Friday, 28 Aug, 2026

ఇంటి పనికి హెల్పర్ కావాలా?  

ప్రియాంక  రస్తోగి ‘ఈజీ హెల్పర్స్’ పేరుతో డొమెస్టిక్ హెల్ప్ కి ఒక వేదిక నిర్మించింది.ఇది ఒక ఆన్‌లైన్ ప్లాట్ ఫారం.దీని ద్వారా ఇంటి పని,వంట పని,తోట పని,పెద్దల కేరింగ్,డ్రైవింగ్ మొదలైన వాటికి హెల్పర్స్ అందుబాటులో ఉంటారు.సహాయకులకు సంబంధించిన పూర్తి వివరాలు రికార్డు చేస్తారు.అలాగే వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు కనుక కస్టమర్ల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదు. ఇంటికి అవసరం అయ్యే  సాయాన్ని ఒక వ్యాపారంగా మార్చిన ప్రియాంక ట్రావెల్ ఇండస్ట్రీ లో పనిచేస్తారు.ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఆమె ఉద్యోగం చేస్తోంది.ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా తరచూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించవలసి ఉంది.2014 లో ఆమె అత్తగారికి పక్షవాతం రావడం తో ఇంట్లో పని కష్టమైంది పని వాళ్ళ కోసం ఎంతో వెతికారు. సరైన ట్రైన్డ్ వర్కర్స్ దొరకడం చాలా కష్టం.దీనికి పరిష్కారం వెతుకుతున్నప్పుడు డొమెస్టిక్ హెల్పర్ లకు శిక్షణ ఇచ్చే ప్రభుత్వ సర్టిఫికెట్ కోర్స్ ఒకటి ఉందని తెలిసింది. దానిలో మాస్టర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందింది ప్రియాంక. అటు తర్వాత దీన్ని ఒక వ్యాపారంగా మలిచింది.ప్రస్తుతం 11,000 మంది డొమెస్టిక్ హెల్పర్లు ఈమె కంపెనీ లో రిజిస్టర్ చేసుకున్నారు.రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తే 20000 రూపాయలు జీతం ఇస్తారు ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా బుకింగ్స్ వస్తాయి.ఈ ఈజీ హెల్పర్స్ 2020 లో ప్రారంభమైంది.ఎవరైనా ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చు.

Leave a Reply