Chinna Maata
రంగు రాళ్ళ బొమ్మలు
సోషల్ మీడియాలో జస్టిన్ బెట్మాన్ ని ‘పెబెల్ పికాసో’ అంటారు ఇతను సృష్టించే ఆర్ట్ వర్క్ చిత్రంగా ఉంటుంది. వందల వేల రంగురాళ్లు ఉపయోగించి బొమ్మలు సృష్టిస్తాడు. చిన్న రాళ్లనే ఉపయోగిస్తూ చక్కని వివరాలతో చిత్రాలను సహజ వాతావరణంలో సృష్టిస్తాడు. ఇవి కొన్ని గంటలే ఫోటో తీసుకొని ఆ బొమ్మని చెరిపేస్తాడు. ఎప్పుడూ రంగురాళ్లు వెదకటం కనబడే రాళ్లతో ఆలోచించడం అందులో సరైన ప్రదేశం ఎంచుకోవటం బొమ్మ రూపొందించటం చివరగా ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పెట్టడం […]
పార్టీకి మేకప్
పార్టీ లో ఫోటోలు బాగా రావాలంటే కొన్ని మేకప్ టిప్స్ ఇస్తున్నారు ఎక్సపర్ట్స్. జుట్టు ముందు భాగంలో కాంటూరింగ్ (contouring) చేయటంవల్ల నుదురు చిన్నగా అనిపిస్తుంది. ముక్కు సన్నగా కనిపించాలంటే ముక్కు రెండు వైపులా కాంటూరింగ్ చేయాలి ముక్కు దూలం హైలెట్ చేస్తే ముక్కుసూటిగా కనిపిస్తుంది. పెదవుల మధ్యలో లిప్ స్టిక్ చిక్కగా వేసే పెదవులు పూర్తి షేప్ లో కనిపిస్తాయి. దవడ ఎముకలు అడుగున కాంటూరింగ్ చేస్తే ముఖం ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. దవడ కండరం […]
ఒకే నూనె వద్దు
వంట నూనెల్ని మార్చి మార్చి వాడితే ఆరోగ్యం అంటున్నారు వైద్యులు. మనం వాడే నూనెలో రెండు ప్రధాన రకాలు ఉంటాయి అందులో ఒకటి మ్యూఫా (మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్) వేరుశనగ నూనె ఆలివ్ నూనె వంటివి రెండవది ప్యూఫా (పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) పొద్దుతిరుగుడు వంటి నూనెలు. ఈ నూనెలను మార్చి మార్చి వాడు కొమ్మని అది గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. వారానికి పది రోజులకా అన్న కాలవ్యవధి మీ […]
బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ
పుట్టిన మరుక్షణం నుంచి తల్లికీ, బిడ్డకు రొమ్ము పాల అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధాన్ని శాశ్వతంగా కళ్ళముందు చూసుకోగలిగేవే బ్రెస్ట్ మిల్క్ జువెలరీ ట్రెండ్ అమెరికా కు చెందిన అల్మా పార్టిడా అనే ఆవిడ తన బిడ్డ అలెస్సా కు 18 నెలలపాటు రొమ్ము పాలు పట్టించి తల్లిగా తను సాగించిన ప్రయాణాన్ని కలకాలం గుర్తుండి పోయే మధుర జ్ఞాపకం గా ఉంచుకోవాలని అనుకుంది. రొమ్ము పాలతో ఆభరణాలు గురించి ఆలోచన వచ్చింది ఆమెకు.ఆమె తయారు చేసే […]
అనుభవాలే తోడు
అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన నీలీ బెండపూడి నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన నీలి బెండపూడి 35 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లే కు 18వ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఇకపైనా ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ కి 19వ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని అందుకునేందుకు తాను పనిచేసిన ప్రతి చోటు తన ఉన్నతికి […]
వ్యాపార దిగ్గజం
ఉపాసన టాకు నాకు డిజిటల్ లావాదేవీల చెల్లింపు సంస్థ మొబిక్విక్ కో పౌడర్ డైరెక్టర్ పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, వంటివాటితో పోటీపడి తన సంస్థను పరుగులు పెట్టించారు ఉపాసన.జలంధర్ ఎన్.ఐ.టి లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివిన ఉపాసన మార్కెటింగ్ లో అపారమైన అనుభవం ఉంది. పేపాల్ లో సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ గా పని చేసినప్పుడు అమెరికా వంటి దేశాల్లో డిజిటల్ చెల్లింపులు ఆమెను ఆకట్టుకున్నాయి.పేపాల్ లో చేసిన అనుభవంతో మొబిక్విక్ ను ప్రారంభించారు. […]
పాదాల నొప్పులా ?
