April 2019
వెండి దారాల సోయగం
లెనిన్ చీరెలు చాలా తేలికగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈసారిలెణిన్ తో కంచిపట్టున్న అంచున్న చీరెలుమార్కెట్లోకి వచ్చాయి.పెళ్ళి చీరెలు ఇవి వధువు నిండుగా కనిపించాలంటే నిండు రంగులు బంగారు జరీ మోటిఫ్ లో ఉన్న చీరెలు అందం.లెనిన్ కంచికోటి పట్టు చీరెలు భారీ కొంగులతో జరీ దారాలతో నేసిన మోటీఫ్ లు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి.చీరె మొత్తం జరీ గీతలు చక్కని అంచులతో చీరెలు ఎంతో అందంగా వేడుకను ప్రతిబింబించేలా ఉన్నాయి.
చర్మం జాగ్రత్త
ఈ వేసవి ఎండలకు ఈత మంచి వ్యాయామం అనిపిస్తుంది. కానీ నీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.ఈత కొలనుల్లో ఇన్ ఫెక్షన్లు రాకుండా క్లోరిన్ కలుపుతారు.దీనివల్ల చర్మం జుట్టుకు కూడా హాని జరుగుతుంది.కొన్ని చోట్ల వేడి నీటి స్విమ్మింగ్ ఫూల్స్ ఉంటాయి, నీటిని వేడి చేసేందుకు ఆటోమేటిక్ మిషన్లు వాడతారు. క్లోరిన్ కలిపిన వేడి నీటితో చర్మంలోని సహజ తేమ,నూనెలు పోతాయి.దాంతో చర్మం బరకగా అవుతుంది.జుట్టు పొడిబారి చిట్లిపోతుంది. ఈతకొట్టే ముందర స్నానం చేసి […]
ఇవి రాచరికపు స్టైల్
గుజరాత్ లోని కచ్ పచ్చికమ్ జ్యూవెలరీకి ప్రసిద్ది. ఇవి ఎంతో సున్నితమైన నగలు. ఈ నగలకు చేసే మెటల్ గా వెండిని వాడతారు. అంచేత ఈవి ప్లాటినమ్ నగల్లా కనిపిస్తాయి.అన్ కట్ గ్లాస్, సెమీ ప్రెషియన్ స్టోన్స్ పొదిగిన ఈ నగలు చెత్తో చాలా శ్రద్దగా చెక్కినట్లు తయారు చేస్తారు.తెలుపు,ఏరుపు,ఆకుపచ్చ ఇలా ముదురు రంగుల జాతి రాళ్ళను వాడి ఈ నగలు చేస్తారు.ముత్యాల అల్లిక చాలా ప్రత్యేకం.జరీ గళ్ళ పట్టు చీరెలకు ఈ నగలు చాలా చక్కగా […]
బియ్యం గింజంత టూత్ పేస్ట్ చాలు
పాలపళ్ళు కనిపించాక పిల్లలకు బ్రెషింగ్ చేయోచ్చు అంటారు డాక్టర్లు. పేస్ట్ బ్రెష్ పైన వేసి నోట్లో పెట్టగానే పిల్లలు చప్పరించేస్తుంటారు.సాధరణంగా ఫ్లోరైడ్ కలిగిన పేస్ట్ ఇళ్ళలో వాడుతుంటారు. ఈ ఫ్లోరైడ్ వాడకం వల్ల దంతాల ఆరోగ్యం బావుంటుందంటారు.కానీ పిల్లలు ఈ పేస్ట్ తినేయడం మటుకు వాళ్ళకు ఆరోగ్యకరం కాదు.బ్రెష్ చేసేటప్పుడు బియ్యపు గింజపరిమాణంలో వేస్తే చాలు. మూడేళ్ళు వచ్చాక దాన్ని కాస్త పెంచుతూ పోవచ్చు.ఆరేళ్ళు వచ్చాక బ్రెష్ నిండా పేస్ట్ వేసిన ఏంకాదు.సంవత్సరం నిండాక దంతవైద్యుడిని సంప్రదించి […]
సరిపోదు అనిపించేది
కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు దానికి ఎన్నో రకాలు, కానీ నేను నటిగా ఫెయిల్ అవ్వలేదు అంటుంది అనుపమ పరమేశ్వరన్.సెలబ్రిటిలకు సంతృప్తి తక్కువని ఎవరైన అంటే మందు నాకు అర్ధం కాలేదు. ఎంతో కష్టపడే తమకు మాత్రం సంతృప్తి ఎందుకు ఉండదు అనుకునేదాన్ని, కానీ కొన్నాళ్ళకు కెమెరా ముందు నటించాక నాకు ఆ మాటలకు అర్ధం తెలిసింది.డైరక్టర్ ఒకే అన్న నాకు సరిపోదని ఇంకా బాగా చేయాలని ఆరటపడేదాన్ని నటనలో మరింత పరిణితి సంపాదించి ఆత్మ సంతృప్తి […]
సలాడ్స్ తింటే ఆరోగ్యం
ఈ వేసవిలో సులువుగా జీర్ణం అయ్యే పదర్థాలు తింటేనే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. ఉల్లికాడలు తినటం ఈ సీజన్ కు మంచిదే . సలాడ్స్ లో వీటిని కలుపుకోంటే రుచిగా తినవచ్చు. ఫ్లూతో పోరాడగల అద్భుత ఔషధం. ఈ ఉల్లి కాడలు కెరోటనాయిజ్ల్ అధికంగా ఉంటాయి. కీరా ,కేలట్లతో కలిపి తీసుకోంటే తగినంత విటమిన్ ఎ లభిస్తుంది. తాజాగా ఉన్నా ఉల్లి కాడలు ,వాటిలోని ఫేవర్ రుచివల్ల సలాడ్ కు మంచి రుచి ఇస్తాయి. ముల్లంగి […]
