April 2020
ఇక్కడా విజయమే
పిల్లల కోసం కెరీర్ బ్రేక్ చేసి ఉన్నా ఉద్యోగానికి గుడ్ బై చెప్పి కొత్తగా వ్యాపారం లోకి వచ్చిన ఎంతోమంది తల్లులు బిజినెస్ లో కూడా శభాష్ అనిపించు కొన్నారు .ఢిల్లీ ఐఐటి లో ఇంజనీరింగ్ చదివిన మీతా శర్మ గుప్తా హార్వర్డ్ లో పిహెచ్ డి చేసింది .ఉద్యోగ రీత్యా అమెరికా నుంచి ఇండియా వచ్చే సరకి ఆమె రెండో కొడుక్కి ఏడాది వయసు పెద్ద కొడుకు కలపతో సహజ వర్ణాలతో దొరికే బొమ్మలతో ఆడుకొనే […]
ఇదీ సమస్యే
లాక్ డౌన్ తో బయటకి వెళ్ళే దారిలేదు .ఎండలోకి వెళ్ళకపోతే డి -విటమిన్ లోపాన్ని ఎదుర్కో వలసి వస్తుంది .ఈ విటమిన్ లోపిస్తే ఎముకలకు సంబందించిన సమస్యలతో పాటు ఇతరత్రా అనారోగ్యాలు కూడా కలుగుతాయి .సూర్య కాంతి సాధారణంగా సూర్య కాంతి చేప నూనె ల నుంచి డి -విటమిన్ లభిస్తుంది .ఉదయం ఎనిమిది గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎండవేడి కొద్దీసేపునై శరీరం పైన పడేలా ఏ బాల్కనీ లోనూ నిలబడాలి .ఇలా […]
బాక్టీరియాపై దెబ్బ
అనారోగ్య భయం వెంటాడుతున్న సమయంలో ఒత్తిడి ఆందోళన ఉండటం సహజమే .కానీ దానివల్ల పొట్టలోని మంచి బాక్టీరియా దెబ్బ తింటుంది.మంచి బాక్టీరియా లోపం వల్ల ఉదరంలో నొప్పి అజీర్తి వంటి సమస్యలు వస్తాయి .పొట్టలోని బాగా లేకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది.ఆలోచనా శక్తి తగ్గిపోయి చిరాగ్గ ఉంటుంది .ఈ రెంటికీ కారణం మెదడకు పొట్టకు మధ్య అవినాభావ సంబంధం ఉండటమే కారణం .అందుకే ఎలాటి సందర్బం లో కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయుట, వత్తిడి […]
సరుకులు కొన్నారా ?
వస్తువుల ఉపరితలం పైన కరోనా వైరస్ 72 గంటల పాటు జీవిస్తుంది .సూపర్ మార్కెట్ లో వస్తువులు కొనితెచ్చుకొన్న తర్వాత వాటిని బయటికి తీసి వంటగదిలో శుభ్రమైన ప్రదేశం లో ఉంచాలి .పండ్లు కూరగాయలు 30 సెకన్ల పాటు చల్లని నీళ్ళతో కడగాలి .బంగాళాదుంపలు క్యారెట్ వంటివి నీళ్ళలో కాస్సేపు బాగా రుద్ది కడగాలి .ఫ్రిజ్ లో నిల్వ ఉండే పదార్దాలు తెస్తే క్యాన్ లు , బాక్సల వంటివి బాగా తుడిచి కడగటం వల్ల వైరస్ […]
“కాలభైరవుడి ప్రసాదం”
వారణాసి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.ముందు ఆయన దర్శనం చేసుకుంటే కానీ స్వామి దర్శనం లభించదు.పూర్వం బ్రహ్మ తపస్సు చేస్తున్న సమయంలో మహర్షులు వెళ్ళి ఈశ్వర తత్వం గురించి అడిగిన అఙ్ఞన మాయ కమ్మి బ్రహ్మ తనను తాను సర్వస్వం అనీ,విష్ణుమూర్తి కూడాఅంతే అఙ్ఞానంగా ప్రవర్తించాడు.అది చూచిన త్రినేత్రుడు కోపంతో తన భృకుటి నుండి ఒక భయంకరమైన జీవిని అనుమతిచ్చాడు.సకల లోకాలను, సర్వ రోగాలను,దుష్ట శక్తులను ఎదిరించడం కాలభైరవుని ప్రత్యేకత.బ్రహ్మ అయిదవ తల కాలభైరవుని చూచి నవ్వినందుకు […]
వీటితో కష్టమే
