ప్రకృతి రక్షణకు ఆస్కార్

ప్రకృతి రక్షణకు ఆస్కార్

ప్రకృతి రక్షణకు ఆస్కార్

ముంబై కి చెందిన పర్వీన్ షేక్ ఈ సంవత్సరం గ్రీన్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో పీజీ చేసిన ఈమె బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ తో కలిసి పని చేస్తున్నారు. నదులు వాటి చుట్టూ బతికే పక్షి జాతుల పైన పరిశోధనలు చేశారు. చంబల్ నది పై పరిశోధన చేస్తున్నప్పుడు స్కిమ్మర్ పక్షులు అంతరించిపోవడం గమనించారు. అవి ఇసుక మేటలో గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను పెంచుతాయి. వేట కారణంగా, ఇసుక అక్రమ రవాణా వల్ల ఈ పక్షుల సంఖ్య పడిపోవటంతో వీటి గురించి స్థానికులకు అవగాహన కల్పించారు పర్వీన్ షేక్ .అలాగే ఆసక్తి ఉన్నవాళ్లకు శిక్షణ ఇచ్చి పక్షులకు రక్షణ గా వారిని నియమించారు. ఈ కృషికి గుర్తింపుగా పర్వీన్ కి ఎన్నో అవార్డులు వచ్చాయి. తాజాగా గ్రీన్ ఆస్కార్ అవార్డు కు  ఆమె ఎంపిక అయ్యారు.