December 2020
సక్యులెంట్ క్రిస్మస్ ట్రీ
క్రిస్మస్ ట్రీ కోసం కొని ఫెర్ ,ఫిర్ జాతి మొక్కలు వాడుతారు అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో ఈ చెట్లను పొలాల్లో పెంచి అమ్ముతారు. అంత చెట్టు ఇంట్లో పెట్టుకునే చోటు లేకపోవచ్చు.అలా అలంకరించే కష్టం లేకుండా ఇప్పుడు ఎడారి మొక్కలు క్రిస్మస్ ట్రీ లు వచ్చేశాయి.ఈ సక్యులెంట్ క్రిస్మస్ ట్రీ ఇప్పుడు కొత్తట్రెండ్ ఆన్ లైన్ లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.పండగ అయ్యాక ఈ మొక్కల్ని తీసి విడిగా కుండీల్లో నాటుకుంటే ఎంత చక్కని […]
మెరిపించే ప్యాక్
ఈ శీతా కాలపు గాలులకు మొహం పగుళ్లు చూపిస్తోంది. చర్మం గరుకుగా తయారవుతుంది ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ ప్యాక్ చర్మానికి నిగారింపు ఇస్తుంది.మూడు టేబుల్ స్పూన్ ఓట్ మీల్, ఎగ్ వైట్, టీ స్పూన్ తేనె,ఓ టీ స్పూన్ పెరుగు మిశ్రమంలా కలపాలి దీన్ని ఫ్రిజ్ లో ఉంచి బాగా చల్లబడ్డాక మొహానికి ప్యాక్ వేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరుపుతో ఉంటుంది వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు .
ఈ నెంబర్లు షేర్ చేయండి
చిన్న కష్టం వస్తే చాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చూస్తుంటారు చాలా మంది. క్షణికావేశం కుటుంబాల భవిష్యత్తు ను దెబ్బతీస్తోంది. అలాంటి వారి ఆలోచనలను ముందే పసిగడితే కాసేపు వాళ్ళతో మాట్లాడితే సులువుగా వారిని అందులోంచి బయట పడేయవచ్చు,ఇందుకోసం కొన్ని హెల్ప్ లైన్ లు పనిచేస్తున్నాయి.కేంద్రం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కిరణ్ హెల్ప్ లైన్ (18005990019) ఆత్మహత్యల నివారణ కోసం ఆసరా (9820466726) తీవ్ర ఒత్తిడి లో ఆత్మహత్య ఆలోచన […]
అందరూ మహిళలే
కిర్లోస్కర్ ఆల్ ఉమెన్ యూనిటీ లో కేవలం మహిళలే ఉంటారు.ఇది గృహవసరాలకు ఉపయోగపడే పంపుల తయారీ సంస్థ.అన్ని విభాగాల్లో ప్రొడక్షన్స్ నుంచి ప్యాకింగ్ వరకు అన్ని చోట్ల మహిళలే ఉంటారు. నెలకు ఐదు లక్షల యూనిట్లని అవలీలగా తయారుచేస్తారు అంటే ఒక పంపు తయారీకి పట్టే సమయం 17 సెకండ్లు మొత్తం 204 మంది మహిళలు దయచేసి యూనిటీలు 17 రకాల పంపులు తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం 132 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ జరుగుతాయి. […]
Immanuel (2013) ( మలయాళం)
మమ్ముట్టి ఫహార్ పజిల్ నటించిన ఈ మలయాళం చిత్రం ఇమాన్యుయల్ మనుష్యలలో మంచి తనాన్ని ,మానవత్వ విలువలను ప్రదర్శించిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇమాన్యుయల్ ఒక పబ్లిషింగ్ సంస్థలో పనిచేస్తుంటాడు అనుకోకుండా ఆ కంపెనీ మూత పడటంతో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం లో చేరుతాడు. ఇలాంటి ప్రవేట్ సంస్థలు కస్టమర్ల భవిష్యత్ కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పని చేయటం ఇమాన్యుయల్ భరించలేక పోతాడు మానవత్వం ఉన్న మనిషిగా క్లైంట్స్ […]
