Monday, 19 Oct, 2026
వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి పేస్ట్ లాగా చేసి దీనికి పెరుగు కలిపి ఈ మిశ్రమం మొహానికీ మెదడు అప్లయ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఖరీదైన మాస్క్ వేసుకున్నంత మెరుపుతో ఉంటుంది మొహం. పెరుగు పసుపు మిశ్రమం కూడా చాలా పనిచేస్తుంది. పాలలో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ముఖ్నైకి మాస్క్ లా వేసుకోవాలి. వేడి నీళ్లతో కడిగేస్తే మొహం మెరుపుగా ఉంటుంది. జీడిపప్పు పచ్చి పాలతో కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఫెస్ మాస్క్ వేసుకోవచ్చు . ఆవ నూనె నిమ్మరసం కూడా మంచి ఫలితం ఇస్తుంది. బాదం పప్పు నాననిచ్చి రోజ్ వాటర్ పచ్చి పాలతో కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో మొహం నృదువుగా మర్దనా చేయాలి. తర్వాత మొహానికి ఆవిరిపెట్టి తుడిచేయాలి. మొహంతో మెరుపు ఎంతోసేపు ఉంటుంది. చర్మం నిగారింపు కోసం ఇలా ఇంట్లోవాడే వస్తువులు ట్రై చేస్తే మొహం ఫ్రెష్ గానూ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వుండవు.

ఈ జ్యూస్ సహజమైన బ్లీచ్

ముఖం పై నల్ల మచ్చలు,వలయాలు పోయేందుకు ఖరీదైన క్రీములు ఫేష్ వాష్ లు వాడుతూ ఉంటారు.కాని వీటన్నింటికంటే సింపుల్ పరిష్కారం బత్తాయిపండులో దాక్కుని ఉంది.ముఖం శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకుని బత్తాయి సగం చెక్క తీసుకుని గుండ్రంగా ముఖం పై కదలిస్తూ ముఖాన్ని మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇందులోని సిట్రిక్ యాసిడ్ సహజమైన తేలికపాటి బ్లీచ్ గా క్లెన్సింగ్ పని చేసి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. బ్లాక్ హెడ్స్ పోగొడుతుంది.మోకాళ్ళ పై బత్తాయి చెక్క రుద్దుకోవచ్చు,బత్తాయి తొక్కలు ఎండబెట్టి గ్రైండ్ చేసి ఆ పొడిలో తేనె కలిపి మంచి ప్యాక్ గా వేసుకోవచ్చు. బత్తాయి రసం రోజుకి రెండు మూడుసార్లు పెదవులపై రాస్తే పెదవులపై నలుపు పగుళ్ళు పోతాయి.

Leave a Reply