Tuesday, 29 Sep, 2026

క్యాన్సర్ పరిశోధనలు లక్ష్యం

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ లో క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ స్క్రీనింగ్ సర్వైలెన్స్ రీసెర్చ్ విభాగానికి సైంటిఫిక్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ ప్రీతి బండి టైం మ్యాగజైన్ టైం 100 హెల్త్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.బయో మెడికల్ ఇంజనీరింగ్ చదివి మాస్టర్స్ చేసిన ప్రీతి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ లో జూనియర్ లెవెల్ ఎపిడెమియాలజిస్ట్ గా ఉద్యోగం తెచ్చుకున్నారు.ఆ ఉద్యోగంలో భాగంగా ప్రజల్లో క్యాన్సర్ రావడానికి కారణాలు,నివారణ మార్గాలు, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయించుకోలేక పోతున్నారన్న అనేక విషయాలు మీద పరిశోధన చేశారు.2019 లో అట్లాంటాలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ లో హయ్యర్ లెవెల్ సైంటిస్ట్ గా పని చేశారు.తర్వాత సైంటిఫిక్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశం లభించింది అత్యంత ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి .యూఎస్ లో హైరిస్క్ ఉన్నవాళ్లు ఏటా సిటీ స్కాన్ చేయించుకోవడం వల్ల ఐదేళ్లలో 62,000 కన్నా ఎక్కువ మరణాలను నివారించవచ్చునని నిరూపించింది ప్రీతి బండి. ఈ అధ్యయనం గత సంవత్సరం జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురితమై అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ఫలితంగా తాజాగా టైమ్ 100 హెల్త్ జాబితాలో ఆమె పేరు చోటు చేసుకున్నది.

Leave a Reply