Chinna Maata
హ్యాపీ అలియన్
ఈ సృష్టిలో వింతల కు కొదవ లేదు కాల్సియోలారియా యూనిఫ్లోరానే హ్యాపీ అలియన్ అని పిలుస్తారు.దీన్నే కానీ చూడ్డానికి ఎవరో చిన్న గిన్నెను పట్టుకున్నట్లుగా ఉంటుంది. దీన్నే డార్విన్ స్లిప్పర్ ఫ్లవర్ అనీ అంటున్నారు. దక్షిణ అమెరికాలో ఉన్న టియెరా డెల్ ఫ్యూగో ప్రాంతంలోని కొండల్లో పసుపూ తెలుపూ గోధుమ రంగుల్లో విరబూసే ఈ పూవులు వింత జీవులేవో భిక్షపాత్ర పట్టుకుని నడిచొస్తున్నట్లేఉంటాయి. చేత్లో గిన్నె పట్టుకొన్నట్లే ఉంటాయి అచ్చంగా.
ఇదే మంచి మందు
ముక్కు,నుదురు,చుబుకం పై బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో లభించే పదార్ధాలతో వీటిని తేలికగా తొలిగించవచ్చు ముఖ్యంగా బంగాళదుంప పేస్ట్ చక్కగా పనిచేస్తుంది. ఒక స్పూన్ చొప్పున ఆలు రసం తేనె తీసుకొని ఇందులో పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఇలా వారంలో రెండు మూడుసార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. అలాగే పావు చెంచా చొప్పున పసుపు ఉప్పు తీసుకొని కొబ్బరి నూనె కలిపి బ్లాక్ హెడ్స్ పై […]
మానసిక ఆరోగ్యం ముఖ్యం
సామజిక దూరం పాటించటం,ఫేస్ మాస్క్ ధరించటం చేతులు శుభ్రంగా ఉంచుకొంటే కోవిడ్ నుంచి తపించుకోవచ్చని మనకు తెలిసిందే. కానీ శాస్త్రవేత్తలు కోవిడ్ నుంచి సంపూర్ణ రక్షణ కావాలంటే డిప్రెషన్,ఎడి హెచ్ డి,బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతులు కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నరు.వారిలో స్కిజో ఫెనియా హైపర్ యాక్టివిటీ డిజార్డర్. మేజర్ డిప్రెసిక్ డిజార్డర్ల కలిగిన వాళ్లకు ప్రమాదం రెట్టింపుగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ టీకా అత్యవసరం అనివారు చెపుతున్నారు.
సీవీడ్ తో సాచెట్లు
సముద్రపు నాచు తో సాచెట్స్ తయారు చేసింది శాస్త్రవేత్ర డాక్టర్ జెస్మిడె బర్మ. ఈ నాచు పోషకాల మాయం కొవ్వు తక్కువ శరీరానికి మేలుచేసే మాంసకృత్తులు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సాచెట్లు అటు పర్యావరణ కాలుష్యానికి,ఇటు పోషకాహార లేమికి చెక్ పెడుతున్నాయి. ఇవి మసాలాల వంటివి ప్యాక్ చేసేందుకు వీలుగా ఉన్నాయి నూడుల్స్, కూరల్లో ఈ మసాలా నింపిన సాచెట్స్ నేరుగా వేసేయవచ్చు ఇవి తేలికగా కరిగిపోతాయి. ఆరోగ్యం ఇస్తాయి. ప్లాస్టిక్ వ్యర్ధాల సమస్య […]
చర్మ సౌందర్యాన్నిచ్చే పరిమళ నూనెలు
చర్మ సౌందర్యానికి పరిమళ నూనెలు ఎంతగానో ఉపయోగ పడతాయి అయితే చర్మం తీరును బట్టి ఎంచుకోవాలి. ఉదాహరణకు పొడిచర్మం అయితే బాదం నూనె,రోజ్ హిప్ నూనె మేలుచేస్తాయి. బాదం నూనె చర్మంలో తేమనే కాదు మృదుత్వాన్ని పెంపొందిస్తుంది. ఇందులోని విటమిన్-ఎ రెటినాల్ చర్మం కింది రక్తనాళాలను ప్రేరేపిస్తాయి. చర్మం బిగుతుగా ఉండేందుకు తోడ్పడే కొలాజెన్ ఉత్పత్తిని దోహదం చేస్తాయి. అలాగే రోజ్ హిప్ నూనెలో అత్యవసర కొవ్వు ఆమ్లాలన్నీ ఉంటాయి. అందువల్ల పొడిచర్మానికి మేలు కలుగుతుంది. దాన్ని […]
చెప్పనా? కథ చెప్పనా?
