Wednesday, 12 Aug, 2026
కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల నుంచి తుంచేసి ఎందినవో, కాస్త వాడిపోయినవో తీసేసి మిగతా తాజా ఆకుల్ని పేపర్ టవల్ లోనో లేదా శుబ్రమైన నూలు గుడ్డలో కానీ చుట్టేసి పెట్టేయాలి. రెండు రోజులు శుబ్రంగా బాగుంటాయి. ఆలుగడ్డ, ముల్లంగి, చిలకడ దుంప, అయితే కట్ చేసి ఫ్రిజ్ లో పడితే రంగు మారిపోతుంది, మృదుత్వం కూడా పోతుంది. తేమ కూడా తగ్గిపోయి మృదుత్వం పోతుంది, రుచి మారిపోతుంది. ఇలాంటి వాటిని గిన్నెలో నీళ్ళు పోసి అందులో వదులుగా ముత పెట్టి వుంచాలి. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకలి వంటివి కట్ చేసి గాలి తగలని బాక్స్ లో పెట్టి వున్నా కవర్ లో పెడితే తాజాగా వుంటుంది. అరటి పండ్లు, కర్భుజా, ఉల్లిపాయలు, అవకాడో, వెల్లుల్లి ఉల్లి వంటివి ఫ్రిజ్ లో పెడితే వీటి వాసన మిగతా కురగాయలకు పట్టి చాలా సార్లు కడిగి వండుకోవాల్సి వస్తుంది.

మళ్ళీ వేడి చేస్తే అనారోగ్యం

రెండు పూటల కోసం ఒకే సారి వండేసి ఫ్రిజ్లో పెట్టేస్తారు సాధారణంగా ఉద్యోగినులైన వాళ్ళు .వచ్చి రాగానే ఉరుకులు పరుగులతో ఇబ్బంది లేకుండా కాస్త వేడి చేసుకొని తీరుబడిగా సాయంత్రం భోజనం చేసేస్తారు. అయితే కొన్ని పదార్థాలు వేడి చేయకండి అంటారు డాక్టర్లు. పాలకూరతో బంగాళాదుంపలను వేడి చేసినప్పుడు మృత బాక్టీరియా విడుదల అవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. పుట్టగొడుగులు ఒక సారి వండేక మళ్ళీ వేడి చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. చికెన్ వంటలు కూడా పదే పదే వేడి చేయరాదు. ఉడికించిన కోడి గుడ్డు గంటలు గంటలు ఉంచకుండా వెంటనే తినాలి. ఫ్రిజ్ లో ఉంచిన పదార్థాలు సాయంత్రం వేళ బయటికి తీసిపెట్టేస్తే తినేవేళకు అవి రూమ్ టెంపరేచర్ కు వచ్చేస్తాయి.అప్పుడు సమస్య ఉండదు.

Leave a Reply