Wednesday, 22 Jul, 2026

జాగ్రత్త

సోషల్ నెట్ వర్క్ లో చాలా ఉత్సాహాంగా ఉంటారు అందరూ ఫేస్ బుక్ ,ట్విట్టర్ ,ఇన్ స్ట్రాగ్రామ్ ల్లో ఎందరో స్నేహితులు ప్రతిక్షణం పలకరిస్తారు.మన సమాచారం ఆ స్నేహితులకు అందుబాటులో ఉంటుంది.ఇటీవలే జరిగిన ఒక పరిశోధన ఈ సోషిల్ నెట్ వర్క్ ల కారణంగానే విద్రోహ చర్యలకు పాల్పడేవారికి వ్యక్తుల వ్యక్తిగత సమాచారం సులభం అయిందంటున్నారు. స్నేహితులతో పంచుకొనే వ్యక్తిగత వివరాలు ఆ స్నేహితుల నుంచి మరెందరికో వెళుతూ ఒక చైన్ లాగా అనేక రకాల వ్యక్తులకు […]

ప్రమాదం

గర్భవతిగా ఉంటే కొన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడ వద్దంటారు. వీటిలో ఉండే ప్రిజర్వేషన్లు ,కెమికల్స్ ,లెడ్ మెటల్స్ ,ఇంకా కొన్నీ పదార్థాలు చర్మం నుంచి బిడ్డకు 40శాతం నుంచి 60శాతం వరకు చేరే అవకాశాలు ఎక్కువే. ఈ బ్యూటీ ప్రోడక్స్ట్ వాడటం వల్ల పిల్లల్లో చర్మ సమస్యలు తెలియని ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.బోటాక్స్ వంటి ఇంజక్షన్ తో కళ్ళకింద ముడతలు కనబడకుండా చేసేవి .ఈ ఇంజక్షన్ తో ముఖం పైన కండరాలు ముడుచుకోకుండా ,ముడతలు లేకుండా […]

ఐరన్ లోపమా?

చాలా మంది నీరసం ,కళ్ళు తిరగడం ,జుట్టు ఊడిపోవటం,చర్మం జీవం లేనట్లు అయిపోవటం వంటి సమస్యలు చెపుతారు. రక్త హీనత వల్లనే ఆదంతా అంటారు డాక్టర్లు. ఐరన్ టాబ్లేట్స్ వేసుకోంటారు. మాంసాహారులతో పోలిస్తే శాఖాహారుల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది.  మాంసం,చికెన్ ,చేపల్లో శరీరంలోకి ఇంకనిదీ,ఇంకేదీ రెండు రకాల ఐరన్ ఉంటుంది. కాయగూరల్లో శరీరంలోకి ఇంకని ఐరన్ శాతం ఎక్కువ అలాంటప్పుడు నట్స్ విత్తనాలతో పాటు పాలకూర ,కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి.అలాగే తీసుకొనే ఐరన్ వంటికి పట్టేందుకు […]

అన్ని గంటల పనా?

రెండు చేతులా పని చేస్తారని,సూపర్ ఉమెన్ అని పొగడ్తలు వస్తాయి కానీ అలా ఎక్కువ సేపు ,ఎక్కువ పని చేస్తే స్త్రీలు అనారోగ్యం భారిన పడక తప్పదంటున్నారు ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు. పదేళ్ళపాటు సుదీర్ఘంగా జరిపిన ఈ పరిశోధనలో 8వేల మంది ఉద్యోగులను పరిశోధించారు. గుండె జబ్బులు,రక్త హీనత,ఊబకాయం,షుగర్ వంటి జబ్బులు ఎక్కువగా ఉండటం గుర్తించారు.ఇంటా బయట స్త్రీలు అంతు లేని చాకిరి చేస్తూ సరైనా పోషకాహారం తీసుకోక పోవటం వల్లనే స్త్రీలు అనారోగ్యల భారీన పడినట్లు […]

తగ్గించండి

ఉప్పు ఎక్కువ తినవద్దు అంటాయి పరిశోధనలు. రోజువారీ ఆహరంలో ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలన్న విషయంలో చాలా మందికి అవగాహణ లేక అనారోగ్యం భారీన పడుతున్నారు. ఒక తాజా పరిశోధనలో మూడు వేల మంది ఆహారపు అలవాట్లను సుదీర్ఘకాలం పరిశోధించి ఈ నిర్ణయానికి వచ్చారు. మనం భోజనంలో తీసుకునే ఉప్పునే పరిగణనలోనికి తీసుకొంటాం కానీ ఇతర ఆహారం ద్వారా,ప్యాక్ చేసిన ఆహారం ద్వారా ఎంత ఉప్పు లోపలికి తీసుకొంటున్న మన్నది గ్రహించక పోవటం వల్ల సమస్య వస్తోదంటున్నారు. […]