భారతదేశంలో కథలు చెప్పే సంస్కృతి గొప్పగా ఉంటుంది.. కథలు, పాటలు మంత్రాలు నృత్యరూపకాలు పురాణాలు చరిత్ర మతాలు ఆదేశాల వంటివి ఎన్నో కథలుగా మలిచి చెప్పేందుకు వీలుగా ఉన్నాయి.. కథలు ఊహా శక్తిని, సృజనాత్మకతను ఆలోచనను తెలియజెప్పేందుకు అవసరమైన శక్తివంతమైన సాధనాలు గా రూపాంతరం చెందాయి. కథలు పిల్లల్లో ఊహ శక్తిని పెంచుతాయి. ఎదుటి వాళ్లు చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే వయసు వచ్చిన దగ్గర నుంచి పిల్లలు కథలు వినేందుకు ఆసక్తి చూపిస్తారు. పిల్లలు కథలు […]
పని సులభం
వంటింటి చిట్కాల తో ఎప్పుడూ పని సులభతరం అవుతుంది. పుస్తకాలు ఉంచే అలమారలో ఎండిన వేపాకులు ఉంచితే చెద పురుగులు పట్టవు.ముత్యాల నగల తెల్లదనం పోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఆలివ్ నూనెతో తుడవాలి.వెండి పాత్రలో కర్పూరం బిళ్లలు వేస్తే నల్లబడకుండా ఉంటాయి. కాఫీపొడి వాసన పోకుండా ఉండాలంటే గట్టి మూత ఉన్న డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.గంజిలో కాస్త ఉప్పు వేసి బట్టలు ఉతికితే అవి మరింత తెల్లగా ఉంటాయి .యాపిల్ మొక్కలు రంగు మారకుండా […]
రోజంతా పరిమళం
పర్ఫ్యూమ్స్ పరిమళం రోజంతా సువాసన పంచుతూ ఉండాలనుకుంటే దాని గాఢత శాతం ఎంత ఉందో గమనించాలి 10 నుంచి 40 శాతం గాఢత ఉంటే పర్ఫ్యూమ్ సువాసన ఏడెనిమిది గంటలు అలాగే ఉంటుంది. స్నానం చేసిన వెంటనే పర్ఫ్యూమ్ చల్లుకోవాలి అప్పుడు స్వేద గ్రంధులు తెరుచుకుని ఉంటాయి. ఆ పరిమళం ఎక్కువ సేపు ఉంటుంది. మణికట్టు చెవి వెనుక మోకాలు దగ్గర పర్ఫ్యూమ్ చల్లుకోవాలిి. ఈ పల్స్ పాయింట్స్ దగ్గర ముందుగా పెట్రోలియం జెల్లీ రాస్తే పరిమళం […]
పొట్ట తగ్గించే ఉలవచారు
ఉలవ జావా పొట్ట తగ్గించడంలో ముందుంటుంది. ఇది చేయటం చాలా సులభం. 50 గ్రాముల ఉలవలు దీనికి పది రెట్లు నీళ్లు అల్లం ఒక గ్రాము జీలకర్ర పొడి ఒక గ్రాము సైంధవలవణం రెండు గ్రాములు మిరియాలపొడి ఒక గ్రాము.వీటన్నింటిని కలిపి జావలా కాచి ప్రతి సాయంత్రం తాగాలి .ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాదు సాగిపోయిన పొట్ట కూడా దగ్గర వస్తుంది .వ్యాయామం కనీసం అరగంట పాటు తప్పనిసరిగా చేయాలి దానితోపాటు ఉలవల చారు […]
తల్లిదండ్రులే మొదటి గురువులు
జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు ఎదురుదెబ్బలు నష్టాలు అపజయాలు మొదలైనవి చాలా సహజమని ఓటమి కూడా ఒక్కసారి గొప్ప గుణపాఠం అవుతుందని పిల్లలకు తెలియజెప్పాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పరీక్షల్లో ఆటల్లో ఓడిపోవటం పిల్లలను నిరాశకు భయాన్ని గురిచేస్తుంది అలాంటి సమయంలో పిల్లలు పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకునే లా వాళ్లని తీర్చిదిద్దాలి అంటున్నారు. గెలుపు ముఖ్యమే, కానీ చేసిన పొరపాట్లను చక్కదిద్దుకోవడం ద్వారా మరోసారి విజయం సాధించవచ్చని పిల్లలకు తెలియజెప్పాలి. తల్లిదండ్రులే వారికి మొదటి గురువు కనుక […]
