Friday, 21 Aug, 2026
రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు ఇన్ని వేల అడుగుల నడక వల్ల కాలోరిలు కర్చుఅవ్వుతాయి కానీ ప్రయోజనం ఇకేముంటుంది అంటున్నారు. వుబకయం వుంటే కాస్త తగ్గుతారు, బరువు పెరగ కుండా వుంటారు. కానీ మరి సాధారణ బరువు ఆరోగ్యం వున్నవాళ్ళ కి ఇంత కష్టమైన ఎక్స్ సైజులు వద్దంటున్నారు. రెండు నుంచి మూడు వేల అడుగులు చాలు అది సాధారణమైన మన్యుషులకు కరెక్ట్ వ్యాయామం. అంటే కానీ నడక తో అంతంత సేపు శరీరాన్ని కష్ట పెడితే కిళ్ళ నొప్పులు తప్పవంతున్నారు. 50 ఏళ్ళు దాటితే, ఇంక ఆ వయస్సులో కిళ్ళ నొప్పుల తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. తీసుకునే ఆహారం చాలా తక్కువైపోతుంది. ఆరోగ్య స్పృహ వల్ల ఒక్క పూటే అన్నం, చపాతీలు, ఇంకా కొన్ని పళ్ళు తిని సారి పెట్టుకుంటారు. లేదా వృద్దాప్య దశ లో అంత కంటే ఎక్కువ అరగదు కనుక ఆ తినే ఆహారానికి సరిపడా నడకే ఎంచుకోమంటున్నారు. ఇంకా ఎక్కువ నడవాలంటే వైద్యుల సలహా పైన మాత్రమే అంటున్నారు.

పదేసి నిమిషాల వాకింగ్ బెస్ట్

రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో వాకింగ్ అయిపోతుంది. కానీ ప్రతి రోజు భోజనం తర్వాత కొద్ది నిమిషాలు వాకింగ్ చేస్తే ,ముఖ్యంగా డయాబెటిస్ ఉంటే బ్లడ్ షుగర్ కంట్రోలవుతోంది అంటున్నారు డయాబెటిక్ వ్యాధి గ్రస్థులు.ముఖ్యంగా ప్రధాన భోజనం మూడింటి తర్వాత ఒక్క సారి పదేసి నిమిషాల వాకింగ్ చేయటం మంచిదంటున్నారు .ఒకే ఒక సారి ఓ అరగంట ,లేదా గంట వాకింగ్ చేసే వారిలో కంటే ఇలా మూడుసార్లు పదేసి నిముషాలు వాకింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. పదేసి నిమిషాల వాకింగ్ శరీరాన్ని చురుగ్గా ఉండేలా చేస్తుందనీ ,బ్లడ్ షుగర్ నియంత్రనలో ఉంచుతుందని తాజా అధ్యయనాల్లో గుర్తించారు.

Leave a Reply