ఇసుకలో పాఠాలు
బోధ్ గయ దగ్గర లోని బక్రౌద్ గ్రామానికి చెందిన మాలో దేవి పేదరికం కారణంగా చిన్నతనంలో చదువుకోలేక పోయింది.ఆమెకు చదువు పైన ఎంతో ఇష్టం.అందుకే నదీ తీరంలోని ఇసుకలో వేళ్లపై రాస్తూ అక్షరాలు సంతకం చేయడం నేర్చుకున్నది. తాను నేర్చుకున్న విద్యని అంతటితో ఆపకుండా సమీపంలోని గ్రామంలో నివసించే అక్షరాలు రాని వందలాది మంది మహిళలకు చదవటం రాయటం నేర్పిస్తున్నారు.ఈ సంతకం చేయడం నేర్చుకోవటం వల్ల వారు బ్యాంకులు ప్రభుత్వ పనుల్లో ఇతరులు సహాయం లేకుండా పని చేసుకో గలుగుతున్నారు.ఇప్పటివరకు 50 మందికి పైగా అక్షర దానం చేసింది మాలో దేవి. జ్ఞానోదయానికి నిలయమైన బుద్ధగయ పరిధిలో నిరుపేద మహిళల జీవితాల్లో ఈ విద్యా దానపు వెలుగులతో వారి జీవితాలను స్వయం సమృద్ధి కి ప్రోత్సాహం చేస్తూ మాలో దేవి స్థానికంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. చిన్నతనంలో నేను పాఠశాలకు వెళ్లే అవకాశం దొరకలేదు. బడి బయట నిలబడి పాఠాలు వింటూ నది ఒడ్డుకు వెళ్లి ఇసుకలో సాధన చేసేదాన్ని. ఆ అనుభవంతో అప్పుడు నేర్చుకున్న అక్షరాలతో నేను గురువు గా మారాను. నాకు తెలిసింది నా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ నేర్పడం నా ఏకైక లక్ష్యం అంటుంది మాలో దేవి.