యవ్వన వంతమైన చర్మం
ఇంట్లో వంటింట్లో ఉండే కొన్ని వస్తువులు ముఖాన్ని యవ్వన వంత గా మార్చేందుకు ఉపకరిస్తాయి. కళ్ళకింద నల్ల మచ్చలు చింతపండుతో పోగొట్టవచ్చు ఇందులోని సిట్రిక్ యసిడ్ చర్మం అందంగా చేసేందుకు ఉపయోగపడుతుంది .పాలు చింతపండు ఈ రెండింటినీ మిక్సీలో వేసి గుజ్జులా చేసి ఆ పేస్ట్ ను ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేస్తే నల్ల మచ్చలు ముడతలు పోతాయి. పసుపుకొమ్ములు వేయించి మెత్తగా పొడిచేసి ఆ పొడితో నలుగు పెట్టుకుంటే శరీరంలోంచి వచ్చే […]
నిత్యం ఉతకాలి
ఏ మాస్క్ నయినా ప్రతిరోజు శుభ్రం చేసుకోక తప్పదు అన్ని రకాల మెటీరియల్ తో తయారయ్యే మాస్క్ కయినా ఈ నియమం వర్తిస్తుంది.ఎన్ 95 మాస్క్ మాత్రం కేవలం నాలుగు సార్లు ఉపయోగించుకోవచ్చు తర్వాత నాలుగు రోజులు పక్కన పెట్టి మళ్లీ వాడుకోవచ్చు ఆ సమయంలో ఈ మాస్క్ కు ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కారణంగా తిరిగి మరో నాలుగు రోజులు వాడుకునేందుకు సిద్ధం అవుతుంది .కాటన్ బేస్డ్ మాస్క్ లే చర్మానికి హాని కరంగా […]
ఈ సంఘటన అత్యంత విషాదం
ఉత్తరాఖండ్ చమోలి జిల్లా జోషి మత్ ప్రాంతంలో దౌలీ గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది .గంటలోపే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సమాచారం అందింది వెంటనే రుషీ గంగ తపోవన్ ప్రాంతాలకు రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు బెటాలియన్ లను పంపించాను డెహ్రాడూన్ నుంచి నా టీమ్ తో మేము బయలుదేరి పోయాము ప్రతి అడుగు ఎంతో కష్టమైంది అని చెప్తున్నారు డిఐజి అపర్ణ కుమార్ గంగా ప్రవాహానికి వంతెన కూలి పోవటంతో 13 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు […]
కన్నీళ్లకు కారణం ఇవే
విషాద పరిస్థితుల్లోనే ఏడుపు వస్తుందనేది నిజం కాదంటున్నారు పరిశోధకులు. భయపడినప్పుడు గట్టిగా అరవటం వంటివి భావోద్వేగమే ఏడుపు కూడా. తీవ్ర వత్తిడికి గురైనప్పుడు గట్టిగా అరిచి చివరకు కళ్ళ నీళ్లు పెట్టుకొంటారు. అలాగే ఆనందం తో కూడా గట్టిగా అరుస్తారు. కన్నీళ్లు పెట్టుకొంటారు. ఇలాటి అరుపులు ఏడుపులు భావోద్వేగ సమతుల్యం ఇస్తాయంటారు. ఏ ల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎక్కువ సమయం భావోద్వేగ తీవ్రతతో ఉండటం మంచిది కాదు అందుకే కన్నీరు ఏడుపు చాలా అవసరం అంటారు పరిశోధకులు. […]
తెలంగాణ కు పతాకాలు లక్ష్యం
అమ్మాయిలు మాత్రమే రాణించగలగే రిథమిక్ జమ్నాస్టిక్ క్రీడల్లో ఛాంపియన్ అలికా జో మన రాష్ట్రం తరఫున జాతీయ అంతర్జాతీయ వేదికలపైనా అలికా జో 150 కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది.మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది అలికా జో పి.వి సింధు అలికా జో కు సీనియర్ .మణికొండలోని జోయ్స్ జిమ్నాస్టిక్ అకాడమీ ప్రారంభించిన పిల్లలకు జిమ్నాస్టిక్ లో తర్ఫీదు ఇస్తోంది. తెలంగాణ నుంచి జిమ్నాస్టిక్ లో పతకాలు సాధించే ప్లేయర్లను తయారు […]
