మహిళలకు స్ఫూర్తి మంత్రం
అమెరికాలో మాస్టర్స్ చేసిన తేజస్విని హేబాల్ కర్ అమెరికాలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఆల్ స్టేట్స్ లో ఇండియా విభాగానికి ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. యూఎస్ లోనే చదువుకున్న తేజస్విని మొదట్లో స్క్వేర్ ట్రేడ్ లో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నారు పదేళ్లకు పైగా పనిచేశాక ఆల్ స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీ స్క్వేర్ ట్రేడ్ ను కొనుగోలు చేసింది అది అమెరికాలోని అతిపెద్ద పబ్లిక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో ఒకటి భారత్ లోని బెంగళూరు పూణేలో ఈ కంపెనీ కేంద్రాలు ఉన్నాయి.ఆ సంస్థకు ఆపరేషన్స్ ప్రాపర్టీ లయబిలిటీ డిజిటల్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తోంది తేజస్విని. ఏఐ విప్లవాన్ని అందుకుని అధునాతన సాంకేతికతతో ముందుకు వెళ్లాలనుకునే యువతకు స్ఫూర్తి తేజస్విని.
