Tuesday, 28 Jul, 2026

ఇవీ లాభమే

ఫుల్ ఫ్యాట్ డెయిరీ  ఉత్పత్తులు చాలా మటుకు ఫిగర్ ఫ్రెండ్లీ అంటున్నాయి అధ్యనాలు . బరువు తగ్గాలనుకొనే వారు తక్కువ కొవ్వు వైపు మొగ్గుతారు. లో ఫ్యాట్ పెరుగు స్కిమ్డ్ మిల్క్ వంటివి బరువు తగ్గేందుకు తీసుకొంటారు .కానీ ప్రతి సారీ లో ఫ్యాట్ పదార్థాలపైనే దృష్టి పోనివ్వకుండా కొంచెం కార్బ్స్ ,కొంచెం ఫ్యాట్ ఉండే డెయిరీ పదార్థాలు తినటం బెటర్. ఫుల్ ఫ్యాట్ కాంబినేటెడ్  లో లినోలెనిక్ యాసిడ్ఉంటుంది. ఎన్నో ఆరోగ్యవంతమైన ఫ్యాట్ ఆసిడ్స్ ఉంటాయి. ఇది కడుపు […]

కొన్నాళ్ళు మానేయండి

గులాబీ వర్ణంలో ఉండవలసిన గోళ్ళు నెమ్మదిగా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. నెయిల్ పాలీష్ వేసుకోకపోతే ఇంకా చూడలేం అని పిస్తుంది. కానీ అలా పసుపు వర్ణంలోకి మారటానికి కారణం గోళ్ళ రంగే అంటున్నారు .నెయిల్ పాలీష్ ,పాలీష్ రిమూవర్లు ఎక్కువగా వాడటం వల్ల గోళ్ళపై పసుపు మరకలు వస్తాయి. కొన్నాళ్ళు ఈ రంగు మానేయాలి. నిమ్మరసం ,బేకింగ్ పౌడర్ కలిపి గోళ్ళపై రాసి కొద్ది సేపటికి కడిగేస్తే నెమ్మదిగా పసుపు రంగు పోతుంది.గోళ్ళు పెరిగే కొద్దీ […]

వేసవిలో చల్లగా

ఈ వేసవిలో ప్రతి రోజు రాగి జావా తాగితే మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాగుల్లో పుష్కలంగా   క్యాల్షియం, ఐరన్ ,విటమిన్ సి పలు రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. ఒత్తడి ,ఆందోళన తగ్గించే రాగి పిండి లో మాంసకృత్తులు ఎక్కువే. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉంటాయి. బరువు తగ్గలను కొంటే రాగి జావా ను భోజనంలో చేర్చుకోవచ్చు . జావా రూపంలో,సంగటిగానూ తీసుకోవచ్చు .నీళ్ళలో రాగి పిండిని […]

అదేమంత వయసు

నలబై ఏళ్ళ వయసులోనే శరీరం, మొహం అసలైన అందం సంతరించుకుంటుంది అంటున్నాయి అధ్యయనాలు. ముఖం పైన పోర్స్ విషయానికి వస్తే మహిళలకు నలభై ఏళ్ళ వయసు చాలా యవ్వనంతో ఉంటుందనుకోండి అంటున్నారు. ఈ వయసులో ముఖంపై పోర్స్ ఎన్ లార్జ్ అవవు. మృత కణాలు పోర్స్ చుట్టు పేరుకోవటం వల్లనే చర్మరంధ్రాలు పెద్దవిగా అవుతాయి . కొద్దిగా మాయిశ్చరైజర్ కలిపి ఓ నిమిషం ముఖంపై ముని వేళ్ళతో మృదువుగా మసాజ్ చేస్తే మృత కణాలు తొలిగిపోతాయి. ఆ […]

రంగు వెలసి పోతుంది

చాలా అందమైన ఖరీదైన డ్రెస్ కూడా ఒక్క ఉతుకుతో రంగు తగ్గి వెలసి పోతాయి. డ్రైవాష్ కి వేసిన ఏ కొంగు రంగో చీరపైన మరకల్లా పడిపోతుంది. పట్టు చీరెల్లాంటి విలువైన దుస్తులు ఉతికేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉతికే ముందు వాటిపై లేబుల్ ఒక సారి చూడాలి. ఎలా ఉతకాలో సలహాలు ఉంటాయి. చల్లని నీళ్లు ,గోరువెచ్చని నీళ్లు ,వాషింగ్ మెషన్ లో ఉతకాలో రాసి ఉంటుంది. ఒక బకెట్ లో ఒక కప్పు వెనిగర్ […]

