ఎన్నెన్నో రంగులు
ఇవ్వాల్టి రోజుల్లో ఏదో ఒక రంగే ఫ్యాషన్ అయిపోదు. మల్టీ కలర్ ఫ్యాషన్ రాజ్యం ఏలుతుంది. సప్త వర్ణాల చీరె దానికి తగ్గ ఇంద్రధనుస్సు రంగుల్లో గాజులు,చెవి రింగులు,చేతి ఉంగరాలు,జడ క్లిప్పులు సర్వం రంగుల మయం. ఇంతేనా వీటికి తోడు ఇంటీరియర్స్ లో కూడ సప్త వర్ణాలు తలుక్కుమంటున్నాయి.తినే కేకులు,పేస్ట్రీలలో కలుపుకుని దుప్పట్ట్లు,కర్టెన్స్, అన్ని వర్ణ మయం. సృష్టిలో కనిపించే ప్రతి రంగును ఫ్యాషన్ తన చేతుల్లోకి తీసుకోనుంది.
అనారోగ్యమే
ఇంటి దగ్గర వంట చేసుకోవడం బాక్స్ తీసుకు పోవడం వంటివి ఈ రోజుల్లో లేనట్లే. ఆఫీస్ లో ఉచితంగా మంచి లంచ్ ఎన్ని సార్లు కోరుకుంటే అన్ని సార్లు కాఫీ,టీ ,లెమన్ టీ వంటివి అందుబాటులో ఉండటం వల్ల ఇంటి భోజనం కరువైపోతుంది. ఆఫీస్ భోజనాల్లో పోషక పదార్ధాలు తక్కువ. అదనపు క్యాలరీలు ఉంటాయి.శాండ్ విచెస్, సాఫ్ట్ డ్రింక్స్ ,కేక్స్ ఫ్రెంఛ్ ప్రైస్ వంటివి ఎక్కువ స్నాక్స్ గా ఉంటాయి. ఇవన్ని ఆరోగ్యాన్ని చెడగొట్టేవే.వేగంగా జీర్ణం ఆయ్యేవి […]
ఇప్పుడీ చీరె గొప్ప బ్రాండ్
ప్రత్యేకంగా ఉంటే పది మంది మెచ్చితే అవి బ్రాండ్ అయిపోతాయి. గొల్ల్బామ చీరెల్లాగ చీరాల,గుంటూరు,ఉప్పాడ,పోచంపల్లి ఇవన్ని బ్రాండ్స్. అలాగే తెలంగాణలోని సిద్దిపేటలో తయారయ్యే గొల్లభామ చీరెలు కూడా ఇప్పుడు బ్రాండే. ఎప్పుడో 70 ఏళ్ళ నాడు చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య,రచ్చ నర్సయ్యలు తల పైన పాలకూర, చేతిలో పెరుగు పట్టుకుని వీధిలో నడిచిపోతున్న ఓ మహిళ నీడను చూసి ఆ డిజైన్ లో ఇప్పుడు పట్టు,చేనేత,గొల్ల భామ చీరెళు దేశ విదేశాల్లో సందడి చేస్తున్నాయి.
