ప్రమాదమే
ఒక వయసు దాటాక పొట్ట వస్తుందంటే రక్తనాళాలు సంభందిత అనారోగ్యాలు డయాబెటిస్,క్యాన్సర్ వరకు ఒక్కో అడుగు పడుతున్నట్లే అంటున్నారు వైద్యులు. రెండు లక్షల పాతిక వేలమంది పైన 16 సంవత్సరాల కాలం సూదీర్ఘ కాలం ఒక పరిశోధన చేశారు. బరువు,ఎత్తు, పొట్ట కొలత తీసుకుని బాడీ మాస్ ఇండెక్స్ లెక్కలు గట్టి వారి ఆరోగ్య అనారోగ్య వివరాలు నమోదు చేస్తూ వచ్చారు. వారిలో పొట్ట పెరిగిన వాళ్ళందరు పలు రకాల అనారోగ్యాలకు గురైయ్యారు. చాలా మంది 40 […]
విలువైనవి
పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎత్తైన చెట్లకు ఎర్రఎర్రని సీమచింతకాయలు వేలాడుతు నోరురిస్తుంటాయి. ఇవి మార్కెట్లలో చాలా చౌకగా దొరుకుతాయి. కాని ఔషధ గుణాలు పోషక విలువల విషయలో చాలా విలువైనవి. కాయల గింజలు, ఆకులు, చెట్ల బెరడు అన్నిటిలోనూ ఔషధ విలువలున్నాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. బ్లడ్ షుగర్ ,కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతాయి. నోటి అల్సర్లను తగ్గిస్తాయి. సహజసిద్దమైన స్కిన్ మాయిశ్చరయిజర్ గా పని చేస్తాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కనుక ఎముకలు దృడంగా […]
ఎరుపురాళ్ళు బెస్ట్
ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే కుందన్ జ్యూయలర్ వైపు చూడోచ్చు. ఇప్పుడు పాల్కీ కుందన్ వైట్ కుందన్ బాగా ఇష్టపడుతున్నారు. కుందన్ నగల్లో మేలు జాతి రాళ్ళు పొదిగేందుకు లక్క వాడతారు. నగల మార్పిడి సమయంలో నష్టం రాకుండా ముందే ఈ లక్క శాతం గురించి తేల్చుకుంటే మంచిదే. రియల్ పాల్కీరాళ్ళు, గో మేధికాలు ఎమరాల్డ్ మొదలైన రాళ్ళను కుందన్ నగల్లో పొదుగుతారు. వేడుకల్లో చక్కని దుస్తులతో పాటు ఈ కుందన్ నగలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నెక్లెస్ […]
సేద తీరుస్తుంది
వేసవి ఎండకు శరీరం ఎంతో అలసిపోతుంది. వంట్లో నుంచి నీరు ఆవిరి అయిపోయి మొహం,జుట్టు కూడా కళ తప్పిపోతాయి. అలసట నుంచి సత్వరం తేరుకోవాలంటే కీరా తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిలో విటమిన్ బీ ఎక్కువగా ఉంటుంది. రోజంతా మధ్య మధ్యలో రెండు కీరా ముక్కలు తింటుంటే దాహం వేయదు. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది కీరా. జీర్ణ వ్యవస్థ బావుంటుంది. అధికబరువు సమస్య తలెత్తదు. జీర్ణక్రియకు అవసరం అయ్యే పీచు కీరదోసలో వుంటుంది కాబట్టి శరీరంలో మలినాలు […]
టీకా వస్తుంది
టినేజ్ లో వచ్చే మొదటి సమస్య మొటిమలు. ఇవి కాస్త గిల్లిన రుద్దిన పుళ్ళయిపోయి మచ్చలు పడిపోతాయి. మొహం అంతా నిండే మచ్చలు ఒక పట్టానా ఏ మందులకు లొంగవు కూడా. మొఖం పై మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని సంహరించగల శక్తి కలిగిన టీకాను కనిపెట్టారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఆ బ్యాక్టీరియా తర్వాత కూడా ఇబ్బంది పెట్టనియని విధంగా ఈ టీకాను తయారు చేశారు. చర్మం పై చేరిన బ్యాక్టీరియా స్రవించే ఒక ప్రోటీన్ వల్ల […]
