Wednesday, 22 Jul, 2026

జట్టుకు మెరుపు

కొత్తిమీర వేసిన చారు,పులుసు ,కమ్మని వాసన వస్తాయి. ఏ ఉప్మానో చేసి కొత్తి మీర చల్లితే నోరు ఊరుతుంది. వట్టి రుచికాదు కొత్తి మీర ఆరోగ్య ప్రదాయిని .విటమిన్ బి కాంప్లెక్స్ కు చెందిన బి1,బి2,బి3, బి4,బి5 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే. ఈ విటమిన్లు అన్నీ వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేవే. చర్మానికి నిగారింపును ,దీర్ఘకాలం యవ్వనంగా ఉంచేందుకు కొత్తి మీర ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు జుట్టును మంచి మెరుపుతో ఉంచుతాయి. చర్మంపైన […]

ఇవి అవసరం

అమ్మాయిల హాండ్ బ్యాగ్ కేవలం అందంగానే కాకుండా అందులో ఉంచుకొనే వస్తువులు ఏ సమయంలో అయినా ఉపయోగపడేలా ఉండాలి. ముఖ్యంగా అందులో రెండు శానిటరీ నాప్ కీన్స్ తప్పసరి. చిన్న దువ్వేన,అద్దం ,మాయిశ్చరైజర్ కూడా కాస్త ఫ్రెష్ గా ఉంచేందుకు ఉపయోగమే. తప్పని సరిగా టిష్యూ పేపర్స్ ఉంచుకోవాలి. అందంగా ఉందికదా అని పెట్టుకొన్న క్లిప్స్ ఏ నిమిషంలో అయినా కాస్త వదులై జుట్టు జారీ పడిపోతూ ఉండవచ్చు. ఓ రబ్బర్ బ్యాండ్ క్లిప్స్,కొన్ని సేప్టీ పిన్స్ […]

తండ్రుల లోపాలు వస్తాయి

సాధరణంగా తల్లి పోలిక అంటూ ఉంటారు. లక్షణాలు,అందం,అలవాట్ల తో పాటు జబ్బులు కూడా తల్లులకే కలిపి వెబుతూ ఉంటారు. కాని ఇటివల ఒక అధ్యాయనం పిల్లల్లో లక్షణాలు తడ్రి పైనే ఆధరపడి ఉంటాయంటుంది. తండ్రి వయసు ఒత్తిడి ఎదుర్కోనే సామర్ధ్యం వాళ్ళ వీర్యకణాలను ప్రభావితం చేస్తాయట. త్వరగా పిల్లల జన్యువుల పై ఇవి ప్రభావం చూపెడతాయంటున్నారు. ఇది ఒక్క తరానికి కాదు భవిష్యత్ తరాలకు కూడా ప్రభావితం చేస్తుందట. తండ్రి ఊబకాయం పిల్లల్లోని కొవ్వు కణాలను ప్రభావితం […]

ఉల్లి కాడల్లో ఆరోగ్యం

పెరట్లో చిన్న కుండీల్లో కూడా ఉల్లి కాడలు పెంచటం చాలా సులభం. వీటిని పెంచే విధానం గురించి యూ ట్యూబ్ లో చూడోచ్చు కదా. ఉల్లి కాడాలను ఆహారపదార్ధాల్లో ఉపయోగించటం పచ్చివి మిగతా కూరగాయలతో కలిపి సలాడ్ గా తీసుకోవడం చాలా ఆరోగ్యం వీటిలో చెడు కొలెస్ట్రాల్ ను కాలేయం చుట్టు పేరుకునే కొవ్వు ని తగ్గించే గుణం ఉంది. క్యాలరీలు చాలా తక్కువ. పీచు చాలా ఎక్కువ వీటిని వారంలో నాలుగు రోజులు ఆహారంలో తీసుకుంటే […]

బేబీ క్రీమ్స్ వాడితే బెస్ట్

పొడి చర్మం గలవాళ్ళు మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పొడి చర్మం పైన మేకప్ సరిగ్గా అతుక్కోదు. అందుకే మేకప్ ముందుగా క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మేకప్ కోసం బేబీ క్రీమ్స్ వాడితే మంచిదంటున్నారు. ఇవి చర్మానికి తేమ అందించి తాజాగా మంచి రంగులో కనిపించేలా చేస్తాయి. ఫౌండేషన్ వాడకపోయినా పర్లేదు. కన్సీలర్ వాడితే మచ్చలు కనబడకుండా పోతాయి. చివరకు పౌడర్ రాసుకుంటే సరిపోతుంది.