చాలా మందిని పాదాల నొప్పులు విసిగిస్తూ ఉంటాయి. తాత్కాలిక ఉపశమనం కోసం వైద్యులు ఇస్తున్న చిట్కాలు ఇవి. పాదాలను పైకి పెట్టుకొని శరీరం బరువు పడకుండా కూర్చోవాలి. రోజుకు రెండు సార్లు వెచ్చని నీళ్ళలో పాదాలు ఉంచాలి. తర్వాత ఒక ఐస్ ముక్క టావాలో పెట్టి పాదాలను చుట్టి పెట్టాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది. రబ్బరు చెప్పులు ఎప్పుడూ ధరించాలి కాళ్ల నొప్పుల కోసం కొన్ని ప్రత్యేకమైన చెప్పులు దొరుకుతాయి. కాలి కండరాలను బలోపేతం చేసే […]
యునికార్న్ క్లబ్ లో ప్రియాంక గిల్
ప్రారంభిస్తూనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు వ్యపారం చేసిన వారిని పరిభాషలో యూనికార్న్ ఆంత్ర ప్రెన్యూర్స్ అంటారు. ఎనిమిదేళ్ల క్రితం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ చదువుతూ స్టైలిస్తా ఫ్యాషన్ బ్లాగ్ ని ప్రారంభించారు ప్రియాంక గిల్ దాన్ని ఐదు లక్షల మంది అనుసరించేవారు. తరువాత పాప్ గ్జో అనే సౌందర్య ఉత్పత్తుల ప్లాట్ ఫామ్ ప్రారంభించారు ప్రియాంక. తన సంస్థల అన్నింటినీ కలిపి గుడ్ గ్లామ్ మర్చి దక్షిణ ఆసియాలో అతిపెద్ద సౌందర్య […]
చర్మ రక్షణకు నెయ్యి
నెయ్యి ఆరోగ్యానికే కాదు చర్మ రక్షణకు ఉపయోగం అంటారు ఆయుర్వేద వైద్యులు. నెయ్యి లో ఉండే ADEK విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన పోషకాలు ఇస్తాయి. క్రమం తప్పకుండా చర్మంపై రాస్తే మచ్చలన్ని పోతాయి. పెదవులు ఎండిపోయి పోట్టు రాలి పోతున్నట్లు అనిపిస్తే నెయ్యి రాయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. నిద్రపోయే ముందర పెదవులకు నెయ్యి రాస్తే ఉదయానికి మెత్తగా ఉంటాయి. వాటర్ ప్రూఫ్ మేకప్ వంటివి తొలగించాలంటే నెయ్యి వాడచ్చు. వంటింట్లో పని […]
సిలికాన్ టీతర్లు సురక్షితం
పిల్లలకు పాల దంతాలు వస్తుంటే చేతికి అందిన ప్రతీ వస్తువు నోట్లో పెట్టుకొంటారు అప్పుడు పిల్లలకు టీతర్లు ఉపయోగపడతాయి. ఈ టీతర్ల తయారీలో లోహం ఉండకూడదు. నాన్ టాక్సిక్ టీతర్ల ను ఎంచుకోవాలి. పిల్లలు కొరికేందుకు మెత్తగా ఉండాలి టీతర్ల లో నీళ్ళు నిండినవి జెల్ నింపినవి ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు రంధ్రాలు పడ్డాయి ఏమో పరీక్ష చేస్తూ ఉండాలి. ప్లాస్టిక్ టీతర్లు రసాయనాల ప్రమాదం ఉంటుంది. సిలికాన్ తో తయారైన టీతర్లు సురక్షితం.
