June 2023
మట్టి బొమ్మల ఆర్టిస్ట్
అంజలి ఖన్నా పుదుచ్చేరి లోని గోల్డెన్ బ్రిడ్జ్ లో సిరామిక్ కుండల తయారీ నేర్చుకున్నారు. ముంబై లోని ఆలీ బాగ్ లో ఆమె సిరామిక్ స్టూడియో ఏర్పాటు చేశారు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ పాటరి ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ మధ్యకాలంలో ఆమె ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సిరామిక్స్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ఈ సిరామిక్ కళారూపాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
వాసన వదలాలంటే
వేసవిలో చెమట తో శరీరం దుర్గంధం సహజం దీన్ని వదిలించుకోవడం కోసం సరైన డియోడరెంట్ ఎంచుకోవాలి స్వేదం ఎక్కువగా విడుదల అవుతుంది కనుక రెండు పూట్ల దుస్తులు మార్చుకోవాలి దుస్తులు ఉతికే నీళ్లలో వెనిగర్ కలిపి ఉతికితే వాసన పోతుంది సల్ఫర్ ఎక్కువగా ఉండే బ్రొకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీలు తీసుకోకూడదు. ఉపయోగించే పెర్ ఫ్యూమ్ లేదా కోలన్ ఆల్మండ్ ఆయిల్ లేదా ఇతర ఎసెన్షియల్ ఆయిల్ కలిపి వాడితే సుగంధం ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
బవుల్ పాటకు ప్రచారం
రీనా దాస్ ప్రఖ్యాత బవుల్ గాయని. పశ్చిమ బెంగాల్ లోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన రీనా దాస్ కుటుంబంలో అందరూ బవుల్ గాయకులే పెళ్లి అయ్యాక రీనా దాస్ భర్త దివాకర్ దాస్ ప్రోత్సాహంతో సంగీతం నేర్చుకుంది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర ల్లో నివసించే జానపద సంగీతం బవుల్ ఈ బవుల్ పాటల్లో భక్తి ప్రధానం 35 సంవత్సరాలు గా రీనా దాస్ 5 వేలకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. […]
ఆవు పాల వ్యాపారి
పరాగ్ మిల్క్ ఫుడ్స్ పేరుతో డైరీ ప్రొడక్ట్స్ ప్రారంభించిన అక్షాలి షా నవతరం విజేత ఆమెకు పూణే లో గో క్షేత్రం ఉంది. ఇక్కడ మానవ రహితంగా ఆవుల నుంచి పాలను సేకరించి ప్యాక్ చేసి విమానాల ద్వారా ఖాతాదారులకు చేరుస్తారు. మార్కెట్లో ఆవు పాల కంటే వీటికి రెట్టింపు ధర ఉంటుంది. పరాగ్ సంస్థ నుంచి గోవర్ధన్ పేరుతో నెయ్యి అమ్ముతారు ఫ్లేవర్డ్ మిల్క్,పెరుగు ఇలా అన్ని ఉత్పత్తుల తో సంస్థ నుంచి అమ్మకాలు సాధిస్తోంది.అవతార్ […]
అరుదైన కళాకారిణి
బెంగాల్ నాటక రంగంలో ఆధునిక దోరణులు పరిచయం చేసిన నటిగా పేరు తెచ్చుకుంది.బినోదిని దాసి.1847 లో కోల్ కత్తా నేషనల్ థియేటర్ తరఫున తొలిసారిగా ఒక సీరియస్ డ్రామా లో నటించింది బినోదిని 12 వ ఏటా మొదలుపెట్టిన నటనను 23 వ యేటా స్వస్తి పలికిన బినోదిని జీవిత చరిత్ర రాసుకున్న తొలి దక్షిణాసియా నటిగా ప్రసిద్ధికెక్కింది. ఆమె జీవిత చరిత్ర అమర్ కథ నటి బినోదిని పేరుతో బెంగాలీ సినిమా వచ్చింది.ఇప్పుడు ఆమె జీవితం […]
సెంగోల్ ఎక్కడ?
తమిళనాడు కు చెందిన శాస్త్రీయ నృత్యకారిణి పద్మ సుబ్రహ్మణ్యం సెంగోల్ రాజదండం గురించి ప్రధాని మోదీకి లేఖ రాయడం వల్లనే ధర్మానికి న్యాయానికి చిహ్నమైన ఆ సెంగోల్ ని కనుక్కోగలిగారు బ్రిటిష్ వారి నుంచి అధికారం బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు తమిళనాడు సాంప్రదాయం ప్రకారం ఈ రాజదండాన్ని 1947 ఆగస్టు 14న నెహ్రూ అందుకున్నారు. దాన్ని ఆయన అలహాబాద్ మ్యూజియాలకు చేర్చారు. రెండేళ్ల క్రితం ఈ రాజ దండం గురించిన వార్త చదివిన పద్మ సుబ్రహ్మణ్యం దీన్ని […]
నిరంతర పోరాటం లక్ష్యం
కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది గా సృష్టించారు 27 ఏళ్ల పద్మా లక్ష్మి కేరళలోని కొచ్చి లో జన్మించిన పద్మా లక్ష్మి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని న్యాయవాద వృత్తి లోకి ప్రవేశించారు. ఇది సరికొత్త అధ్యాయానికి నాంది అంటూ కేరళ న్యాయ శాఖ మంత్రి ఎ.రాజీవ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ట్రాన్స్ జెండర్ ల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెబుతున్నారు పద్మా లక్ష్మి.
ఈ హ్యాండ్ బ్యాగ్స్ మరీ స్పెషల్
రస్కీ పేరుతో బనానా బెస్ట్ లెదర్ ప్రొడక్ట్స్ తో మార్కెట్ లో అడుగు పెట్టింది శివాని పోపట్. తన బ్యాగులు యాక్ససరీస్ కు ముందు క్రూయాలిటీ ఫ్రీ అనే వాక్యం చేర్చి ఎంతో మందికి దగ్గర అయింది. శివాని. పర్యావరణ హితం కోరుతూ ఆమె ప్రారంభించిన ఈ కంపెనీతో చాలా త్వరలో పాదరక్షలు కూడా తేబోతోంది.వినియోగదారులు ఇష్టపడే లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లో రస్కీ కూడా ఒకటి.
బామ్మ ది గ్రేట్
ఆస్కార్ విన్నింగ్ టీవీ సీరియల్ ‘డి కుమార్స్ ఎట్ నంబర్ 42 లో మీరా స్వాల్ పోషించిన సుశీల అనే భామ పాత్ర సూపర్ హిట్. ఆమె ప్రతిష్టాత్మకమైన ‘భాస్టా’ ఫెలోషిప్ కు ఎంపికైంది. రచయిత్రిగా మీరా రాసిన ‘అనితా అండ్ మి’ పుస్తకానికి ఎంతో గుర్తింపు లభించింది. రచయితల తొలి పుస్తకానికి ఇచ్చే ప్రఖ్యాత బెట్టీ ట్రాస్క్ అవార్డు గెలుచుకుంది.ఆమె చక్కని గాయని.పంజాబ్ గ్రామీణ ప్రాంతాలలోని జానపదాలు చక్కగా.61 సంవత్సరాల మీరా బహుముఖప్రజ్ఞశాలి.
