Chinna Maata
కాలుష్య నివారిణి విటమిన్ బి
వాయు కాలుష్యం శరీరంలోని ఎన్నో అవయవాలపైన ప్రభావం చూపెడుతోంది అంటారు అధ్యయనకారులు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్న ప్రయోజనం శూన్యం అయితే విటమిన్ బి తో ఈ కాలుష్య ప్రభావం నుంచి తప్పిచుకోవచ్చు అంటున్నారు అధ్యయనకారులు. కొన్ని వందల మందితో జరిపిన ఈ పరిశోధనలో బి2 తీసుకొన్న వారిలో వాయు కాలుష్య ప్రభావం ఏమీ కనిపించ లేదు.ఇది మొదటి సారిగా రుజువైంది.ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.
లైట్ మేకప్ ప్రధానం
వేసవికి సింపుల్ మేకప్ వేసుకోండి అంటారు ఎక్స్ పర్ట్స్. ఫౌండేషన్ ,సింపుల్ లేయర్లు అప్లైయ్ చేసుకోవాలి. సరైన షేడ్ ఫౌండేషన్ ఎంచుకొని కరెక్ట్ గా అప్లైయ్ చేస్తే ఎక్కువ మేకప్ అవసరం ఉండదు. కాంప్లెక్షన్ సమంగా ఉండేందుకు లేదా మచ్చల్ని కవర్ చేసేందుకు కొద్ది పాటి ఫౌండేషన్ చాలు. చర్మం ఆయిలీగా ఉంటే లిక్విడ్ ఫౌండేషన్ సూటవుతుంది. పొడిగా సాధరణ చర్మం గలవారు క్రీమీ షౌండేషన్ ఉపయోగించాలి. ఫౌండేషన్ లోని ఆయిల్స్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
పోల్చుకొంటేనే సమస్య
సాధ్యమైనంత వరకు సాటి ఉద్యోగులు లేదా పరిచయంతో ఉండే ఇరుగు పొరుగులతోనూ ప్రవర్తన విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆ ప్రభావం తప్పకుండా మీద పడుతుందనీ చెపుతున్నారు విశ్లేషకులు. వారితో మాట్లాడటం సన్నిహితంగా ఉండటంతో ఏ సంఘటన జరిగినా ఆ ప్రభావం మనసుపైనపడి నిద్రపట్టనీయక, ఒత్తిడికి గురిచేస్తుందంటున్నారు. తోటి మసుషుల్లో ఉండే ఉద్రేకాలు ప్రవర్తన ,జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన విషయంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు మనసుపైన తప్పని సరిగా ముద్రపడి ఆందోళన కలిగిస్తుందనీ ,ఆ సందర్భాన్ని […]
అదో సమస్యా?
ఇప్పుడు రెండో సారి గర్భం దాల్చాను. క్రితం సారి లాగా ఒత్తిడితో లేను. ఈసారి సులువుగా సన్నబడి పోతాను అంటూ నటి సమీరా రెడ్డి ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ వెనకో కథుంది. తీరైన శరీరాకృతిలో ఉన్న సమీరా రెడ్డి మొదటి బిడ్డకు జన్మ ఇచ్చాక 102 కేజీల బరువు పెరిగింది. జుట్టు ఊడిపోయింది, దీన్తో సమీరా బయటికి రాలేకపోయింది. దీనితో ఎన్నో వ్యాయమాలు చేసి సన్న బడిపోయింది.ఈ బరువు తగ్గించటంలో ఉన్న సులువులు ఇప్పుడు […]
కథా స్రవంతి
(పి.సత్యవతి కథలు) పి సత్యవతి ప్రముఖ నవలా కథా రచయిత్రి ,వ్యాసకర్త , కాలమిస్ట్. ఆమె రచనలలో గత 50సంవత్సరాల్లో మధ్య తరగతి స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులు కనిపిస్తాయి. ఈ కథ సంపుటి లో పది కథలున్నాయి. ప్రపంచీకరణ పర్యావసానాలు స్త్రీల జీవితాల్లో తెచ్చిన మార్పులు ఈ సంపుటిలో ఉన్నా ‘మంత్రనగరి’ కథలో కనిపిస్తాయి. వృద్ధాప్యంలో జరిగిన పెళ్ళిళ్ళూ వాటి వెనక ఉండే పలు ఆర్ధిక సామాజిక కారణాలు కొత్త ఆలోచనలతో చెప్పిన కథ ‘ఆవిడ’. […]
అడుగేసి చూస్తే మజా
ఎప్పుడు ఎదో ఒక కొత్తదనం కావాలి ఎదుటివాళ్ళు ఆశ్చర్యపోవాలి.అనుకుంటే గుమ్మాలు సోఫాలు ముందర వేసుకునే పూల్ స్టోన్స్ రగ్ కొనుక్కోచ్చేయాలి చూసేందుకు ఇవి సముద్రపు రాళ్ళ లాగా రాళ్ల ఉండల్లాగా అనిపిస్తాయిఽయితే కాళ్ళు పెట్టగానే మెత్తగా సున్నితంగా తాకితే ఈ పూల్ స్టోన్స్ ని ఉన్ని తోనే తయారు చేస్తారు.ఎగుడు దిగుడుగా ఉండే వీటి పై నడవడం వల్ల కాళ్ళకు రక్తప్రసరణ పెరుగుతుంది కూడా.
