Tuesday, 18 Aug, 2026

అర్థవంతమైన పాత్రలకే ప్రాధాన్యత

ముంబైలో కిషిన్‌చంద్ చెల్లారామ్ కాలేజీలో మాస్ మీడియా మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ డిగ్రీ పూర్తి చేసిన కాజల్ అగర్వాల్ చిన్న వయసులోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. 2004లో క్యూన్  హో గయా నా అనేది ఆమె మొదటి చిత్రం.తెలుగు లో చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ మగధీరతో భారీ హిట్ సొంతం చేసుకున్నది. 2020లో గౌతమ్ కిచ్లు ను పెళ్ళి చేసుకున్న కాజల్ మగ బిడ్డ  నీల్ కిచ్లు కి జన్మ ఇచ్చింది.నెమ్మదిగా సినిమాలు తగ్గించుకొని కథా బలం ఉన్న పాత్రను ఎంచుకుంటోంది. భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో మండోదరి గా నటిస్తోంది.ఆమె దృష్టిలో మహిళలకు,మంచి కథలకు కాల పరిమితి అంటూ ఉండవు.పెళ్లయి పిల్లలు కలిగినంత మాత్రాన నటీనటులకు ఆసక్తులు మారవు గాని కథలని చూసి ఎంచుకోవాలి.నేనైతే సినిమాలను సంఖ్య కోసం కాకుండా నాలోని నటిని నిరంతరం సవాల్ చేసే, సమాజం మీద ప్రభావం చూపించే పాత్రల్ని మాత్రం ఎంచుకుంటాను మంచి కథలకి గడువు తేదీ ఎప్పుడు ఉండదు, నా కెరియర్ లోని ప్రతి దశలో నాలో ఏదో ఒక మార్పు తెచ్చిన చిత్రం ఒకటి తప్పకుండా ఉంది అంటుంది కాజల్ అగర్వాల్.20 ఏళ్ళ పైగా ఆమె కెరీర్ లో ఎన్నో మంచి పాత్రలో నటించింది కాజల్ అగర్వాల్.

Leave a Reply