Thursday, 30 Jul, 2026

గుర్తించండి

షేక్ హ్యాండ్ కూడా మనకు ఆరోగ్యం గురించి చెబుతుందట. ఒక పరిశోధన ఏం చెబుతుందంటే చేతులు కలిసే సమయంలో పటుత్వం తగ్గితే భవిష్యత్ లో గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. కొన్ని వేల మంది పై ఈ అధ్యాయనం జరిగింది. షేక్ హ్యాండ్ లో పటుత్వం లేకపోతే గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, క్యాన్సర్ బారిన పడి అకాల మృత్యువుకు గురైనట్లు కనుగొన్నారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకోని మర్యాద పూర్వకంగా ఎదుటివారికి ఇచ్చే షేక్ […]

వట్టి అబద్దాల కోర్లు

అబద్దాలు చెప్పడంలో ఆడవాళ్ళు ముందుంటారు అంటారు కాని ఈ విషయంలో మగవాళ్ళదే పై చేయి అంటున్నాయి అధ్యాయనాలు.పురుషులు రోజుకు అనేకసార్లు అబద్దాలు చెబితే స్త్రీలు రోజుకు మూడుసార్లు మాత్రమే అబద్దాలు చెపుతారట. బావోద్వేగాలు వెల్లడించటంలో పురుషులే ముందుంటారు. ప్రేమ,కోపం తదితర భావాలు ముందుగా వ్యక్తం చేస్తారు. అలాగే స్త్రీలు అంత త్వరగా బయటపడరు. బాధను స్త్రీలు ఓర్చుకున్నంతగా పురుషులు ఓర్చుకోలేరు. ఉరుములు ఉరిమినా సరే పురుషులే ఎక్కువ బయపడతారట. ఏదైన ఆడవాళ్ళు చెబుతుంటే సోది వినడం ఇష్టం […]

ఆ మాత్రం శ్రద్ద అవసరం

ఈ వేసవి రోజుల్లో ఎండల్లో తల్లో మురికి చెమట చేరి జుట్టు వాసనగా ఉంటుంది. నిమ్మ రసం ఈ సమస్య నుంచి కాపాడుతుంది. నిమ్మరసం కప్పు నీళ్ళలో వేయాలి షాంపూ అయ్యాక జుట్టు కుదుళ్ళకు తగిలేలా రాసి కడిగేయాలి. జుట్టు పొడి బారినట్లు ఉంటే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేస్తే మెత్తగా మెరుస్తూ ఉంటుంది. టామోట రసం కూడా మంచిదే. అలాగే టిట్రీ నూనెలో బ్యాక్టీరియా దూరం చేసే గుణం […]

ఆరోజుల్లో తినాలి

నెలసరి వస్తే కలిగే చిరాకు,అలసట కలిగే ఒత్తిడి తగ్గాలంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాల్షీయం తో పాటు మెగ్నిషియం ఎక్కువగా ఉండే అవిసె గింజలు,గుమ్మడి గింజలు,పొద్దు తిరుగుడు గింజలు పాలు పాల పదార్ధాకు తీసుకోవాలి. గ్రీన్, చామంతి వంటి హెర్బల్ టీలు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మంచి నీళ్ళు తాగాలి వీటి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఎదురవ్వదు. పండ్లు,కూరగాయలతో పాటు తృణ ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవాలి. నువ్వుల్లో ఒత్తిడి తగ్గించే ఖనిజాలు,మెగ్నిషియం,కాల్షియం […]

పర్లేదు మంచిదే

చెవులకు, ముక్కులకు, చేతులకు, నడుముకు పాదాల వేళ్ళకు వేసుకునే నగల విషయంలో ఎన్నో వైజ్ణానికి విశేషాలు ఉన్నాయంటున్నారు. ఉదాహరణకు చెవులు కుట్టించుకోవడం అనేది ఆక్యుపంచర్ వైద్య విధానానికి సంభందించింది. సంప్రదాయం వెనుక విజ్ణానం దాక్కుని ఉంది. చెవులు కుడితే రుతు సంభందమైన ఆరోగ్య సమస్యలు రావు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. నాడీ మండలం ఉత్తేజితమై నాడులు ప్రేరణ చెందుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. ఇన్ని విశేషాలు ఉండబట్టే ప్రాచీన కాలంలో మగవాళ్ళకు […]

