WoW
ఖరీదైన హోటల్
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్ అలస్కాలోని డాన్ షెల్టన్ యాంపీ థియేటర్ శిఖరం పైన ఉన్న షెల్టన్ పాలెట్ ఒక జంట మూడు రోజులు బస చేయాలంటే 26 లక్షల ఖర్చు చేయాలి.ఇక్కడికి చేరుకోవాలంటే వాయు మార్గమే దారి హోటల్ యాజమాన్యం కొన్ని ప్రైవేట్ హెలికాప్టర్స్ ఏర్పాటు చేసింది. రుచికరమైన ఆహారం అతిథుల ఆనందం కోసం పర్వతారోహణ, చేపల వేట వంటి వినోద కార్యక్రమాలు ఉన్నాయి సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో నిర్మించిన […]
ఆవూరి మట్టే మసాలా
వంటల్లో రుచి కోసం మనం మసాలాలు వాడినట్లు ఇరాన్ లోని హార్ముజ్ దీవి ప్రజలు తమ వంటలకు కమ్మని రుచి రావటం కోసం ఆ దీవి లో దొరికే మట్టిని వాడతారు. హార్ముజ్ లో రంగు రంగుల రెయిన్ బో పర్వతాల నుంచి కిందకు జారే మట్టి లో ఇనుము తో పాటు 70 రకాల ఖనిజాలు ఉంటాయట. ఇది రుచిగానూ మంచి వాసనతో ఉండటంతో ఈ మట్టిని పోపుల డబ్బాలో పోసుకుని వంటల్లో వాడుకుంటారు. ఇక్కడికి […]
ది బిగ్ బుక్ ఆఫ్ ట్రీట్స్
పూజా దింగ్రా రాసిన ‘ది బిగ్ బుక్ ఆఫ్ ట్రీట్స్’ పుస్తకం ప్రపంచ గౌరమండ్ కుక్ బుక్ అవార్డ్ ల కార్యక్రమంలో రెండో విజేతగా నిలిచింది.మ్యాక్రాన్ క్రీన్ అని పిలుస్తారు. ఇండియా లో తొలి మ్యాక్రాన్ స్టోర్సే ప్రారంభించి ఫ్రెంచ్ రుచులను మనదేశంలో అందిస్తూ 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్ షిప్ గా ఎదిగి ఎన్నో లక్షల మందికి ప్రేరణగా నిలిచింది.ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటుచేసుకుంది పూజా ముంబాయి లో పుట్టి పెరిగిన అమ్మాయి స్విజర్లాండ్ లో […]
సోలార్ లజ్జా !
సోలార్ లజ్జా మెషిన్ ను కనిపెట్టిన ముంబై కి చెందిన మధురిత గుప్తా ఆమె తమ్ముడు రూపన్ లకు ఎన్నో అవార్డులు వచ్చాయి. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్ సోలార్ లజ్జా మెషిన్ కాల్చి బూడిద చేస్తుంది. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తి తో పనిచేస్తుంది.దీని ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీని ద్వారా వెలువడే బూడిద ను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. 2019లో ప్రారంభించిన ఈ మిషిన్ […]
అత్యంత ధనవంతురాలీ కుక్క
ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన కుక్క గుంథర్ Vl .ఈ కుక్క కు వాళ్ల తాతగారైన గుంథర్ III కి జర్మన్ దేశస్థురాలైన కౌంటిస్ కార్లోట్టా లైచెస్ స్టెయిన్ అన్నావిడ తాను చనిపోయే ముందు 431 కోట్ల విలువ చేసే తన ఆస్తిని ఆ కుక్క కు రాసి ఇచ్చింది. అట్లా తాత ఆస్తి వచ్చి ఇప్పుడు దాని ధర పెరిగి 3715 కోట్లు విలువ చేసే ఈ గుంథర్ ప్రపంచంలోనే డబ్బున్న కుక్క గా నిలిచింది.