అందమైన చిరునవ్వు
ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో నిర్వహించిన స్మైల్స్ అథెఓటిక్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ ఎగ్జిబిషన్ లో బాలీవుడ్ నటి దీపికా పడుకొనే విగ్రహానికి స్థానం లభించింది.ఈ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. మెడలో చోకర్ తో, మడిచిన కొప్పు తో దీపిక చిరునవ్వు నవ్వుతున్న విగ్రహం ఏథెన్స్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహం గ్రే మార్బల్ తో తయారు చేశారు ఇది దీపిక తను పాడిన అన్న టైం అయోగా […]
నువ్వు అత్యంత భాగ్యశాలివి
మనం ఎంత అదృష్టవంతులమో ! ఈరోజు ఉదయం ఏ నొప్పి బాధ లేకుండా నిద్ర లేస్తే నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కంటే అదృష్టవంతులు కదా ఏ భయం లేకుండా ఆయుద్ధం లేకుండా చుట్టూ పదిమంది అనుచరులు లేకుండా హాయిగా తిరుగుతున్నాం అంటే భయం లేని జీవితం గడుపుతున్నట్లే కదా.ఈ రోజుకు సరిపోను డబ్బు చేతిలో ఉండి బ్యాంక్ లో భవిష్యత్తు కోసం కొన్నాళ్లకు సరిపోను డబ్బు ఉంటే ప్రపంచంలో ఎనిమిది శాతంగా […]
ఇంటింటికీ పెళ్లి విందు
కోవిడ్ వచ్చాక ఎన్నో కొత్త సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. రంగ రంగ వైభవంగా చేసే పెళ్లిళ్లు వెబినార్ లో చూసి అక్షింతలు వేస్తున్నారు అలాగే నవకాయ పిండి వంటలతో,ఎన్నెన్నో రకాల వంటకాలతో పెండ్లి విందు గుమగుమలాడేది.మరి కరోనా సమయంలో అందరూ రాలేరు కదా తమిళనాడు ఒక జంట ఇంకో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్లి రోజున కళ్యాణ సాపాడు పార్సల్ పంపించింది పెళ్లి పత్రికల్లో వధూవరుల పేర్లు ముహూర్తం వివరాలతో సహా ఇందులో […]
రోష్ని నాడార్
ఫోర్బ్స్ మ్యాగజైన్ వందమంది శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు రోహిణి నాడార్ హెచ్. సి.ఎల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రోహిణి ఈ జాబిదాలో చోటు చేసుకోవటం ఇది నాలుగో సారి.హరూన్ రిచ్ లిస్ట్ ఇటీవల ప్రకటించిన జాబిదా లో భారత్ లో సంపన్న మహిళ పారిశ్రామిక వేత్తగా తొలి స్థానంలో నిలిచారు.ఆమె సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకు గా ఉన్నారు. అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. […]
సంస్కృతం ఔపోసన పట్టిన సల్మా
గుజరాత్ యూనివర్సిటీ నుంచి సంస్కృత భాషలో పి.హెచ్.డీ తీసుకుంది తొలి ముస్లిం అమ్మాయి సల్మా ఖురేషీ.ఆమె పిహెచ్.డి టాపిక్ పురాణేషు నిరూపిత శిక్ష పద్ధతి ఏ కాధ్యాయం అంటే పురాణకాలం నుంచి గురు శిష్య పరంపర ద్వారా విద్యా విధానం ఎలా కొనసాగిందీ అనేది వివరణ. సంస్కృతం దేవభాష అంటారు ముస్లిం కుటుంబం నుంచి వచ్చి సంస్కృతంలో పీహెచ్ చేసిన ఈ అమ్మాయిని చూసి గర్వ పడిపోయారు సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ చేసిన సల్మా […]
పాఠాలు నేర్పే ఎడ్యు ఆరా
