Sunday, 28 Jun, 2026

యువరాణి రాసిన ఉత్తరం

వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నాకో ఉత్తరం రాశారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న వారిలో మీరు ఒకరిని నాకు తెలిసింది. ఇండియా,నేపాల్ దేశాలలో క్యాన్సర్ కేర్ కోసం పనిచేస్తున్నారు. ఇది ఇతరులకు ఎంతో స్ఫూర్తి అని ఉత్తరం లో రాశారని సంతోషంగా చెబుతోంది మనీషా కొయిరాలా. 2012లో మనీషా ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడి ఐదేళ్ల  వైద్యం తర్వాత కోలుకున్నది. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా క్యాన్సర్ నుంచి బయటపడ్డ వారే యువరాణి రాసిన ఉత్తరం నాలో […]

రీల్స్ నుంచి సినిమాకు

చిన్నతనం నుంచి మోడల్ కావాలన్న కోరిక తో ఇన్‌స్టా లో రీల్స్ ప్రారంభించిన సాక్షి వైద్య ఏజెంట్ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. మహారాష్ట్రలోని థానే కు చెందిన సాక్షి ఫిజియోథెరపీ లో పీజీ చేసింది. కరోనా సమయం లో చేసిన రీల్స్ తో ఇన్‌స్టా లో 9 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు మోడలింగ్, టీవీ యాడ్స్, మ్యూజిక్ వీడియోలు ఒకదాని వెంట ఒకటి ఎన్నో అవకాశాలు వచ్చాయి.రీల్స్ నుంచి సినిమా రంగ ప్రవేశం చేసింది సాక్షి.

ఆమె గొంతు ప్రత్యేకం

రాగయుక్తంగా పాడితే గొంతు మగరాయుడిగా ఉందన్నారు దాన్నే ప్రశంసగా తీసుకొని గొంతును ప్రత్యేకంగా మలుచుకున్నారు అంటుంది సునిధి చౌహాన్ ఆమె పాడిన ధూమ్ మచాలే ధూమ్ దుమ్ములేపే బీట్ రెండు ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్న సునీత ఇప్పటివరకు 14 సినిమా పాటలు పాడింది అందులో తెలుగు పాటలు ఉన్నాయి హిందీ తమిళం కన్నడ మలయాళం అస్సామీ బెంగాలీ భోజ్ పూరి తదితర భాషల్లో కూడా పాడింది సునీత ఆమె తొలి ఆల్బమ్ సోలో ఆల్బమ్ ఆయుధ […]

కాఫీ బెస్ట్ డ్రింక్

కమ్మని కాఫీ అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్ ఇందులో ఇందులోని కెఫిన్ తో నాడీ వ్యవస్థ ప్రభావితమై మెదడు పనితీరు వేగవంతం అవుతుంది. కాఫీ లో ఉండే ఖనిజ లవణాలు క్యాలరీలు కార్బోహైడ్రేట్లు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజుకు రెండు కప్పుల కాఫీ తో డోపమైన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. కాలేయపు  ఇన్ఫెక్షన్లు రావు. బ్లాక్ కాఫీ తో బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం తరువాత వచ్చే అలసట తగ్గుతుంది.

డీఎస్పీ గా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్

ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్) గా చేరారు. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు  నిఖత్. బ్యాంకాక్ లో జరిగిన 2019 థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో జరీన్ రజిత పతకం పొందింది.2015 లో అస్సాం లో జరిగిన 16 వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో ఆమె స్వర్ణం సాధించారు. 2022లో ఇస్తాంబుల్ లో ప్రపంచ బాక్సింగ్ […]

కొత్తగా చెబుతున్నారు

లక్నో లోని మహిళ బైకర్లు సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు గాను ఆల్ విమెన్ బైక్ ద్వారా నిర్వహించారు సాంప్రదాయ వస్త్రధారణలో సాగిన ఈ ర్యాలీ లో సశస్త్ర సీమా బల్ అనే కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లోని స్త్రీలు కూడా యూనిఫామ్ ధరించి పాల్గొన్నారు వీరంతా వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహన కల్పించారు ఈ ర్యాలీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అంతులేని ఆత్మవిశ్వాసం

అరుదైన వ్యాధి చక్రాల కుర్చీకే పరిమితం చేసిన అంతులేని ఆత్మవిశ్వాసం తో రచయిత్రిగా మంచి టీచర్ గా ఎదిగారు రష్మీరేఖ భుయాన్ గుహవాటి విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేశారు స్పైనల్ మస్క్యులర్ అట్రోపి అనే వ్యాధితో వీల్ చైర్ లోనే జీవిస్తున్నారు. ఆమె జీవితాన్ని మాత్రం చక్కగా తీర్చిదిద్దుకున్నారు ఒక తల్లిగా చక్కని టీచర్ గా మంచి రచయిత్రిగా ఆమె ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఆమె రాసిన మూడు నవలలు ప్రశంసలు అవార్డులు పొందాయి.