ఎన్నో లాభాలు
ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే చురుకుగా హుషారుగా ఉండటమే కాదు పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది అంటున్నారు. గ్రీన్ టీ పోడిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శాతం ఎక్కువ. అవి క్యాలరీలను కరిగించి శరీరంలోని ట్యాక్సిన్ లను తొలగిస్తాయి. మానసిక ఒత్తిడి ఆందోళన పోతాయి. స్కిన్ ఎలర్జీల నుంచి ఉపశమనం. కండరాలకు విశ్రాంతి ఇవ్వడం శరీరంలోని కొవ్వును కరిగించడం గ్రీన్ టీ సాయపడుతుంది. జలుబు దగ్గు నివారణలో కీళ్ళ నడుమ ఉండే కార్టిలేజ్ పరిరక్షణలో ఉపకరిస్తుంది. […]
ఉడికించే పద్దతిలో ఆరోగ్యం
మనం రోజు తినే ఆకు కూరల్లో ఉండే ఖనిజాలు,విటమిన్లు,ప్రోటీన్లు వల్ల ఎంతో ఆరోగ్యం దక్కుతుంది. పాలకూరలో కాల్షియం ఎముకల సాంద్రత పెంచుతుంది. గోంగూరలో ఐరన్ ఎక్కువ. కంటి వ్యాధులు తగ్గుతాయి. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ,చుక్క కూరలో మెగ్నీషియం, విటమిన్ సీ మునగాకులో ఐరన్ ,కాపర్ లు ఎక్కువగా ఉంటాయి.కరివేపాకులో బయోటెక్ జుట్టు సంరక్షణకు పనికి వస్తుంది.పదార్ధాలు ఎంత రుచికరంగా తయారు చేసుకుంటాం అనే దానితో పాటు అవి చేసే పద్దతులు ఆరోగ్యకరంగా ఉండాలి. బేక్ గ్రిల్ […]
రంగుల్లో సగ్గు బియ్యం
సగ్గు బియ్యం అంటే తెల్లని పరమాన్నం గుర్తుకు వస్తుంది కాని ఇప్పుడు రంగు రంగుల సగ్గు బియ్యం వస్తున్నాయి. ఆరోగ్యకరమైన కూరగాయలు,పండ్ల రుచులతో వచ్చే ఈ సగ్గు బియ్యంతో ఎన్నో పదార్ధాలు వండేయవచ్చు. క్యారెట్,బీట్ రూట్ పాలకూర ,స్ట్రాబెర్రీ,మామిడి ఇలా పండ్లు కూరగాయల రసాలు కలిపి రంగుల్లో తయారు చేసిన ఈ సగ్గు బియ్యంతో హల్వా, పులిహోర,ఉప్మా,డిసర్ట్ లు,ఫలుదా ,బబుల్ టీ,కేక్స్ తయారు చేస్తున్నారు. సగ్గు బియ్యం,కర్ర పెండలం దుంప లేదా సాగోపామ్ కాండం లోపలి భాగం […]
బోర్డర్ లేకుండా బావుంటాయి
పట్టు ఇష్టమే కానీ భారీగా ఉండే చీరెలు ఆఫీసులకు బావుండవు. సంప్రదాయ వస్త్ర శ్రేణి ని ట్రెండీగా వాడుకోవచ్చు అంటారు ఫ్యాషన్ డిజైనర్లు.ఆఫీసు కు కట్టుకోవాలి అనుకుంటే బోర్డర్ లేని చీరె ఎంచుకోవచ్చు.ఇప్పుడు అవి ఫ్యాషన్ కూడా, బోర్డర్ లేకపోయిన చక్కని పనితనం ఉన్న పైట కొంగు కనిపిస్తుంది. అప్పుడు హెవీగా డిజైన్ చేసిన చక్కని బ్లౌజ్ వేసుకుంటె సరిపోతుంది. సింపుల్ గా ఒక్క గొలుసు వేసుకున్న సరిపోతుంది. పరికిణి ఓణిలు కూడా మంచి ఎంపికే. కంచి […]
ఒత్తుగా అవుతాయి