ఎడ్యు ఆరా పేరుతొ ఎడ్యుకేషన్ కు సంబంధించి యాప్ తీసుకువచ్చింది ముంబయ్ కు చెందిన ఆకాంక్ష. ఈ యాప్ ద్వారా 6-12 తరగతుల విద్యార్థులకు పాఠ్యంశాలు బోధిస్తున్నారు. వీడియో గ్రాఫిక్స్ తో స్టెమ్ సబ్జక్ట్ ల పైన ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు రూపొందించారు జీ5 యాప్ లో కూడా వీరి వీడియో పాఠాలు చూడవచ్చు త్వరలో పోటీ పరీక్షల విభాగంలో కూడా ఈ యాప్ పాఠాలు తేబోతుంది. ఎడ్యు ఆరా సేవలను 999 రూపాయలతో ప్రారంభం పేకేజ్ […]
Pahuna (పాహున) (నేపాలి) ది లిటిల్ విజిటర్స్
2017 లో నేపాలీ భాషలో తీసిన ఈ పాహున సినిమా ప్రియాంక చోప్రా నిర్మించారు. జర్మనీ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. పరమత సహనం లేకుండా ద్వేషం దెబ్బ గోడుతూ పెద్ద వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లల పైన ఎలాంటి దుష్ప్రభావం చూపెడతయో ఈ సినిమా చక్కగా చూపెడుతుంది. వాళ్ళ లేత మనసుల్లో పెద్దల నాటే విష బీజాలతో పిల్లలు ఎలాంటి భావ జాలంతో పెరుగుతారు.ఎంత […]
మనిషికి ఎంత శక్తి !
ఫ్రిడా కాయ్లో (1907-1954)జీవించింది. జీవించింది తక్కువ కాలమే అయినా గొప్ప చిత్రకారునిగా పేరు తెచ్చుకుంది ఫ్రిడా పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. ఆమె జీవిత చరిత్ర చూస్తే నిజంగా ఈ ప్రపంచంలో మనిషి ఎంత శక్తివంతుడో,ఇటువంటి కష్టానికైనా ఎలా ఓర్చుకొంటారో ఎలా గెలుస్తారో తెలుస్తుంది. 1985 లో 17 ఏళ్ల వయసున్న ఫ్రిడా కాయ్లో బస్ లో వెళ్తుండగా జరిగిన ఒక ప్రమాదంలో ఆమె వెన్నుముక, మెడ తుంటి ఎముక విరిగిపోయాయి కుడిపాదం వంకర పోయింది. […]
జుట్టు దువుతూంటే మంచిది
జుట్టు ఒత్తుగా పెరగాలంటే మాడు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి.మాడకు స్క్రబ్ చేయాలి అలా చేయడం వల్ల సేబాషియన్ గ్రంధులు ఉత్తేజితమై జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.జుట్టుకు కూడా పోషకాలు అందాలంటే గుండ్రని పళ్ళున్న దువ్వెనతో జుట్టు బాగా దువ్వాలి. హెయిర్ డ్రయ్యర్ వాడితే వేడి తక్కువగా ఉండాలి. ప్రతి రోజూ తల స్నానం మంచిది కాదు. స్నానం తర్వాత కాటన్ బట్టతో జుట్టు తుడుచుకోవాలి. ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత జుట్టు పై తీవ్ర […]
స్త్రీలకు ప్రత్యేకం
పురుషులతో పోల్చితే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం తినవలసిన అవసరం చాలా ఉంటుంది. మహిళల శారీరక పనితీరు సక్రమంగా సాగాలంటే కచ్చితంగా తినవలసిన పదార్ధాలు కొన్ని ఉన్నాయి.వాటిలో పాలకూర ఒకటే వీటిలో ఉండే మెగ్నీషియం ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు అడ్డుకుంటుంది.టమోటో అత్యంత శక్తివంతమైనది. క్రాస్ బెర్రీలు మహిళల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల కలిగే భావోద్వేగాలు నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి బరువును అదుపులో ఉంచగలిగిన ఆహారం.