కళ్ళు జాగ్రత్త

ఎర్రని ఎండలో మొదటగా ఇబ్బంది పడేది కళ్ళే. ఎంత సన్ గ్లాసులు ధరించిన కళ్ళు అలిసిపోతూనే ఉంటాయి. ఈ వేసవిలో కళ్ళ ఆరోగ్యానికి కాస్త జాగ్రత్తలు తీసుకోవచ్చు. కంటికి అవసరమైం పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ,విటమిన్ బీ12, సీ,మెగ్నీషియం, జింక్ లు అధికంగా ఉండే గుడ్డు తప్పనిసరిగాతినాలి. చేపలు తీసుకుంటే కళ్ళు పొడిబారి సమస్య పోతుంది. అలాగే కాంటాక్ట్ లెన్సులు వాడే వాళ్ళు కళ్ళు ఇన్ ఫెక్షన్ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలగే ప్రతి వస్తువు […]

అంటిస్తే అందం

ప్యాచ్ వర్క్ ఎప్పుడూ బావుంటుంది. దేన్నయినా ఫ్యాషన్ గా మార్చేస్తుంది. ఒక సాదాసీదా డ్రెస్ కు ఎన్నెన్నో డిజైన్ లు అతికించి ట్రెండిగా మార్చేస్తుంది. ఈ వర్క్‌ ఇప్పుడు పెద్ద కష్టం కాదు. ఐరన్ ఆన్ ప్యాచెస్ వచ్చేశాయి మార్కెట్లోకి దీన్ని ప్యాంట్ పైనో షర్ట్ పైనో అతికించేయవచ్చు. పులులు,సింహాలు,లోగోలు,పువ్వులు,అక్షరాలు ఎన్నో ప్యాచెస్ వీటిని పెట్టి ఐరన్‌ చేస్తే చాలు ఎక్కడ కావాలంటే అక్కడ అతుక్కుపోతాయి. చిల్లులు.మరకలతో పక్కన పడేసిన పాత డ్రెస్ లు అయినా ఈ […]

పాట పవర్

శిశువులను,పశువులను ఒకే రకంగా గానం అలరిస్తుంది అంటారు. కాని ఇప్పుడు కొత్త పరిశోధనలో గానం ఒక చికిత్స అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ పరిశోధకులు. సంగీతం కారణంగా అల్జీమర్స్ రోగుల పాత జ్ణాపకాలు తిరిగి తెప్పించవచ్చు అంటున్నారు. క్రమం తప్పకుండ పాటలు వినిపిస్తే వాళ్ళలో మతిమరుపు తగ్గి ఆలస్యంగా అయినా పాత విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం పరిశోధనలో గమనించాం అంటున్నారు. ఆలోచన శక్తి క్షీణించకుండ పదే పదే పాత పాటలు కూడా వింటూ ఉండటం మంచిదే […]

మెడలోనూ అమ్మే

లక్మీ హారాలు,పాత తరం నగలు ఆ కాలంలో నగల్లో కూడా దేవతామూర్తులు దర్శనం ఇచ్చేవి. ముఖ్యంగా లక్ష్మీదేవి నగల్లో కొలువై ఉండేది. ఇప్పుడు అవే నగలు ఫ్యాషన్ కు ప్రతిరూపాలు అయ్యాయి. లక్ష్మిదేవి చోకర్ నెక్లెస్ లో మొత్తం అమ్మవారి బొమ్మలే మెడ చుట్టు వస్తాయి. వజ్రాలు,కెంపులు,రత్నాలు,ముత్యాలు పొదిగిన ఈ హారం చాలా బావుంటుంది. అలాగే లక్ష్మీరూపంలో హారాలు మ్యాచింగ్ గా దిద్దులు,గాజులు వస్తున్నాయి. వన్ గ్రామ్ గోల్డ్ లోనూ లక్ష్మీ రూపాలే. సంపదగా ఆది దేవతగా […]

ఎండకు పాడవ్వదు

వేసవిలో ఎండ, చెమటకు మేకప్ ఎక్కువసేపు మొహం పైన ఉండదు. పొడి చర్మానికి వేసవిలో మాయిశ్చరైజర్ అవసరం ఉండదు. అయితే వాటర్ ప్రూఫ్ మేకప్ వాడితే మంచిది. లిక్విడ్ ఫౌండేషన్ వేసి మస్కర్, లైనర్ తో కళ్ళను దిద్దుకున్నాక బుగ్గలకు బ్లష్ అద్ది టిష్యూ పేపర్ తో అదనపు రంగు తొలగించవచ్చు. ఇక జిడ్డు చర్మం ఐతే ఐస్ తో మొహం రబ్ చేసి ఫౌండేషన్ వేయాలి. ముందుగా ప్రైమర్ వాడాలి. దాని పైన వాటర్ బేస్డ్ […]