ఇలా ఫోజివ్వాలి

ఫోటోలు ,సెల్ఫీలతో ప్రపంచం నడుస్తోంది అంటే ఆశ్చర్యం లేదు .ఫోటోల్లో పర్ ఫెక్ట్ గా రావాలంటే చిన్న శ్రద్ధ కావాలి కెమెరాలు ప్రతి చిన్న అంశాన్ని పట్టేస్తాయి. కనుక ముందుగా సింపుల్ బ్యూటీకేర్ అవసరం ముఖం తాజాగా ,కళకళ లాడుతూ ఉండాలి. కెమెరా ముందు ఉన్న మన్న సంగతి మరచి సహాజంగా స్మైల్ గా నిలబడి సరదాగా అందంగా వున్నమనే కాన్ఫిడెట్స్ తో ఉండాలి. హాయిగా ఫ్రీగా నవ్వాలి, చక్కని వస్త్రధారణ అవసరం .సరిగ్గా ఫిట్ అయ్యే […]

ఈ నడకే ప్రయోజనం

రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రిణలో ఉంచేందుకు వ్యాయామాలు తప్పనిసరి. అయితే క్రమం తప్పకుండా 30 నుంచి అరవై నిమిషాలు వాకింగ్ చేయాలి. ప్రస్తుత పరిశోధనలు ఏం చేపుతున్నాయంటే భోజనం తర్వాత 15 నిమిషాల చొప్పున నడవటం ,మొత్తం రోజంతా 45 నిమిషాల చొప్పున నడుస్తుంటే 24 గంటల్లో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుకొన్నా ఫలితం ఉంటుందంటున్నాయి. అన్నీ రకాల వ్యాయామాలు గ్లూకోజ్ స్థాయిల్ని మెరుగుపరుస్తాయి. ఒకే సారి పావుగంటో అరగంటో కాకుండా రోజు మొత్తం మ్మీద […]

ఇక జుట్టు రాలదు

ప్రపంచం మొత్తం ఒక్కసారి ఆగి చదవేంత విలువైన రిపోర్టు వచ్చింది. జుట్టు ఊడిపోవటం ,పలుచబడటం వంటి సమస్యకు స్త్రీ పురుష భేదం లేదు. ఎన్నో అధునాతన చికిత్సలున్న ,ఇంత వరకు సరైన పరిష్కారం లేదు. జపాన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనలో ఒక కొత్త విషయం బయటపడింది. తేనే టీగెల గూడులోని ఒక ప్రోపిలిస్ అనే జిగురు వంటి పదార్ధం జుట్టు పెరిగేలా చేయగలదని కొన్ని ప్రయోగాల ద్వారా కనుగొన్నారు. గూడు తయారీలో చోటు చేసుకున్న చిన్న […]

క్లీన్ కిచెన్

వంట గది కాస్త తీరుగా అమర్చుకొంటేనే ఉదయపు పని వేళల్లో పని సులువుగా తీర్చుకోవచ్చు. అన్ని పదార్ధాలు డబ్బల్లో సర్ధేసి వాటి పైన లేబుల్ రాసి పెట్టుకోవాలి. అన్నీ డబ్బాలు ఇప్పుడు ఒకే మాదిరిగా ఉంటున్నాయి కనుక స్ట్రిప్స్ అంటించాలి. పప్పులు, స్ప్రైస్ లు ఒకటికి మించి ఎక్కువ కంటెయినర్లలో భద్రపరుచకూడదు. అలాగే కిచెన్ గట్ట టాప్ తుడిచేందుకు హాండీ వైపర్ గానీ ,క్లీనింగ్ క్లాత్ ను దగ్గరగా ఉంచుకోవాలి. భారీగా పెద్దగా ఉండే వస్తువులు కాప్ […]

కాస్త చూసుకోండి

మంచి సమతులాహారం తీసుకొంటున్న ,ఉదయంలో వ్యాయామాలు చేస్తున్న బరువు తగ్గకుండా ఉండటం ఒక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే ఉద్యోగ నిర్వహాణలో భాగంలో గెస్ట్ లతో పాటు తాగే కాఫీ,టీ స్నాక్స్ అనివార్యంగా తివటం వల్లనే ఈ సమస్య అని. సాధారణంగా ఆఫీస్ లో చేతి కందే పదార్ధాల్లో కుకీలు,చాక్లెట్లు ఉంటాయి. అంచేత వీటి విషయంలో ఎలాంటి సందర్భంలోనూ ఏమరి పాటుగా ఉండద్దు అంటున్నారు . ఎనర్జీ లెవల్స్ కోసం ప్రోటీన్స్ అధికంగా ఉండే స్నాక్స్ […]

