Thursday, 20 Aug, 2026
కొన్ని నగలు ధరిస్తే అమ్మాయిలకు అందం వస్తుంది. కొన్ని నగలకు అమ్మాయిలు ధరిస్తేనే అందంగా కనిపిస్తుంది. తల తిప్పారనుకొండి ఆ వజ్రాల తో తళుక్కుమంటారు. పెదవులపైకి నవ్వొస్తే నీటి బిందువు లాంటి చెవిపోగులు పచ్చని ఆకుల చివర నెమ్మదిగా ఊగుతాయి. ఏ వర్ణపు దుస్తులయితే ఆ వర్ణాలతో మెరిసిపోయే ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అమ్మాయిల ఫ్యాషన్. ముఖ్యంగా దీపాల వెలుగులో ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అందం చూడాలి. గాఢమైన రంగుల దుస్తుల పైకి మరే నగలు లేకపాయినా ఈ వజ్రపు చెవి పోగులు మెరిపిస్తాయి. అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఈ డిజైన్లు ఓసారి చూడండి.

ముఖాకృతిని బట్టి అందం

ముఖాకృతిని బట్టి చెవికి ధరించే ఆభరణాలు సెలక్ట్ చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదాహరణకు గుండ్రని ముఖానికి కోలగా ఉండే చెవిరింగ్స్,హ్యాగింగ్స్ బావుంటాయి.టియర్ డ్రాప్స్ డ్వాంగర్లు ఎంచుకోవాలి. గుండ్రగా ఉంటే ఇలాంటి ఆభరణాలు గుండ్రని ముఖానికి మ్యాచ్ అవుతాయి. కోల ముఖం ఉంటే ఏవైన బావుంటాయి.టియర్ డ్రాప్ లేదా స్టడ్స్ ఎంచుకోవచ్చు. నల చెదరపు ముఖం ఉంటే గుండ్రని ఆభరణాలు అందం, వజ్రాకృతిలో ముఖం ఊంటే డ్వాంగిల్ ఇయర్ రింగ్స్ బావుంటాయి. స్టడ్స్ హ్యాంగిగ్స్,ఇయర్ జాకెట్స్ ఇలా ఎన్నోరకలు ఇయర్ రింగ్స్ లో ఉన్నాయి. ముఖాకృతి బట్టి ఇయర్ రింగ్స్ ధరిస్తే ఆకర్షణియంగా ఉంటాయి.

Leave a Reply