హోటల్స్ లో చేతుల కడుక్కొని చోట హ్యాండ్ డ్రయర్స్ అమర్చి ఉంటాయి .చేతుల తడులు కాకుండా అలా చేయి పెడితే వేడిగాలి వెదజల్లుతాయి ఈ హ్యాండ్ డ్రయర్స్ .కానీ వీటివల్ల పెద్దగా ఉపయోగం లేకపోగా, సూక్ష్మ జీవులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ అంటారు అధ్యయన కారులు .బాత్ రూమ్స్, టాయిలెట్స్, వాష్ బేసిన్స్ ఒకే చోట ఉంటాయి .అక్కడే సూక్ష్మ జీవులు అధికం .ఆ సూక్ష్మ జీవులు ఈ యంత్రాలు వదిలే గాలివల్ల మరింత దూరం […]
ఇది వ్యసనమే
అలసిన మనసుకి విశ్రాంతి,వినోదం అవసరం ఇప్పటి రోజుల్లో యువత అలసట పోగొట్టే సాధనంగా టి వి,ఇంటర్ నెట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా జీవితం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది.ఇప్పుడున్న ఆపద సమయం లో ఫేసుబుక్, వాట్సాప్ లో వచ్చే ఎన్నో వార్తలు నిజమో అబద్దమో తేల్చగగలిగే రుజువు,సాక్ష్యం ఉండదు .కొన్ని ఫేక్ న్యూస్ లు మనసు పైన మోయలేని భారం తెచ్చి పెడతాయి .ఈ సామజిక మాధ్యమాల దుష్ప్రభావం అర్ధం చేసుకొని దానినుంచి కొన్నాళ్ళు దూరంగా ఉంటే […]
మనసుకి లాభం
పుషప్స్,వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాల వల్ల శరీరానికి మనసుకీ మేలు జరుగుతుంది .వ్యాయామాల వల్ల కుంగుబాటుకి లోను కాకుండా ఉంటారు .మూడ్ త్వరగా మారటం పనుల పట్ల ఆసక్తి లేకపోవుటం వంటి మానసిక సమస్యల నుంచి వ్యాయామం బయటకు తెస్తుంది .ఏ వయసు వారైనా లింగ భేదానికి అతీతంగా కలిగే లాభం ఇది.ముఖ్యంగా20-40 ఏళ్ళ మధ్య వయసు వారికి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది వ్యాయామం .ఈ తరహా వ్యాయామాలు రక్త ప్రసరణ మెరుగు పరిచి మెదడును […]
మధుబని మాస్క్ లు
మధుబని మాస్క్ లు తయారీకి శ్రీకారం చుట్టారు ఇహితా శ్రీశాంధియా .ఆమె మిథిలా స్మిత్ అనే సంస్థను స్థాపించి మధుబానీ కళను ప్రాచుర్యంలోకి తెచ్చారు .లాక్ డౌన్ కారణంగా చేతి వృత్తుల పై ఆధారపడిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాలు వస్త్రాలకు వన్నెలద్దే మధుబానీ కళ పై ఆధారపడిన మహిళలు మాస్కుల తయారీలో శిక్షణ ఇప్పించారు .శాంధియా వారు తాయారు చేసిన మాస్కులు తక్కువ ధరకే ప్రజల కు అందించే ఏర్పాట్లు చేశారు […]
పేదపిల్లలకు విద్య
ఉపాధి కోసం దేశ రాజధాని ఢిల్లీకి వేలాది మంది వలస వస్తూ ఉంటారు .వాళ్ళు కూలీలు , కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు .వారి పిల్లలు మాత్రం వీధుల్లో ముష్టి ఎత్తి బతుకు సాగిస్తుంటారు .ఈ పిల్లల ఆరోగ్యం , చదువు కోసం సునాయ్ ఫౌండేషన్ స్థాపించిచారు రిచా ప్రశాంత్ .ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసంత కుంజ్ దగ్గర ఓ పాఠశాల ఏర్పాటు చేసి కూలీలు , కార్మికుల పిల్లలకు చదువు చెపుతున్నారు .కోల్ కొత్త బీహార్ లోని […]
మహిళల వేదిక షీరోస్
