Wednesday, 22 Jul, 2026

ఇవి చాలు

చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు ఎంతో ఖరీదైన ఆహారపదార్ధాలు ఎంతో శుభ్రత తో శ్రద్దగా తాయారు చేసి ఇచ్చినా వాళ్ళు తరచుగా అనారోగ్యల పాలవుతూనే ఉంటారు. ఖరీదైన ఆహారపదార్ధాలలో అవసరమైన పోషకాలు లేకపోవటం వల్లనే ఈ సమస్య అంటరు డాక్టర్లు. శక్తి కోసం పప్పు,ఆకు కూరలు కాల్షీయం కోసం నువ్వుల లడ్డులు పీచు ఎక్కువగా ఉండే పదార్ధాలు ఇవ్వండి.ఇవే ఆరోగ్యం అంటున్నాయి అధ్యాయనాలు. పీచు కోసం దోస,బీరకాయ,కీర,సిట్రస్ పండ్లు,బీట్ రూట్,క్యాబేజ్,క్యారెట్ ఇవ్వండి అంటున్నారు. తప్పని సరిగా పాలు […]

కాస్త శ్రద్దతో

ఎప్పుడేనా హడావిడిగా ఏ పార్టికో వెళ్ళాలంటే అప్పటికప్పుడు గోళ్ళ రంగు వేసుకుని వెంటనే ఆరిపోవాలంటే రెండు నిమిషాలు ఐస్ నీళ్ళలో చేతులు ముంచితే చాలు. గోళ్ళరంగు సీసాను షేక్ చేయలి అనిపిస్తే రెండు చేతుల మధ్య ఉంచుకుని గుండ్రంగా తిప్పాలి. అప్పుడు సీసాలో బుడగలు రాకుండా ఉంటాయి. గాలి కూడా లోపలికి చేరడు. గ్లిట్టర్ నెయిల్ పాలిష్ తొలగించాలంటే రిమూవర్ లో ముంచిన దూదిని గోళ్ళ పై కాసేపు ఉంచి గట్టిగా తుడవాలి.అలా రంగు తొలిగించాక గోళ్ళు […]

రంగుల్లో అందం

చల్లగా హాయిగా వర్షపు జల్లులో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో కాంతి వంతమైన రంగులు బావుంటాయి. ఏ వస్త్ర శ్రేణి అయినా గులాబీ,ఆకుపచ్చ,ఆరెంజ్ వంటి అందమైనవి, కాస్త పొడుగ్గా లావుగా ఉండే ముదురు రంగులు బావుంటాయి. చిన్న ప్రింట్ లలో గులాబీ,ఆకుపచ్చ రంగుల దుస్తులు చాలా అందం ఇస్తాయి. ఎరుపు వెచ్చదనానికి సంకేతం. ఈ కాలంలో దీనికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఇక మబ్బుపట్టిన వాతావరణాన్ని ఉత్సహంగా మార్చేయాలి అనుకుంటే సూర్య కాంతి ప్రతిబింభించే పసుపు రంగు […]

ఫంగస్ వచ్చేస్తుంది

వర్షంలో చేతుల్ల్లో ఉన్న బ్యాగ్ లు,సెల్ ఫోన్ కవర్లు,వ్యాలెట్ లు తడిసిపోతూ ఉంటాయి. తడి సరిగ్గా ఆరకపోతే వాసన రావడం ఫంగస్ ఏర్పడటం మాములే. వర్షంలో తడిసి ఇంటికి రాగానే లెదర్ వస్తువులను తుడిచి వాటి మధ్యలో పేపర్లు ఉంచాలి.నీడనే గాలి తగిలేలా ఉంఛాలి. నేరుగా ఎండబెట్టకూడదు. వీటి పైన బురద మరకలు పడితే పాత బ్రష్ తో రుద్ది మెత్తని బట్టతో తుడిస్తే సరిపోతుంది. ఈ లెదర్ వస్తువుల పైన కరిగిన మైనం పూత పూసి […]

ఆల్శండ్స్ పళ్ళే

ఇవ్వల్టి రోజుల్లో ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్దే. తాజా పరిశోధనలో మహిళలు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినేందుకు ఇష్టపడుతున్నారని ముఖ్యంగా ఆల్మండ్స్ ,తాజా పండ్లు మాత్రమే వీళ్ళు స్నాక్స్ గా తింటున్నారని తేలింది. ఇరవై నుంచి నలభై ఏళ్ళ లోపు 3 వేల మంది మహిళలపై చేసిన పరిశోధనలో సహాజసిద్ధమైన ,ఆరోగ్యవంతమైన ఆహారం ఇష్టపడుతున్నారని ,ఎక్కువ మంది మహిళలు తమ బ్యాగ్స్ లో ఆల్మండ్స్ ,కొన్ని నట్స్ మాత్రమే వెంట తీసుకువెళుతున్నారని ఇది గొప్ప ఆరోగ్యవంతమైన మార్పుగా పరిశోధకులు […]

