May 2019
దేవికారాణి
దేవికారాణి జర్నలిస్ట్, రచయిత్రి జీ-మీడియా నెట్ వర్క్ ఢిల్లీలో పని చేస్తుంది. చక్కని కథా రచయిత్రిగా, ఫీచర్ రైటర్ గా ప్రసిద్ధులు. జర్నలిజంతో పాటు తెలుగులో పీజీ చేశారు. we can change ,we shall over come వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు . సమాచార భారతి ఉత్తమ యువ పాత్రికేయ పురస్కార గ్రహీత.
దాసరి శివ కుమారి
దాసరి శివ కుమారి విశ్రాంత ఉపాధ్యయురాలు. హిందీ నుంచి తెలుగులోకి ఎన్నో అనువాదాలు, కథలు అనువాదించిన రచయిత్రి. ఆటవిడుపు కథల సంపుటి,అమ్మకు వందనం నవల ,ఆదివారం సందడి బాలసాహిత్య కథ సంపుటి వెలువరించారు.ధర్మం శరణం గచ్చామి హిందీఅనువాద నవల ప్రసిద్ద హిందీ అనువాద కథలు ప్రచురణయ్యాయి. ఎన్నో ప్రముఖ వార్తా ,మాస ప్రత్రికల్లో ఈమె కథలు ప్రచురితం అయ్యాయి. అమ్మకు వందనం నవలకు కందుకూరి నవల పురస్కారం లభించింది.వెబ్ మ్యాగజిన్ లో అనువాద కథలు రాస్తారు.
అంజని యలమంచిలి
అంజలి యలమంచిలి ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్, ప్రోడ్యుసర్.. చిన్నారుల పై జరిగే అధ్యయనాలకు సంబంధించి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వాటిని నిర్మించే దిశగ పని చేస్తున్నారు. షూటర్ ఆఫ్ సైలెన్స్ ,లవ్ లెట్ లీవ్,కరగనీయకు కల మొదలైనవి పేరు తెచ్చిన షార్ట్ ఫిలిమ్స్ . నంది పురస్కారాల జ్యురీ మెంబర్ కూడా. ఆమె సృజనకు ఎన్నో అవార్డులు వరించాయి. ఆమె తీసిన లఘుచిత్రాలు యూట్యూబ్ లో చూడవచ్చు.
సహజ క్లెన్సర్లు
బయట అడుగుపెడితే ఎండవేడికి ముఖం వడలిపోతుంది. ఆ నలుపు వదిలించుకోవాలంటే రసాయనాలు లేని క్లెన్సర్లు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.కప్పు వెనిగర్ కొన్ని నీళ్ళలో కలిపి సీసాలో పోసి ఫ్రిజ్ లో నిల్వా చేస్తే చాలు ఎండలో నుంచి రాగానే ఆ చల్లటి నీళ్లలో ముఖం కడిగినా నలుపు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది. నిమ్మరసం,తేనె కలిపి ముఖానికి రాసి ఒక పదినిమిషాలు ఆగి క్లీన్ చేస్తే చర్మానికి తేమ అంది కాంతివంతంగా తయారవుతుంది.పెరుగు కలబంద గుజ్జు కూడా చక్కని […]
బాంధవ్యాలు ఎక్కడ
తల్లీ ,తండ్రీ పిల్లలతోనే కుటుంబాలు ఇరుకైపోయి బంధువులు పిలుపుల్లో కూడా కనుమరుగై పోతున్నారు. ఎవ్వళ్ళ ఇళ్ళకు వెళ్ళకపోవటంతో సొంత పెదనాన్నలు, బాబాయ్ లు, మేనత్తలు కూడా ఏమని పిలవాలో తెలియని స్థితిలో ఉంటున్నారు. ఆత్మీయతలు, అనుబంధాలు కొరవడుతున్నాయి. వరసలు పెట్టి పిలవటం తల్లిదండ్రులే అలవాటు చేయాలి.బిజీ అనుకోంటూ దూరంగా ఉండిపోతే మరీ వంటరి వాళ్ళైపోతారు. బంధవ్యాలు తెలియజేప్పాలి. కనీసం ఫోన్లలో అయినా పరిచయాలు మరిచి పోకుండా పలకరింపులు కోనసాగించాలి. పిల్లలకు పిలుపులు పెద్దవాళ్ళే నేర్పాలి.
