జ్ఞాపకాన్ని మెరుగుపరిచే టెక్నిక్
నిద్ర లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు వందలాది పనులు చేస్తూ ఉంటాం. ఒకేసారి నాలుగైదు పనులు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది.ఆదుర్దా పడి చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాము .భయం వేస్తుంది మతిమరుపు వస్తుందా అని .కానీ జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఏం చెప్పింది అంటే మైండ్ మ్యాపింగ్ చేసుకోండి దీనివల్ల చాలా కాలం ప్రతి జ్ఞాపకం భద్రంగా మనసులో ఉంటుంది అని చెప్తుంది. అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని పైకి చెప్పుకోవాలి. 40 సెకండ్ల పాటు దాన్ని మెదడులో ఒక ప్లాన్ లాగా వేసుకుంటూ మాట్లాడాలి. ఉదాహరణకి ఒక మీటింగ్ కి వెళ్తుంటే అక్కడ ఏం మాట్లాడారు ఏం చేయాలి? ఏం చీర కట్టుకోవాలి ఎప్పుడు టిఫిన్ చేయాలి ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ ఒక రిహార్సలు లాగా నెమ్మదిగా పెదవులతో పైకి అనాలి. ఇది ఈ రిహార్సల్ ను చేస్తే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. కచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం పనులు అయిపోతాయి. ప్రతి విషయాన్ని ఒకవేళ మతిపరుపు వస్తుందేమో నన్న భయం వస్తే ఈ మెదడు మ్యాపింగ్ ని మర్చిపోవద్దు అంటుంది ఈ అధ్యయనం నివేదిక.ఇది తేలికే. ప్రతి విషయాన్ని పైకి చెప్పడం .ఫలానా తాళం ఫలానా చోట పెట్టాను .ఫలానా వస్తువు ఫలానా చోట ఉంది. ఇవాళ నేను ఈ పని చేయాలి. ఇవన్నీ పెదవులతో మాట్లాడుతూ దాన్ని మెదడుకు అందేలా చేయడమే ఈ మెదడు మ్యాపింగ్. ఒక 40 సెకండ్ల పాటు ఈ పని చేసినా మెరుగైన ఫలితాలు వస్తాయి అంటోంది అధ్యయనం.