ఐస్ పెట్టాలి
గాయం తగిలితే రక్తం కారితే ఐస్ పెట్టండి అంటుంటారు కొన్ని గాయాలకు ఐస్ కాపడం కొన్నింటికి వేడి కాపడం పెట్టాలి. శరీరానికి దెబ్బలు తగిలి రక్తం కారకపోతే బయటికి గాయం కనిపించకపోతే వేడి కాపడం పెడతారు. దీని వల్ల ఆ ప్రదేశంలో రక్త సరఫరా జరిగి ఆ దెబ్బనుంచి కండరాలు కోలుకునేందుకు సౌలభ్యంగా ఉంటుంది. అదే రక్తం కారే దెబ్బకు ఐస్ పెట్టాలి. ఈ చల్లధనంతో రక్తనాళాలు కుంచించుకుపోయి గాయమైన చోటకు అధికంగా రక్తం చేరి స్రావం […]
కట్టుదిట్టం చేయడం కష్టం
పిల్లలు టీనేజ్ లో అడుగుపెట్టారు వారిని అనుక్షణం ఆ పని వద్దు ఇది ఇలా ఉండాలి ఇది మంచిది ఇది కాదు అంటూ అనుక్షణం ఆంక్షలు పెడితే వారు మొండిగా అయిపోతారు అంటున్నారు సైకాలజిస్టులు. వారి పై అజమాయిషీ లేని నియంత్రణ ఉండాలంటారు. ఏదైన తప్పు చేస్తే అది ఎలా తప్పో ఎందుకుచేయకూడదో వారికి వివరంగా అర్ధమయ్యేలా చెప్పాలి. వారితో స్నేహపూర్వక వైఖరితో ఉండాలి. వాళ్ళతో సరదగా ఉంటూ కాస్త కఠినత్వం అవలంభించాలి. కాస్త వయసు పెరుగుతు […]
ఎండు ద్రాక్ష ఆరోగ్యం
పోటాషియం,కెరోటిన్,విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఎండు ద్రాక్ష ఎండు కర్జురం ఈ వేసవి రోజుల్లో తినడం వల్ల ఎంతో ప్రయోజనం అంటున్నారు వైద్యులు జీర్ణ శక్తికి ఇది చాలా మంచిది అంటున్నారు. బీపీ నియంత్రణకు కూడా మంచివే ఊపిరితిత్తులు పని తీరు మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే పీచు కారణంగా మలబద్దకం, డయేరియాని నివారించి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫినాలిక్ పదార్ధాలు క్యాన్సర్లు రానివ్వవు. మధుమేహం తో బాధ పడే వాళ్ళకు ఇవి స్నాక్స్ […]
మచ్చలు పోతాయి
అమ్మాయిలకు మొటిమలు పెద్ద సమస్య. ముఖ్యంగా ఇవి మచ్చలు పడితే ఒక పట్టాన పోవు. మందుల కంటే వంటింటి చిట్కాలే బాగా పని చేస్తాయి. నిమ్మరసం,రోజ్ వాటర్,శనగ పిండి కలిపి పెస్టుల చేసి మొహానికి అప్లై చేసి ఆరాక కడిగేస్తే నెమ్మదిగా మచ్చలు పోతాయి. ఆపిల్ సిడర్ వెనిగర్ లో తేనె,నీళ్ళు కలిపి మొహానికి పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేసిన మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె బాగా పని చేస్తుంది. కమలా తొక్కలు పొడి […]
నైట్ షిఫ్టులే కారణం
ఇప్పుడు చాలా ఉద్యోగాలో నైట్ షిఫ్టులు తప్పనిసరవుతున్నాయి. ఒక అధ్యాయనం ఈ రాత్రి వేళ డ్యూటీ చేసే వాళ్ళు మాములు వాళ్ళ కన్నా అదనపు బరువు పెరుగుతున్నారని తేల్చింది. రాత్రి వేళ చేసే ఉద్యోగాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రాత్రివేళ నిద్ర మేల్కోనేందుకు తాగే పానీయాలు ఎక్కువ ఆహారం తీసుకోవటం పోషకాహరం పై శ్రద్ద చూపించే అవకాశం లేకపోవడం,పగలు నిద్ర పోవడం వల్ల ఇవే అధిక బరువుకు కారణమవుతున్నాయంటున్నారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని నైట్ […]
కన్నీళ్ళు మంచివి