మంచి ఆరోగ్యం,శక్తి

చపాతీలు తినడం మంచిది . గోధుమ పిండితో చేసే చపాతీలు తినటం వల్ల పోటాషియం ,ఫాస్పరస్ ,కాల్షియం ,ఐరన్ లభిస్తాయి. ఇవి తింటే వేడి చేస్తుంది అనుకోవటం అపోహే అంటున్నారు. ఫైబర్ జంక్ ఇతర ఖనిజాలు ఉండటం వల్ల చర్మానికి మేలు చేస్తుం ది. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. ఎటువంటి నూనె లేకుండా  చేసుకుతింటే కేలరీలు తక్కవే ఉంటాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేడ్స్ శక్తిని ఇస్తాయి.

మొలకలోస్తే మంచిదే

వెల్లుల్లిపాయల్లో మొలకలోస్తే తాజావాటికన్నా వీటిలోనే గుండె కు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని అమెరికన్ కెమికల్ సొసైటీ నిపుణులు చెబుతున్నారు. ఇలా మొలకలొచ్చిన పాయల్లో రకరకాల మెటాబోలైట్లు ఉన్నట్లు నిపుణులు కనిపెట్టారు. సాధరణంగా ఇవి గింజ మొలకల్లో కనిపిస్తాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబోలైట్లు రక్షిస్తాయి.మామూలుగానే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్, బీపీ తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. మొలకలోచ్చిన వెల్లుల్లిలో ఇంకెన్నో […]

పాదాలు కోమలంగా

అందంగా మరకలు ,ముడతలు లేని చంద్రబింబం వంటి మొహం మాత్రమే కాదు పాదాలు అంతే మృదువుగా అందంగా ఉండాలి ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు మడుమలు ,పాదాల పక్క భాగం ఫ్యూమిక్ స్టోన్ తో రుద్ది స్నానం అయ్యాక బాధం నూనెతో కొద్ది సేపు మర్ధన చేయాలి. అలాగే రాత్రి వేళ పడుకొనే ముందరా ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో పాదాలు వుంచి తర్వాత చల్లని నీళ్ళలో కాసేపు ఉంచాలి. శుభ్రంగా తడిచి వ్యాజిలెన్ రాస్తే […]

తోక్కలో ఔషధ గుణాలు

యాపిల్ ఎంత ఆరోగ్యకరమో దానిపై తోక్క అంతకంటే మంచిది అంటున్నారు పరిశోధకులు. కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రిసెర్చులో తోక్కలో పన్నెండు రకాల రసాయన పదార్థాలు కాన్సర్ కణాలను సమర్ధవంతంగా అడ్డుకొంటాయని తేలింది. ట్రెటర్ పెనాయిడ్స్ గా వ్యవహారించే ఈ పదార్థాలు కాలేయం, పెద్ద పేగు ,రోమ్ము కాన్సర్ లకు సంబంధించిన కణాల పెరుగులదలను అడ్డుకుంటాయట. అంతే కాదు క్యాన్సర్ మృతకణాలను కూడా ఇవి బయటకి పంపిస్తాయి. పండు లోనూ క్యాన్సర్ నిరోధక ఫ్లేవ నాయిడ్ ఫిలోనిక్ ఆమ్లాలు […]

మన గురించి చెపుతాయి

ఎంత ఫ్యాషన్ గా ఉండవచ్చు. అందమైన దుస్తుల ఎంపికలో మనల్ని ఎవ్వళ్ళు మించక పోవచ్చు .కానీ ఏదైనా జాబ్ కోసం గానీ ముఖ్యమైన మీటింగ్ కు అటెండ్ అయ్యేప్పుడు గానీ దుస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. టైట్ గా ఉండే షర్టులు, టీషర్టులు ,లోవెయిస్టు పాంట్లు వద్దు. స్టైల్ కోసం కట్టుకొనే బ్యాండ్స్ తీసేయాలి. కామెడీ డిజైన్ లు ఉన్నా డ్రస్సులు వద్దు. ఏ ఉదోగ్యానికైనా ఫస్ట్ ఇంప్రెషన్ ముఖ్యం. హుందాగా కనబడటం ముఖ్యం. చక్కని లేత […]