పాడే దీపం

మనకు ఒక వస్తువుతో ఇంకొన్ని ప్రయోజనాలు ఉండటం ఇష్టం. ఇది వ్యాపార రహస్యం కూడా. ఇప్పుడు జింగ్ స్పీకర్ లైట్స్ చూస్తే అలంకరించుకునే అందమైన పంజరంలో పిట్టలు ఇంకెన్నో డెకరేటివ్ ఆర్టికల్స్ కనిపిస్తాయి. బ్లూటూత్ తో పని చేస్తాయి. ఇందులో లౌడ్ స్పీకర్ లైట్ కూడా ఉంటుంది. రీ చార్జ్ చేస్తే పదిహేను గంటల పాటు సంగీతం వినోచ్చు. కరెంట్‌ పోయినప్పుడు లైట్ లా ఉపయోగపడి అందులోనే సంగీతం గంటల తరబడి వినే సౌకర్యం ఉంటే ఎంతబావుంటుంది. […]

కాస్త ప్రత్యేకం

ఏదైన ప్రత్యేక సందర్భాన వేసుకునే దుస్తులు,నగలు ప్రతిబింభిస్తాయి. ప్రత్యేకం అంటేనే కాస్త భిన్నంగా ఉండాలి కదా. ఎప్పుడు పార్టీలకు స్పెషల్ అకేషన్ల కోసం జీన్స్ టీ షర్టులే కాదు. కాస్త భిన్నంగా బాడీ కాన్ దుస్తులు ఎంచుకోవచ్చు. ఇవి ఫ్యాషన్ అయితే వయసు అభిరుచులు భట్టి ఈ డ్రెస్ ఎంచుకోవాలి. పాతిక లోపు వయసు ఐతే మోకాలి వరకు ఉండేవి. ఆ వయసు దాటితే పోడవాటి గౌన్లు ప్రాధన్యత ఇవ్వాలి. బాడీ కాన్ లోనే మినీలు హై […]

రూల్స్ తప్పవు

బ్రిటన్ యువరాజు హ్యారీ పెళ్ళాడి మహరాణి అయిపోయింది నటి మేఘన్ మార్కెల్. సకల సౌకర్యాలు రాజభవనంలో నివసించవచ్చు గాని రాజ కుటుంభానికి సంభందించి ఎన్నో పద్దతులు ఉంటాయట.మేఘన్ ఎప్పటిలా హాయిగా సెల్ఫీలు తీసుకుని పోస్టులు పెట్టుకోకుడదు. సోషల్ మీడియా ఎకౌంట్ లు ఉండకూడదు. ఆటో గ్రాఫ్ లు ఇచ్చేయకూడదు. డ్రెస్సింగ్ అయితే మినీ స్కర్ట్ లు వదిలేయాల్సిందే. డిన్నర్ టైమ్ ప్రకారం షెల్ ఫిష్ ముట్టుకోకుడదు.  మహారాణి కంటే ముందు నిద్ర పోకూడదు. ఫంక్షన్ లో భర్త […]

బరువు తగ్గేరు

బరువు తగ్గేందుకు తీసుకునే డైట్ లో ఈసారి బంగాళాదుంపను చేర్చుకోమంటున్నారు పరిశోధకులు. సాధరణంగా బంగాళాదుంపతో చేసే పదార్ధాలు బరువు తగ్గే క్రమంలో తీసుకోరు. కాని ఇటివల పరిశోధనలో బంగాళాదుంపలు, వీటితో చేసిన పదార్ధాలు కొద్దిగా తీసుకున్న కడుపు నిండిన భావన కలుగుతుందని కనుగొన్నారు. 40 మంది ఊబకాయులు మీద చేసిన ఈ పరిశోధన విజయవంతం అయిందని చెప్పారు. రెండు గ్రూప్ లకు బంగాళాదుంపలు, క్యారెట్లు ఇచ్చారు, బంగాళాదుంపలు తిన్న గ్రూప్ అనూహ్యంగా బరువు తగ్గిందట.