ఒత్తుగా కనుబొమ్మలు కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. కనుబొమ్మలకు ఉల్లిపాయ రసం రాసి నాలుగైదు గంటలు అలా వదిలేసి గోరు వెచ్చని నీళ్ళలో కడిగేస్తే వత్తుగా పెరుగుతాయి. కొన్ని కొబ్బరి నూనె చుక్కల్ని కను బొమ్మల పై రాసి మసాజ్ చేసి అలా రాత్రంతా వదిలేస్తే మంచిది. ఆముదం కూడా జుట్టు ,కనుబొమ్మలకు కూడా మంచిదే. ఒక చుక్క ఆముదంతో కనుబొమ్మలను మసాజ్ చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో కడిగేయాలి.లావెండర్ […]
నిదురా రావమ్మరావే
తొందరగా నిద్రపోయే అలవాటు చేసుకోవాలన్న అలవాటైన ఆలస్యంగా పడుకునే అలవాటు నిద్ర రానివ్వదు. ఎంత సేపు పడుకున్న నిద్రపట్టదు. ఈ సమస్యను పూర్ స్లీప్ కన్సాలిడేషన్ అంటారు. బెడ్ పైన సమయం గడుపుతున్నా నిద్రపోయే సమయం తక్కువ అవ్వటం దిన్ని నెమ్మదిగా పోగొట్టుకోవచ్చు. బెడ్ టైమ్ కి ముందుగా కునుకు తీయకుండా బాగా నిద్ర వస్తున్నప్పుడే పడుకోవాలి. ఒత్తిడి కలిగించే విషయాలు ఉంటే ఆ ఆందోళనతో పక్క పైకి వాలకూడదు. వీకెండ్స్ అయినా వేళ ప్రకారమే నిద్రపోవాలి […]
బ్రేక్ తీసుకుంటే మంచిది
స్ట్రెస్ ఫీలయితే డీప్ బ్రీతింగ్ చేయటం మంచిది అంటారు.కంప్యూటర్ ముందు పని చేసేవాళ్ళు గంటకు ఐదు నిమిషాలు చొప్పున కంప్యూటర్ స్క్రీన్ పై నుంచి బ్రేక్ తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకి ఒకసారి మెడను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో రోటెట్ చేయాలి. బుజాలను ముందు వైపుకు వెణక్కు మూడేసిసార్లు తిప్పాలి. డీప్ గా గాలి పీల్చి వదలాలి. ఐదు లెక్కపెట్టే వరకు ఉండి బుజాలను కిందికి దించి గాలి వదలాలి. గాలి వదిలేసి […]
భలే మెరుపు
ఎన్నో పువ్వులు ఇంటికి తెస్తాం పూజకో అలంకరణకో ఫ్లవర్ వాజ్ లోకో అవి వాడిపోయాక పారేయకుండా కొన్ని చికిత్సల కోసం వాడమంటున్నారు ఎక్స్ పర్ట్స్. గులాబీ పూలు,మందార పూలు , చామంతి,బంతి ఏవైనా సరే ముందుగా ఎండబెట్టాలి. వాటిని విడివిడిగా బాక్స్ ల్లో పెట్టుకోవాలి. అరకప్పు నీళ్ళు మరిగించి అందులో గోద్రెజ్ ఎండిన మందార గులాబీ రేకులు వేసి మూత పెట్టేయాలి.ఆ నీటిని వడకట్టి అందులో కొబ్బరి నూనె మెత్తటి ఉప్పు కలిపి వంటికి పట్టించి ఓ […]
ఎఫ్పుడు కొత్తగా