కురులే పువ్వులు
తలలో పువ్వులు అలంకరించుకోవటం తెలపిన అలవాటు.కానీ జుట్టుకు పువ్వుల్లా ముడుచుకోవటం ఇవ్వాల్టి ఫ్యాషన్. ఈ హెయిర్ స్టైల్ ను ఫ్లోరల్ బన్ హెయిర్ స్టైల్ గా అంటున్నారు. జెల్ రాసి దువ్విన జుట్టుకు పువ్వుల్లా తీర్చి దిద్దటం ఈ హెయిర్ స్టైల్ రహస్యం. అచ్చం గులాబీలు, మందారాల్లో ఇంకెన్నో పూల ఆకృతితో జుట్టుకు తీర్చిదిద్దుతున్నారు.ఈ హెయిర్ స్టైల్ నే అమర్చుకొనే విధానం పైన బోలెడన్ని వీడియోలు కూడా ఉన్నాయి.
భయపెట్టకండి
పిల్లల చేత ఏ పని చేయించటం అయినా కష్టమే. కనీసం భోజనం కూడా పేచీలు లేకుండా చేయరు. వాళ్ళని లొంగదీసేందుకు ఏదో బూచి భయన్ని వాడుతుంటారు పెద్దవాళ్ళు. కానీ ఇలాంటి భయాలు పెద్దవుతున్నా కొద్దీ వారి మానసిక స్థితిపై ప్రభావం చూపెడుతుందంటారు ఎక్స్ ఫర్ట్స్.వాళ్ళలో క్రమ శిక్షణ మాట అటుంచి ఎదిగే కొద్దీ వాళ్ళలో భయం పెరిగి ఆత్మవిశ్వాసం సన్నగిల్లి పోతుంది. ఏ పని సొంతంగా చెయలేని పరికి ధోరిణి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. సృజనాత్మాక […]
కోహినూర్
అద్భుతమైన ఆ వజ్రం అందాన్ని చూసి కోహినూరు అంటే వెలుగులకొండ అని పిలిచారట. ఆ పేరే ఆ వజ్రం పేరైంది. ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దొరికిందని మొదట్లో మొఘల్ చక్రవర్తి బాబర్ దగ్గరికి చేరిందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఎందరో రాజులు కిరీటంలో సింహాసనాల్లో రాజ ప్రసాద్లోనూ ధగధగలాడిన ఈ వజ్రం చేతులు మారుతూ బ్రిటిష్ పాలకుల సిగ పై చేరింది. బ్రిటన్ ను పరిపాలించిన విక్టోరియా మహరాణి ఈ వజ్రాన్ని ధరించింది.వజ్రం శుక్ర గ్రహానికి […]
ఇది వేసవి గిప్ట్
మామిడి పండ్లతో నగరం పచ్చగా మెరిసిపోతుంది.మామిడి పండు బేబీ బ్రేయిన్ డెవలప్ మెంట్ ను మెరుగపరుస్తుంది. ఇందులో ఉండే కాపర్ ఒక ముఖ్యమైన న్యూట్రిషియన్ , బ్లడ్ ఫార్శేషన్ కు సహాయపడుతుంది. ప్రెగ్నేన్సీ సమయంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఈ తియ్యని పండు తింటే మినరల్స్ పెరుగుతాయి. వీటీలో ఉండే ఫోల్లెట్స్, బ్రెయిన్,స్పైనల్ కార్డ్ లోపాలు నివారిస్తుంది. ఉత్తర భారత దేశంలో పుల్లటి మామిడి ముక్కలను పొడిగా చేసి అమ్ముతారు. దీన్ని ఆమ్ బార్ గా […]
తిరుగులేని ట్రైబల్ ప్రింట్స్
ఈ సీజన్ లో కట్టుకొనేందుకు నూలు చీరెల్ని మించినవి ఏవీ లేవు . చిన్న చిన్న వేడుకలకు ఇవే బెస్ట్ .ఆకట్టుకొనే రంగలు,వైవిద్యమైన ట్రైబల్ ప్రింట్లతో నూలు చీరెలు అందల్లో ఖరీదైన పట్టు,జరీ,సిల్క్ చీరెల్ని మించిపోయాయి. గాఢమైన రంగుల్లో సాదా చీరెలకు ట్రైబల్ మోటిఫ్ ల ఎంబ్రాయిడరీ చీరెలు ఎంతో అందంగా ఉంటాయి. సీకో చీరెలపై బ్లాక్ ప్రింట్స్ ట్రైబల్ మోటిఫ్ లు అందమే అందం. కొత్తకొట ,మంగళగిరి,గద్వాల్ ,చీరాల చీరెలు వంటివి కూడా అ ట్రైబర్ […]
వాటర్ స్ప్రే ఫెస్టివల్