కోల్డ్ కాఫీ

కాఫీ లేనిది క్షణం గడవదు. వేడి వేడి కాఫీ గొంతులో పడితే బుర్ర పనిచేస్తుంది అని చెప్పే వాళ్ళు ఎంతో మంది కాఫీల్లో రకాలు, రుచులు, ఆ కథ అలా ఉంచితే కోల్డ్ కాఫీ కూడా ఇతర పానీయాలు తీసుకుపోకుండా ఉంటుంది. ఇది తయారు చేయడం చాలా ఈజీ. మీగడ తీయని చల్లని పాలు రెండు గ్లాసులు, ఇన్ స్టెంట్ కాఫీ పొడి, రెండు స్పూన్లు, సరిపోయేంత పంచదార క్రష్డ్ ఐస్, ఓ అరగ్లాసు పక్కనే ఉంచుకుని నురగలు […]

సన్ స్క్రీన్ తో డేంజర్

సన్ స్క్రీన్ లు కాస్మోటిక్స్ అతిగా ఉపయోగిస్తే మంచిది కాదంటున్నారు. వాటిల్లోని బ్యూటైల్ ఫారా బెన్ అంత: స్రావ గ్రంధుల పైన ప్రభావం చూపెడుతుంది.దీని ఫలితం ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైన ఉంటుందని పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గుతుందని స్త్రీలలో అండాశయం, రొమ్ముల పెరుగుదలలో మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెపుతున్నారు. వీటిని మరింతగా ఒంటికి పట్టించేయకండి ఏదైన మితంగా ఉంటే మంచిదంటున్నారు.

క్యాలరీలు తగ్గిస్తే బెటర్

రోజు తీసుకునే ఆహారంలో 30 శాతం క్యాలరీలు తగ్గించగలిగితే ఎన్నో రకాల అనారోగ్యాలు వెనక్కిపోతాయి అంటున్నాయి అద్యాయనాలు. అంటే అవసరానికి మించి ఆహారం తీసుకోవడమే అనారోగ్యానికి కారణం. ఆహారనియమాలు పాటిస్తూ కొన్ని క్యాలరీలు తగ్గించగలిగితే మధుమేహం,గుండె జబ్బులు రావని చెబుతున్నారు. శరీరం బరువు కొద్దిగా తగ్గినా నడుం నొప్పి,వెన్ను నొప్పి వంటివి భాదించకుండా ఉంటాయని అధ్యాయనాలు చెబుతున్నాయి.

బంగారం వంటి నూనె

మొరాకోలో ఎక్కువగా పెరిగే ఆర్గన్ చెట్లనుంచి తీసే ఆర్గాన్ నూనెను మొరాకో బంగారం అంటారు. విటమిన్ ఎ, విటమిన్ ఇ సమృద్దిగా ఉండే ఈ నూనె అందానికి ఆరోగ్యానికి పెట్టింది పేరు. మొహం పైన మొటిమలు మచ్చలు చికెన్ ఫాక్స్ పోగొట్టడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. అందుకే దాన్ని బంగారంతో సమానంగా భావిస్తున్నారు. శరీరంలో మెరుపును శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదం చేస్తుంది. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. చర్మ సంబంధమైన వ్యాధుల్లో విశేషంగా ఉపయోగపడుతుంది.

తల్లులకు డి విటమిన్

ఒక పరిశోధన పాలిచ్చే తల్లులు డి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల పిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల తలెత్తే జబ్బులు రావంటున్నారు. తల్లులు డి విటమిన్ వాడితే పిల్లల్లో ఆ విటమిన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉన్నారు. ఒక కణజాలం కాల్షీయం ని షోషించుకునేందుకు విటమిన్ డి ఎంతో అవసరం. ఇది సూర్యరశ్మి ద్వారానే అందుతుందని ఇంతవరకు మనకు తెలిసిన అంశం. కాని ఎముకల సంభందిత వ్యాధులు పిల్లలకు రాకుండా వాళ్ళు సూర్యరశ్మిలోని డి విటమిన్ […]