వాడి చూడండి

కాఫీలు,కూల్ డ్రింక్ లు,సాఫ్ట్ డ్రింక్ లు తాగటం వల్ల పళ్ళ పై మచ్చలు ,లేదా రంగు మారటం కనిపిస్తుంది. స్ట్రాబెర్రీ లేదా స్ట్రా బెర్రీ టూత్ పేస్ట్ తో పళ్ళు రుద్దుకొంటే తెల్లని మెరుపు వస్తుంది.అలాగే అరటి పండు తోక్కలో ఉండే పొటాషియం,మెగ్నిషియం ,మాంగనీస్ వంటి ఖనిజల వల్ల ఆ తోక్కతో పళ్ళురుద్దితే దంతాలు తళతళా మెరుస్తాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ బేకింగ్ సోడాతో కలిపిన లిక్విడ్ పేస్ట్ వల్ల కూడా లాభం ఉంటుంది. తులసి ఆకులు ,కమలా […]

మన కోసం కూడా

ఇంట్లో పెద్దవాళ్ళుంటే వారి అవసరాలు తీర్చేందుకు ఇంట్లో పిల్లల్నీ సిద్దం చేయండి. ఆ అలవాటు వాళ్ళు పెద్దయ్యాక మిమ్మల్ని బాగా చూసే అలవాటు కింద మారుతోంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్లు వయసులో ఉండగా చదివిన బుక్స్ వాడిన వస్తువులు అలా మూలన ఎవ్వరు పట్టించుకోకుండా పడి ఉంటాయి వాటిని వాడే ఓపిక శుభ్రం చేసే ఓపిక పెద్దవాళ్ళకు ఉండదు. పిల్లలు తాత,అవ్వను పలకరించటం వాళ్ళ అవసరాలు తీర్చటం ,వాళ్ళ వస్తువులు దుమ్ములేకుండా దులిపి […]

ఒక్క చిటికెలో

ఇప్పుడు అమ్మాయిలందరికీ స్లీవ్ లెస్ టాప్ లు వేసుకోవటం ఇష్టం. అండర్ ఆర్మ్స్ నల్లగా ఉంటాయనే భయంలో వేసుకోనేందుకు కాస్త సందేహిస్తారు. చిన్న చిట్కాతో ఈ నలుపు పోగోట్టవచ్చు. బేకింగ్ సోడాతో మృత కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచే బ్లీచ్ ఉంటుంది.మెలనిన్ కారణంగా నల్లగా అయినా అండర్ ఆర్మ్స్ ని నలుపు పోయోలా చేయగలదు. బేకింగ్ సోడాలు ,రోజ్ వాటర్ గాని నీళ్ళుగాని కలిపి దాని వెళ్ళతో మర్ధన చేస్తే చాలు .ఓ అరగంట ఆగి […]

ముందు డాక్టర్ సలహా

ఈ మధ్య కాలంలో కొబ్బరి నూనె వైద్యం గురించి వినబడుతుంది.ప్రతి రోజు కొబ్బరి నూనె తాగితే బరువు తగ్గవచ్చు అంటున్నారు. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ఫాటి యాసిడ్లు ఆకలిని తగ్గించి రోజులో కొన్నీ క్యాలరీలు తక్కువ తీసుకొనేలా చేస్తాయి. కానీ మిగతా భోజనపు అలవాట్లు ఏవీ మార్చుకొకుండా కొబ్బరి నూనె తాగటం మొదలు పెడితే ప్రయోజనం ఉండకపోగా పైగా ఎక్కువ బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి చిట్కాలతో లాభం కన్నా శరీరానిక […]

శిక్షణ ఇక్కడే

విశాఖపట్టణం,అనకాపల్లి ప్రాంతాలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బెల్లంతో తయారు చేసిన చాక్లెట్లు ,బెల్లం పొడి ,చెరుకు రసం ,బెల్లం పైనాఫిల్ జెల్లీలు,బెల్లంతో చేసిన బిస్కెట్లు ,కుకీలు,ఉసిరి బెల్లం ఉండలు,అల్లం విక్రయాలు జరుగుతున్నాయి. ఇవి తయారు చేసే శిక్షణ కూడా అనకాపల్లి పరిశోధన కేంద్రంలో ఇస్తున్నారు. శిక్షణకు 10వేలు ఫీజుగా ఉంది. మంచి ఆరోగ్యకరమైన బెల్లం తీసి తిను బండారాల స్టార్టప్ పెట్టాలంటే ఇక్కడ శిక్షణ తీసుకోవటం ఉత్తమం.