ఎర్రని పెదవులకో జెల్
పెదవులు గులాబీ రంగులో ఉండాలంటే ఈ మిశ్రమం ఉపయోగ పడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల ఎక్స్ ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్,పీ బటర్ అర టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ గ్రేటెడ్ బీన్ వ్యాక్స్ లను కొద్దిగా వేడి చేసి పెట్టుకోవాలి. చల్లారాక అందులో పది చుక్కల విటమిన్-ఇ ఆయిల్,ఏదైనా ఎస్సెన్షియల్ ఆయిల్ పది చుక్కలు కలపాలి. ఈ మిశ్రమం పెదవులకు రాసుకొంటూ ఉంటే మృదువుగా గులాబి రంగులోకి వస్తాయి. విటమిన్ ఇ టాబ్లెట్లు కూడా […]
ఈ బ్లెండర్ తో మేకప్ ఈజీ
చూసేందుకు వాటర్ డ్రాప్ షేప్ లో ఉండే ఈ మేకప్ బ్లెండర్ తో మేకప్ వేసుకోవటం సులభం దాన్ని ఉపయోగించటం తేలిక కూడా.ఈ బ్లెండర్ ను పొడిగా వాడకూడదు. నీటిలో ముంచి గట్టిగా పిండేయాలి.ఈ నీటి చుక్క ఆకారంలో ఉండే బ్లెండర్ తో ఫౌండేషన్ కన్సీలర్ వేసుకోవడం చాలా సులభం ఫౌండేషన్ ను మొహం పై చుక్కలు చుక్కలుగా పెట్టుకొని బ్లెండర్ తో పైపైన అద్దితే అది సమంగా పరుచుకుంటుంది ప్యాచ్ లాగా కనిపించకుండా సహజంగా ఉంటుంది. […]
ఇవి వేడినిస్తాయి
ఇంకా చల్ల గాలులు వస్తూనే ఉన్నాయి. ఈ చల్లని రోజులో వెచ్చదనం ఇచ్చే ఆహారం కావాలి. జలుబు,ఫ్లూ,జ్వరాలు ఔషధంగా తేనె ఉపయోగించాలి. అల్లం తులసీ టీ శరీరానికి స్వాంతన ఇస్తుంది.చలి కాలంలో నెయ్యి శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా ఖర్జురాలు,ఆప్రికాట్స్ వంటివి తింటే వళ్లు వెచ్చగా ఉంటుంది. బెల్లం తినటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. దాల్చిన చెక్క వాడకం కూడా చాలా మంచిది. గోరు వెచ్చని పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని […]
రసాయనాల ప్రభావం కావచ్చు
సౌందర్య ఉత్పత్తుల్లో రసాయనాలు ఉంటాయి. ఒక్కసారి ఈ రసాయనాల ప్రభావం చర్మం పైన పడుతుంది అప్పుడు చర్మం కొన్ని సంకేతాలు ఇస్తుంది చర్మంపైన చిన్న ఎర్రని బుగ్గలు ఏర్పడి పగుళ్ళు వస్తే ఉపయోగించే సౌందర్య సాధనాలలో సల్ఫేట్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ లో సోడియం లారైల్, సల్ఫేట్ పాళ్ళు ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఒక్కసారి చర్మం పైన ఎక్కువ జిడ్డు లేదా పొడిగా కనిపించవచ్చు. అన్ని సీజన్లలో ఒకే రకం సౌందర్యసాధనాలు వాడకూడదు […]
ఇవి ఇలా తింటే ఆరోగ్యం
ఇవి తరచుగా తింటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. వారానికి నాలుగు సార్లు ఆకుకూరలు తినాలి అలసందలు మొదలైనవాటిని వారానికి రెండుసార్లు స్నాక్స్ లాగా తినాలి. వారానికి మూడుసార్లు తెల్ల నువ్వులు ఉండలు,పల్లీల ఉండలు బెల్లంతో తయారు చేసినవే తినాలి. నెయ్యి బెల్లం కలిపిన సున్నుండలు చాలా మంచిది. ఆయా కాలాల్లో దొరికే పండ్లను వారానికి రెండుసార్లు తినాలి.నానబెట్టిన బాదం పప్పు స్నాక్ లాగా తినాలి. పరిమితంగా జీడిపప్పు, పిస్తా పప్పు తినాలి. అవన్నీ వేడిగా ఉన్నప్పుడే […]