పూర్ డైట్ కారణం
ఏ ఇద్దరు కబుర్లు చెప్పుకొంటున్నా జుట్టు రాలిపోతుంది అన్నా కంప్లైట్ వినిపిస్తుంది. దువ్వెనలో వెంట్రులు వచ్చాయి అంటే కనబడని ఆందోళన మొదలవుతుంది.జుట్టు ఊడి పోవటానికి ముఖ్యమైన కారణం పూర్ డైట్ అంటారు ఎక్స్ పర్ట్స్. ఆహారంలో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్ లు లోపించటం వల్ల జుట్టు ఊడిపోతుంది. విలువైన వెంట్రుకలు రాలిపోకుండా ఆపాలి అంటే ఆహారంలో తగినన్ని పోషకాలు భాగం చేసుకోవాలి. విటమిన్ ‘ఇ’ జుట్టు ఊడిపోకుండా అరికడుతుంది. అలాగే బరువు తగ్గించుకొనే క్రమంలో ఆహారంలో విధించుకోనే […]
పండ్ల రసాలతో లవణాలు
ఈ వేసవికి రోజులో పలుమార్లు స్నానం చేయడం మంచిదే. సబ్బులు ఇఅతర రసాయనాలు మాత్రం వాడకుండా ఉండలి. బిగుతు దుస్తులు వేసుకోకూడదు. వదులుగా తెల్లని రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది.ఇవి చెమటని పీల్చేస్తాయి. ఆహారం మితంగా తీసుకోవాలి.పుచ్చకాయలు,మామిడి కాయలు వంటి వేసవి ఫలలు తినాలి.పండ్ల రసాలు తాగితే లవణాలు శరీరానికి అందుతాయి. మామిడి రసం ,కొత్తిమీర,కదివేపాకు వేపిన మజ్జిక తాగాలి. నాలువున్న పదార్థాలు తినక పోవటమే మంచిది. మంచి నీళ్ళు వెంట తాసుకుపోవాలి. చర్మానికి తగిన […]
విలువ తెలుసుకోనివ్వండి
పిల్లలకు డబ్బు విలువ తెలియజెప్పడం మంచిది అంటారు ఎక్స్ పర్ట్స్. దీనికి ఫలానా వయసన్న నియమం లేదు. స్కూలుకి వెళ్లే వయసు నుంచి టీనేజ్ వారి వరకు డబ్బు గురించిన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. డబ్బు ఎలా వస్తున్నా దాన్ని ఎలా ఖర్చు చేయాలన్న మనీ మేనేజ్ మెంట్ పిల్లలకు వారి వయసుకు తగ్గట్లు వివరించాలి.వారి వయసు దృష్టిలో ఉంచుకుని వారికి పాకెట్ మనీ ఇవ్వడం మొదలుపెట్టాలి. దాన్ని ఖర్చు చేయడం విషయంలో వారు ఎలా జాగ్రత్తగా […]
బంగారం విలువ తగ్గదు
భారతీయ సంస్కృతిలో బంగారానికి ఎంతో విలువ ఉంది. అందుకే భారతీయుల జీవితంలో కీలక ఘట్టాలన్నింటిలో బంగారానికి సంబంధం ఉంది. పసి బిడ్డకు చెవులు కుట్టించి బంగారు పోగులు పెడతారు. నామకరణం నాడు బంగారు ఉంగరతో పేరు రాస్తారు. అన్నప్రాసన రోజు బంగారు వస్తువుతోనే తొలి తీప రుచి చూపిస్తారు.పాకే సమయంలో పిల్లల ముందు బంగారు వస్తువు పెట్టి వాళ్ళ భవిష్యత్ ఊహిస్తారు.బంగారు లోహ లక్షణాలను అర్దం చేసుకుని దాన్ని నగలుగా మర్చుకున్న దేశం అది.బంగారపు విలువ అధికమవుతుంది.2017 […]
పొడిగా ఉంచితే మంచిది
ఒక్కసారి వాషింగ్ మెషిన్ వాసన వస్తూ ఉంటుంది.కనుక లోపల బూజు ,నాచు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.ఇదంతా బట్టలకు అంటుకోకుండా దానిలోకి గాలి వెళ్ళే అవకాశం ఇవ్వాలి. తడి దుస్తులు ఉతకడం పూర్తైన వెంటనే బయటకు తీసేసి గ్లాస్ డోర్,గ్యాస్కెట్ లు శుభ్రంగా తుడవాలి. లోపలి భాగంలో పొడి అయ్యేలా తలుపు తెరిచి ఉంచాలి. అలాగే డోర్ దగ్గర గ్యాస్కెట్ లో మురికి లేకుండా శుభ్రం చేసుకోవాలి.వెనిగర్,వంటసోడా వంటివి వాడి టబ్ వాష్ చేయాలి. వేడి నీరు […]
కనువిందు చేసే జలపాతం
