ముంజేతికి ఆభరణం
బ్యాగ్ లేందే ఆడవాళ్ళకి నడవదు. భుజానికి తగిలించుకొని ఈ బ్యాగ్ ను కాస్త రిలీఫ్ గా పట్టుకోకుండా తీసుకుపోయేలా హ్యాండిల్ క్లబ్ బాగ్స్ వచ్చాయి. ఇవి ముంజేతికి ఒక డిజైనర్ ఆధారంగా అమరి పోతుంది. బయటికి తీసుకుపోమే పర్స్ లో ఫోన్ ,కార్డులు, డబ్బులు ఉంటాయి. అది జాగ్రత్తగా ఎక్కుడ మరిచిపోకుండా ఉండేలా చేతికి తగిలించుకోవచ్చు . ఈ క్లబ్ లో జనపనార, నూలువి కూడా ఉన్నాయి. అలాగే లేదర్, బటర్ ఫ్లై డిజైనర్ హాండిల్ క్లబ్ […]
దంపుడు బియ్యం తినండి
కంచంలో అన్నం తెల్లగా వల్లెపూవులా ఉంటేనే మనకి తినబుద్ధి అవుతుంది. కానీ దంపుడు బియ్యం అన్నం పోషకాలకు నిలయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వరిపొట్టు కింద ఉండే తవుడు పోరలో విటమిన్ ,ఖనిజాలు చాలా ఉంటాయి. పాలిష్ పడితే ఇవన్నీ పోతాయి. సోడియం పాళ్ళు కూడా దంపుడు బియ్యంలో తక్కువే నియాసిన్ ,విటమిన్ బి3 ఎక్కువ. వీటిలోని మెగ్నిషియం ఎముకలని ఆరోగ్యంగా ఉంచుతాయి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచె సెలీనియం కూడా దంపుడు బియ్యంలో ఎక్కువగానే ఉంటుంది. […]
పీచు చాలా ముఖ్యం
మన పేగుల్లో ఎన్నో జాతుల సూక్ష్మజీవులుంటాయి. మనిషి కడుపులో రెండు కిలోల బరువు తూగే సూక్ష్మజీవులు ఉంటాయి. మనం తీసుకొనే ఆహారంపైన ఈ సూక్ష్మజీవుల ప్రభావం చూపిస్తాయి. పీచు పదార్ధాలను పేగు గోడలు పీల్చుకోగలిన స్థాయికి తీసుకువస్తాయి భిన్న సూక్ష్మజీవుల జాతులు సరైన సంఖ్యలో పేగుల్లో వుంటే పేగు గోడలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి ఆరోగ్యం ఇచ్చే బాక్టీరియా పేగుల్లో ఉండే పీచు కాళ్ళు ఎముకలకు బలన్ని ఇస్తుంది.
ఎండల్లో హాయ్ హాయ్
వేసవి రాగానే సాధారణంగా కాటన్స్ వైపు తిరిగిపోతారు. అలాగే యాక్ససరీలు కూడా వేసవి ఫ్యాషన్ కు సరిపోయేవి మార్కెట్ లో కొస్తాయి. వెదురు, నారా, కలంకారి జీన్స్ తో చేసిన చెప్పులు వేసవికి నప్పుతాయి. జ్యూట్ ,కలంకారీ జీన్స్ హ్యాడ్ బ్యాగ్ లు , ఇతర వస్త్రాలతో చేసిన హ్యాండ్ బ్యాగ్ లు వేసవిలో కట్టుకొనే ,నూలు ,రేయాన్, పోచంపల్లి ఇతర మంగళగిరి కాటన్స్ కు సరిగ్గా సూటవుతాయి. ఈ కాలంలో నగలు కూడా టెర్రకాటన్, డై […]
అనర్ధాలే ఎక్కువ
ఒక్కసారి ఫ్యాషన్ లు కూడా ప్రాణం మీదికి తెచ్చిపెడతాయి చూసుకొండి అంటున్నారు డాక్టర్లు. శరీరాకృతి చక్కగా కనిపించేందుకు బిగుతుగా అతుక్కునేలా ఉండే డ్రెస్ వేసుకోటం వల్ల చర్మం రాపిడికి గురై ఎలర్జీలు వస్తాయి. బిగువైనా ఫ్యాంట్లు స్కర్ట్ లు ,లెగ్గింగ్స్ వంటివి క్లోజ్ ఫిట్టింగ్ స్కర్ట్ లు వేసుకోవడం వల్ల కండరాలు నొప్పులు ,డిస్క్ సమస్యలు రావచ్చు . అలాగే ఎత్తు చెప్పులు కూడా ఎక్కువసేపు మడమలపైన, వేళ్ల పైన భారం పడితే రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు […]
తల్లికి ముప్పే
