Thursday, 30 Jul, 2026

పల్లెల్లో వైద్యం

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సరిహద్దు నుంచి తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పరిధిలోని కుగ్రామాల్లో ట్రిపుల్ ఎల్ పనిచేస్తుంది. ఇది నా ఎన్జీవో లివ్ లవ్ లాఫ్ సంస్థ అంటే ట్రిపుల్ ఎల్ మానసిక సమస్యలు ఉన్న వారికి సేవ చేసే సంస్థ ఇంతకుముందే వికలాంగులకి సేవలు అందిస్తున్న వసంత ఫౌండేషన్ అన్న ఎన్జీవో మా నోడల్ సంస్థ అంటోంది దీపికా పడుకోణె. ఇక్కడ మానసిక సమస్యలు ఉన్నవారికి చికిత్స, మందులు ఇస్తారు. కోలుకున్న వారికి ఉపాధి కోసం […]

కాగితపు బొమ్మలు

రంగులు కుంచెలతోనే కాదు పేపర్లతో కూడా కళాకృతులు చేయవచ్చని నిరూపించాడు బ్రిటన్ కు చెందిన 47 ఏళ్ల బెక్ స్టోన్ ఫాక్స్ ఈ ఆర్టిస్ట్ క్విల్లింగ్ టెక్నిక్ తో రూపొందించిన కాగితపు బొమ్మలు. వాస్తవికత ఉట్టిపడుతూ కళా ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి. కుక్క, గొరిల్లా, పిల్లి,పక్షి వంటి రకరకాల జీవులను కాగితాలను మలిచి బొమ్మలు గా తయారు చేస్తారు ఫాక్స్.

రాణి అవంతి బాయి

రామ్‌ఘర్ రాణి అనంతి బాయ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన యుద్ధం ప్రకటించింది మధ్యప్రదేశ్ లోని రామ్‌ఘర్ పాలకుడు విక్రమాదిత్య సింగ్ అనారోగ్యం తో చనిపోతే అతని రాణి అవంతి బాయి ని, పిల్లలను లెక్కచేయకుండా బ్రిటిష్ కమాండర్ వాషింగ్టన్ ప్రజల పై అంతులేని పన్నులు వేశారు. ప్రజల కష్టాలు చూడలేక అవంతి బాయి తిరగబడి బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి ఓటమి తప్పదని అర్థం అయ్యాక 1858 మార్చి 20వ తేదీన కత్తితో పొడుచుకొని ఆత్మార్పణ […]

స్త్రీ సేవా లక్ష్యం

స్త్రీల ప్రసూతి కష్టాలు తీర్చేందుకు గైనకాలజీ లో పరిశోధనలు చేశారు బండారు అచ్చమాంబ. ఆమె మేనత్త పేరు కూడా బండారు అచ్చమాంబే. లండన్ వెళ్లి మూడు డిగ్రీలు పూర్తి చేశారు. వామపక్ష భావాలు అలవర్చుకున్నారు ప్రసూతి శిశు పోషణ అనే వైద్య గ్రంథాన్ని రాసి స్త్రీల లో చైతన్యం తీసుకువచ్చారు. ఇదంతా రెండో ప్రపంచం యుద్ధానికి ముందు మాట మాంటి స్టోరీ విద్యా విధానంలో చదువు చెప్పడం మొదలుపెట్టారు. శాసనోల్లంఘనం చేసి జైలుకు వెళ్లారు.1957లో కాంగ్రెస్ తరఫున […]

టీ పాట్ మ్యూజియం  

భావన నిర్మాణాల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఇంజనీర్లు చైనా లోని మీటాన్ కౌంటీ లో ఉన్న టీ పాట్ మ్యూజియం ఇంజినీరింగ్ అద్భుతం. ఈ భవనానికి ప్రపంచంలోనే అతిపెద్ద టీ పాట్ షేప్ బిల్డింగ్ గా గుర్తింపు ఉంది. భవనం ఎత్తు 73 మీటర్లు. చైనీస్ గ్రీన్ టీ కి మీటాన్ కౌంటీ పుట్టిల్లు అంటారు. అందుకే ఇక్కడ టీ పాట్ మ్యూజియం కట్టారు. జగ్గు ముందున్న కప్పు కూడా ఇంకో చక్కని భవనం.

