ఈ సేవకు అవధులు లేవు
కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన డాక్టర్ అనిత మిశ్రా ఉత్తరప్రదేశ్ లోని గోండా కు ఉద్యోగ రీత్యా వెళ్లారు. అక్కడే నివసించే డాక్టర్ పూర్ణోదయ మిశ్రా ఆమె భర్త. అక్కడ నివాసం ఉండేవాళ్లు అవధి అని స్థానిక భాషలో మాట్లాడుతారు ఆ భాష ముందు గా డాక్టర్ అనిత అర్థం చేసుకోలేకపోయారు. వారికి వైద్యం చేయాలంటే ముందుగా ఆ భాష నేర్చుకోవాలి పైగా ఆ భాష పై పట్టు ఉండాలి. భావవ్యక్తీకరణకు అవధి భాష కు ఒక లయ ఒక ఆత్మీయత ఉన్నాయి. ప్రజలు తమ భావాలను లక్షణాలను చక్కగా వ్యక్తపరుస్తుంటే అర్థం చేసుకొనే విధంగా డాక్టర్ అనిత ఆ భాషను నేర్చుకున్నారు. ఈ 20 ఏళ్లలో ఆమె అక్కడ నివసించే వారి భాషా సంస్కృతుల తో కలిసిపోయారు చివరికి గోండా మెడికల్ సెంటర్ పేరుతో ఒక ఆసుపత్రి నెలకొల్పారు.స్థానికులే కాదు చుట్టుపక్కల ప్రాంతాల రోగులు కూడా ఇక్కడికి వస్తారు. ఒక ప్రాంతపు భాష స్వీకరించి ,అక్కడ ప్రజలను సంస్కృతిని, జీవన విధానాన్ని అర్థం చేసుకుని వారికి వైద్యం చేస్తున్న డాక్టర్ అనిత ను ఎంతో మంది ప్రశంసిస్తున్నారు.