ఆడవాళ్ళకి పిల్లలకీ ఏదో విడదీయరాని సంబంధం ఉన్నట్లే ఉంది. ఇప్పుడో కొత్త రిపోర్ట్ పిల్లలని కనకపోతేనే బావుండు అనిపిస్తుంది. పిల్లలున్న తల్లి ఆయుష్షు పిల్లలు లేని వాళ్ళతో పోలిస్తే 11 సంవత్సరాలు తక్కువగా ఉంటుందట. ఒక అధ్యాయనంలో మానవ క్రోమోజోమ్స్ లో ఉండే టెలో మర్స్ పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉన్నాయి. టెలోమర్స్ జనన కాలన్ని పెంచుతాయని ఇవి తక్కువగా ఉంటే జననకాలం తక్కువని అధ్యాయనం చెపుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత స్ట్రీలలో టెలోమర్స్ పోడవు తగ్గినట్లు వీరు […]
ఎన్నయినా తినవచ్చు
లోటస్ సీడ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఔషధగుణాలు ఎక్కువే. వీటితో చేసే పాప్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు ,కొవ్వు,సొడియం తక్కువ కనుక భోజనానికి మద్య తినవచ్చు. చక్కెర చాలా తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు తప్పని సరిగా తినగలిగే స్నాక్. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. చిన్నప్పటి నుంచి చిరుతిండి అలవాటైన వాళ్ళు ఒక పట్టానా ఏవీ తినకుండా నోరు కట్టేసుకోలేరు. లోటస్ సీడ్స్ లో […]
పండ్లలో బెస్ట్
ఆరు కమలా పండ్లలో ఎంత ‘సి’ విటమిన్ ఉంటుందో భాగా పండిన ఒక్క జామ కాయలో అంత ‘సి’ విటమిన్ ఉంటుంది. అంతే కాదు కాల్షియం , ఫాస్పరస్, కెరోటిన్, పోటాషియం , పీచు, కాల్షియం, ఐరన్ తో పాటు దాదాపు అన్నీ విటమిన్లు,లవణాలు సమృద్ధిగా ఉండే అద్భుతమైన పండు జామ. ఇందులో కొలెస్ట్రాల్ ,సోడియం అస్సలు ఉండవు. మిగతా అన్నీ పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ జామాలో ఎక్కువగా ఉంటాయి. పచ్చి కూరలు,జామతో కలిపి తిన్న […]
మంచి కండిషనర్
కేశ సంరక్షణలో గోరింటాకు మించింది ఇంకేదీ లేదు. పౌడర్ గా దొరికే హెన్నపొడి కంటే పచ్చి గోరింటాకు రుబ్బి తయారు చేసే హెన్నాలో విశిష్టమైన లక్షణాలున్నాయి. గోరింటాకు ,మెంతులు, నిమ్మరసం మెత్తగా రుబ్బి అందులో గుడ్డుసొన కూడా కలిపి తలకు పట్టించుకొని గంటసేపు ఉంచుకొని తల స్నానం చేస్తే జుట్టు మెత్తగా పట్టులాగా అయిపోతుంది. ఇది మంచి కండిషనర్. మంచి సువాసనతో మాడుకు రక్షణ ఇస్తుంది. తెల్ల జుట్టుకు ఈ గోరింటాకు నుంచి వచ్చే సహాజ ఉత్పత్తులను […]
శిశువుకు సమస్య
అతిగా మాంసం తినవద్దు , గర్భస్థ శిశువుకు చాలా నష్టం అంటున్నాయి పరిశోధనలు. గొర్రె మాంసం ,చికెన్ , చీజ్ నట్స్ పాలధార ఉత్పత్తులు . బీన్స్ లో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భవతిగా ఉన్న వాళ్ళు మాంసం అధికంగా తింటే శిశువు కు స్కిజోఫ్రినియా అంటే దీర్ఘకాలికమైన వైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. అంచేత గర్భవతిగా ఉంటే అధికంగా మాంసం తినవద్దని హెచ్చరిస్తున్నారు.