ఇంట్లోనే మానిక్యూర్

ఎప్పుడు చేతులతో ఏదో ఒక పని చేస్తునే ఉంటాం. రసాయనాలు ఇతర డిటర్జెంట్స్ ,పదార్ధాలు అన్నీ చేతులతో తాకుతూ పని చేయాలి. గోళ్ళు మొత్తబడి విరిగిపోకుండా చేతులు మొరటు దేలకుండా ఇంట్లో కొన్నీ జాగ్రత్తలు తీసుకోవచ్చు. గోరు వెచ్చని నీళ్ళు ఒక బౌల్ లోకి తీసుకోని చేతులు అందులో ముంచి మృదువుగా రుద్దితే మృత కణాలు పోతాయి. పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాస్తే చేతులు మృదువుగా ఉంటాయి. గోళ్ళు నీట్ గా కట్ చేసుకోవాలి. వేలి కుదుళ్ళు […]

ఇది మంచి సమయం

వేసవి సెలవుల్లో ఎన్నో కొత్త పనులు మొదలు పెట్టవచ్చు అవుట్ డోర్స్ లో పని చేయటానికి ముఖ్యంగా గార్డెనింగ్ మొదలు పెట్టే సమయం ఇదే. మనసుకి సంతోషం కలుగుతుంది, గార్డెనింగ్ లో కాలరీలు కలరుగుతాయి. ముఖ్యంగా హెర్ట్ గార్డెనింగ్ కు వేసవి చాలా అనుకులం కుండీలో గింజలు చల్లి అవి ఒక్కో  మొలక ఆకులు తోడిగితే చూడటం మంచి అనుభవం . వంటింటి అవసరాలకు ఉపయోగపడే కూరగాయాల మడులో ,అల్లం ,ఉల్లి,వెల్లుల్లి వంటివి పెంచటం ,ఇంటి గదుల్లో […]

అర్ధరాత్రి ఆకలేస్తే

టి.వి చూస్తూ నెట్ లో కాలక్షేపం చేస్తూ అర్ధరాత్రి వరకు మేలుకోవటం చాలా మందికి అలవాటై పోయింది. అలాగే అర్ధరాత్రి అయినా ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళటం ఏదో ఒక చిరుతిండి తిటనం కూడా అలవాటుగా మారుతోంది. ఈ అర్ధరాత్రి తిండ్లు స్థూలకాయం ,కార్డియో మెటబాలిక్  వ్యాధులకు అవకాశం  ఇస్తాయి. అలాగే పోషకాలు లేని ఆహారం తక్కువ ప్రోటీన్స్ గల పదార్ధాలు తినటం కూడా రాత్రి వేళ చిరుతిండ్లపైకి మనసు పోయోలా చేస్తుంది. ఈ తిండి బ్లడ్ షుగర్ […]

బంగారం జడా

నగలన్నింటితో పాటు జడకు అలంకరించే నగల్లో బంగారు జడ కూడా అందమే . అచ్చంగా బంగారుతో చేసిన జడతో పాటు ,జడ మొత్తం అలంకరించేలా నెమలి పింఛం ,మామిడి పిందెలు ,దేవలా రూపాలతో ఏర్చి కూర్చి జడ బిళ్ళలూ ఎప్పటి నుంచో ఉన్న నగలే .నిజడ్ స్టాన్స్ అన్ కట్ డైమాండ్స్ ,ఎమరాల్ట్స్ పొదిగిన జడ బిళ్ళలు చాలా అందంగా ఉంటాయి. ఇవి జడ మొత్తం దగ్గర దగ్గరగా అమర్చుతారు .  22 క్యారెట్ల తో యాంటిక్ […]

అలల వర్ణాలు

హెయిర్ కలర్ తో  కొత్త లుక్ ఇవ్వలనుకొంటే బాలయేజ్ ట్రై చేయమంటున్నారు హెయిర్ స్టైలిస్టులు. ఇది ఒక కలరింగ్ టెక్నిక్ . ఒకే రంగులోని వివిధ ఛాయలతో హెయిర్ కి కలరింగ్ ఇస్తారు. ఆంబ్రే ,హైలైటెంగ్ ల కాంబినేషన్ ఇది. జుట్టు పాయలకు అలలు అలలుగా రంగులద్దుతారు. నేచురల్ హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తారు. తేలికైనవా,గాఢమైన రంగుతో చెపితే ,తలపైన ఆ రంగులద్దుతూ బ్లెండింగ్ చేస్తారు. అచ్చం సముద్రపు అలలని తలపిస్తూ పైన లేతరంగులోంచి కిందకు ముదురు షేడ్ […]

