Monday, 10 Aug, 2026
శరీరానికి అందే ఉప్పు చాలావరకు సహజంగా ఆహారపదార్ధాల ద్వారానే అయినా రుచికోసం మనం కలుపుకొనే ఉప్పే అధిక ఉప్పుగా అనారోగ్యానికి కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముందుగా మనం తినే అయోడిన్ కలపిన ఉప్పు స్థానంలో సైంధవ లవణం రాక్ సాల్ట్ తినమంటున్నారు లేదా రాళ్ళ ఉప్పు పర్లేదంటున్నారు. వంటకాల్లోనే ఉప్పు సాధ్యమైనంత తగ్గించి, వెల్లుల్లి, నిమ్మ, ఉల్లి, ఆకుకూరలు, మసాలా దినుసులతో వండమంటున్నారు. ఆకుకూరల్ని బాగా కడిగి అందులోని లవణాలు పోయేలా చూడాలి. ఆహారంలో భాగంగా పొటాషియం అధికంగా గల బంగాళాదుంపలు, చిలకడదుంపలు, టొమాటోలు, ఆకుకూరలు తినాలి. పొటాషియం శరీరంలోకి వచ్చే సోడియంకు విరుగుడుగా ఉంటుంది. పదార్ధాలు వండే తీరుమార్చాలి. ఉప్పు వేయనవసరం లేని విధంగా కారగాయలు ఉడికించాలి. కూరల్లో ఉప్పుకు బదులుగా ఆ రుచి ఇచ్చే వస్తువులు వాడాలి. ఉప్పు ఎక్కువగా తీసుకొంటున్నారు అనే భావన వస్తే సాధ్యమైనన్ని మంచినీళ్ళు తాగాలి. ఉప్పు మంచిదే. ఆకలని కలిగించడం, ఆహారం గ్రహించడం, శరీరంలో మలినాలు తొలగించడం విషపూరితమైన పదార్ధాలు ప్రభావం తగ్గించడంలో ఇది మేలైనదే కానీ అధికంగా వాడితే ఇబ్బందులు తప్పవు.

ఇంకొంచెం నష్టమే

ఏదీ ఎక్కువ తక్కువ లేకుండా సరిగ్గా కొలతలలో ఉంటేనే అందం ,ఆరోగ్యం కూడా.ఆరోగ్యానికి ముప్పేమోనని అసలు మానేసినా ,నోటికి హితవుగా ఉందని కాస్త ఎక్కువ జోడించిన ఉప్పు విషయంలో రెండూ తప్పే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినట్లు మనిషి కేవలం ఐదు గ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి.రెండున్నర టేబుల్ స్పూన్ల ఉప్పులో శరీరానికి ఆ సోడియం అందుతుంది .18 దేశాల్లో లక్ష మందిపై పరిశోధన చేసి ఈ విషయం కనుగొన్నారు. భారతీయులు రోజుకు 11 గ్రాముల ఉప్పు తీసుకొంటున్నారు .ఒక వేళ ఉప్పు తక్కువ తింటే కూడా గుండె జబ్బును కోరి తెచ్చుకొన్నట్లే .ఇది తక్కువ ఎక్కువ కాకుండా తింటేనే ఆరోగ్యం.

Leave a Reply