విక్టోరియా అమెజోనిక
అమెజాన్ లో పెరిగే తామరాకుల పైన హాయిగా మనిషి విలువ నిలబడచ్చు వాటర్ లిల్లీ ల కుటుంబానికి చెందిన ఈ విక్టోరియా అమెజోనిక ఇక మూడు మీటర్ల వ్యాసం కలిగి 26 అడుగుల పొడవు వరకు పెరిగే కొమ్మతో ఉంటుంది. ఈ అద్భుతమైన తామరాకులు పువ్వులను క్వీన్ విక్టోరియా పేరిట పిలుస్తారు. ఈ తామర పువ్వులు కూడా మొదటి రాత్రి నాడు తెల్లగా రెండో రాత్రికి గులాబీ రంగులోకి మారిపోతాయి వికసించి.
బెస్ట్ టూరిజం విలేజ్
ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కించుకొంది భూదాన్ పోచంపల్లి హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి వస్త్ర నేత కు ముందు గాజుల,పూసల తయారీకి ప్రసిద్ధి. ఇరవై నంబర్ నూలుతో తేలియా రుమాళ్లు, ఇక్కత్ బ్రాండ్ పట్టు చీరెలు నేస్తూ 1970 నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది పోచంపల్లి. తాజాగా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చే బెస్ట్ టూరిజం విలేజ్ గా గౌరవం దక్కించుకున్నది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్ రాజధాని […]
అత్యంత స్వచ్ఛం
ప్రపంచం లోని స్వచ్ఛమైన నదుల్లో మేఘాలయా లోని ఉంగోట్ నది మొదటిది(UMNGOT) అట్టడుగున ఉండే ఇసుక కూడా స్పష్టంగా కనిపించే ఈ నది ఒక అద్భుతం మేఘాలయా స్టేట్ లో షిల్లాంగ్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నదిలో ఉన్న బోట్ లను పై నుంచి చూస్తే పడవ గాలిలో తేలినట్లే కనిపిస్తుంది. జలశక్తి మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటోలో చుట్టూ ఆకాశం పచ్చని కొండలు మధ్యలో ఓ […]
పిల్లలకు ఆశ్రయం
ఆశ్వాస భవన్ ఏర్పాటు చేశారు సిస్టర్ ఫాబియోలా ఫాబ్రి ఇటలీ లోని ఫ్లోరెన్స్ లో పుట్టిన సిస్టర్ ఫాబ్రి సేవా కార్యక్రమాలు చేయడం కోసం కేరళ వచ్చింది కొచ్చి చుట్టుపక్కల ఉన్న మురికివాడల్లో అనాధ పిల్లల కోసం 2005 లో స్థాపించిన ఆశ్వాస భవన్ లో ఇప్పుడు 70 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రాన్ని మూడు విభాగాలుగా పిలుస్తారు హోమ్ లో శిశువులు, గర్ల్స్, హోమ్ లో ఆరు నుంచి 18 సంవత్సరాల బాలికలు, […]
ఇలాంటి ప్రయాణాలు అవసరం