అందరూ సరేనంటేనే
యాభై దాటినా వయసులో ఉన్నప్పటి ఉత్సహం కావాలంటే బేసిక్ ఎరోబిక్ వ్యాయామాలు ఎంచుకోవాలి. వేగం తగ్గించి ఎక్కువ సేపు చేసే వ్యయామాలు ,చేతులు ,కాళ్ళు కదిలేలా ఉంటాయి. అయితే ముందుగా ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడి శరీరం బరువు , ఆరోగ్య సమస్యల వివరాలు అన్నీ డాక్టర్ దగ్గర సూచనలు తీసుకొని వారు ఇరువురూ కలిసి నిర్ణయించిన తేలికపాటి వ్యయామాలు చేయాలి. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకొని ఎముకల్లో కాల్షియం సాంద్రత గురించి తెలుసుకొని మరీ వ్యయామం […]
కండరాల నొప్పా
నిద్రలో ఒక్కసారి కాలి వేళ్ళు తిమ్మిర్లు ,కాలి కండరాలు పట్టేసి నొప్పి పెడతాయి. ఇందుకు కారణం పొటాషియం లోపం కావచ్చు . కండరాలను అలసట చెందనివ్వకూడదు. కాళ్ళ పాదాలు పడుకొనే ముందర మసాజ్ చేసుకోవాలి. పట్టేసిన కండరాలపైన వేడి నీళ్ళతో కాపడం పెట్టాలి. ముఖ్యంగా ఆహారంలో అరటి పండు, బంగాళాదుంపలు ,సిట్రస్ పండ్లు ,పాలకూర ,బీన్స్ సమృద్ధిగా తినాలి. వీటిలో పొటాషియం ఉంటుంది. ఆహారం ద్వారా పోషకాలు అందితేనే ఆరోగ్యం.
ఆకలిని ఓడిస్తా
క్యాటీ అనే అమ్మాయి 9 సంవత్సరాల వయసులో స్కూల్ గార్డెనింగ్ ప్రోగ్రామ్ కోసం మొక్కలు పెంచమని స్కూల్లో విత్తనాలు ఇస్తే జాగ్రత్తగా ఇంట్లో నాటి క్యాబేజీలను పండించింది. ఒక క్యాబేజీ అందులో 18కిలోల బరువు పెరిగింది. దాన్నీ ఆ పాప ఓ చర్చికి విరాళంగా ఇస్తే దాన్ని కోసి వండి 175 మందికి పంచారు. అప్పుడు అనుకొంది క్యాటి పేదల ఆకలి తీర్చేంందుకు క్యాబేజీ ఇతర కాయగూరలు పండించాలని, క్యాటీస్ క్రాప్స్ అన్న తన సొంత సంస్థ […]
చెమట వల్లే దాహం
శరీర ఉష్టోగ్రత ఏ కారణంగా అయినా పెరిగితే దాన్ని చల్లబరించేందుకు చెమట పోస్తుంది. వేసవిలో ఇది కామన్. చెమట పడితే శరీరంలోని ద్రవాలు తగ్గుతాయి.వాటిని నింపకపోతే డీ హైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది. ఉష్టోగ్రత పెరుగుతుంది. తీవ్రమైన తలనొప్పి, స్పృహ పోవచ్చు కూడా . ఇదే వడదెబ్బ . అలా శరీరం చెమట పట్టి పోతుంది. శరీరంలో సోడియం తగ్గకుండా స్పోర్ట్స్ డ్రింక్స్ తాగాలి. రోజు మాత్రం ఈ వేసవి వెళ్ళేదాకా సమతుల్య ఆహారం తీసుకొంటు చెమట ద్వారా […]
వాళ్ళని నియంత్రించండి
ఒక పరిశోధనలో పిల్లల్లో, టీనేజర్లలో ఫేస్ బుక్ డిష్రెషన్ పెరుగుతుంద అని తేలింది. గాడ్జెట్స్ అతిగా వాడటం అది ఒక రకమైన మాదక ద్రవ్యల్లా పని చేస్తాయి. ఒక వీడియో గేమ్ గెలవటం విపరీతంగా లైక్స్ రావటం వల్ల సంతోషానికి కారణమైన డోపమైన్ అనే హర్మోన్ స్థాయిలు పెరిగి అనందం అవధులు దాటుతుంది. ఈ టెక్నాలజీ వినియోగం ఈ కారణంగానే ఎక్కువ అవుతుంది. టీనేజర్స్ ఇక నిజ జీవితంలో ఎదురయ్యే అపజయాలు నిరుత్సాహాలు ఎదుర్కోలేరు. వారికి ప్రపంచంతో […]
