Wednesday, 05 Aug, 2026
ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో బి.పీ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్య వేధిస్తుంటే చెర్రి పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిదని చెపుతున్నారు పోషక నిపుణులు. ఈ స్టడీలో భాగంగా బిపీ, టెన్షన్లతో బాధ పడుతున్న వారికి 60 మిల్లీ లీటర్ల చెర్రీ జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తీసుకున్న తర్వాత బిపి తో ఉత్సాహం స్పష్టంగా నమోదైనదని పరిశోధకులు చెప్పుతున్నారు. జ్యూస్ తీసుకున్న మూడు గంటల తర్వాత కూడా బి.పి కంట్రోల్ లో ఉన్నట్లు ఈ పరిశోధన రుజువు చేసింది. అధిక రక్త పోటు, గుండెకు సంబందించిన రుగ్మతకు కారణం అవుతుంది. అందువల్ల టెన్షన్ తగ్గించు కునే సాధనాల్లో ఈ చెర్రీ జ్యూస్ చేర్చుకోమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

ఇది మంచి ఔషధం.

చెర్రీస్ చూసేందుకు బావుంటాయి. తినేందుకూ బావుంటాయి. చూడగానే చక్కని రంగులో నోరూరించే చెర్రీ పండ్లు రుచినే కాకుండా ఆరోగ్యాన్నీ ఇస్తాయి అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. చెర్రీ జ్యుస్ లో అధిక రక్త పోటును తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయిట. గుండె జబ్బులకు కిడ్నీ సమస్యలకు కారణం అయ్యే రక్త పోటును తాగించుకునేందుకు మందులు వాడటం కన్నా ఓ గ్లాసు చెర్రీ జ్యుసు తాగితే చాలా వరకు రక్త పోటును అదుపులో వుంచుకోవచ్చు అని ఒక అధ్యయనం లో తేలింది. సుమారు వెయ్యి మంది బి.పీ పేషెంట్ల పై దీర్ఘకాలం ఈ పరిశోధన చేసారు. చెర్రీ జ్యుస్ తో రక్త పోటు తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అంటున్నారు పరిశోధకులు.

Leave a Reply