చీటికి మాటికి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే తప్పు కానీ మనసారా ఏడవటం వల్ల కూడా సానుకూల ఫలితాలుంటాయి అంటున్నాయి అద్యయనాలు. ఏడవటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం రెండు దక్కుతాయి. కన్నీళ్ళు కను గుడ్లు,రెప్పలకు తేమను అందిస్తాయి. కళ్ళను శుభ్రం చేస్తాయి. కన్నీళ్ళు యాంటీ బ్యాక్టిరియాగా యాంటీ వైరల్ గా పని చేస్తాయి. ఏడవటం వల్ల మనుషులు గూడుకట్టుకున్న దిగాలు, భారం పోయి మానసిక ప్రశాంతత దక్కుతుంది. భావోద్వేగాల ఒత్తిడి తగ్గిపోతుంది. హాయిగా నవ్వండి అన్న పదంతో పాటు […]
డబ్బుతో ఆయుర్దాయం
కొన్ని అద్యాయనాలు ఆలోచనలో పడేస్తాయి. డబ్బే సరస్వం కాదు డబ్బుతో అన్ని సమకూరవు మమతానుబంధాలను డబ్బుతో కొనలేము. వీటిని చిన్నప్పటి నుంచే వింటాం. కాని ఒక అధ్యాయనం డబ్బుకు ఆరోగ్యానికి సంబంధం ఉంది అంటుంది. డబ్బుతో ఆనందం ఉందో లేదో కాని ఆయుర్ధాయం మాత్రం పెరుగుతుందట. ఆదాయం బావుండి ఆర్ధికపరమైన ఒత్తిడి లేనివారిలో ఎక్కువ మంది 15 శాతం అధికకాలం జీవించారని సర్వే రిపోర్ట్స్ నివేదిక ఇచ్చాయి. ఆదాయం అధికంగా ఉన్న వారు మెరుగైన ప్రవర్తన, పొగ తాగే […]
సుగంధ భరితం
కడిమి చెట్లు ఉన్న చోట పార్వతి దేవి కొలువై ఉంటుందంటారు. నియోలా మార్కియా అనే శాస్త్రీయనామం గల కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేటట్లుగా ఉంటాయి కదంబ పూలు. గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా తర్వాత పసుపు బంగారు వర్ణంలో తర్వాత తెల్లగాను మారతాయి. ఈ పువ్వులు పార్వతి దేవి పూజలు జరిగే చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే కడిమి పూలు ఎక్కువ పూస్తాయి. ఆద్యాత్మిక పరంగానే కాక వాణిజ్యపరంగాను కడిమి చెట్టు ప్రత్యేకమే. […]
అతి నిద్ర అనారోగ్యం
ఏదైన అతిగా చేస్తే అనర్ధమే. నిద్ర చాలకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో అతిగా నిద్రపోతే అంతకంటే ఎక్కువే ఇబ్బందులు వస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయే వారితో పోల్చితే పదిగంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే వారిలో అనారోగ్యకర లక్షణాలు కనపడతాయంటున్నారు. ఎక్కువ సేపు నిద్రపోతే గుండె సమస్యలు వస్తాయి. శరీరంలో చురుకుదనం లోపిస్తుంది. ముఖ్యంగా బరువు పెరుగుతారు. ఈ విషయంలో మగవారికంటే మహిళలకే ముప్పు ఎక్కువ అంటున్నారు. రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతాయి. టైప్-2 […]
వేడుకకు వెలుగు
సాధరణంగా పగటి వేడుకల కోసం బంగారు నగలు ధరిస్తేనే బావుంటుంది. రాత్రి వేళ మెరిసే జాతి రాళ్ళు పాల్కి, కుందన, మోజనైట్స్, వజ్రాల నగలు కళ్ళకు మిరుమిట్లు గొలుపుతాయి. అమ్మాయిల అందం రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా చిన్ని వేడుకల కోసం వేసుకునే సంప్రదాయ నగల్లో పోల్కీ నక్లెస్ లు, కాసుల పేర్లు అందంగా ఉంటాయి. ఇప్పటి ట్రెండ్ కైతే రాంపరీ వరాల మాల, మరీ భారీ నగలు బావుండవు కానీ మిడిల్ లెంగ్త్ హారంతో పాటు మాంగ్ […]
