Wednesday, 12 Aug, 2026
పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో పడుకునే సమయం, స్లీప్ రోటీన్ సౌకర్యంగా నిర్ణీత పద్దతిప్రకారం వుండాలి. పడుకునే వెలలు, నిద్ర లేచే సమయాలు నిర్ణీత క్రమంలో సాగాలి. వారాంతాల్లో సైతం ఈ రోటీన్ కు ఇబ్బంది కలుగ కూడదు. నిద్రించే వేళల్లో ఓ గంట కూడా మార్పు లేనట్లు వుండాలి. పడుకునే ముందు ఆటలు, టెలివిషన్ చూడటం, కంప్యుటర్ గేమ్స్ అడనివ్వకూడదు. ఆకలితో నిద్ర పొమ్మనడం లేదా పడుకునే ముందు అతిగా ఆహారం పెట్టడం రెండు తప్పే. కాఫీ, టీలు, పానీయాలు చాక్లెట్స్ అస్సలు ఇవ్వకూడదు. క్రమం తప్పకుండా అవుట్ డోర్ ఆటలకు ప్రోత్సహించాలి. పిల్లల పడక గది చాలా ప్రశాంతంగా వుండాలి. బాల్యంలో నిద్ర లేమికి గల కారణాలు వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.

పాపాయి నిద్ర

రాత్రివేళ నిద్ర పోకుండా అమ్మను సతాయించే పిల్లలను కాసేపలా షికారుకి తీసుకెళ్ళడం నిద్ర రహస్యం,పగటి వేళ ,మధ్యాహ్నం 12-4 గంటల మధ్య కనీసం 2 సార్లు అయినా సహజకాంతికి ఎక్స్ పోజ్ అయిన పిల్లలు రాత్రివేళ గాఢంగా నిద్రపోతారని అధ్యాయనాలు చెబుతున్నాయి.స్నానం చేయించే సమయంలో మసాజ్ చేయడం వల్ల హాయిగా నిద్రపోతారు.మసాజ్ లు స్లీప్ హార్మోన్ మెలటోనిన్ ని విడుదల చేస్తాయి. కొత్తగా పుట్టిన పాపాయి పొట్ట వాల్ నట్ సైజులో ఉంటుంది.కనుక పొట్ట నింపుకోవడం కోసం ప్రతి రెండు గంటలకు నిద్రలేస్తారు.పాపాయి నిద్రలో కూడా నేర్చుకుంటూ ఉంటుంది.కొత్త అనుభవాలు జీర్ణించుకోవడంలో పాపాయి బిజీగా ఉంటుంది.

Leave a Reply