Thursday, 30 Jul, 2026

వస్తే డబ్బిస్తాం

ఈ ఊరు వెళ్ళి స్థిరపడదాం అనుకుంటే వాళ్ళకి ఖర్చులు కింద పదివేల డాలర్లు ఆరేడు లక్షలు ఇస్తుందట ఇక్కడి గవర్నమెంట్. ఇది వెర్మాంట్ అమెరికాలో ఒక రాష్ట్రం. ఇక్కడ దాదాపు అందరు వయసు మళ్ళినవాళ్ళు దాంతో 16 వేల ఉద్యోగాలు ఖాళిగా ఉన్నాయట. దింతో స్థానిక ప్రభుత్వ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళేవరైనా వెర్మాంట్ వచ్చి స్థిరపడితే ఊరు మారేందుకు అయ్యే ఖర్చులు క్రింద డబ్బు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకం 2021 వరకు ఉంటుందట. గ్రీన్ మెయింటైన […]

పాదాలు కోమలంగా

అందంగా మరకలు ,ముడతలు లేని చంద్రబింబం వంటి మొహం మాత్రమే కాదు పాదాలు అంతే మృదువుగా అందంగా ఉండాలి ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు మడుమలు ,పాదాల పక్క భాగం ఫ్యూమిక్ స్టోన్ తో రుద్ది స్నానం అయ్యాక బాధం నూనెతో కొద్ది సేపు మర్ధన చేయాలి. అలాగే రాత్రి వేళ పడుకొనే ముందరా ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో పాదాలు వుంచి తర్వాత చల్లని నీళ్ళలో కాసేపు ఉంచాలి. శుభ్రంగా తడిచి వ్యాజిలెన్ రాస్తే […]

తోక్కలో ఔషధ గుణాలు

యాపిల్ ఎంత ఆరోగ్యకరమో దానిపై తోక్క అంతకంటే మంచిది అంటున్నారు పరిశోధకులు. కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రిసెర్చులో తోక్కలో పన్నెండు రకాల రసాయన పదార్థాలు కాన్సర్ కణాలను సమర్ధవంతంగా అడ్డుకొంటాయని తేలింది. ట్రెటర్ పెనాయిడ్స్ గా వ్యవహారించే ఈ పదార్థాలు కాలేయం, పెద్ద పేగు ,రోమ్ము కాన్సర్ లకు సంబంధించిన కణాల పెరుగులదలను అడ్డుకుంటాయట. అంతే కాదు క్యాన్సర్ మృతకణాలను కూడా ఇవి బయటకి పంపిస్తాయి. పండు లోనూ క్యాన్సర్ నిరోధక ఫ్లేవ నాయిడ్ ఫిలోనిక్ ఆమ్లాలు […]

ఇంచక్కని అందం

పారిశ్రామిక ఉత్పత్తులు, ఫోటోగ్రఫీ, నగలు, పాత్రలు కంప్యూటర్ కీ బోర్డులు, మైక్రో వేవ్ కంట్రోల్ ఫ్యానెల్స్ లో వెండి తప్పని సరి భాగం .ఎప్పటికీ వెండి వస్తువులు కానుకగా ఇచ్చే సంప్రదాయం పచ్చగానే ఉంది. అన్నీ జ్యూవెలరీ సంస్థలు వెండి వస్తువులు తయారు చేస్తున్నాయి. వెండికి బాక్టీరియా ,వైరస్ లను దరి చేరనివ్వని లక్షణం ఉంది. ఆక్సిజన్ తాకిడి రంగు మారుతుంది కానీ తుప్పుపట్టదు. ఆహారపదార్థాలు నిల్వవుంచినా ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఇప్పుడు గృహాలంకరణల్లో వాడే […]

మన గురించి చెపుతాయి

ఎంత ఫ్యాషన్ గా ఉండవచ్చు. అందమైన దుస్తుల ఎంపికలో మనల్ని ఎవ్వళ్ళు మించక పోవచ్చు .కానీ ఏదైనా జాబ్ కోసం గానీ ముఖ్యమైన మీటింగ్ కు అటెండ్ అయ్యేప్పుడు గానీ దుస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. టైట్ గా ఉండే షర్టులు, టీషర్టులు ,లోవెయిస్టు పాంట్లు వద్దు. స్టైల్ కోసం కట్టుకొనే బ్యాండ్స్ తీసేయాలి. కామెడీ డిజైన్ లు ఉన్నా డ్రస్సులు వద్దు. ఏ ఉదోగ్యానికైనా ఫస్ట్ ఇంప్రెషన్ ముఖ్యం. హుందాగా కనబడటం ముఖ్యం. చక్కని లేత […]