నెయిల్ పాలిష్ బ్యాగ్
అనేక రంగుల్లో నెయిల్ పాలిష్ లు కొంటూ ఉంటారు అమ్మాయిలు ఇవన్నీ ఎక్కడ రంగు వేసుకుంటే అక్కడ వదిలేస్తూ సమయానికి కనబడకుండా అదృశ్యమై పోతుంటాయి. ఈ నెయిల్ పాలిష్ లను అమర్చుకునేందుకు అనేక ఆర్గనైజర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. యార్వో కంపెనీ ఒక చక్కని బ్యాగ్ రూపొందించింది. ఈ నెయిల్ పాలిష్ బ్యాగ్ లో 24 రంగుల బాటిల్స్ పెట్టుకోవచ్చు. నెయిల్ ఆర్ట్ కు సంబంధించి బ్రష్ లు స్టిక్కర్లు పెట్టుకునేందుకు వీలుగా ఈ బ్యాగ్ లో ఏర్పాట్లు […]
అలసట మాయం
నెలసరి సమయంలో చిరాకు అలసట ఒత్తిడి అనిపిస్తాయి సువాసనలతో ఈ ఇబ్బంది నుంచి బయట పడవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. మానసిక సంబంధిత చికిత్సల్లో ఉపయోగించే జాస్మిన్ పరిమళం, మనసుకు విశ్రాంతినీ, నిద్రనూ ఇస్తుంది. పడుకునే ముందుగా దిండు పై చిలకరిస్తే చాలు డిఫ్యూజర్ క్యాండిల్, ఎండిన పూల రూపాల్లో దొరికే లవెండర్ ను, బెడ్రూంలో ఉంచుకుంటే మనసు తేలిక పడుతుంది. కొన్ని చుక్కల ఆరెంజ్ ఆయిల్ ను డిఫ్యూజర్ లో వేసి ఇంట్లో ఉంచితే చాలు. ప్రపంచవ్యాప్తంగా […]
చర్మ సంరక్షణ అవసరం
గర్భం ధరించినప్పుడు హార్మోన్లలో వచ్చే వ్యత్యాసంతో మెడ నల్లబడటం, చర్మం సాగిపోవడం వంటివి జరుగుతాయి ప్రతిరోజు మాయిశ్చరైజ్ చేసుకోవటం తప్పనిసరి మెడ పొత్తికడుపు తొడలపై స్ట్రెచ్ మార్క్, మొహంపై పిగ్మెంటేషన్ వంటి నాలుగవ నెల నుంచి కనిపిస్తాయి. దీనికి మృదువుగా ఏదైనా తేలికైన నూనెతో మసాజ్ చేసుకోవాలి. కెమికల్స్ లేని ఉత్పత్తుల్ని ఉపయోగించాలి. కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిది. హార్మోన్లు ఆ సమతుల్యాన్ని తగ్గించుకునేందుకు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే కూరలు బ్రకోలి.సిట్రిస్ వంటి […]
అంతరిక్ష యానం
ఈ సంవత్సరం తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామిగా నిలిచింది బండ్ల శిరీష. ఇండియన్ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజనీర్ వర్జిన్ గెలాక్టిక్ అధినేత తో కలిసి అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి తెలుగు అమ్మాయి. గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష తల్లిదండ్రులతో అమెరికాలోని హ్యూస్టన్ వెళ్లి అక్కడే చదువు పూర్తి చేసింది. 2015 లో వర్జిన్ గెలాక్టిక్ లో చేరి అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శిరీష […]
సంకల్ప బలం
గడచిన సంవత్సరం లో తన సేవలతో ప్రజలను ప్రభావితులను చేసినందుకు గాను భారత్ లోని అత్యంత శక్తివంతమైన ప్రభావ పూర్వకమైన 21 మంది లో ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ 2021లో పేరుతెచ్చుకుంది మెటిల్డా కుల్లు ఒడిస్సా సుందర్‌ఘర్ జిల్లాలోని గార్దభహల్ గ్రామానికి చెందిన ఆశ వర్కర్ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి తో ప్రపంచం గడగడలాడుతున్న సమయంలో కోవిడ్ కిట్లు ఇతర సామాగ్రి తో కొండ కోనల్లో లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్ పై […]