అనారోగ్యమే

వీకెండ్ పార్టీలు కాస్త రిలాక్సేషన్ ఇస్తాయి కానీ తరుచు ఇలాంటి భోజనాలు గుండెకు హాని చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారం రోజుల్లో ఐదు రోజులు విశ్రాంతి లేని పని తర్వాత తప్పకుండా బయటి భోజనాలు నలుగురితో పార్టీలు ఇష్టపడతారు. కానీ ఎక్కువ క్యాలరీలు ,అవసరానికి మించిన ఆహారం తినటం ,బయట తయారయ్యే శభ్రత లేని మాంసం,మాటి మాటికి వేడి చేసే నూనెల వల్ల ఆరోగ్యానికి నష్టమే. ఒక వేళ సామాజిక కార్యక్రమాల్లో బయట తిన వలసి […]

మూలం ఇక్కడ

శరీరం ఎప్పుడూ నిత్య చైతన్యంతో కదులుతూ ఉండాలి. రోజు మొత్తం మీద శరీరానికి ఎంతో కొంత చురుకుదనం ఇచ్చేందుకు అనేకనేక అవకశాలు ఉన్నాయి. చిన్న చిన్న మార్పులే గుర్తించలేనంత ఫలితం ఇస్తాయి. వీధి చివర ఉన్న షాపుకు కూడా వాహనం పై వెళ్ళకుండా నడచి వెళ్ళటం మంచి పద్దతే కదా.కుదిరినప్పుడల్లా మెట్లెక్కి దిగుతూ ఉంటుంటే శరీరానికి వ్యాయామం దోరుకుతుంది.స్విజ్జర్లాండ్ పరిశోధకులు జరిపిన ఒక పరిశోధనలో అస్తమానం కూర్చోవటం వల్ల కొవ్వుల్ని కరిగించే లిపో ప్రొటీన్ అనే ఎంజైమ్ […]

ఆల్ ఈజ్ వెల్

ప్రకృతి ద్వారా మనకు అందే ప్రయేజనాలు లెక్కకు అందనివి. ఆదుర్ద కోసం నిరాశ వంటి నెగిటివ్ భావాలు మానసిక శక్తిని కుంగదీసే పరిస్థితి వస్తే పాజిటివ్ మార్గానికి నడిపించగలిగేది ప్రకృతి చికిత్సే.పక్షుల కిలకిలా రావాలు అరుణోదయ కాంతులు,చక్కని సహజమైన సువాసనతో పూవ్వులు, నదీ ప్రవాహం,సముద్రపు అలలు ఇలా ఏది చూసినా మనసు పొగిపోతుంది. ఉవ్వెత్తున పడిలేచే సముద్రం దిశగా కనీసం ఒక చక్కని ఫోటోలు అయినా చూస్తే అనంతమైన వాహిని ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ జీవితంలో […]

ఎంతో శక్తి

ఈ సారి వ్యాయామం మొదలు పెట్టబోయే ముందర బీట్ రూట్ రసం తాగండి దాని వల్ల 16శాతం ఎక్కువ సమయం వ్యాయమాం చేయగలుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బీట్ రూట్ పోషకాల నిలయం.బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్ శరీరం సైట్రిక్ ఆక్సైడ్ గా మారి తేలికైన వ్యాయమాలు చేసేటప్పుడు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది. బరువైన వ్యాయమాలు చేసే శక్తిని ఇస్తుంది. ఇందుకు కారణం ఇందులో ఉన్న ఇన్ ఆర్గానిక్ నైట్రేట్ కారణం. ఈ రసం తాగటం […]

దువ్వుకోవాలి

మంచి నిద్ర వెంట్రులకు ఎంతో మేలు చేస్తుంది.తలపై ఉన్నా శిరోజాలు ఎన్నిసార్లు దువ్వుకొంటే అంత బాగా సెబేషియన్ గ్రంధి ఉత్తేజితమవుతుంది.దానివల్ల సెబం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.విడుదల అయినా సెబం ,చెమట కలిసి తల పై భాగంలో ఆమ్ల తెర ఏర్పడుతోంది. ఇది చర్మాన్ని కాపాడుతోంది. చల్లని నీటి తో జుట్టు శుభ్రం చేసుకోని తడిసిన జుట్టు శుభ్రంగా పొడిగా ఉండేలా తుడిచేసి జుట్టుకు పెట్టిన పిన్నులు,జడబిళ్ళలు అన్ని తీసేసి పక్కన పెట్టేయాలి. జుట్టు వదులుగా ఉంచి సిల్క్ […]

