Sunday, 18 Oct, 2026
నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే ఏమవుతుంది. ఈ సందేహాలకు డాక్టర్లు మంచి సమాధానం ఇచ్చారు. పిస్తా, వాల్ నట్, బాదాం, జీడి పప్పుల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రకరాకాల సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పాతాయి. కాన్సర్ రానీయకుండా కాపాడతాయి. అయితే ఇవి రోజుకు పది గ్రాములు అంటే ఐదు వాల్ నట్లు తినాలి. వేరు సెనగ పది పన్నెండు పప్పులు, బాదం తొమ్మిది, జీడి పప్పులు గుప్పెట నిండుగా అన్నమాట. ఇలా రోజుతీసుకుంటే దాదాపు 23 అనారోగ్యాలకు శాశ్వతంగా దూరంగా వుండ వచ్చు. అతి గా తింటే బరువు పెరగడం ఖాయం.

కేవలం అపోహ

డ్రైఫ్రూట్స్ తో లావెక్కుతారని అనుకోవడం కేవలం అపోహ మాత్రామేనని అంటున్నరు ఆస్ట్రేలియా శాస్రవేత్తలు . డ్రైఫ్రూట్స్ లో ఉండే కొవ్వులు శరీరనికి మేలు చేసేవేనని శరీరం శోషించుకోగల కొవ్వులు కూడ వీటిలో ఉండటం వల్ల వీటితో మేలే కాని కీడు లేదని శాస్రవేత్తలు వివరిస్తున్నరు. ప్రతిరోజు 30 గ్రాముల డ్రైఫ్రూట్స్ తినవచ్చు. అయితే కొవ్వుల మోతాదు వేర్వేరుగా ఉంటుంది. జీడిపప్పు ,పిస్తాలు 50 గ్రాములుంటే కొన్ని ఇతర డ్రైఫ్రూట్స్ లో 70 శాతం వరకు ఉండచ్చు.ఈ కొవ్వులు కొలెస్ట్రాల్ మోతాదు తగ్గిస్తాయి. ఇవి రోజు తిన్నప్పటకి దీర్ఘకాలంలో బరువు పెరగడం చాలా తక్కువ ఉంటుందని ఒక అధ్యయానం చెపుతుంది.

Leave a Reply