కోల్డ్ కాఫీ

కాఫీ లేనిది క్షణం గడవదు. వేడి వేడి కాఫీ గొంతులో పడితే బుర్ర పనిచేస్తుంది అని చెప్పే వాళ్ళు ఎంతో మంది కాఫీల్లో రకాలు, రుచులు, ఆ కథ అలా ఉంచితే కోల్డ్ కాఫీ కూడా ఇతర పానీయాలు తీసుకుపోకుండా ఉంటుంది. ఇది తయారు చేయడం చాలా ఈజీ. మీగడ తీయని చల్లని పాలు రెండు గ్లాసులు, ఇన్ స్టెంట్ కాఫీ పొడి, రెండు స్పూన్లు, సరిపోయేంత పంచదార క్రష్డ్ ఐస్, ఓ అరగ్లాసు పక్కనే ఉంచుకుని నురగలు […]

సన్ స్క్రీన్ తో డేంజర్

సన్ స్క్రీన్ లు కాస్మోటిక్స్ అతిగా ఉపయోగిస్తే మంచిది కాదంటున్నారు. వాటిల్లోని బ్యూటైల్ ఫారా బెన్ అంత: స్రావ గ్రంధుల పైన ప్రభావం చూపెడుతుంది.దీని ఫలితం ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైన ఉంటుందని పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గుతుందని స్త్రీలలో అండాశయం, రొమ్ముల పెరుగుదలలో మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెపుతున్నారు. వీటిని మరింతగా ఒంటికి పట్టించేయకండి ఏదైన మితంగా ఉంటే మంచిదంటున్నారు.

ఇది బెస్ట్

బయటకు వెళితే చాలు దుమ్ము దూళి మొఖానికి స్కార్పులు కట్టుకున్న చర్మం కాంతి హీనం అయిపోతుంది. ఫేషియల్ క్రీములతో రసాయనాల బెడద ఈ సమస్య లేకుండా సహజమైన ఫెస్ ప్యాక్‌ వేసుకోవచ్చు. ఆరోగ్య నిధిగా చెప్పే గ్రీన్ టీ ఆకులు ముఖానికు కూడా మెరుపునిస్తాయి. గ్రీన్‌ టీ ఆకులు మెత్తగా పొడి చేసి అందులో పెరుగు,ఆలివ్ అయిల్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత కడిగేస్తే మొహం చక్కగా మెరిసిపోతూ కనిపిస్తుంది.

క్యాలరీలు తగ్గిస్తే బెటర్

రోజు తీసుకునే ఆహారంలో 30 శాతం క్యాలరీలు తగ్గించగలిగితే ఎన్నో రకాల అనారోగ్యాలు వెనక్కిపోతాయి అంటున్నాయి అద్యాయనాలు. అంటే అవసరానికి మించి ఆహారం తీసుకోవడమే అనారోగ్యానికి కారణం. ఆహారనియమాలు పాటిస్తూ కొన్ని క్యాలరీలు తగ్గించగలిగితే మధుమేహం,గుండె జబ్బులు రావని చెబుతున్నారు. శరీరం బరువు కొద్దిగా తగ్గినా నడుం నొప్పి,వెన్ను నొప్పి వంటివి భాదించకుండా ఉంటాయని అధ్యాయనాలు చెబుతున్నాయి.

భాషలు నేర్చుకోండి

ఎక్కువ బాషలను నేర్చుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకులు చెబుతున్నారు. భాషలు వస్తున్న కొద్ది మెదడు కణాల్లో సాగే గుణం పెరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు. కొంతమంది విద్యార్ధులను ఈ పరిశోధనలోకి తీసుకుని విదేశీ భాషాల పదాలు నేర్చుకుంటున్న సమయంలో ఎలక్ట్రో ఎన్ సెఫలోగ్రాఫీ ద్వారా మెదడు కణాల పని తీరుని పరిశీలించారు. ఈ కణాల కదలిక ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు భాషను మాటను మర్చిపోతే వాళ్ళలో తిరిగి అవి […]

బంగారం వంటి నూనె

మొరాకోలో ఎక్కువగా పెరిగే ఆర్గన్ చెట్లనుంచి తీసే ఆర్గాన్ నూనెను మొరాకో బంగారం అంటారు. విటమిన్ ఎ, విటమిన్ ఇ సమృద్దిగా ఉండే ఈ నూనె అందానికి ఆరోగ్యానికి పెట్టింది పేరు. మొహం పైన మొటిమలు మచ్చలు చికెన్ ఫాక్స్ పోగొట్టడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. అందుకే దాన్ని బంగారంతో సమానంగా భావిస్తున్నారు. శరీరంలో మెరుపును శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదం చేస్తుంది. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. చర్మ సంబంధమైన వ్యాధుల్లో విశేషంగా ఉపయోగపడుతుంది.