పర్ ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే

అందమైన డ్రెస్ మాత్రమే ఎంచుకుంటే సరిపోదు. దానికి తగ్గ బ్యాగ్ షూ కూడా ఉండాలి. అన్ని సరిగ్గా మ్యాచ్ అయితేనే ఫ్యాషన్ లుక్. చక్కని జీన్స్ ఎంచుకుంటే ట్రీ పీజ్ మోడల్ బ్యాగ్ , డాక్టర్ మార్టిన్స్ షూ తప్పకుండా వేసుకోవాలి. మినీ స్కర్ట్ వేసుకుంటే ఎన్వలప్ క్లబ్ బ్యాగ్ ఎంచుకోవాలి. షార్ట్ స్కర్ట్ చెప్పులు ఒకే రంగులో బ్యాగ్ కాంట్రాస్ట్ ఎంచుకుంటేనే అందం. ఇక గౌన్ వేసుకోవాలి అని నిర్ణయించుకుంటే క్లబ్ బ్యాగ్, యాంకిల్ స్ట్రాప్ షూస్ […]

పరిచయం చేయండి

పిల్లలు చిన్నప్పుడు బొమ్మలను ఇష్టపడతారు. కాస్తా ఊహా తెలుస్తు ఉన్నాక వాళ్ళ ఇష్టాన్ని పుస్తకాల వైపు మళ్ళించడం పెద్దవాళ్ళ బాధ్యత. చక్కని బొమ్మలు, కథలు ఉన్న పుస్తకాలు వాళ్ళకు బహుమతిగా కొని ఇవ్వడం అంతటితో దాన్ని వదిలేయకుండా రాత్రి హోం వర్క్ అయ్యాక పిల్లలతో ఆ పుస్తకాలు చదువుతూ ఆ కథలు పిల్లలకు అర్ధమయ్యేలా వివరించటం పెద్దవాళ్ళ బాద్యతే. అలాగే పుస్తకాలు వివిధ రంగాలకు చెందినవి ఉంటాయి. మ్యూజిక్ పెయింటింగ్స్, డాన్స్ ,సినిమా వంటి ఎన్నో రంగాలకు […]

వంట త్వరగా

టూ ఇన్ వన్ కట్టర్ గనుక వంటగదిలో ఉంటే వంట నిమిషాల్లో సిద్దం చేయవచ్చు. కట్టర్ ఫుడ్ చాపర్ కలిసి ఉంటాయి. నిమిషాల్లో అతివేగంగా పండ్లు,కూరగాయలు,ఆకు కూరలు కత్తిరించిపెడుతుంది. ఇది మన చేత్తో చేయగలిగిన పని కనుక కావలిసిన సైజ్ లో పరిమాణంలో కట్ చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ లో కొంచెం గా సూప్ చేసుకోవాలన్న అందులోకి కావలిసిన పదార్ధాలు చాలా చిన్నగా ఒకే సైజ్ లో కట్ చేసి వేసుకోవచ్చు. కడిగేయటం చాలా ఈజీ. […]

ఆరోగ్యం సౌందర్యం

ఎర్రని ఎరుపులో వగరుగా తియ్యగా ఉండే ఆల్ బఖరా పండ్లు ఈ సీజన్ లో బాగా వస్తాయి. ఈ పండ్లు శరీరాన్ని డీ టాక్సిఫై చేస్తాయి. చర్మం పట్టులా మృదువుగా అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. వయసు కనబడనీయవు. చర్మం బిగుతు కోల్పోకుండా ఉంటుంది. చర్మం పైన ముడతలు రావు. శరీరంలో జీవక్రియ, రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. ఈ పళ్ళలో పోటాషీయం చాలా ఎక్కువ. ఈ పండ్లలోని ఫ్లూయిడ్ కణాలకు […]

పూర్తిగా తెలుసుకొంటే మంచిది

కొత్తగా ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనుకొనే వాళ్ళు మొక్కలను కొనే చోటనే వాటి గురించి క్షుణంగా తెలుసుకోవాలి. నర్సరీల్లో కాస్త పెరిగిన మొక్కలు తీసుకొంటాం కనుక వాటి జాగ్రత్తలు తెలుసుకోవటం తేలికే. టోమాటో,ఉల్లిపాయలు,కొన్ని రకాల ఆకుకూరలు పెంచటంలో పెరటి తోటకు శ్రీకారం చుట్టవచ్చు. కొన్ని నీడలో పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. కొన్ని సూర్యరశ్మిని తట్టుకోగలుతాయి. మొక్కలకు ప్రతి రోజు నీళ్ళు పోయాలి. సేంద్రియ ఎరువులు వాడి మొక్కలకు పట్టే చీడపీడలను కూడా వేప నూనె వంటివి ఉపయోగించవచ్చు. […]