భ్రమ కాదు వాస్తవం
డైనింగ్ టేబుల్ డెకరేషన్ కు పెద్ద హడావిడి ఉండదు. హాట్ బాక్స్ లు,ప్లేట్లు మహా అయితే ఒక ఫ్లవర్ వాజ్ కానీ ఇవ్వాల్టీ టెక్నాలజీ ఈ కాన్సెప్ట్ ని మార్చేసింది.ఒక త్రిడీ టేబుల్ క్లాత్ గనుక టేబుల్ పై పరిస్తే ఆ ఎఫెక్ట్ చాలా పెద్ద పెద్ద పువ్వులు అచ్చంగా అనిపించే ఫ్రూట్స్ ,గులాబీలు ఒకటేమిటి ఏ క్లాత్ అయినా త్రీడీలో అచ్చంగా పెద్ద సైజుని అక్కడ పెట్టినట్లే అనిపిస్తాయి.
ఉతికి వాడటం బెస్ట్
ఒక్కసారి కొత్త దుస్తులు ధరిస్తే ఎలక్ట్రిక్ రియాక్షన్ కనిపిస్తుంది.సింథటిక్,ఫ్యాబ్రిక్ తరచు డిస్పర్స్ డైలతో ఉంటాయి కాబట్టి ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది.కాటన్ వంటి వాటిలో కూడా ఇరిటేటిగ్ డీ హైడ్ మూలాలుంటాయి.ఫ్యాబ్రిక్ ముడతలు పడకుండా తయారీదారులు వీటిని ఉపయోగిస్తారు.కొత్తదనం పోతుంది అన్న భావన లేకపోతే వీటిని ఉతికి ఆరేసి ఐరన్ చేసి ధరించడం మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.
మొటిమల సమస్యా
పదహరేళ్ళ వయసులో మొటిమలు చాలా ఇబ్బందిపెట్టే సమస్య. హార్మోన్ల ప్రభావం వల్ల ఇవి రావడం మాములే అయినా ఆహారం కొంత ఊరట పొందవచ్చు. విటమిన్ సీ అధికంగా ఉండే జామ,నారింజ,కమలా,కివి,విటమిన్ సీ అధికంగా ఉండే బొప్పాయి,కర్భూజా,యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మామిడి ,పుచ్చ ,దానిమ్మ,ద్రాక్ష వంటి పండ్లు తీసుకోవాలి.ఉప్పు తగ్గించాలి. బాదం,పిస్తా,అక్రోట్ వంటి గింజలు మంచివే. ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. మంచి నిద్ర పోవడం కూడ మంచిదేఽఅహార నియామాలు పాటిస్తే మొటిమలు తగ్గుతాయి.
1379 కోట్లు ఈ నెక్లెస్
ఈ నెక్లెస్ ఖరీదు అక్షరాలా 1379 కోట్లు. హాంకాంగ్ కు చెందిన చౌటాయ్ ఫుక్ సంస్థ వాళ్ళ డిజైనర్ వాల్గేస్ చన్ 22 మందితో కలిసి 47 వేల గంటలు పని చేసి ప్రపంచంలోనే అరుదైన 507 క్యారెట్ల బరువైన కలినన్ హెరిటేజ్ అన్న వజ్రంతో ఇంకా ఐదు వందల గులాబీ వజ్రాలు వందల సంఖ్యలో ఆకుపచ్చని జేడ్ రాళ్ళు కలిపి ఈ అందమైన ఖరీదైన నెక్లెస్ తయారు చేశారు.ఈ నెక్లెస్ 27 రకాలుగా వేసుకోవచ్చు.