కొచ్చి నుంచి కాశ్మీర్ వరకు 17 వేల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశారు డాక్టర్ మిత్రా సతీష్. కొచ్చి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ మిత్ర 10 ఏళ్ళ కొడుకు నారాయణ్ తో పాటు చేసిన ఈ ప్రయాణంలో 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు కవర్ చేశారు జమ్మూ, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, జైపూర్, ఉజ్జయిన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా మీదుగా కేరళ చేరుకున్నారు. ఈ ప్రపంచంలో భౌగోళిక చారిత్రక […]
జేమ్స్ బాండ్ నవలలో స్త్రీవాదం
ఇప్పటివరకు గూఢచారి జేమ్స్ బాండ్ నవలలను ఆరుగురు రచయితలు రాశారు. వారి సరసన చేరారు రచయిత్రి కిమ్ షెర్వుడ్ ఆమె రాసిన టెస్ట్ మెంట్ నవల బాత్ నోవెల్ అవార్డు అందుకుంది. ఆ నవల ద్వారా కిమ్ షెర్వుడ్ బాండ్ నవలలు రాసే అవకాశం దక్కించుకున్నారు పాత జేమ్స్ బాండ్ 007 అయితే రాయబోయే నవలలో 00 ఏజెంట్స్ ఉంటారు ఇప్పటివరకు బాండ్ నవలల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం తక్కువ. ఈ నేపథ్యంలో ఈ యువ మహిళా […]
కోకోకోలా లేక్
కోకోకోలా అందరూ ఇష్టంగా తాగే పానీయం కానీ బ్రెజిల్ లోని రియో గ్రాండ్ డెల్ నార్టే ప్రాంతానికి వెళ్లిన వాళ్లు మాత్రం కోకో కోలా సరస్సులో హాయిగా ఈత కొడతారు ఈ సరస్సులో నీళ్లు అచ్చం కోకో కోల కానీ యపు రంగులో ఉంటాయి ఈ సరస్సు పేరు ‘లాగావో దె అరారాక్వారా’ కానీ దాన్ని అందరూ కోకోకోలా లేక అని పిలుస్తారు. ఈ సరస్సులోని నీటిలో అయోడిన్, ఐరన్ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో ఈ నీటికి […]
ఈ సింహం పెద్ద సెలబ్రిటీ
ఎవరేనా కుక్కనో పిల్లినో పెంచుకుంటారు. ఈ రష్యన్ దంపతులు ఒక సింహం పిల్లను జూ నుంచి కొనుక్కొని తెచ్చి పెంచుకుంటున్నారు. 2015 రష్యా లోని సంరస్క్ అనే ఊర్లో జూలీ అనే మౌంటెన్ లయన్ కు మూడు పిల్లలు పుట్టాయి.ఓ పిల్లని పెంజా అనే ఊర్లో ఒక జూ వాళ్ళు కొనుక్కున్నారు మెస్సీ అనే పేరు పెట్టారు దానికి జబ్బు చేస్తే అధికారులు దానిని చంపేద్దామానుకున్నారు. ఇది తెలిసిన అలెగ్జాండర్ మేరియా అనే ఇద్దరు సైకియాట్రిస్ట్ లు […]
‘అన్ని పర్వతాలూ ఎక్కుతా’
ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన పర్వతం కిలిమంజారో ఎక్కి భారత జాతీయ జండా ఎగుర వేసింది మౌంటేనియర్ పులకిత హస్వి. 13 ఏళ్ల పులకిత కీబోర్డ్,గిటార్ వాయిస్తుంది.స్కేటింగ్ లో నేషినల్స్ కు వెళ్ళింది. భవిష్యత్ లో ఎవరెస్ట్ అకోన్‌కాగువా,డెనాలి,ఎల్ బ్రస్,విన్ సాన్ మాసిఫ్, లు కూడా ఎక్కాలని లక్ష్యం అంటుంది పులికిత.