కీటకాలు పరార్

వర్షకాలంలో తడితడిగా ఉంటుంది కనుక ఈగలు,దోమలు,బొద్దింకలు ఎక్కవ కనిపిస్తాయి. రసాయనాలు నిండిన ఇన్ ఫెస్టిసైడ్ వాడితే అనారోగ్యాలు తప్పవు. ఇంట్లో తయారు చేసే ఈ మందులు విజయవంతంగా కీటకాల్నీ నిర్మూలిస్తాయి. దోమలు పోవాలంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ,యూకలిప్టస్ ఆయిల్ ,సిట్రోనెల్లా ఎసెస్షియల్ ఆయిల్ నీళ్ళు కలిపి స్ర్పేయర్ లో నింపి అవసరం అయినప్పుడు వాడుకోవాలి. దాల్చిన చెక్క వెల్లుల్లి ముక్కలు గోడ మూలన ఉంచితే చీమలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల నీళ్ళలో వేసి మరగబెట్టి […]

అది అనారోగ్యం

చిన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే బరువు పెరిగిపోతారు. ఇక టీనేజ్ లోకి వస్తున్నా బరువు పెరగడమే అవుతుంది. స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్, జామ్ మొదలైన వాటితో బరువు పెరిగే అవకాశం ఎక్కువే. వాటిలో ఉండే ఫుడ్ కలర్స్ తో కిడ్నీలు ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కూల్ డ్రింక్స్ కు కూడా పిల్లలను దూరంగా ఉంచవలిసిందే. ఫిజ్జాలు, బర్గర్లు,కేక్ లు వంటి బేకరీ ఉత్పాదనలు పిల్లల్లో మరింత బరువును పెంచుతాయి. అనారోగ్య […]

పనులు చెప్పండి

ఎప్పుడూ చదువుకో మార్కులు తెచ్చుకో నీ ఫ్యూచర్ ను గురించి ఆలోచించుకో వంటి మాటలు చెబుతారు కాని పిల్లలకి ఇంటిపనులు చెప్పరు. అలా చెబితే వాళ్ళు అలసిపోతారనో టైమ్ వేస్ట్ అవుతుందనో చదువుకునే సమయం తగ్గిపోతుందనో భావిస్తారు కాని వాళ్ళను ఇంటి పనుల్ల్లో భాగస్వాములుగా ఉంచరు. తల్లిదండ్రులు చేసే తప్పిదం ఇదే. ఇలా చేస్తే పిల్లలకు బాధ్యత తెలియదు. ఇది అలవాటై పెరిగే కొద్ది ఏ పని చెప్పిన చేయాలన్న ధ్యాస ఆసక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ […]

పసితనంలోనే పాఠాలు

ఇప్పుడు వృత్తిరిత్యా వికాసపు కోర్సులు వచ్చాయి. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి బాడి లాంగ్వేజ్ ఎలా ఉండాలి నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాటలు నేర్పిన నాటి నుంచి నేర్పవలసిన విషయాలు ఇవి. వారికి మర్యాదపూర్వకమైన మాటలు నేర్పాలి. ఇంటికి ఎవరు వచ్చినా వారితో గౌరవంగా ఎలా మెలగాలి వాళ్ళను ఎలా పలకరించాలో నేర్పాలి. తోటి పిల్లలు, ఇరుగు పొరుగులతో బంధువులతో మర్యాదగా మెలగటం నేర్పిస్తే ఎదిగే కొద్ది వాళ్ళలో సంస్కారం కనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. […]

చర్మం సాగుతోంది

స్మార్ట్ ఫోన్స్ అస్తమానం చేతిలో ఉంచుకోవడం వలన తల,మెడ,బుజాల నొప్పులు వస్తాయంటున్నాయి అధ్యయనాలు. వీటితో పాటు చర్మానికి ఇబ్బందులు తప్పవంటున్నారు. ముఖ్యంగా స్త్రీలకు మెడ వెనుక కాలర్ బోన్ దవడల పక్కన చర్మం సాగిపోతుంది. ఫలితంగా ముందే ముడతలు వచ్చేస్తాయి. ఇదివరకు మెడ పై చర్మానికి నలభై దాటాక ముడతలు వచ్చేవి. ఇప్పుడైతే 18 ఏళ్ళు దాటుతుండగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు అధ్యాయనకారులు. ఫోన్ లేదా టాబ్ వైపు మెడ వంచి చూస్తూనే ఉండటం వల్ల చర్మం […]

