Wednesday, 12 Aug, 2026
నేను ప్రత్యేకంగా ఉండాలన్న కోరికే బహుశా ఫ్యాషన్ అన్నపదానికి తెర తీసిందేమో. ఎదో ఒక్కటి ఎలాగో ఒకలా మందిలో ఒక్కరుగా.... ఎలాగా అంటే అది అందంగా అంద విహినంగా, కొత్తగా, వింతగా, తమాషాగా తయ్యారవ్వాలి. ఈ కాన్సెప్ట్ లోకి చెప్పులు కుడా వచ్చి చేరాయి. అనేక రకాల కొత్త చెప్పులు. ఇవి కుక్క పిల్లల్లాగా, చేపల్లాగా, అరటి పండు తొక్కల్లాగా, మొలిచిన గడ్డిలాగా....... సందేహం వద్దు. ఇవన్నీ చెప్పుల డిజైన్సే. ఎదో ఒక ప్రేత్యేకత చూపిద్దాం అనుకుని చెప్పుల పైన గడ్డి మొలిచినట్లు కనిపించే జత వేసుకోవచ్చు. ఈ యూనిక్ డిజైన్ లు ఇవ్వాల్టి లేటెస్ట్ ఫ్యాషన్. అప్పుడే ఆన్లైన్ లో సందడి చేస్తున్నాయి. లెక్కలేనన్ని రకాల అరటి పండు తొక్కలు, కుక్క తోకలు, కాట్ బాల్స్ అనుకోండి. అన్నీ చెప్పులే!

హీల్స్ ఎంపికలో జాగ్రత్త

సరైన దుస్తుల ఎంపికతో పాటు సరైన హీల్స్ కూడా ఎంచుకొంటేనే ఫ్యాషన్ ,సౌకర్యం కూడా. పర్ ఫెక్ట్ హీల్ ఎంచుకోకపోతే శరీర ఆకృతి కూడా సరిగా ఉండదు. అలాగే ఎముకల ఆరోగ్యం దెబ్బ తింటుంది కూడా. కొంచెం ఎత్తు తక్కువగా ఉంటే కాస్త ఎత్తు ఇవ్వగల షూ ఎంచుకోవాలి. ప్లాట్ ఫారమ్స్ ,వెడ్జెస్,సైలెట్టోస్ గ్లాడియేటర్ హీల్స్ చక్కగా సూటవుతాయి. కాస్త బొద్దుగా ఉంటే సింపుల్ హీల్స్ సరిపోతాయి హీల్స్ గల ఓపెన్ టూ షూ బాగా నప్పుతాయి. పొడవుగా సన్నగా ఉంటే అసలు హీల్సే బావుండవు అనుకొంటారు కానీ హీల్స్ ఉన్న స్ట్రాపీ సాండిల్స్ స్టిలెట్టోన్ మరింత అందంగా ఉంటాయి.

Leave a Reply