వాల్ పెయింటింగ్ లో శిక్షణ
గ్రామీణ తమిళనాడు లో స్త్రీల ఉపాధి కోసం ఒక కొత్త ద్వారం తెరుచుకొంది. ఇప్పటి వరకు మగవాళ్లకే పరిమితంగా ఉన్న వాల్ పెయింటింగ్ లో జపాన్ పెయింట్ సంస్థ నిప్పన్ అక్కడ 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వారంతా విజయవంతంగా పని చేస్తున్నారు. తాజాగా నిప్పన్ సంస్థ చెన్నయ్ లో రెండు వేల మంది మహిళా పెయింటర్ లకు శిక్షణ ఇవ్వాలనుకొంది. చెన్నయ్ రోటరీ క్లబ్ లో చేసుకున్న ఒడంబడిక ప్రకారం,పెయింటింగ్ పట్ల ఆసక్తి […]
వాక్సిన్ తో కోటి బహుమతి
ద మిలియన్ డాలర్ వాక్స్ కాంపెయిన్ లో వాక్సిన్ వేయించు కుంటే మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించారు ఆస్ట్రేలియా ప్రభుత్వం వాక్సిన్ వేయించుకున్న జోన్నేజూ లాటరీ తగిలింది. మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 7. కోట్ల బహుమతి వచ్చింది. ఈ డబ్బుతో,మా నాన్న వ్యాపారానికి,చైనా లో ఇరుక్కుపోయిన మా కుటుంబాన్ని సిడ్నీ తీసుకురావటానికి,నా భవిష్యత్ కి ఖర్చు చేస్తానని చెప్తోంది జోన్నేజూ. లాటరీ వచ్చిందని చెప్పేందుకు ఫోన్ చేస్తే కొత్త నంబర్ అనుకోని ఫోనే తీయలేదట […]
సేవ కు పురస్కారం
కలకాలం నిలిచేవి మనం చేసే పనులే నిజాయతీకి ఎప్పుడూ ఒక పురస్కారం ఉంటుంది. ఒక చిన్న పనితో నలుగురు ముఖ్యమంత్రుల నుంచి ప్రశంశలు పురస్కారాలు అందుకొన్నారు. ప్రజల అభిమానం పొందాను అంతకన్నా ఇంకేం కావాలి అంటుంది పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యవతి. చెన్నై లోని టి పి చత్రం ఇన్స్పెక్టర్ గా ఉన్న సత్యవతి ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో చెట్లు కొమ్మలు పడి నీళ్లలో అచేతనంగా పడి ఉన్న ఒక యువకుడిని భుజాలపైన మూసుకుంటూ […]
మాకు సమయం లేదు
మీపై కోపం వస్తోంది. కానీ దానికి నా దగ్గర సమయం లేదు కనీసం మేమైనా మా భవిష్యత్తు నిర్మించుకోవాలి ప్రపంచ నేతలరా దయచేసి మా తో కలిసి రండి అంటూ గ్లాస్గో లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సులో మాట్లాడండి. 15 ఏళ్ల వినిశా ఉమాశంకర్ తమిళనాడుకు చెందిన వినిశా వాతావరణ కార్యకర్త పన్నెండేళ్ల వయసులో సౌరశక్తితో పనిచేసే ఇస్త్రీ బండిని తయారు చేసింది. బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్ ఏర్పాటు చేసిన ఎర్త్‌షాట్ ప్రైజ్ కు ఎంపికైంది. […]
పరి సిన్హా
జాతీయ అంతర్జాతీయ బేస్ టోర్నమెంట్ లో సత్తా చాటుతున్న పరి సిన్హా అతి పిన్న వయస్కురాలైన చదరంగా ప్రవీణురాలిగా రికార్డులకెక్కింది. 2010 జూలై 29న జన్మించిన పరి 2013లో బీహార్ అసోసియేషన్ నిర్వహించిన అండర్ 7 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది అప్పటికీ ఆమె ఇంకా స్కూల్ లో కూడా చేరలేదు వయస్సు 3 ఏళ్లు మాత్రమే. తర్వాత బీహార్ రాష్ట్ర బేస్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. పరి బాబాయి లీల్ ప్రకాష్ […]
అది వారి ఇష్టం
చీర కట్టుకొని స్కూళ్లకు రావాలని స్కూళ్ళకు యాజమాన్యాలు విడుస్తున్న ఆంక్షలు పెట్టటాన్ని తాను ఖండిస్తున్నానని, చీరలే కట్టుకొని రావాలనే హక్కు స్కూళ్ళ యాజమాన్యాలకు లేదనీ ఏ వస్త్రాలు ధరించాలన్నది టీచర్ల వ్యక్తిగత అభిప్రాయమని అంటున్నారు కేరళ రాష్ట్ర విశ్వ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు. కేరళ లో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది రాష్ట్ర విద్యాశాఖ వస్త్రధారణపై సర్క్యులర్ జారీ చేసింది టీచర్లు తమకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించి స్కూలుకు వెళ్లిమని స్పష్టం […]