కొత్త లుక్

ఒక్క రకంగానే ఉంటే అందం ఏముంటుంది. ఫ్యాషన్ ఎప్పుడు కాంభినేషన్ లో ముడిపడి ఉంటుంది. ఫ్యాషన్ వెలుగు,వెన్నెల చీకటి లాగా డిఫరెంట్ గా ఉండాలి. ఇప్పుడు పొట్టి లేదా పొడవు కుర్తీలు గౌన్ లు ఎప్పటి నుంచో ఫ్యాషన్. డిజైన్లలో తేడాలున్నా చిన్ని మార్పులతో కొత్త లుక్ తెచ్చేస్తారు ఫ్యాషన్ డిజైనర్స్. ఈ వర్షాలకు ఫ్యాషన్ మారిపోయింది. ముదురు లేత రంగులు కలిపి డ్రెస్ ఉ తయారు చేస్తారు. లాంగ్ టాప్ పై నుంచి కింద వరకు […]

ఏదో కారణం?

చెమటలు పోస్తుంటే వాతావరణం వేడిగా ఉండటం వల్లనే అనుకోకండి. ఇతరాత్రా ఎన్నో కారణాలున్నాయి గమనించండి అంటున్నారు వైద్యులు. థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పని చేస్తున్నా చెమటలు పట్టవచ్చు. అలాగే నరాల వ్యవస్థ దెబ్బతినటం వల్ల కూడా ఎక్కువ చమట పడుతోంది. అలాగే ఇది డయాబెటిక్ న్యూరోపతీ వల్ల కూడా అవ్వచ్చు. శరీరంలో ఇన్ ఫెక్షన్ పెరిగితే చెమటలు పోస్తాయి. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి కనుక చెమట పట్టటంలో ఎదైనా అసాధారణంగా అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ […]

సౌందర్యం ఇస్తాయి

పసుపు,వేప కలిపి వాడినా విడివిడిగా వాడినా సౌందర్య కారకాలే. పసుపును పూజల్లో ,సౌందర్య ఉత్పత్తుల్లో వంటకాల తయారీలో ఇటు ఆరోగ్య ప్రదాయినీగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఆహారంలో పసుపు తీసుకొంటే టాక్సిన్లు బయటికి వెళ్ళిపోతాయి. ఇక వేపచెట్టు వల్ల కలిగే లాభాలకు అంతే లేదు. అసలీ చెట్ల నుంచి వచ్చేగాలి కూడా ఆరోగ్యం ఇవ్వగలదు. వేప చిగుర్లు కొబ్బరి నూనెలో వేసి మరగకాచి రాసుకుంటే దురదలు తగ్గుతాయి. వేప చిగురు,పసుపు ,మంచి నూనె కలిపి నూరి గాయాల […]

మంచితనం పెంచే పుస్తకం

రెండు మూడేళ్ళ పిల్లలకు వారి లోని భావోధ్వేగాలను నిర్వహించుకోగల సామార్ధ్యాన్ని పెంచుకొనేలా చేయలంటే పుస్తకాలు ఒక్కటే మార్గం అంటున్నారు . కోపం ,భయం ,బాధ,ఆతృత ఇలాంటి క్లిష్టమైన ఎమోషన్ లను నియంత్రించుకోవటం గురించి పుస్తకాలు చదివి వినిపిస్తూ అందులో పాత్ర ప్రవర్తన గురించి వివరంగా చెప్పాలి. స్నేహాల విలువ ,సానూభూతి దోరణులకు ఇక్కడే బీజం పడుతుంది. ఒక మంచి పని చేసేందుకు ఎంత కష్టపడతారు,ఆ కష్టం విలువ పిల్లలు తెలుసుకోవాలంటే పుస్తకం ఒక్కటే మార్గం క్షమించటం ఇవ్వటం […]

ఉదయాన్నే తాగాలి

జీలకర్ర కూడా బరువు తగ్గిస్తుంది. జీరాలో ఉండే పొటాషియం మాంగనీస్,ఐరన్,ఫైబర్ అధికం.జీర్ణప్రకియకు జీరా ఎంతోగానే తోడ్పడుతుంది. రోజుతాగే నీళ్ళలో జీలకర్ర వేసుకుని కాచి తాగితే మంచిది.ఒక స్పూన్ జీలకర్ర ను గ్లాస్ నీళ్ళతో మరిగించి ,ఆ నీరు అరగ్లాస్ అయ్యేవరకు మరిగాక ఉదయాన్నే ఆ నీటిని తాగితే మంచిది. కడుపులో రసాయనాలు మనం తినే ఆహారాన్ని షుగర్ గా మార్చుతాయి. అలా ఎప్పుడు ఈ జీరా రసం షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. డైట్ ప్లాన్ లో […]