పూర్ణిమకు వే ఫైండర్ అవార్డు
అస్సోం కి చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమ దేవి బర్మన్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ కియా సంస్థ సంయుక్తంగా అందజేసే వేఫైండర్ అవార్డు 2026 అందుకున్నారు. ప్రజలు అపశకునంగా భావించిన ఒక పక్షిని మహిళ ఆత్మగౌరవ ప్రతీక గా మార్చిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణానికి ఈ అవార్డు దక్కింది. గౌహతి విశ్వవిద్యాలయంలో ఈకోలజీ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీలో మాస్టర్స్ పూర్తి చేసిన పూర్ణిమ అరణ్యక్ అనే జీవవైవిధ్య పరిరక్షణ సంస్థలో వన్యప్రాణి జీవశాస్త్రవేత్త గా పనిచేస్తున్నారు.అస్సాం ప్రజలు ఆమెను హర్గిలా బైదో అని పిలుస్తారు. అంటే హర్గిల అక్క అని అర్థం. అస్సాం ప్రాంతంలో హర్గిలా అనే కొంగలు ఉంటాయి. కుళ్ళిన పదార్థాలు తింటాయి. వాటి నివాసాల్లో దుర్వాసన వస్తుంది .అందుకే ఈ కొంగలను ఈ ప్రాంత ప్రజలు అపశకునంగా భావించేవారు. పక్షులను చంపేసేవారు. అంతరించిపోతున్న ఈ పక్షుల పరిస్థితి పూర్ణిమ ను బాధ పెట్టింది. ఈ పక్షులపై ఉన్న వ్యతిరేక భావనను పోగొట్టేందుకు ఎంతో ప్రచారం చేసింది. కొంగలు పర్యావరణ సమతుల్యతను ఎలా కాపాడతాయో ప్రజలకు అర్థం అయ్యాక 20 వేల మంది పైగా గ్రామీణ మహిళలు ఒక పర్యావరణ సైన్యంగా మారి ఈ పక్షులను కాపాడటం మొదలుపెట్టారు .ఈ ఉద్యమాన్ని మహిళల ఆర్థిక సాధికారపు తో ముడిపెట్టి అస్సాం సంప్రదాయ దామోసా వస్త్రాలు చీరల పైన హార్గిల పక్షి బొమ్మలు డిజైన్లు చేయటం వారికి నేర్పింది పూర్ణిమ .ఈ ఉత్పత్తులకు లభించిన ఆదరణతో అక్కడి మహిళలకు సొంతంగా జీవనోపాధి లభించింది. ఈ పక్షులను కాపాడిన ఉద్యమం చేపట్టినందుకుగాను పూర్ణిమకు పర్యావరణ రంగంలో ఆస్కార్ గా భావించే లండన్ వీట్లి అవార్డు ఇచ్చారు. అలాగే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం అందుకున్నారు పూర్ణిమ.ప్రసిద్ధ టైం మ్యాగజైన్ విమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలిగా పూర్ణిమా దేవి నిలిచింది. గ్లోబల్ ఛేంజ్ మేకర్స్ లో ఈమె ఒకరు.