మరీ ఇంత ఖరీదా
ఈ ప్రపంచంలో విలాసవంతమైన వస్తువులు ఎన్నో తయారుచేస్తే వాటిని కొనే వినియోగదారులు ఉన్నారు. లండన్ కు చెందినెన్ సేథియా ఫౌండేషన్ ఒక టీ పాట్ ను 1658 వజ్రాలు 386 థాయ్,బర్మ కెంపులు.ఏనుగు దంతం,హ్యాండిల్ ఉపయోగించి తయారు చేసింది. దీనిపేరు ద ఇగోయిస్ట్ టీ పాట్. దీని ఖరీదు 20 కోట్లు. ఇది ప్రపంచంలోనే విలువైన టీ పాత్రగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది.
ఆరోగ్యం కోసం శిల్పా యాప్
ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటే మానసికంగా శారీరకంగా అంత శ్రమించవల్సిన అవసరం ఉండదు అంటుంది శిల్పాశెట్టి.వ్యాయామ పరికరాలు లేకుండా జిమ్ లోకి వెళ్ళవల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులువుగా వర్కవుట్స్ చేసుకునే వీలుగా సెలబ్రిటి ఫిట్ నెస్ యాప్ తీసుకొచ్చారు ఆమె.సరైన ఆహార ప్రణాళిక పాటిస్తూ బరువు తగ్గుతూ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చుకుంటే కండరాలను దృఢంగా చేసుకునే అనేక విషయాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అందరు పాజిటివ్ లైఫ్ స్టైల్ అలవర్చుకొండి అంటుంది శిల్పా […]
కాంట్రాస్ట్ గా ఎంచుకోవచ్చు
ఎన్ని రకాల దుస్తులున్న అమ్మాయిలకు ఇవ్వాళేం వేసుకొవాలి అన్న సందేహమే. ఏ వయసు వారైన వార్ట్ రొబ్ లో రెండు చక్కని చేనేత చీరెలు, తాజా ట్రెండ్ లో ఒకటైన కలంకారీ ,మరోకటి బెనారస్ తప్పని సరిగా ఉండాలి.ఏ సీజన్ లో కట్టుకొన్న ఈ రకం కాటన్ చీరెలు ఎప్పుడు ఫ్యాషనే . ఇక లెహాంగా అయినా చీరెకైన చక్కని మ్యాచింగ్ కావాలంటే బ్లౌజ్ ల్లో ఫ్లెయిన్ గోల్డ్ ఎరుపు నలుపు ఆకుపచ్చ రంగుల్లో క్రాప్ టాప్ […]
దాన్ని తుడి చేయండి
కార్పోరేట్ బోర్డ్ మీటింగ్ లలో అమ్మాయిలపై అనధికారంగా కొన్ని దురభిప్రాయాలు చర్చల్లోకోస్తాయి. నెలసరులప్పుడు అమ్మాయిలు కీలక నిర్ణయాలు తీసుకోలేరు అని. దీన్ని పీరియడ్ బ్రెయిన్ అని వెక్కిరింతగా వాడతారు. గ్రీక్ లోని అరిస్టాటిల్ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకురాలు బ్రిగెటీ లీనర్స్ వంద మంది మహిళలపై ఒక అధ్యయనం చేసి నెలసరికి కారణం అయిన హార్మోన్స్ కి మేధోపరమైన ఆలోచన శక్తి సంబంధం లేదని తేల్చారు. అలాంటి అపనమ్మకాలు మీ బుర్రలో ఉంటే వాటిని వెంటనే క్లీన్ చేసకొమ్మని […]
ఆహార ప్రణాళిక ముఖ్యం
వర్కవుట్స్ చేస్తున్నప్పుడు మంచి ఆహర ప్రణాళిక ఉండాలి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. వర్కవుట్స్ చేసే ముందర ఐదారు బాధం గింజలు మూడు నుంచి ఆరు వరకు ఖర్జూరాలు తీసుకొంటే ఆక్సిజన్ అందించే కెపాసిటీ పెరుగుతుంది. వర్కవుట్స్ పూర్తైన తర్వాత ఒక గుడ్డు ,ఒక పండు తింటే బలహీనమైన కండరాలు తిరిగి శక్తిని ఉంచుకొంటాయి. మధ్య మధ్యలో ఉప్పు కలిపిన నిమ్మరసం తీసుకొంటే మంచిది. 22 సంవత్సరాలు దాటాక వర్కవుట్స్ కోసం వెళుతుంటే డాక్టర్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు […]
కేలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ
ఈ సీజన్ లో ముంజలోస్తాయి. వీటిలో శరీరం చల్లబడటమే కాదు ఎండ నుంచి ఉపశమనం అలాగే సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, ఇనుము, జింక్, ఫాస్పరస్ , పోటాషియం ,కాల్షియం వంటి పోషకాలున్నాయి. నీటిశాతం ఎక్కువ. ఇవి తింటే శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కేలరీలు తక్కువే కాని అవసరమైన శక్తి లభిస్తుంది. తక్షణ శక్తి ఇస్తాయి ముంజలు .గర్భణీలు కూడా వీటిని తినచ్చు. గర్భవతులుగా ఉన్నప్పుడు తలెత్తే జీర్ణాశయం సమస్యలకు ఇవి పరిష్కారం.