నిద్ర చాలా ముఖ్యం

కనీసం ఆరుగంటల సేపు గాఢంగా నిద్రపోతే మెదడు చురుగ్గా ఉంటుందంటున్నాయి పరిశోధనలు. మెదడు ఆరోగ్యం గురించి చేసిన పరిశోధనలో భాగంగా వెయ్యిమంది పై ఈ పరిశోధన నిర్వహించి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు వాళ్ళ మణికట్టుకు యాక్టిగ్రాఫ్ అనే పరికరాన్ని కట్టి దీని ద్వారా వాళ్ళు ఎంత సేపు చక్కగా నిద్రపోయారు. అందువల్ల మెదడు ఎంత విశ్రాంతిగా ఉంది పరీక్షించారు. సరిగ్గా నిద్రపట్టక అటుఇటు కదులుతు ఉండేవాళ్ళలో మెదడు పనితీరు సరిగ్గా లేదని క్రమంగా అది వాళ్ళలో […]

పిల్లలకు నచ్చుతాయి

బావుంది తిను అని తల్లులు ఎంత మొత్తుకున్న మంచి మంచి వంటకాలను తిననే తినరు. నోట్లో అయినా పెట్టుకోకుండా బాగాలేదు అని రిజెక్ట్ చేస్తారు. తేలికైన తల్లులు అ తినే దాన్ని కాస్తా పిల్లల కళ్ళకు ఆకట్టుకునేలా తయారు చేస్తే పిల్లలు దాని అందానికి మెచ్చి తింటారు ఇప్పుడు రెవోలిన్ రోలింగ్ పిన్‌ ఉందనుకోండి. రెండు చపాతీల మధ్య ఏ ఆకు కూరనో, కోలినో, తియ్యని కొబ్బరి బెల్లం పోడి ని పెట్టేసి ఈ అప్పడాల కర్రతో […]

చీకటి వెలుగుల్లా

బ్లాక్ ఎన్డ్‌ వైట్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. వానా కాలానికి సూటయ్యే రంగు నలుపేనంటారు ఫ్యాషన్ నిపుణులు. హీరో తనానికి హోదా కి ప్రతీకగా ఉండే నలుపుని చక్కని ప్రకాశవంతమైన శాంతికి రూపమైన తెలుపుతో జోడిస్తే ఎంతందం. కొత్త దనానికి స్థిర చిత్తానికి, ఆశావాదానికి తెలుపు సంకేతం అంటారు. తెలుపు నలుపుని క్లాసిక్ కలర్ కాంబినేషన్ అంటారు ఫ్యాషన్ గురూలు. నగలు,దుస్తులు,వాహనాలు చివరకు ఇంటీరియర్స్ లోనూ ఈ కాంబినేషన్ బావుంటుంది. ఈ రెండింటిని కలిపి ధరించడం తిరుగులేని […]

ఒత్తిడి ప్రమాదం

ఎక్కువ ఆందోళన పడినా ఒత్తిడితో సతమతమైనా ముఖ్యంగా ఎముకలకు ప్రాబ్లం అంటున్నారు వైద్యులు. ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువ అంటున్నాయి అధ్యాయనాలు. ఆందోళనకు గురయ్యే మహిళల్లో ఖనిజాల శాతం తగ్గిపోయినట్లు గుర్తించారు. ఎముకలు బలహీనపడి అతి చిన్న ప్రమాదాలను కూడా తీవ్రంగా గాయపరుస్తాయి. డీ విటమిన్ స్థాయి పడిపోతాయి. శరీరం ఇన్ ఫెక్షన్ తట్టుకునే శక్తిని పొగొట్టుకుంటుంది. విటమిన్‌ డీ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోమని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా గుడ్లు బాదం, సోయా, బ్రకోలి,అవిసె గింజలు, […]

ఇది లాభమే

డాక్టర్ మైకల్ మోస్లే ఒక డైట్ ప్లాన్ ఇప్పుడు పాశ్చత్య దేశాల్లో ట్రెండ్ అవుతుంది. వారంలో ఐదు రోజులపాటు చక్కగా మూడు పూటల భోజనం చేసి మిగతా రెండు రోజులు ఉపవాసం చేయాలి. అది పూర్తిగా ఉపవాసం కాదు పండో ఫలమో, గ్లాసుడు పాలో రెండు రోజులు తినే తిండిలో 500 కేలరీలు మించకుండ చూసుకుంటే శరీరానికి అందే క్యాలరీల సంఖ్య పడిపోతుంది. ముఖ్య అవయవాల్లో కొవ్వు కరగడం మొదలవుతుంది. ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గుతారు […]