ఇవి డేంజర్

మనం హోటల్స్ లో, హాస్పటల్స్ లో బాత్ రూమ్స్ లో చేతులు కడుక్కొనే చోట ,చేతులు తుడుచుకోకుండా వాటి కింద చేతులు పెడితే వేడి గాలి వెదజల్లే హాండ్ డ్రయర్స్ చూస్తూ ఉంటాం. పరిశోధనలు ఏం చేబుతున్నాయంటే వీటి మూలంగా సూక్ష్మజీవులు ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయట. టాయ్ లెట్స్ నుంచి బయటకు రాగానే పక్కనే వాష్ బేసిన్స్ ఉంటాయి. పక్కనే ఈ హాండ్ డ్రయర్స్ ఉంటాయి. మనష్యుల చేతికి అంటుకున్న సూక్ష్మజీవులు ఈ వేడి గాలికి […]

తల నొప్పి

చాలా సార్లు కారణం లేకుండానే తలనొప్పి వస్తూ ఉంటుంది. తినే ఆహారం ,తాగే పానీయాలు కారణం కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిల్వ ఉండే ఛీజ్ ,ప్రాసెస్ చేసిన మాంసం ,టూరమైన్ ,ఫినైల్ ,ఇథైల్ మెయిన్ అనే బయోజనిక్ ఎమైన్స్ కలిగిన పదార్థాలు చాలా మందిలో తల నొప్పులకు కారణం కావచ్చు .ఆల్కహాలు ఉండే పానీయాలు ,పెర్మెంట్ చేసిన కాయగూరలు ,సరిగ్గా శుద్ధీ చేయని చేపలు ,రెడ్ వైన్ ఇలాంటివి కూడా కారణం కావచ్చు. ఆహారం వల్ల […]

వానోస్తే

చల్లచల్లగా వర్షం పడుతోంటే బావుంటుంది కానీ ,కాలు బయటపెడితే దుస్తులు తడుస్తాయి.చేతిలో పట్టుకొనే వస్తువులు పాడవుతాయి. అందుకే ఈ సీజన్ లో అనువైన దుస్తులు,వాటర్ ఫ్రూప్ బ్యాగ్స్ ఎంచుకొంటే మేలు. వేసవిలో వాడుకొన్నట్లే కాటన్ డెనిమ్ కఫ్రీస్ ను ఈ సీజన్ లో వాడవచ్చు. ఇవి తడిస్తే ఆరటం కష్టం కనుక సింథటిక్ కఫ్రీస్ ,ఏలాజో నీ లెంగ్త్ ట్రౌజర్లు ఈ సీజన్ కు వీలుగా ఉంటాయి.అలాగే వాటర్ ఫ్రూప్ బాగ్స్ ,బ్యాగ్ ఫ్యాక్స్ తీసుకోవాలి. మొబైల్ […]

వట్టి అపోహాలు

గంటసేపు వ్యాయమాలు ఎక్కుడ చేస్తాం బాబూ ,ఉదయాన్నే మాకు అంత తీరికనా అనే అభిప్రాయంలో చాలా మంది అసలు చిన్న పాటి వాకింగ్ కూడా చేయరు.ఒక్క పదినిమిషాలు ఉపయోగించుకోగలిగిన చాలని అర్ధం చేసుకొరు. రోజులో పదేసి నిమిషాల పాటు ,రెండు మూడు సార్లు వ్యయమాం చేస్తే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి.అలాగే వ్యాయమానం మానేస్తే లావెక్కిపోరు. ఆహారంలో మార్పులు చేసుకోకపోవటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. వ్యాయమం అసలు మానేసి అవసరానికి మించిన కేలరీలు శరీరానికి దొరికితే […]

బయోటిన్ లోపం కావచ్చు

జట్టు ఆరోగ్యంగా లేకుండా బలహీనపడిపోయి తెగిపోతూ ఉంటే అది బయోటిన్ లోపం కావచ్చు ప్రోటీన్ లు విడగొట్టి అమైనో ఆమ్లాలు గ్లూకోజ్ గా మార్చటంలో దీనిది ప్రధాన పాత్ర .పీనట్ బలర్ ,చేపలు ,పుట్టగోడుగులు ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో బయోటిక్ స్థాయి సరిగా ఉంటుంది. అలాగే విటమిన్ ఇ కూడా చాలా ముఖ్యం .ఇది సౌందర్యాన్ని ఇచ్చే విటమిన్ బాధం గింజల్లో ఈ పోషకం ఎక్కువగా ఉంటుంది. దీన్నీ తలకు పట్టించుకోవచ్చు కూడా కొబ్బరి నూనెలో రెండు […]