ప్రకృతిలో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. భారతదేశంలోని అందమైన జలపాతాల్లో భగ్సు ఒకటి.కొండలు,రాళ్ళు,పచ్చని ప్రకృతి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా లోయలో భగ్సు చిన్న ప్రదేశం . అందమైన టూరిస్ట్ స్పాట్ కూడా. భాన్స్ నాగ్ గ్రామానికి చెందిన రెండు కిలోమీటర్లు దూరంలో ప్రాచీన కాలపు శివాలయం దగ్గరలోనే కనువిందు చేసే జలపాతం ఉంటాయి.విదేశీ యువత ఇక్కడకు వచ్చి నెలల తరబడి ఉంటారు. ధౌలా ధర్ శ్రేణుల నుంచి జాలువారే ఈ జలపాతం పరమపవిత్రమని ప్రజలు భావిస్తారు.ఇక్కడ […]
నాకు నేనే సరిపోతా
నిన్ను నువ్వు ప్రేమించుకో ముందు అప్పుడు ఈ ప్రపంచాన్ని ప్రేమించడం నీకు చాతనవుతుంది. అన్న హితోక్తిని మనస్పూర్తిగా తీసుకోమంటుంది లారామిస్త్రీ. ఇటలీకి చెందిన ఈ ఫిట్ నెస్ ట్రైనర్ మనస్పూర్తిగా ఒక అబ్బాయిని ప్రేమించింది.చాలా తొందరలోనే బ్రేకప్ చెప్పేసుకున్నారు.నాకంటే నన్నెవరు ఇంకా ప్రేమించగలుగుతారు.నాకు నేనే తగినదాన్ని అని నిర్ణయించుకుని తనకు తానే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్రహ్మండమైన వేడుకను జరిపేసుకుంది.ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది ఎంజాయ్ చేస్తుందో. ఇవ్వాల్టి అబ్బాయిలంతా కాస్త జాగ్రత్తగా శ్రద్దగా […]
స్టీరియో టైప్ నచ్చదు
యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్లీ కార్నెట్టో శామ్ సంగ్ మోభైల్,చవర్లెట్ అడ్వర్టైజ్ మెంట్స్ నిమిషానికో చోట అనిపిస్తుంది. విక్కి డోనర్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తెలుగు ,కన్నడ ,పంజాబీ ,మలయాళం ,తమిళ సినిమాల్లో నటించింది. హిమాచల్ లో పుట్టి చంఢీఘడ్ లో పెరిగిన అమ్మాయిని నేను. ప్రతిభను నమ్ముకొనే ముంభై వచ్చాను. నిరతంరం ఒక కొత్త దనాన్ని ఎంచుకోంటూ నన్ను నేను సానబెట్టుకొంటూ స్టీరియో టైప్ ను బ్రేక్ చేస్తూ వస్తున్నాను. ఎన్నొ […]
నేను ,నా కెరీర్ పూర్తిగా భిన్నం
నిజానికి నేను మార్పును పెద్దగా ఇష్టపడను. ఒకే ఆహారం తింటాను, అదే ఫ్రెండ్స్ తో కలుస్తాను. తమాషా ఏమిటంటే నాకెరీర్ ఈ తత్వానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అన్ని రకాల పాత్రలతో ప్రయోగాలు చేయాలి. ప్రతి నిమిషం కొత్తదనం సృష్టించగలగాలి అంటోంది సాయిపల్లవి. అది అలా ఉంచితే నా సినిమాల పట్ల నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి సినిమా ఒక అభ్యాస ప్రక్రియలాగా సాగింది. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేయాలన్న భయం పోయింది. నాకు సినిమాలో ప్రాముఖ్యత […]
లైంగిక వేధింపుల ప్యానల్
టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని కొన్నాళ్ళ క్రితం శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ప్యానల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. జీవో నం 984 ప్రకారం సినీ నటి సుప్రియా,యాంకర్ ఝాన్సీ,దర్శకురాలు నందినిరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీలో టాలివుడ్ ప్రతినిధులుగా నియమించిందినల్సర్ యీనివర్సిటీ ప్రో.వసంతి ,గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్ రమాదేవి సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో ఈ కమిటీ ఏర్పటైంది.