స్లీప్ లైన్స్ పడకుండా

మొహాంపైన పడే  స్లీప్ లైన్స్ వల్ల వయసుకంటే ఎక్కువ కనబడుతారని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఒకే వైపునే పడుకొనే అలవాటుంటే, అలా ఒక వైపే ఏళ్ళతరబడి పడుకొంటూ ఉంటే ఏ జింగ్ ప్రియలో భాగంగా కొంత వదులైన ముఖచర్మం తలగడకు బరుసుకు పోయి గీతలు పడుతాయి. వీటినే స్లీప్ లైన్స్ అంటారు . ఇలా జరగకుండా తలగడపైన తలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడూ ముఖాన్నీ ఒకే వైపు తిప్పి పడుకొకూడదు. ఇప్పటికే అలవాటు ఉంటే నెమ్మదిగా అటు […]

తిండి తగ్గించటం మంచిది

కొన్ని లెక్కలు జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఒక పరిశోధన ఫలితం ఏమంటుంది అంటే ఆహారం మితంగా తీసుకొంటే 80 శాతం బరువు తగ్గచ్చు అలాగే వ్యాయామంతో ఇరవై శాతం తగ్గొచ్చు.   కానీ ఏ రకంగా బరువు తగ్గినా ముధుమేహాం వచ్చే ప్రమాదం 50 శాతం తప్పని సరిగ్గా తగ్గుతోంది. ఇది ఫ్యాక్ట్ . బరువు తగ్గేందుకు వ్యాయామం మంచిదా? ఆహారం తక్కువ తీసుకోవటం మంచిదా? అని పరిశోధన చేస్తే , ముందర తిండి తగ్గించి కనుక బరువు […]

అవిసెతో సౌందర్యం

అవిసె గింజలు ఆరోగ్యానికి మంచిదని ఎప్పటినుంచో తెలుసుకానీ ఈ గింజల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాల కారణంగా చర్మం అందంగా మెరిసిపోతుంది. వయసుతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. అవిసె గింజల్లో నీళ్ళుపోసి మెత్తగా గ్రైండర్ చేసి మొహాం,మెడకి ఫ్యాక్ వేయాలి. అది ఆరిపొయాక పైన ఇంకా ఫ్యాక్ వేయాలి .ఇలా నాలుగైదు విడతలుగా ఫ్యాక్ వేసి వేడి నీళ్ళతో కడిగేస్తే ముఖం కాంతిగా మెరుస్తుంది. అలాగే ఈ అవిసె గింజల పొడిలో నిమ్మ రసం ,తేనే […]

అక్షరాలతో డాన్స్

అంతర్జాతీయ  ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ పాల్ మావి రూపొందించిన బోక్వా వ్యాయామం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీన్ని ఆంగ్ల అక్షరాలతో చేస్తారు. సంగీతం వినిపిస్తూ ఉండగా ,లయబద్ధంగా కదులుతూ ఇంగ్లీష్ అక్షరాలు అంకెలూ పాదాలతో నేలపై గీస్తూ కార్డియో వ్యాయాములు చేస్తారు. ఒకటి రెండూ అంటూ స్టెప్స్ ఉండాలి. సంగీతానికి తగ్గట్టు అఓరం ఆకారం వచ్చేలా అడుగులు వేస్తారు. ఈ రిథమ్ ని ఆస్వాధిస్తే కాళ్ళు కదిలించే బోక్యా వ్యాయామం ఇష్టపడేవాళ్ళు గ్రూప్ గా చేస్తారు […]

ప్రకృతి గీసిన చిత్రాలు

పచ్చలు, నీలాలు ,వజ్రాలు అన్నీ నేలలో దొరికేవే .అలాంటి కోవలోకి వస్తాయి ఎగెట్ రాళ్లు .అందమైన ప్రకృతి దృశ్యాలు కనబడే రాళ్ళు ఇవి. ఇవి సహాజ సిద్దమైనవి .ఎగెట్ అగ్ని పర్వత శిలలకు సంబంధించిన ఒక రాయి .ఈ రాయి తయారయ్యే క్రమంలో శిలమధ్య క్వావిటీ ఏర్పడుతుంది అందులోకి ఐరన్ ఆక్సాయిడ్ ,కాఫర్ ,సిలికాకేట్ లాంటి అవక్షేపాలు నీటి ప్రవాహాల వల్ల రాయిలో రకరకాల రంగులు ,పొరలు ,ఆకృతులు ఏర్పడుతాయి. వాటిని వేలికి తీసి సానపెడితే అవి […]