మానవ శిఖరాలు 

కృష్ణాష్టమికి ఉట్టి కొట్టే వేడుక లాంటిదే స్పెయిన్ లో క్యాస్టిల్ పేరుతో జరుపుకొంటారు. కటాలోనియా నగరం లో జరిగే ఈ ఉత్సవానికి 15 వేల మందికి అంచెలంచెలుగా వలయాలుగా ఏర్పడుతూ పైకి ఎగబాకుతారు. ఈ క్యాస్టిల్ నిర్మించే వంద గ్రూప్ లు ఈ నగరంలోనే ఉన్నాయి. వివిధ జట్లు కలిసి 40 అడుగులు ఎత్తు వరకు మానవ శిఖరాలు నిర్మిస్తారు. పోటీల్లో అతి ఎత్తయిన మానవ శిఖరానికి బహుమతులు ఇస్తారు.

ఫెయిరీ టేల్ క్యాజిల్

అద్భుతమైన కోట వంటి హోటల్ ఒకటి చైనాలో ఉంది కధల్లో వర్ణించే అందమైన రాజమహల్ లాగా ఉండే ఈ హోటల్ పేరు ఫెయిరీ టేల్ క్యాజిల్ 2011 లో కొండల మధ్య వంతెనలను కలుపుతూ కట్టిన ఈ కోట వంటి హోటల్ లో బస చేసేందుకు బారులు తీరుతారు అచ్చం రాజు రాణీల్లాగా జీవించే లాగా ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉంటాయి.

‘యూజ్ మి’

ఢిల్లీ లో అప్ సైక్లింగ్ ప్రాజెక్ట్ ‘యూజ్ మి’ విజయవంతంగా నడిపిస్తున్న మీనాక్షి శర్మ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ఆమె స్టూడియో లో పేద మహిళలు పనికిరాని వ్యర్థాలతో క్లాత్ బ్యాగ్ లో గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తారు డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థాలను సేకరించి బ్యాగులు చేసి పర్యావరణహితమైన పద్ధతిలో ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేస్తారు నెలకు రెండు వందల కేజీల ఫ్యాబ్రిక్ వేస్ట్ తో అందమైన పూల తీగలు కుషన్ కవర్లు […]

ఆహారం చాలా ముఖ్యం

జుట్టు రాలే సమస్యకు తలపైన రాసుకునే నూనెల కన్నా తీసుకునే ఆహారం చాలా ముఖ్యం ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, చేప,గుడ్లు, పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్, సెలీనియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉండే మటన్, రొయ్యలే కాదు కందులు, పెసలు, మినుములు, బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు ఎక్కువగా తినాలి. విటమిన్ డి కోసం వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలి బాగా నిద్రపోవాలి.

సరికొత్త చరిత్ర

మేరీ ల్యాండ్ కు తొలి భారతీయ అమెరికన్ డెలిగేట్ గా తన ప్రత్యేకత చాటుకుంది అరుణ మిల్లర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గెలిచిన అరుణ మిల్లర్ హైదరాబాద్ లో పుట్టింది. మిస్సౌరీ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్పోర్టేషన్ ప్లానర్ గా ట్రాఫిక్ ఇంజనీర్ గా పనిచేశారు బ్రాండ్ గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది.