జపాన్ లో కయబుకీ నోశాటో అనే అందమైన ఊరు. గడ్డితో కప్పే అందమైన ఇళ్ళు. ఇక్కడి ప్రత్యేకత. ఆ ఇళ్ళు కాస్తా ఒక అగ్ని ప్రమాదంలో కొన్ని దెబ్బతిన్నాయి. ఆ తరువాత జపాన్ ప్రభుత్వం ఊరంతా నీటి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసింది. మే ,డిసెంబర్ నెలలో ఈ స్ప్రింక్లర్లు అన్ని సరిగ్గా పని చేస్తున్నాయ లేదా చూస్తారట. ఎండ వేడి పెరిగితే ఈ స్ప్రింక్లర్లు నీటిని చిమ్ముతాయి. ఊరంత నీరు చిమ్ముతూ ఉంటే చూసేందుకు అందంగా ఉండటంతో […]
అమ్మాయిలతో కష్టమే
మగవాళ్ళు ఎవరైనా అబద్దాలు ఆడితే ఒక్క నిముషంలో ఆడవాళ్ళు ఆ విషయాన్ని కని పెట్టేయగలరట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. ఎందరో విభిన్న సంస్కృతుల్లో ఉండే స్త్రీ పురుషులతో ఈ పరిశోధన చేశారట. అబ్బాయిల అబద్దాలు వాళ్ళ కళ్ళే సులువుగా చెప్పెస్తాయట. కళ్ళల్లోకి చూస్తే చాలు అమ్మాయిలు ఈవిషయం ,చెప్పేస్తారట. తమషా ఏమిటంటే అమ్మాయిలు అబద్దాలు ఆడితే అమ్మాయిలే కాదు ఆమెతోటి అమ్మాయిలు కూడా దాన్ని పసిగట్ట లేరట. వాళ్ళు చక్కని కళ్ళున్న […]
ఆ అడవే ఆమె ఇల్లు
విశ్రాంత జీవితం గడుపుతున్న మహారాష్ట్రలోని పుణెకు చెందిన రిటైర్డ్ బోటనీ మహిళా ప్రొఫెసర్ హేమాసనే (79) భుధవార్ పేట్‌లోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె 79 ఏళ్లుగా కరెంటుకు దూరంగా నివసిస్తున్నారు. ఆమె ఇల్లు ఒక తొటకంటే పెద్దది. ఒక అడవిలాంటిదీ. పచ్చని చెట్లు,పక్షులు తోడుగా కూలి పోవడానికి సిద్దంగా ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటారు. కరెంట్ లో లైట్లు వేస్తే ఫ్యాన్లు తిరిగితే పక్షులకు అసౌకర్యంగా ఉంటుందని ఈ నిర్ణయం . అక్కడ […]
పాకెట్ శారీస్
చక్కని చీరె కట్టుకొని చేతిలో బరువేదీ ఉంచుకొకుండా హాయిగా బయటికి వెళ్ళటం బాగానే ఉంటుంది. కానీ సెల్ ఫోన్, కార్డులు, తాళాలు, కొంచెం డబ్బు ఇవన్నీ అవసరం కదా. అందుకే ఇలాంటీ అత్యావసరమైన వస్తువులు ఉంచుకొనేందుకు వీలుగా పాకెట్ శారీస్ వచ్చేశాయి. చీరె అంచున పాలిన్ వస్త్రంతో చీరెకు ఓ జేబుకుట్టేస్తున్నారు. లేదా డిజైన్ తో కలిసిపోయే రంగుతో పక్షి, నెమలి ,పువ్వులాంటివి సృష్టించి సన్నని జిప్ తో అక్కడ జేబు ఉందనే విషయం కూడా కనిపించకుండా […]
The Moment of Lift: How Empowering Women Changes the World
బిల్ గేట్స్ సతీమణి మిలిందా గేట్స్ రాసిన పుస్తకం ఇది. స్త్రీలు సాధికారత దిశగా అడుగులు వేయాలంటే మూడు ప్రదేశాల్లో మార్పులు రావాలి అంటుంది విలిందా . ఇకటి కుటుంబం, సమాజం, పని ప్రదేశం. మహిళ వృత్తిగతంగా ఉన్నత స్థాయికి చెరుకొంటే ఆమె తనలాంటి ఎంతో మందికి చేయూత నివ్వగలదు అంటుంది మిలిందా. మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో దేశాలకు వెళ్లినప్పుడు తాను కులసుకొన్న ఎందరో స్ఫూర్తిదాతలైన మహిళలు ,తమ కుటుంబాన్ని ,సమాజాన్ని ఎంతలా మార్చుకున్నారో […]