తల్లులకు డి విటమిన్

ఒక పరిశోధన పాలిచ్చే తల్లులు డి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల పిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల తలెత్తే జబ్బులు రావంటున్నారు. తల్లులు డి విటమిన్ వాడితే పిల్లల్లో ఆ విటమిన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉన్నారు. ఒక కణజాలం కాల్షీయం ని షోషించుకునేందుకు విటమిన్ డి ఎంతో అవసరం. ఇది సూర్యరశ్మి ద్వారానే అందుతుందని ఇంతవరకు మనకు తెలిసిన అంశం. కాని ఎముకల సంభందిత వ్యాధులు పిల్లలకు రాకుండా వాళ్ళు సూర్యరశ్మిలోని డి విటమిన్ […]

చేత్తోనే చేస్తారు

చేత్తో చేసే నల్లని మట్టి పాత్రలను లాంగ్ పీ పాటరీ లేదా రాయల్ పోటరీ అంటారు. మణిపూర్ లో ఎత్తైన కొండ శిఖరం పైన ఉన్న ఊఖ్రూల్ దగ్గరలోని లాంగ్ పీ కొండ గ్రామాల్లో నివశించే థంకూల్ నాగా తెగ ఈ పాత్రతో చక్రంతో పనిలేకుండా వట్టి చేత్తో తయారు చేస్తారు. ధర కాస్త ఎక్కువే ఈ గ్రామంలో దోరికే సెర్పంటైన్ అనే నల్లరాతిని పొడి చేసి అక్కడ దోరికే గోధుమరంగు మట్టిని కలిపి చేత్తోనే రకరకాల […]

ఇవి గుండ్రని పర్సులు

  అందమైన పర్సులు బ్యాగులు ఎన్నో రకాల్లో వచ్చాయి. చేత్తో పట్టుకుని చతురస్రంగా, త్రికోణం, దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉండేవి చూశాం. కాని ఇప్పుడు అందమైన మెరిసే గుండ్రని క్లబ్ పర్సులు వచ్చాయి. ఇవి అచ్చం బంతిలా ఉన్నాయి. వీటిని మెరిసే పూసలు,రాళ్ళు, మెటల్ లో తీర్చిదిద్దారు. చేత్తోపట్టుకుంటే మెరిసిపోతూ కనబడే వాటిని పట్టుకునేందుకు వీలుగా బెల్టులు, రింగ్ లు ,చైన్లు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి బంతుల్లాంటి బ్యాగ్స్. ‎

బ్లవుజుకో బ్రూచ్

పార్టీల్లో మెరిసిపోవాలంటే ఏదో ఒక కొత్తదనం తేవాలి. ఎప్పుడు అలంకరణలో నగలంటే మెడలో వేసుకునేవి చేతులకు, చెవులకు పెట్టుకునేవి ఇప్పుడు కొత్తగా వచ్చాయి శారీ పిన్ బ్రూచ్ లు. చీరలకు తగిలించుకోవచ్చు బ్లవుజులకు అందంగా అమర్చుకోవచ్చు. రాళ్ళూ పూసలు కుందన్ లతో వస్తున్న ఈ బ్రూబ్ లు చీరెలు,ఓణీలు,జాకెట్ల మీదకు కూడా చక్కని అలంకారమే. ఇమేజెస్ చూడండి. డిజైన్స్ వందల్లో ఉన్నాయి. బ్లవుజ్ యాక్ససరీస్ జ్యూలరీ బ్రూచ్ పిన్ అని ఆన్‌ లైన్‌ లో వెతికితే బ్లవుజులకు […]