మోడలింగ్ నా ఫ్యూచర్
మిస్ యూనివర్స్ గా ఎంపికైన హర్నాజ్ సంధూ నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరివీ భారతీయ మూలాలే గత 35 ఏళ్లలో సింగపూర్ కు చెందిన ఏ అమ్మాయి మిస్ యూనివర్స్ సెమీఫైనల్స్ వరకు వెళ్లలేదు. జడ్జి అడిగిన ఎన్నో ప్రశ్నలకు నేను నిజాయితీగా సమాధానాలు చెప్పాను ఆ నిజాయితీ నన్ను సెమీ ఫైనల్స్ కు తీసుకు వెళ్ళింది అంటుంది నందితా బన్నీ. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే నందిత నేను పుట్టి పెరిగింది సింగపూర్ లో, ఆ దేశపు […]
లింగ వివక్షకు చెక్
కేరళ లోని బాలు శర్రీ (Balu serry ) ప్రభుత్వ పాఠశాలలో తాజాగా విద్యార్థులందరికీ ఒకేలాంటి యూనిఫామ్ కేటాయించి లింగ వివక్షకు వ్యతిరేకంగా నిలబడ్డారు. 200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో అందరూ ప్యాంట్ షర్ట్ ధరించాలనే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టారు. గతంలో విద్యార్థినీలు చుడిదార్ లేదా స్కర్ట్ ధరించే వాళ్ళు ఇటువంటి గొప్ప నిర్ణయానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక కేరళలో మిగతా పాఠశాలలూ ఈ ఫాంట్ షర్ట్ విధానాన్ని […]
ఈ మార్పు మంచిదే
2021 సంవత్సరం మహిళలకు బ్రహ్మాండమైన స్ఫూర్తిని శక్తి నిరూపించుకునే అవకాశాలు ఎన్నో ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వధువు వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా ఒక మంచి మార్పు ఇచ్చే ఉద్దేశ్యం ఉంది. చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లు అమ్మాయి మానసిక శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని దీనివల్ల ప్రసవానంతర మరణాలు నవజాత శిశు మరణాలు పెరుగుతున్నాయని సర్వేలు చెప్పటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 21 ఏళ్ల […]
గ్రామాల అభివృద్ధి లక్ష్యం
భూపాల్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల జాగ్రతి అవస్థి యు పి ఎస్ సీ పరీక్షల్లో దేశంలోనే రెండవ ర్యాంకర్ గా నిలిచింది మహిళల్లో ఆమెదే ఫస్ట్ ర్యాంక్ మౌలనా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017 లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ప్రతిష్టాకరమైన గేట్ పరీక్ష లోను మంచి ర్యాంకు సాధించింది. ముందుగా బి హెచ్ ఈ ఎల్ లో ఇంజనీర్ గా పనిచేసిన అవస్థి ఇంటి దగ్గర శ్రద్ధగా చదివి పరీక్షలు […]
అత్యున్నత పురస్కారం
ఈ సంవత్సరం దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు వనదేవత తులసి గౌడ్. ఔషధ మొక్కల భిన్నమైన ఎన్నో జాతి మొక్కల పట్ల పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉన్న 72 సంవత్సరాల తులసి గౌడ్. తన ఉద్యోగ కాలంలో 40 వేల వృక్షాలను పెంచి వన సామ్రాజ్యాన్నే నెలకొల్పారు గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన సేవలు వల్లనే ఆమెకి అత్యున్నత గౌరవం దక్కింది ఈ వయసులోనూ తులసి అలసట లేకుండా మొక్కలు నాటుతారు తనకు […]