ఆ పేరు పెడితే చాలు
బాలీవుడ్ స్టార్స్ పేరుతో మొత్తం ఫ్యాషన్ ప్రపంచం మునిగి తేలుతూ ఉంటుంది. ఉదహరణకు కాజల్ పేరుతో వచ్చే కుర్తాలు ,లెహంగాలు ,సిల్వాట్టలు ఎంతో పాపులర్ . లెహంగాలు ఇవ్వాల్టి ట్రెండ్ కూడా. లేత రంగులు ట్రైబల్స్ డిజైన్స్ , క్యూట్ గా ఉండే హాఫ్ శారీలు, స్కర్ట్ పైన లేత రంగు ప్రింట్స్, ధగ ధగ మెరిసే చోకర్ లు అన్నీ ఫ్యాషనే. బంగారు వన్నే జరీతో ఫ్యూర్ సిల్క్ లెహంగాలయితే కాజల్ అగర్వాల్ ఫ్యాషన్ డ్రెస్సెస్ […]
అమ్మకి అందరూ సాయం
అమ్మకావటం అనిర్వచనీయమైన ఆనందం. అమ్మకో కొత్త బాధ్యత . పాపాయి అపురూపమే , కానీ అమ్మ పాపాయి పైన 24 గంటలు కేంద్రీకరించకూడదు. ఇంట్లో ఉన్న అందరూ పాపాయిని ప్రేమిస్తారు కనుక వాళ్ళు కూడా పాపాయి పనుల్లో భాగాస్వాములుగా ఉండాలి ముఖ్యంగా కుటుంబం పాపాయి లాగా పాపాయి తల్లిని చూసుకోవాలి. అమ్మగా మారేందుకు ఆమె ఎంత కష్టం ఓర్చుకుందో పిల్లల పెంపకం ఎంతో కష్టమో అర్ధం చేసుకుంటే అమ్మ తేలిగ్గా ఉంటుంది. పాపాయికి పాలివ్వాలి కనుక వేళకు […]
ఎంత మంచిదో
అచ్చం పాలకూరలో వుండే పోషకాలతో చేసిన టాబ్లెట్స్ గర్భవతులకు ఇస్తారు. పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ శక్తి పాలకూరలో ఉందన్నమాట. ఇందులోని పోషకాలు అందరికీ ఆరోగ్యాన్నీ ఇస్తాయి. విటమిన్ ‘ఎ’ పాళ్ళు ఎక్కువ కనుక కాళ్ళకు మేలు చేస్తుంది. విటమిన్ ‘సి’ ఉంది కనుక వ్యాధి నిరోధక శక్తి సమకూరుతోంది. అనీమియా రాదు . పాలకూరలో ఉండే ల్యూటెన్ ,జయగ్భాంధన్ వంటి యాంటీ ఆక్సీ డెంట్స్ వల్ల ఎన్నో పోషకాలు అందటమే కాక ఎన్నో […]
ఎండల్లో జాగ్రత్త
జుట్టు ధృఢంగా ,బావుండలంటే మాడు శుభ్రంగా పొడిగా ఉంచుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తలకు పెట్టుకోనే డై ,హెన్నా,ఆయిల్స్ అన్నీ బాగా పోయేలా శుభ్రం చేయాలి. మాడు ఆరోగ్యంతో దురదలు రాకుండా ఉంటాయి. సహజమైన నూనెతో మసాజ్ చేసి తల స్నానం చేయాలి. గోరు వెచ్చని నీళ్ళతోనే తలస్నానం చేయాలి. వేసవిలో మాడుకు చల్లదనం ఇచ్చే గోరింటాకు పూత వేసుకోవాలి . ఎండ పడకుండ స్కార్ఫ్ ధరించాలి. గొడుగు వెంట తీసుకుపోవాలి హెయిర్ స్ప్రే లు, జెల్స్ […]
అందం ఆరోగ్య రహస్యం ఇదే
వాకింగ్, యోగా ఏదైనా ఏ వ్యయామం అయినా సరే శృంగార జీవితానికి సాటిరాదు అంటుంది ఒక రిపోర్ట్. సుఖంగా అన్యోన్యంగా జీవించే దంపతులు ఆరోగ్యంగా జీవించవచ్చు. శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు విడుదలై పని ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. భార్య,భర్తల శృంగార జీవితం వాళ్ళ శరీరాలను పటిష్టంగా , ఆరోగ్యంగా ఉంచి వాళ్ళకి ఆరోగ్యం, అందం ప్రసాదిస్తుందని రిపోర్టు చెపుతుంది.
