Thursday, 27 Aug, 2026

మహిళలకు ఉచిత శిక్షణ

బెంగళూరులోని బన్నేరుఘట్ట ప్రాంతంలో పుట్టి పెరిగిన ఝాన్సీ బి.వి. ఈరోజు బెంగళూరులో ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఎంతో మంది స్త్రీలకు ప్రేరణ ఇస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆటో డ్రైవర్ గా బెంగళూరు వీధిలో ధైర్యంగా ఆటో నడుపుతూ ఆదాయం సంపాదించుకుంటున్న ఝాన్సీ ఇతర మహిళలకు సాయం చేయాలని  సంకల్పించింది.ఎంతోమంది బెంగళూరు నగరానికి చెందిన  మహిళలకు రూపాయి కూడా తీసుకోకుండా ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చింది. నాలుగు గోడలకే పరిమితమైన గృహిణులు, తక్కువ జీతాలతో ఇబ్బందులు పడే వాళ్ళు తన కాళ్ళ మీద తాము నిలబడాలనే  కోరిక తో నేను ఆడవాళ్లకు శిక్షణ ఇచ్చాను. నా ఆశయం ఫలించింది ఎంతోమంది నా దగ్గర శిక్షణ తీసుకున్న ఆడవాళ్లు బెంగళూరు రోడ్ల పైన ఆటోలు నడుపుతున్నారు అంటోంది ఝాన్సీ.పేద మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇస్తూ వారు ఆర్థికంగా నిలబడేందుకు ప్రోత్సహిస్తోంది ఝాన్సీ బివి.

Leave a Reply