నేను గెలిచాను

నాకు నిక్టోఫోబియా అంటే చీకటి అంటే భయం దాన్ని పోగొట్టుకునేందుకు పెద్ద యుద్ధం చేసినంత పని చేశాను అలాగే వైఫల్యం అన్న భయం. ఎంతో కష్టపడే దాన్ని కానీ నెమ్మదిగా ఈ భయం నుంచి బయటపడ్డ. ఇప్పుడు ఫలితం గురించి కంగారు పడ్డాను అంటుంది ఆలియా భట్. ప్రతి వాళ్ళకి ఏదో ఒక భయం ఉంటుంది. అది ఎక్కువ ఫోబియా గా మారుతుంది వ్యక్తిగతంగా, వృత్తి గతంగా కూడా ఇది పెద్ద ఇబ్బంది ఇది మానసిక సమస్యే. […]

ఉన్నతమైన బాధ్యత

ఒడిశా డీజీపీ ర్యాంక్ ను అందుకున్న తొలి మహిళా ఐపీఎస్‌ ‘బూదరాజు రాధిక’ ఇప్పుడు దేశ సరిహద్దుల్ని కాపాడే ‘సశస్త్ర సీమాదళ్‌’లో ఏడీజీ హోదాపొందారు.మొదట్లో ఆమె హైదరాబాద్‌ సీబీఐలో ఎస్‌పీగా, డీఐజీగానూ చేశారు.ఆపై ఒడిశా స్టేట్‌ విజిలెన్స్‌, ఆర్మ్‌డ్‌ పోలీస్‌, నార్కొటిక్‌ సెంట్రల్‌లో పనిచేశారు.నేపాల్‌, భూటాన్‌ సరిహద్దుల్లో 90,000 మంది భద్రతా దళాలను పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నారు.

స్టైలిష్ లుక్

చీర కట్టు సరదా అయినా అమ్మాయి ల కోసం వచ్చిన ఫ్యాషన్ ప్యాంట్ శారీ స్టైలిష్ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. వేడుకల్లో హైలెట్ గా నిలుస్తుంది డ్రెస్ ఒకే రంగులో ఉండే ప్లయిన్ శారీ ప్యాంట్ లు ఈవినింగ్ గెట్ టుగెదర్ పార్టీలకు మంచి ఎంపిక ప్యాంట్ టాప్ ప్లెయిన్ కలర్ లో కాంట్రాస్ట్ గా ఫ్లోరల్ దుపట్టా ఉంటే స్టైలిష్ లుక్ వస్తుంది. పెద్ద అలంకరణలో అవసరం లేని డ్రెస్ ఇది నడుముకు ఎంబ్రాయిడరీ […]

అసలైన కళాఖండాలు

జపాన్ కు చెందిన సైజీ కవాసాకీ అనే ఆర్టిస్ట్ చెక్కతో తినే పదార్థాలు డిజైన్ చేశారు రియలిస్టిక్ ఫుడ్ ఆర్ట్ మేడ్ అవుట్ అఫ్ వుడ్ పేరుతో ఈ పదార్థాలు రూపం పోసాడు చెక్కతో చేసిన చాక్లెట్లు, బ్రెడ్ వంటకు సిద్ధం చేసిన కూరగాయలు పుట్టగొడుగులు ఎంత శ్రద్ధగా చూసిన  సహజమైన వాటి లాగా ఉంటాయి. చెక్కతో చేశారంటే నమ్మశక్యంగా ఉండవు.

బీరు తాగే దేవుడు

మంగళగిరి నరసింహస్వామి పానకం తాగే దేవుడిగా ప్రసిద్ధి అయితే బీరు,రమ్ము తాగే దేవుడున్నాడు ఆయనే ఉజ్జయిని కాలభైరవ్ నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి కాలభైరవ దేవాలయం ఈయనను దారు బాబా గా పిలుస్తారు. ఈయన పూజా ద్రవ్యాలతో పాటు మద్యం బాటిల్ కూడా ఉంటుంది.గర్భగుడి అర్చకుడు పూజ చేస్తూ పళ్లెంలో సీసా మద్యాన్ని ఒంపి కాలభైరవుడి నోటి దగ్గర పెడితే క్షణాల్లో పళ్లెం కాళీ అవుతుంది.ఈ మధ్యం దేవుడు ఎలా తాగుతారో అంతుచిక్కని అద్భుతం.