అపురూప జానపద వాణి
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా కోసం రెండు గిరిజన పాటలు పడింది నంజమ్మ. ఆ పాటలు యూట్యూబ్ లో దుమారం రేపాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా అట్టపాడి ప్రాంతం ఆగలి అనే గిరిజన సెటిల్ మెంట్ లో నివసిస్తోంది నంజమ్మ తను జన్మించిన ఇరుల తెగ తాలూకు జానపద గీతాలు నేర్చుకుంది. ఆ భాషకు లిపి లేదు ఒక తరం నుంచి ఇంకో తరానికి మౌఖికంగా అందిన గీతాలు అవి. ఇప్పుడు జానపద గీతాలు పాపులర్ కేరళ లోని […]
మంచి ఔషధం
అనేక ఆరోగ్య సమస్యలకు వేపాకు మంచి ఔషధం ఉదయాన్నే పది వేపాకులను నములుతుంటే నోటికి సంబంధించిన సమస్యలు రావు. వేప బెరడు ఎండబెట్టి పొడి చేసి రోజుకు ఒక టీ స్పూన్ చొప్పున గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే ట్యూమర్లు అల్సర్లు రావు. తలలో స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే వేప నూనెతో మర్ధన చేస్తే తగ్గుతుంది.లేదా వేపాకు ను తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది కనీసం నెలకోసారి అయినా వేప […]
కల నిజమైంది
ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నదే నా డ్రీమ్ నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి న్యూయార్క్ వెళ్లాను అక్కడ కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో పనిచేసి హైదరాబాద్ వచ్చాక సొంతంగా దుస్తులు డిజైనింగ్ మొదలుపెట్టాను. 2012 లో మొదటిసారి లక్మే ఫ్యాషన్ వీక్ లో అవకాశం వచ్చాక ఇక వెనక్కి తిరిగే పనిలేకుండా పోయింది ఇక మహానటిలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవరకొండకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాక వాటికి జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ వచ్చింది […]
ఇది నా బాధ్యత
ఢిల్లీకి చెందిన 63 సంవత్సరాల రేణు గుప్త గత 15 సంవత్సరాలుగా పరిసరాలను శుభ్రం చేస్తూనే ఉంది. డంప్ యార్డులు గా మారిన ప్రభుత్వ ఖాళీ స్థలాలు పిల్లల ఆటస్థలాలు గా పచ్చిక మైదానాలు గా మార్చేసింది. తనతో పాటు పలుగు పార మొక్కలు తీసుకుపోతుంది. అలాగే ఉత్తర ఢిల్లీలోని నానక్ పియావో సాహిబ్ గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రం చేసింది. కనపడిన ప్రతి గోడని పెయింటింగ్స్ తో నింపేస్తుంది రేణు గుప్తా. మనం ఓ అడుగువేస్తే […]
జ్వరానికి విరుగుడు
చలి రోజుల్లో దగ్గు జలుబు జ్వరం వంటి వస్తూ ఉంటాయి. జ్వరం వచ్చి తగ్గిన దాన్ని తాలూకా నీరసం తగ్గదు ఇటువంటి సమయంలో పొట్లకాయ దివ్యౌషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. మామూలుగా మలేరియా బాధితులకు పొట్ల కాయ రసం మంచి మందు. ఇది యాంటీ బయోటిక్స్ మాదిరిగా పని చేస్తుంది గొంతులోని కఫాన్ని తగ్గించే శ్వాస వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది.శరీరంలోని విషతుల్యలను తొలగిస్తుంది. మూత్రాశయం పనితీరు మెరుగుపరుస్తుంది.