భారత దేశంలో సక్సెస్ అయిన అంకుర్ సంస్థల్లో మహిళల సోషల్ నెట్ వర్క్ షీరోస్ ఒకటి జె ఎన్ టి యు నుంచి ఎంఫిల్ చేసిన సైరా చిహత్ ఎన్నో ఉద్యోగాలు వ్యాపారాల తర్వాత మహిళల కోసం ఈ వేదిక ను ప్రారంభించారు. దీని ద్వారా మహిళల ఉద్యోగావకాశాలను,ఉపాధి మార్గాలను తెలియజేసేవారు. తర్వాత కెరీర్ కు సంబంధించిన హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసింది షీరోస్. ఫోన్ చేసిన వాళ్ళు పిల్లల పెంపకం,వ్యాపారం,మానవ సంబంధాల గురించి అడగాలంటు […]
ఫ్లోరెన్స్ పార్పార్ట్
వంటింట్లోను,ఇంట్లోనూ వాడుకొనే ఎన్నో వస్తువులు కనిపెట్టింది ఆడవాళ్ళే (florence parpart) ఫ్లోరెన్స్ పార్పార్ట్ ఇప్పుడు మన జీవితాల్లో ఒక భాగంగా ఉన్న ఫ్రిజ్ కనిపెట్టి దానికి పేటెంట్ పొందింది. రాత్రి మిగిలిపోయిన కూరలు,దినుసులు,ప్రతి వస్తువు కొన్ని గంటలకే పాడైపోతు ఉంటె ఆ సమస్య పరిష్కారం కోసం ఫ్రిజ్ కి రూపకల్పన చేసిందామె అంతకు ముందు వీధులు ఊడ్చే చీపురు కూడా పార్పార్ట్ రూపొందించారట. తను తయారు చేసిన వస్తువుల ప్రచారం కోసం ఆమె సొంతంగా అడ్వార్ టైజ్ […]
దివ్యాంగులకు ఆసరా
సుధీక్షన్ ఫౌండేషన్ ద్వారా రహదారి భద్రతపైన అవగాహన కల్పిస్తారు విజయవాడకు చెందిన చిగురు పాటి విమల ఆమె ఇరవై ఏళ్ళ కొడుకు సుదీక్షన్ 2006 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన కొడుకు పరిస్థితి ఏ పిల్లవాడికి రాకూడదని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకొన్నారు విమల. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన పేదలకు కుత్రిమ అవయవాలు అమర్చే ఏర్పాటు చేస్తారు. రెండు తెలుగు రాష్టాలకు […]
కొన్నాళ్ళు మానేయచ్చు
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈ సమయం మేకప్ కు కాస్త విరామం ఇమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. నెయిల్ పాలిష్,లిప్ స్టిక్ లు కొన్నాళ్ళు మేనేయి మంటున్నారు. గోళ్ళను శుభ్రం చేసుకొని చక్కగా కట్ చేసుకొని మాయిశ్చ రైజెర్ రాసుకోవాలి. లిప్ స్టిక్ వేసుకోకుండా వైట్ పెట్రోలియం జెల్లి,ఆలివ్ నూనె బాదం నూనె పాల మీగడ పెదవులకు రాసుకోమంటున్నారు. పాలల్లో కాస్త తెనె కలిపి పెదవులకు రాస్తే పొడి బారకుండా ఉంటాయి. మేకప్ బ్రష్ […]
“బాలగణపతి ప్రసాదం”
తమిళనాడు సమీపంలో శనీశ్వరాలయంకు అతి దగ్గరగా ఉన్న తిలతర్పణపురి దేవాలయాన్ని చూశారా మరి రండి ఆ దేవాలయం గొప్పతనం తెలుసుకుందాం.శ్రీరామచంద్రమూర్తి తన తండ్రి దశరథునికి ఈ ప్రదేశంలో పిండ ప్రదానాలు చేశాడు అందుకే తిలతర్పణపురి అని పేరు వచ్చింది.తిల అంటే నువ్వులు.శ్రీరాముడు ఇక్కడ కొలనులో స్నానం ఆచరించి నాలుగు పిండాలు పెట్టాడు అవి క్రమేపి శివలింగాలుగా దర్శనం ఇస్తున్నాయి.విశేషం ఏమిటంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు మనకు తొండము లేకుండా బాలగణపతి గా దర్శనం ఇస్తాడు. నిత్య ప్రసాదం: కొబ్బరి,కుడుములు -తోలేటి […]
గ్రామం చుట్టూ ఫెన్సింగ్