ఇలా చేస్తే నష్టమే
అమ్మాయిలు కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్ లో చూడచక్కగా బావుంటారు. కానీ జుట్టు దెబ్బతినిపోతూ ఉంటుంది. జుట్టు బాగా వెనక్కి దువ్వటం చేస్తారు. అలా కొన్నాళ్ళకు దువ్వుకొన్నాక మళ్ళీ పాపిడి తీసేందుకు ప్రయత్నం చేస్తే జుట్టు రాలిపోతుంది. నడి నెత్తి పైన కొప్పు ఫ్యాషన్ ఆ కొప్పు కోసం గట్టిగా దువ్వి మాడు వరకు పైకి లాగి కట్టడం వల్ల నొప్పి పుడుతుంది. కురులు లాగినట్లు అయి దెబ్బతిని జుట్టు పలచబడుతుంది. పిల్లలకు జుట్టు చెదిరిపోకుండా బిగితుగా […]
మెరిసే ఫుడ్
రుచిగా ఉండేవి తింటుంటే కరకరమని శబ్దం వచ్చేవి. నోట్లో వేసుకుంటే జున్నులాగా కరిగిపోయేవి ఎన్నో పదార్ధాలు తిని ఉంటాం. ఇప్పుడు గ్లో ఇన్ ది డార్క్ ఫుడ్స్ వచ్చాయి. చిరు చికట్లో ఏ బర్గరో,కేకో ,కూల్ డ్రింక్ జిగేల్ మని మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఈ వెలిగే తిండిని నోట్లో పెట్టుకోవడం సరదానే కదా. నూడిల్స్,పాస్తా, డిజార్ట్ లు క్యాండీల్లో వాటిని మెరిసేలా చేసేందుకు టానిక్ వాటర్ ను గాని విటమిన్ బీ 12 గాని ,జెల్ […]
మధుబని సౌందర్యం
బీహార్ లోని సమస్తేపుర అనే రైల్వే డివిజన్ కేంద్రం నుంచి ప్యాసింజర్ రైలు మాత్రమే నడిచే మద్ధుబని స్టేషన్ ఇప్పుడు అతి సుందరమైన స్టేషన్ గా ఇప్పుడు ప్రఖ్యాతి చెందింది. స్వచ్చ భారత్ లో భాగంగా స్టేషన్ల సుందరీకరణ పోటీల్లో పెడితే మిధిలా చిత్రకళకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతపు కళాకారులు 90 శాతం మంది స్త్రీలు కూలీ చేసుకుంటు పొట్ట పోసుకుంటూ నిరుపేద కళాకారులు ఈ మధుబని స్టేషన్ ను పదిరోజుల్లో ఓపెన్ ఆర్ట్ గ్యాలరీగా […]
ఇదోక కారణం
వివాహితులు వారు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా సంతానోత్పత్తి తగ్గిపోతుందని చెబుతున్నారు ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆరు వేల మంది మహిళల పై ఈ పరిశోధన సాగింది. కొన్ని పండ్లు,ఇతర పోషకాలు తీసుకున్న మహిళలు త్వరగా గర్భం దాల్చటం వీరు గుర్తించారు. కేవలం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే మహిళలు కొన్ని వారాలు,నెలలు ఆలస్యంగా గర్భం దాల్చారట. ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తూ గర్భదారణను ఆలస్యం చేసే జంక్ ఫుడ్ మానేయండనే సలహా ఇచ్చారట.
పిల్లల పై తండ్రి ప్రభావం
దురలవాట్లు ఎప్పుడు నష్టమే తాజా పరిశోధన ఒకటి తండ్రికి మద్యం తాగే అలవాటున్న ఊబకాయం ఉన్న ఒత్తిడిని ఎదుర్కునే సామర్ధ్యం తక్కువ ఉన్నా ఇవి వీర్యకణాలను ప్రభావితం చేస్తాయని దీని ద్వారా పూట్టబోయే బిడ్దలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారని చెబుతున్నారు. తండ్రి ఊబకాయంలో ఉంటే ఆ ప్రభావం పిల్లలపై పడి ఊబకాయం,డయాబెటిస్, గుండె సమస్యలతో పిల్లలు బాధపడతారని హెచ్చరిస్తున్నారు. తండ్రికి ఉండే దురలవాట్ల ప్రభావం రాబోయే తరాల పైన కూడా ఉంటుందని తల్లిదండ్రుల అనారోగ్యానికి పిల్లలు […]