తగిలించే గిన్నెలు

టిఫెన్,స్నాక్స్ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని తినమంటే పిల్లలు ఎప్పుడు తినరు. టీవీ చూస్తూ తినాలి, కార్లో ప్రయాణం చేస్తూ తినాలి. ఒక్క ప్లేట్ సరిపోదు చట్నీలు,సూప్‌ లు రకరకాల కూరలు నాలుగైదు కావాలి. ఇవన్ని ప్లేటులో పెట్టుకుని గబగబా ఎక్కడికి తీసుకుపోలేం కదా. ఈ సమస్య తీర్చేందుకు వచ్చాయి టాస్టో చిప్ అండ్ డిప్ సెట్ గిన్నెలు. వీటిని ఒక వేడాల్పాటి గిన్నెకి క్లిప్పుల్లా తగిలించవచ్చు. ఈ గిన్నెలకే తగిలించే ఏర్పాట్లు ఉన్నాయి. ఓకె […]

బుల్లి కాయగూరలు

పెరటి తోటల్లోనో, కిచెన్ గార్డెన్ లోనో పెంచుకునేందుకు పంటలు పండించేందుకు అనువుగా ఉన్నాయి మీనియోచర్‌ పండ్లు కూరగాయలు అన్ని దేశాలు ఇప్పుడు బుల్లి కూరగాయల పెంపకంపై దృష్టి పెట్టాయి. ఇప్పటి వరకు హైబ్రీడ్‌ ఆనవాళ్ళు కూడా ఇప్పుడు చిన్న వాటి పైనే ఆసక్తి చూపుతున్నాయి. చిన్ని పెరల్ ఉల్లిపాయలు,బుల్లి దోసకాయలు,బేబీ పోటాటో, చిన్ని క్యాప్సికం, బెండకాయ,కీరాతో సహా మినియేచర్‌ కూరగాయల పంటలు వచ్చాయి. బేబి అనాన్‌ లైల్ చూసేందుకు పెద్దవాటిలాగే ఉన్నా లోపల మొత్తం మెత్తగా ఉండి […]

గొప్ప కథలు

ధువా పేరుతో వచ్చిన ఈ గుల్జార్ కథలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. గుల్జార్ కవి ,సినిమా గేయ రచయిత .ఆయన అద్భుతమైన కథలు రాశారు అవన్నీ సామాన్యుల వేతలు .1947 లో భారతదేశ విభజన సంద్భరంలో ఆ నేపథ్యంలో రాసిన కథలు ఇవి. ఉర్ధూలో రాసిన ఈ కథలను సి మృణాళిని అనువాదం చేశారు. ఇతర రాష్ట్రాల ,దేశాల సాహిత్యం చదువుతూ వుంటే మనకు మనుష్యులు ఎక్కడి వారైనా ,వాళ్ళ ఆలోచనలో ఒకేలాగే ఉంటాయని తెలస్తుంది […]

ఇదే ఔషధం

పుస్తకాలు చదవటం ఆరోగ్యం అంటున్నారు ఇప్పటి అధ్యయనాలు కార్టిసాల్ వంటి ఒత్తిడి చేసే హార్మోన్స్ స్థాయిలను నియంత్రించాలంటే ఒక మంచి పుస్తకాన్ని దీక్షగా లీనమై చదివితే చాలు. యాంగ్జయిటీ పెంచే కార్యకలాపాలు ఆలోచనలు మనిషిని స్థిమితంగా ఉండనివ్వవు. మందులు కూడా ఒక స్థాయిలో పని చేయవు. ఆ సమయవలో పుస్తక పఠనం సంగీతం వినటంతో ఒత్తిడి స్థాయిలు తగ్గిపోతాయి. ఇలా చేస్తే 67 శాతం యాంగ్జైటీ నియంత్రణలోకి వస్తుంది. మూడు బాగవుతుంది. చదవటంలో ఉండే మ్యాజిక్ ఇది.

పిల్లల ఆరోగ్యం కోసం

పిల్లలు రాత్రివేళ ఎక్కువ సేపు నిద్ర పోతారు కనుక వాళ్ళలో డీ హైడ్రేషన్ అవకాశాలు ఉంటాయి. అందుచేత ఉదయం వేళ వారికి ద్రవ పదార్థాలు ఆహారం అంటే టోమోటో జ్యూస్ వంటివి ఇవ్వటం మంచిది. ఉడికించిన టోమోటో లికొసిన్ అనే రసాయనం విడుదల చేస్తుంది అది పిల్లల ఎదుగుదలకు మంచిది. చర్మం బావుంటుంది కూడా అలాగే పిల్లల ఉదర ఆరోగ్యానికి పులియబెట్టిన పదార్ధాలు కూడా మంచివే .ఇవి శారీరక రోగనిరోధక వ్యవస్థకు బాగా సపోర్టు చేస్తాయి. ఇడ్లీ,దోసె […]