మాగ్రామంలో కరోనా బాధితులు ఉండకూడదని నిర్ణయించుకున్నాం .అందుకే బయట గ్రామం నుంచి ఎవరినీ అనుమతించ కుండా కాపలా కాస్తున్నాం అంటున్నారు జమ్మూ కాశ్మీర్ లోని చత్తా పిండ్ గ్రామ వాసులు .ఆరున్నర వేల ఇళ్ళు వేలమంది జనం ఉన్నా ఈ గ్రామం లోకి కరోనా వస్తే సమస్య అవుతుందని గ్రామ వాసులు పక్కాగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఊరిచుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు .ఇవంతా గ్రామ మాజీ సర్పంచ్ సామాజిక కార్యకర్త గూర్మత్ కౌర్ నేతృత్వం లో […]
సహజమైన హెయిర్ ఫ్యాక్స్
ఉద్యోగినులకు మాములు రోజుల్లో శిరోజాల విషయంలో శ్రద్ధ తీసుకొనే సమయం దొరకదు .ఈ లాక్ డౌన్ సమయం లో జుట్టు పై కాస్త శ్రద్ధ పెట్టే తరుణం .కొబ్బరి నూనెలో ఆముదం కలిపి తలకు పట్టించాలి .రాత్రంతా అలా ఉంచి మరుసటి రోజు తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది .అలాగే అర టీ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ , ఇంకో స్పూన్ కొబ్బరి నూనె తో కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత […]
శుభ్రంగా ఉతికితే చాలు
ఈ సమయంలో ఫేస్ మాస్కలు ధరించడం తప్పనిసరి అయితే శుభ్ర పరిచే విధానంలో శ్రద్ధ తీసుకోవాలి . వస్త్రం తో తయారైన మాస్క్ వాడుతూ ఉంటే ప్రతి రోజు దాన్ని వేడినీళ్ళలో వేసి శుభ్రంగా ఉతికి ఎండలో ఆరవేయాలి .ఒక వేళ ఎన్ -95 మాస్క్ వాడుతూ ఉంటే దాన్ని ఉతకరాదు .ఉతికితే నీటివల్ల దాని లోపలి వడపోత లేయర్ల లోని ఎలక్ట్రో స్టాటిక్ ఛార్జ్ తొలిగిపోతుంది .ఫలితంగా మాస్క్ ప్రభావం తగ్గిపోతుంది మాస్కలు మైక్రో వేవ్ […]
ఇది అరుదైన గౌరవం
కోవిడ్-19 ను అరికట్టేందుకు మందు కనిపెట్టేందుకు,టీకా అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్రభుత్వం,విద్యావేత్తలు శాస్త్రవేత్తలు,నాసా,వైద్య నిపుణులతో కలిసి,’B కోవిడ్-19 హైపర్ ఫార్మెన్స్ కంప్యూటర్ కన్సార్టియం ఏర్పడింది. ఈ ప్రతిస్టాత్మిక ప్రాజెక్ట్ లో ఎన్‌ఐటీ ప్రొఫెసర్ సౌమ్య లిప్సరత్‌కి చోటు దక్కింది . ఇప్పటి నుంచి సౌమ్య పరిశోధన ప్రారంభం అవుతోంది. వైరస్ పైన ఆమెకు చక్కని అవగాహన ఉంది కోవిడ్ లక్షణాలు భౌగోళిక పరమైన ప్రభావాల వివరాలతో ఒక నివేదిక తయారు చేయమన్నది సౌమ్య. సౌమ్య ఒడిశా కు […]
ఇదే మంచి తరుణం
ఈ కరోనా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి, చక్కని హాబీలు ఎంచుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ కోడింగ్ ,పెయింటింగ్,ఫోటోగ్రఫీ,వీడియో మేకింగ్,పేపర్ డ్రాఫ్ట్,స్కెచింగ్,ఒరిగామి ఇవన్నీ నేర్చుకోగలిన చక్కని హాబీలు అంటున్నారు. స్కూలు సమయాల్లో ఏది నేర్చుకోవాలన్న సరైన సమయం,ఫోకస్ పెట్టలేని వాళ్ళు ఇప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎన్నో వీడియోల్లో స్కెచింగ్ ,డ్రాయింగ్,మ్యూజిక్ గురించిన సమాచారం ఎంతో ఉంది. అలాగే ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే డిక్షనరీ దెగ్గర పెట్టుకొని రోజుకో పేజీ అర్ధాలు చూసుకొంటూ చక్కగా నేర్చుకోవచ్చు. లేదా ఇతర […]