గులాబీ వన్నే కోసం
గులాబి రేకులు చర్మ సంరక్షణ చేస్తాయి. గులాభీ రేకుల్నీచల్లని నీళ్ళలో కాసేపు ఉంచి ,వాటిని మెత్తగా చేసి ఫేస్ పాక్ వేసుకొంటే ముఖం ఎంతో తాజాగా ఉంటుంది. పొడి చర్మం గల వాళ్ళకి గులాబి రేకుల్లోని సహజమైన నూనెలు కావాల్సిన తేమను ఇస్తాయి. గులాబీ రేకుల్ని మొత్తగా చేసి కాసిన పాలు తేనె కలిపి ప్యాక్ వేసుకొని ఓ అరగంట అయ్యాక కడిగేస్తే మృత కణాలు పోవటంతో పాటు ముఖచర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. గులాబీ రేకుల్లో […]
ముఖాకృతిని బట్టే లోలకులు
ఎన్నో రకాల ఇయర్ రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి.అయితే ముఖాకృతికి తగ్గవే తీసుకొమ్మంటారు స్టైలలిస్టులు. ఓవెల్ షేప్ ముఖాకృతి ఉంటే ఆ ముఖానికి ఏ మోడల్ ఇయర్ రింగ్స్ అయినా నప్పుతాయి. చెవులకు అంటినట్లు ఉండే దిద్దులు ,మెటల్ బీడ్స్ ,స్టోన్ హాంగింగ్స్ ఏ వయినా బావుంటాయి. స్క్వేర్ షేప్ మొహం అయితే మొహం ఆకారానికి పూర్తిగా విరుద్దంగా ఉంటే ఆభరణాలు ,పొందికగా ఉండేవి బావుంటాయి.రౌండ్ షేప్ అయితే సైజ్ ,పొడవు పైన దృష్టిపెట్టి మెడ పొడవును కూడా […]
టీ బ్యాగ్స్ తో తాజాదనం
పని ఒత్తిడి వల్ల కళ్ళ కింద వలయాలు వస్తాయి. అలాంటప్పుడు స్వచ్చమైన ఆల్మండ్ ఆయిల్ ని కళ్ళచుట్టు రాసి కాసేపు మసాజ్ చేస్తే పోతాయి. అలాగే కీరా బంగాళా దుంప రసం కలిపి కంటి కింద రాసి ఇరవై నిమిషాల ఆగి కడిగేస్తే చాలు. అలాగే బయటకు వెళ్ళే ముందర కళ్ళకింద ఒక్క చుక్క నీళ్ళు అద్ది సన్ స్క్రీన్ అప్లైయ్ చేస్తే నలుపు రంగు వలయాలు రాకుండా ఉంటాయి.నిద్ర తక్కువై కళ్ళు ఉబ్బితే వాడేసిన టీ […]
ఇలా చేయవచ్చు
ఇంట్లోనే పన్నీరు తయారు చేసుకోవాలంటే రెండు కప్పుల గులాబి రెక్కలు ఒక లీటర్ నీటిలో వేసి మరిగించి చల్లార్చితే సరి. పన్నీరు తయారీకి వర్షపు నీరు మంచిది, కూరల్లో రుచి పెరగాలంటే చివరలో ఒక స్పూన్ కొబ్బరి తరుము అర స్పూన్ జీలకర్ర పొడి కలపాలి. టోమాటో పేస్ట్ ఇంట్లో తయారు చేసుకొని కూరల్లో వాడాక మిగిలిపోతే పారేస్తూ ఉంటారు. దీన్ని ఐస్ ట్రేలో కొంచెం ఉప్పు కలిపి నాలుగైదు రోజుల వరకు పాడై పోకుండా ఉంటుంది. […]
