Monday, 19 Oct, 2026
ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటీవల మధుమేహం తర్వాత ఎక్కువమంది మహిళల వెన్ను నొప్పి తోనే. శారీరిక బలహీనత మానసిక వత్తిడి కూర్చునే భంగిమ సరిగాలేక పోవటం ఇలా కారణాలు ఏమైనా నడుము కింది భాగంలో వెన్నునొప్పి తో బాధపడేవాళ్లు సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుంది. ప్రతి పదిమందిలోను ఎనిమిదిమంది దీని బారిన పడుతున్నారని అధిక బరువు ఎత్తటం క్షణం కూడా తీరిక లేని అనేక పనులు పదే పదే చేస్తూ ఉండటం కూడా మరో ముఖ్య కారణమని పరిశోధకులు చెపుతున్నారు . ఇందులో రెండు రకాల్ని ఒకటి దీర్ఘ కాలికంగా వస్తూ పోతుందని ఒకటి ఉదయం పూట ఎక్కువగా ఉంటుందనీ విశ్లేషించారు. తొలిదశలోనే కారణం తెలుసుకుని బరువులు ఎత్తటం ,దించటం ఆపాలనీ యోగా చేయాలనీ కూర్చునే భంగిమలు మార్చుకోవాలని వాటి ద్వారా దీన్ని నివారించుకుంటే మంచిదని చెపుతున్నారు. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నెప్పి తీవ్ర స్థాయికి చేరుతుందని అది దీర్ఘకాలికంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు . నడుం నొప్పి కదా ఒక మాత్రతో పోతుందని ఆలస్యం చేయద్దంటున్నారు

ముందే పట్టించుకోండి

ప్రపంచ జనాభాలో 80 శాతం నడుం నొప్పితో బాధపడుతున్నారు అంటున్నాయి అధ్యాయనాలు.పురుషులలో పోలిస్తే 40 నుంచి 80 ఏళ్ళ వయసు స్త్రీలలో సమస్య ఎక్కువగా ఉంది.కదలకుండా కూర్చోవడం కూర్చునే భంగిమ సరిగ్గాలేకపోవడం ఉభాకాయం,వయసు ప్రభావం ఈ నడుం నొప్పికి కారణాఉ దీర్ఘాకలికంగా ఈ నొప్పితో బాధపడేవాళ్ళు త్వరగా త్వరగా మరణించే అవకాశం ఉందని మాసాచు సెట్స్ లోని బోస్టన్ మెడికల్ సెంటర్ పరోశోధకులు తేల్చారు.ఈ నొప్పి వ్యక్తులను మెడికల్ సెంటర్ పరిశోధకులు తేల్చారు.ఈ నొప్పి వ్యక్తుల జీవన శిలీని ప్రభావితం చేస్తుంది. నడక తగ్గిపోయి జీర్ణవ్యవస్థ దెబ్బతిని మానసికంగా కుంగిపోయి ఈ సమస్య మరణానికి దారీ తీస్తుంది. అందుకే చిన్నవయసు నుంచే ఈ సమస్య రాకుండా జీవనశైలి,ఆహారపు అలవాట్లు మార్చుకొమ్మంటున్నారు వైద్యులు.

Leave a Reply