భండారు అచ్చమాంబ
భండారు అచ్చమాంబ 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. ఇది కోస్తాంధ్రలో స్త్రీల మొదటి సంస్థ. 34మంది స్త్రీల జీవిత చరిత్రతో అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని రచించింది.. శతక పద్యాలు రాశారు. స్త్రీ అభ్యుదయం కోసం కృషి చేశారు. ఈమె రాసిన కథలో 11 కథలు దొరికాయి. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో కొమర్రాజు వెంకటప్పయ్య,గంగమ్మ […]
విత్తనంలో శక్తి
కొన్ని రకాల గింజల్ని పని గట్టుకొని తినండి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గుమ్మడి గింజల్లో పనాగమిక్ ఆసిడ్ అనే పోషకం ఉంటుంది. ఆక్సిజన్ లేదా పెరాక్సైడ్ పెరగటం వల్ల కలిగే దుష్ర్పభావాన్ని పనాగమిక్ ఆసిడ్ నిరోధిస్తుంది. ఒత్తిడిని నివారించటానికి గుమ్మడిగింజలు ఎంతో దోహద పడతాయి. అలసట పోగోడతాయి. ఎదో ఒకటి తినాలి అనే ఆలోచన తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచటంతో పాటు ఆర్థరైటిస్ ముప్పు తగ్గిస్తుంది. ఈ గింజల్ని పొడి […]
ఆలీవ్ నూనెతోనే అందం
గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు వాడితే కురుల సహజ అందం పాడైపోతుంది అనుకొంటారు ఇటలీ మహిళలు.వాళ్ళకు ఆలివ్ నూనెను మించిన దివ్య ఔషధం లేదు. ఇక్కడి మహిళలు వారానికి ఒక సారి ఏం చేస్తారంటే ఒక పెద్ద చెంబు ఆలీవ్ నూనె తలంతా పట్టిస్తారు. దీని వల్ల వెంట్రుకలకు చక్కని పోషణ లభిస్తుందని అనుకొంటారు. అలాగే వెంట వెంటనే తల స్నానం చేసేందుకు ఆసక్తి చూపించరు. మన పల్లెటూరు ఆడవాళ్ళలాగా జుట్టుకు నూనె పట్టించి ఒక్క వెంట్రుక […]
నిద్ర నిచ్చే ఆహారం
వేగవంతమైన జీవన శైలితో ,కంప్యూటర్ కంటే వేగంగా పని చేయవలసి వస్తూ మెదడు చాలా అలసిపోతుంది. ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు ఒత్తిడిని తగ్గించి మెదడును చురుకుగా ఉంచేందుకు కొన్ని పదార్థాలు తినమంటున్నారు ఆహారనిపుణులు. అశ్వగంధ పొడిని గొరువెచ్చని పాలలో కలిపి పడుకోనే ముందర తాగితే హాయిగా నిద్రపట్టీ ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ శాతం తగ్గిపోతుంది. అలాగే నాడీ కణాల పని తీరు పెంచేందుకు మెదడు చురుకు దనం కోసం వాల్ నట్స్ని మించినవి లేవు. రోజు […]
ఈ శక్తి అనంతం
ధ్యానం గురించి ఆలోచించండి .క్రమం తప్పని ధ్యానంతో మహిళల్లో మోనొపాజ్ సమయంలో చోటు చేసుకొనే డిప్రెషన్ ,ఆందోళన ,మూడ్ స్వింగ్ వంటివి తగ్గుతాయి అని పరిశోధకులు చెపుతున్నారు. స్వీయ నియంత్రణ శక్తి పెరగటంతో చెడు అలవాట్లను తేలిగ్గా వదిలించుకోవచ్చు. ముఖ్యంగా బరువు నియంత్రించుకోగలుగుతారు. ఏదో ఒకటి తింటూ ఉండాలన్న ఆసక్తి తగ్గించుకొని ఆచితూచి తినటం అలవాటు అవుతోంది గనుక అధిక బరువు అదుపులో ఉంటుంది. ధ్యానంతో ఒత్తిడితో డిప్రెషన్ వంటి శారిరక మానసిక సమస్యలకు కారణమయ్యే సైటోకైన్ […]