ఆఫీస్ కు కుర్తీలే ఇష్టపడతారు అమ్మాయిలు అయితే రోజు ఒకే రకంగా కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నం చేయమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. కుర్తీ లెగ్గింగ్ స్టైయిల్ కి కాస్త భిన్నంగా కనిపించాలి అంటే లెగ్గింగ్స్ బదులు జెగ్గింగ్స్ ఎంచుకోవచ్చు. స్కర్ట్ లో పలోజీలు కూడా బాగానే ఉంటాయి.ఈ పలోజీలు మ్యాచింగ్ గా సైడ్ స్లిట్స్ ఉన్నా కుర్తీలు ట్రెండీగా ఉంటాయి. టాప్ పైన ఓవర్ కోట్ కూడా కొత్త ట్రెండే. పొడవాటి కుర్తీకి జోడిగా టోర్న్ జీన్స […]
జుట్టుకు పోషణ అవసరం
జుట్టు తెల్లబడేందుకు కారణం శిరోజాల్లోని పిగ్మెంట్ కణాలైన మెలనో సైట్స్ పని నెమ్మదిగా అవటం వల్లనే జుట్టు తెల్లబడటం మొదలైన కుదుళ్ళలో మెలనో సైట్స్ ఉంటాయి. కాకపోతే తక్కువ చురుగ్గా ఉంటాయి. శిరోజాల్లో తక్కువ పిగ్మెంట్స్ డిపాజిట్ అయినప్పుడు ఎక్కువ గ్రే హెయిర్ ఉన్నట్లు భ్రాంతి కలుగుతోంది. వయస్సు పెరిగే కొద్దీ శిరోజాల్లో ఉండే మెలనో సైట్స్ నశించిపోతాయి. దీని వల్ల రంగు ఉత్పత్తి చేసే కణాలు ఉండవు. ఇంత ప్రకియ జరిగాకే తెల్లబడుతుంది. అందుకే పోషకాహారం […]
శ్రావణ లక్ష్మి కి స్వాగతం
ఈ రోజు నుంచి శ్రావణ మాసపు లక్ష్మి పూజలు ఆరభం. ఈ మాసంలో మంగళ,శుక్రవారాలు లక్ష్మి దేవిని కొలిస్తే ధన రాసులను అందిస్తుందట వరలక్ష్మి దేవి. మాసాల్లో శ్రావణం ,ఋతువుల్లో వర్షం, వారాల్లో శుక్రవారం ,వాహాన్నాల్లో పసుపు,సుగంధ ద్రవ్యల్లో అగరు ,కస్తూరి నివేదనల్లో పాయసం ఇష్టం అంటుంది లక్ష్మి దేవి. శ్రావణ మాసంలోని మంగళ,శుక్రవారాలు మహాఫలాలనై ,సుఖాలను,ఐశ్వర్యాన్ని ఇస్తాయి.ఈ శ్రావణ మాసపు పూజల్లో సులభంగా వరాలు ఇచ్చే లక్ష్మి దేవి అనుగ్రహాం కలుగుతుంది. అటూ ఇటూ ఏనుగులు […]
మట్టి పాత్రల్లో రుచి
వంట పాత్రల్లో ఎన్నో రకాలు వచ్చాయి .ఎన్ని రకాల లోహాలతో వచ్చినా పాత కాలపు మట్టి పాత్రలదే నాణ్యత. ఈ మట్టి పాత్రలతో చాలా తక్కువ నూనెతో ,అసలు నూనె లేకుండానూ ఏ పదార్ధలు అయినా తయారు చేసుకోవచ్చు. పదార్ధాలు రుచి పెరుగుతుంది. పోషకాలు నిలిచి ఉంటాయి.క్లే లో ఆల్కలైన్ గుణాలు ఎసిడిక్ పదార్ధాల పి హెబ్ బాలన్స్ ను న్యూట్రిలైజ్ చేస్తాయి. క్లే పాట్స్ మొదటి సారి వాడుతున్నాప్పుడు కనీసం పావుగంట సేపు నీటిలో ఉంచి […]
వర్షాల్లో మెరిసే చర్మం
వర్షాలు పడుతుంటే ఈ సీజన్ హాయిగానే ఉంటుంది. కానీ ఈ వానల ప్రభావం చర్మంపై పడుతుంది. చర్మం పేలవంగా మారి పోతుంది. వంటగదిలో వాడే పదార్ధాలతో చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా చేసుకోవచ్చు. బొప్పాయి ఫేస్ మాస్క్ చర్మాన్ని నిగారింప చేస్తుంది.బొప్పాయిలోని ఏ పెయిన్ మృతకణాలు పోరను ట్యాన్ లను తొలగిస్తుంది. నిమ్మ సీల్ కూడా మంచిదే సగం నిమ్మచెక్కతో మొహానికి ,మోచేతులు తుడుచుకొంటే ట్యాన్ పోతుంది. ఇంకో సహాజమైన బ్లీచ్ నిమ్మరసం ,పెరుగు గంధంపొడి కలిపి మాస్క్ […]