అన్నింట్లో ముందే

హిందుస్తానీ సంప్రదాయ సంగీతం కథక్ లో శిక్షణతో పాటు మాస్ మీడియా లో డిగ్రీ తీసుకున్నకే నటిగా వెండితెర పైన మెరిసింది మిథిలా పార్కర్. ఆమె నటించిన లిటిల్ థింగ్స్, గర్ల్ ఇన్ ది సిటీ, కార్వాన్,త్రిభంగ వంటి వెబ్ సిరీస్ సూపర్ హిట్ ఈ గుర్తింపుతోనే తెలుగులో ఓరి దేవుడా చిత్రాల్లో నటించింది మిథిలా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు చేసుకుంది మరాఠీ చిత్ర మురంబా కి ఫిలింఫేర్ అవార్డు తీసుకుంది. […]

ఐరాస గుర్తింపు  

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ కు ప్రత్యేక దూత గా ఎంపికైంది కెపి అశ్విని.ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు మొదట దళిత మహిళ కూడా కర్ణాటక కు చెందిన దళిత కుటుంబంలో పుట్టింది అశ్విని. ఢిల్లీ జె ఎస్ యు లో పిహెచ్ డి చేస్తూ దళిత విద్యార్థి విభాగంలో నాయకురాలుగా ఉంది అశ్విని.  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంలో ఛత్తిస్ గఢ్,ఒడిశా లోని ఆదివాసీ తెగల భూముల హక్కుల కోసం పోరాడింది ఆమె కృషి గుర్తించిన […]

26 ఏళ్ల నాయకురాలు

స్వీడన్ లో అతి చిన్న వయసు లోనే మంత్రి పదవి చేపట్టి రికార్డ్ సృష్టించింది రోమినా పూర్మోఖ్తారీని స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో పుట్టిన రోమినా పూర్మోఖ్తారీని ఉప్సల విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో డిగ్రీ చేసింది. 2016 లో 20 ఏళ్ల వయసులో రాజకీయాల్లో ప్రవేశించింది.లిబరల్ పీపుల్స్ పార్టీలో చేరింది. మూడేళ్లలోనే విభాగానికి అధ్యక్షురాలు అయింది. తాజాగా స్వీడన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది నూతన ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికయ్యారు ఆయన అధ్యక్షతన […]

అందమైన వేడుక

ఫిలిప్పీన్స్ లో జరిగే మస్కారా ఫెస్టివల్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.బాకోలోడ్ నగరంలో జరిగే ఈ పండుగలో విచిత్రమైన రంగులు మాస్క్ లు ధరించి వీధుల్లో ఊరేగుతూ ఉత్సాహంగా బృంద నాట్యాలు చేస్తారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇస్తారు. ఈ వీధి నాట్యం లో విజేతలకు ఘనమైన బహుమతులు ఇస్తారు 40 ఏళ్లగా ఫిలిప్పీన్స్ లో జరిగే ఈ వేడుకల్లో  పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

మ్యూరల్స్ నగరం

గొప్ప మ్యూరల్స్ ఆర్టిస్ట్ ల నగరం గ్లాస్గో ఇది స్కాట్లాండ్ లోని అతిపెద్ద చూడ చక్కని నగరం ఈ గ్లాస్గో లో ఏ భవనం కూడా ఖాళీగా కనిపించదు ప్రకృతి పర్యావరణానికి సమాజం, జీవనం జంతు ప్రేమ తదితర అంశాలతో భవనాల పైన పెద్ద పెద్ద మ్యూరల్స్ కనిపిస్తాయి గ్లాస్గో మ్యూరల్స్ ట్రయల్ పేరుతో నగరం లోని పూర్తి పెయింటింగ్స్ చూడాలి అనుకుంటే రెండు రోజులు పడుతుందట కేవలం సిటీ సెంటర్ మ్యూరల్ ట్రెయల్ లో ఉన్న […]