కిలిమంజారో అధిరోహించిన మొదటి వీగన్ వార్తల్లో నిలిచారు బాపట్లకు చెందిన కూరగాయల శారద. పర్వతారోహణలో శాకాహారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నే అత్యంత ఎత్తయిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతం కిలిమంజారో ని ఎంచుకొన్నానన్నారు శారద. పాలు పెరుగు ముట్టుకోకుండా కొబ్బరి బాదం నుంచి తీసిన పెరుగు పాలే ఉపయోగిస్తూ కేవలం ప్రకృతి సంబంధమైన ఉత్పత్తులనే ఐదేళ్లుగా తీసుకుంటోంది శారద. అమెరికాలో రేడియో మాధ్యమాల్లో పని చేసే శారద, జీవహింస లేకుండా జీవిద్దాం అనే ప్రచారం కోసం ఈ పర్వతాన్ని ఎక్కి రికార్డ్ సృష్టించింది.