ఆరోగ్య ప్రదాయిని

పాలలో ఉండే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇంకా పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. స్వీడన్ పరిశోధకులు పాలలో ఇంకో గొప్ప గుణం కనిపెట్టారు. ప్రతిరోజు రెండు గ్లాసుల పాలతో క్యాన్సర్ కణాలు వృద్ది చెందకుండా అపేయవచ్చని చెబుతున్నారు. పాలల్లో ఉండే మిల్క్ ప్రోటీన్ క్యాన్సర్ కణాలను సమర్ధవంతంగా ఎదుర్కోంటుందని వీరి పరిశోధనలో తేలింది. పాలు కాకుండా పాలు ఆధారిత పదార్ధాలతో కూడా ఇదే ఫలితం పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

చల్లగా వద్దు

ఫ్రీజ్ లో పెడితే ఏవయిన తాజాగానే ఉంటాయి. కాని కొన్ని పదార్ధాల్లో రుచి నశిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నట్స్ లో ఫ్రీజ్ లో పెడితే అందులో ఉన్న నూనె బావుంటుంది కాని రుచి పోతాయి. వీటిన్ని గాలి చోరబడని సీసాల్లో భద్రపరిస్తే చాలు. కిర దోస కూడా గది ఉష్ణోగ్రతలోనే తాజాగా ఉంటాయి. వెల్లుల్లిని బయటే ఉంచాలి. ఫ్రీజ్ లోని తేమ కు పాడైపోతాయి. తెనే అయితే ఫ్రీజ్ లో చల్లదనానికి గడ్డకట్టిపోతుంది. పుచ్చకాయ కోయకముందు గది వాతావరణంలో […]

అలసటా

తీరిక లేని పని తర్వాత ఏ పార్టీకో వెళ్లాలంటే మొఖం అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రీజ్ నుంచి తీసిన చల్లని నీళ్ళతో మొఖం కడుక్కోవాలి. దీనితో ముఖం కండరాలు బిగుసుకుని మృదువుగా కనిపిస్తాయి. ఐస్ ముక్కలు వేసిన పాలతో మొఖన్ని కాసేపు రుద్దితే చర్మానికి తేమ అందుతుంది. అలాగే ఒక స్పూన్ ఫ్రీజ్ లో పెడితే చల్లగా ఐపోతుంది. ఈ స్పూన్ ను పదే పదే చల్లబరుస్తూ కళ్ళ […]

అన్ని ఒక వైపే

ఎప్పటికప్పుడు కాస్త అటుఇటుగా ఫ్యాషన్ మారినా ఏ సీజన్‌ లో కంఫర్ట్ బుల్ గా కనిపించే కుర్తీలు కాస్త స్టైయిల్ మార్చుకుని ఒక వైపు డిజైన్ ఉండేలాగా ఒక వైపు సాధాగా కనిపించే లాగా సింగిల్ కలర్ డిజైన్‌ కుర్తీలు వచ్చాయి. రెండు రంగుల డిజైన్ తో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఈ కుర్తీలు వెరైటీగా ఉంటాయి. అలాగే శారీ విత్ ఒన్ సైడ్ టాప్ లు వచ్చాయి. అలగే ఒక వైపు వెస్ట్రన్ గౌను ప్యార్లల్ […]

దీర్ఘకాల యవ్వనం

ఈ సీజన్ లో దొరికే తాటి ముంజల్ని ఒక్క రోజు కూడ వదలకుండ తినండి అంటున్నారు డైటీషియన్లు. ఆరోగ్యంగా బరువు అదుపులో పెట్టుకోవాలంటే ఈ తాటి ముంజలు రుచికరమైన మార్గం అంటున్నారు. వీటిలో స్వాభావికంగా ఉండే నీటి పాళ్ళు, పుష్కలంగా ఉండే ఖనిజాలు వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. వీటిలో ఉండే పెట్రో కెమికల్స్ వల్ల వయసు పైబడిన లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాల యవ్వనం సాధ్యపడుతుంది. ముంజల్లో ఉండే పొటాషియం పాళ్ళు రక్తపోటును నివారిస్తాయి. జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తాయి. కాలేయం […]

ఒక పదిహేను నిమిషాలు

ఉదయాన్నే ఎంత త్వరగా లేవగలిగితే అంత ప్రయోజనాత్మకంగా సమయాన్ని వినియోగించుకోగలుగుతాం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కనీసం ఏడుగంటలు నిద్రచాలు, తాజాగా ఉండే ఉదయపు గాలి ప్రశాంతంగా అతి విశ్వాసంతో ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే ఒక్క పదిహేను నిమిషాలు ఏకాంతంగా ప్రశాంతంగా ఉండేందుకు కేటాయిస్తే రోజంతా ఆ ఉత్సాహం వెంటే ఉంటుంది. అ కొద్ది నిమిషాలు మనల్ని మనం సమీక్షించుకునేందుకు గమునించేందుకు పనికి వస్తాయి. ఏ పని చేయకుండా ఉదయం వేళ కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే చాలు ఒక […]