నగలకు మెరుగు

నగలకు మెరుగు

నగలకు మెరుగు

ఇంట్లో డెకరేషన్ కోసం ఇత్తడి వస్తువు వాడుతూ ఉంటారు. అవి మురికి పట్టి పోతాయి. ఒక్కోసారి రంగు మారినట్లు అనిపిస్తాయి కూడా. వాటిని అమ్మోనియాలో ముంచిన గుడ్డతో తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి. అలాగే బంగారు నగలు కూడా దగదగా మెరవాలంటే కాస్త వేడి నీటిలో అరకప్పు అమోనియా కలిపి ఆ మిశ్రమంలో ఆ నగను పదిహేను నిమిషాలు ఉంచి ఆ నగల్ని బయటికి తీసి మెత్తని వస్త్రంతో రుద్ది ఆరనివ్వాలి. ఇది సాధా బంగారు నగలకు మాత్రమే. నగల్లో ముత్యాలు పగడాలు రాళ్ళు పొదిగి ఉంటే అమోనియా కలిసిన నీళ్ళు వాటి మెరుపుని పోగొట్టే ప్రమాదం ఉంది.