నేల పైన కూర్చోవాలి
కరీనాకపూర్ నెలకో పది గంటల పాటు వర్కవుట్స్ చేస్తానంటుంది. వారానికి మూడు గంటలు చొప్పున మొత్తంలో పదిగంటలు వ్యయామంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు అంటుంది ఆమె.ఎక్స్ పర్ట్ కూడా ఇదే చెబుతారు. వారానికి మూడు రోజులు వ్యాయామం చేస్తూ రాత్రి భోజనంలో అన్నం తింటారు కూడా బరువు అదుపులో ఉంచుకోవచ్చు. మలి వయసులో ఎముకలు గుల్లబారకుండా ఎముకల సాంద్రత పెరగాలన్న మహిళలు వ్యాయామం చేయాలి. అయితే కొవ్వు మాత్రం కరిగించే వ్యాయామం మాత్రమే […]
ఫ్యాషన్ సౌకర్యం కూడా
ఎండకు రక్షణగా రకరకాల క్యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అమ్మాయిలు పోనీటెయిల్ కు ఇబ్బంది లేకుండా టాప్ వాట్ హాట్స్ చాలా అందంగా ఉన్నాయి.బోట్ హ్యాట్,ఎడ్జ్ క్రష్ ,ఫ్లామీ వంటి టోపి మోడళ్ళు ఈ వేసవి స్పెషల్స్ గా వచ్చాయి.దుస్తులకు మ్యాచ్ అయ్యే కాటన్,డెనిమ్ వస్త్ర శ్రేణిలో తయారైన ఎన్నో రకాల టోపీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు టోపీ అంటే ఎండకు రక్షణ ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్. ఈ వేసవి ప్రయాణాల్లో వాడుకునేందుకు వీలుగా విశాలంగా ఉండే అంచువల్ల […]
నూటోక్క సంవత్సరాల యోగా టీచర్
మన శ్వాస మన ఆరోగ్యం గురించి చెబుతుంది.దాన్ని వినాలి అంటుంది 101 సంవత్సరాల యోగా టీచర్ పోర్బన్ లింబ్. ఇప్పటికి ఎంతో ఉత్సహంగా యోగా,డాన్స్ చేసే ఈ వృద్ద యోగా టీచర్ న్యూయార్క్ సిటీలో తన స్టూడెంట్స్ కి యోగా పాఠాలు నేర్పుతుంది.ఆమె తన ఏడేళ్ళ వయసులో ఇండియాలో యోగా నేర్చుకుంది. అప్పట్లో యోగా పురుషుల కోసం అనే వాళ్ళు కాని పోర్బన్ దీన్ని అబ్బాయిలాగే నేర్చుకుని సాధన చేస్తా అంటుంది. ఈ మధ్య కాలంలో ప్రధాని […]
మహిళా పోలీస్ ల కోసం ప్రత్యేకం
స్మార్ట్ మైత్రిన్ పేరుతో ముంబై కమిషనరేట్ పరిధిలో 93 స్టేషన్లు, సంబందిత ప్రాంతాల్లో 140 శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ముంబై మహిళా పోలీసుల కోసం అక్కడి పోలీసులు మైత్రిన్ స్వచ్చంద సంస్థ కలిసి ఇప్పటికే వంద శానిటరీ ప్యాడ్ వెండింగ్ యంత్రాలు అందించారు. మొత్తం పోలీస్ యంత్రాంగంలో దాదాపు 20శాతం మంది మహిళా పోలీసులున్నారు. వారు పని చేసే చోట ఇలాంటి మౌళిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చేయాలి. వాళ్ళకు ఇబ్బంది లేకుండా […]
