మిస్ సౌత్ ఇండియా గా శ్రీజ
రాజమహేంద్రవరం లో ఎంటెక్ చదువుతున్న పులపర్తి భౌమ్య శ్రీజ హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ దివా ఇంటర్నేషనల్ మిస్ సౌత్ ఇండియా గా గెలుపొందారు. ఆమె కళలపై ఉన్న ఇష్టంతో మోడలింగ్ లోకి అడుగు పెట్టారు ఎక్కడా శిక్షణ తీసుకోలేదు.2025 లో మిస్ విజయవాడ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే ఈ జూన్ లో రాజమండ్రిలో నిర్వహించిన స్టార్ ఐకాన్ మోడలింగ్ షో కి కొరియోగ్రఫీ చేశారు. హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వంటి వివిధ ప్రాంతాల్లో వర్క్ షాపులు నిర్వహించి 200 మందికి మోడలింగ్ లో శిక్షణ ఇచ్చారు శ్రీజ. ఆమె కూచిపూడి తో పాటు, వెస్ట్రన్ ఫ్యూజన్ వంటి నృత్యాలలోనూ ప్రావీణ్యం పొందారు. రాష్ట్ర జాతీయస్థాయిలో 300 పైగా ప్రదర్శనలు పురస్కారాలు, సంగీతం లో రికార్డులు సొంతం చేసుకున్నారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించుకున్నారు.ఎన్నో పోటీల్లో అనేక పతకాలు సాధించారు శ్రీజ.