సీజన్ కి తగ్గ ఎంపిక
ఈ వర్షాల్లో ప్రత్యేక హెయిర్ యాక్ససరీస్ ఎంచుకోవాలి .కలర్ ఫుల్ క్లాత్ హెయిర్ బాండ్స్ ,డెకరేటివ్ ఆర్కిమెంటల్ హెయిర్ క్లిప్స్ సాయంత్రం వేళలకు బాగా మ్యాచ్ అవుతాయి.జుట్టు రేగినా ఈ రకం క్లిప్పులు అ లోపాన్ని మరుగు పరిచి సవరిస్తాయి. చక్కని హెయిర్ కలర్ ,హెయిర్ ఎక్స్ టెన్షన్స్ కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాలేజీ స్టూడెంట్స్ కి ఈ ఎక్స్ టెన్షన్లు నప్పుతాయి. హెయిర్ బాండ్ క్లిప్లులు వ్యక్తిగత స్టైల్ ,వయస్సు ,ధరించే డ్రెస్ అనుసరించి ఎంచుకోవాలి. […]
బోడ్డు తాడు జాగ్రత్త
గర్భవతిగా ఉన్నప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి . శరీరాన్ని రకరకాల ఇన్ ఫెక్షన్స్ నుంచి కాపాడు కొనేందుకు అవసరమైన వాక్సిన్లు తీసుకోవాలి. మొదటి మూడు నెలలు దాటాక డాక్టర్స్ అనుమతితో ప్రయాణం చేయవచ్చు. ఎత్తైన ప్రదేశాలకు మాత్రం వద్దు. స్లీపింగ్ పోజిషన్ మార్చుకోవాలి. బోర్లా పడుకోకూడదు. ఏదో ఒక సైడ్ ఒత్తిడిగా పడుకోవాలి .క్రమం తప్పకుండా ,డాక్టర్ సలహా పైనే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకొంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. పుట్టుక లోపాలుండవు. అనేక ప్రాణాంతాక వ్యాధుల్ని […]
ఈ సంవత్సరం రంగు
ఇవ్వాళ్టి రోజుల్లో ముదరు రంగులు ఎంతో ఫ్యాషన్ .అందులో రెడ్ లేటెస్ట్ .ఈ రెడ్ స్టైల్ లో అన్ని రకాల యాక్సస రీస్ వస్తాయి. ఈ రెడ్ స్టైల్ లో పెదవులకు వేసుకొనే లిప్ స్టిక్ కూడా మాట్ టైల్ రెడ్ లిప్ స్టిక్ అందమైన రెడ్ సియచ్ పాలిష్ ,మరి వర్షమేఘం కనిపిస్తే ఎర్రని గొడుగు ,అన్ని చక్కని కాంబినేషనే. ఎరుపు ఫ్రాక్ వేసుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. లాంగ్ ఫ్రాక్ స్టైల్ గౌన్ మ్యాచింగ్ […]
సూపర్ స్టైల్
చీరె ఎప్పుడు ఫ్యాషనే .అయితే చీరెకట్టులో ఎప్పటి కప్పుడు కొత్త మార్సులు వస్తాయి. బ్లౌజ్ ప్లేస్ లో ఇప్పడు చక్కని టాప్స్ వచ్చాయి. చీరెకు తోడుగా లాంగ్ జాకెట్ చీరె ,స్టర్ట్ తో చీరె , కుర్తీ కుచ్చిళ్ళు చీరె .ఇలా చీరె కట్టులో కొత్త ష్యాషన్ తో అమ్మాయిలు చమక్ మంటున్నారు. ప్రింటెడ్ చీరెకట్టు మారింది కనుక ఇలాంటి కుర్తీ చీరెకు మ్యాచింగ్ ఆభరణాలు కూడా అక్కర్లేదు. చక్కని జూకాలతో చెవులు మెరిస్తే చాలు షార్ట్ […]
