Saturday, 01 Aug, 2026

సిలికాన్ టీతర్లు సురక్షితం

పిల్లలకు పాల దంతాలు వస్తుంటే చేతికి అందిన ప్రతీ వస్తువు నోట్లో పెట్టుకొంటారు అప్పుడు పిల్లలకు టీతర్లు ఉపయోగపడతాయి. ఈ టీతర్ల తయారీలో లోహం ఉండకూడదు. నాన్ టాక్సిక్ టీతర్ల ను ఎంచుకోవాలి. పిల్లలు కొరికేందుకు మెత్తగా ఉండాలి టీతర్ల లో నీళ్ళు నిండినవి జెల్ నింపినవి ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు రంధ్రాలు పడ్డాయి ఏమో పరీక్ష చేస్తూ ఉండాలి. ప్లాస్టిక్ టీతర్లు రసాయనాల ప్రమాదం ఉంటుంది. సిలికాన్ తో తయారైన టీతర్లు సురక్షితం.

నెయిల్ పాలిష్ బ్యాగ్  

అనేక రంగుల్లో నెయిల్ పాలిష్ లు కొంటూ ఉంటారు అమ్మాయిలు ఇవన్నీ ఎక్కడ రంగు వేసుకుంటే అక్కడ వదిలేస్తూ సమయానికి కనబడకుండా అదృశ్యమై పోతుంటాయి. ఈ నెయిల్ పాలిష్ లను అమర్చుకునేందుకు అనేక ఆర్గనైజర్లు  మార్కెట్లో దొరుకుతున్నాయి. యార్వో కంపెనీ ఒక చక్కని బ్యాగ్ రూపొందించింది. ఈ నెయిల్ పాలిష్ బ్యాగ్ లో 24 రంగుల బాటిల్స్ పెట్టుకోవచ్చు. నెయిల్ ఆర్ట్ కు సంబంధించి బ్రష్ లు స్టిక్కర్లు పెట్టుకునేందుకు వీలుగా  ఈ బ్యాగ్ లో ఏర్పాట్లు […]

అలసట మాయం

నెలసరి సమయంలో చిరాకు అలసట ఒత్తిడి అనిపిస్తాయి సువాసనలతో ఈ ఇబ్బంది నుంచి బయట పడవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. మానసిక సంబంధిత చికిత్సల్లో ఉపయోగించే జాస్మిన్ పరిమళం, మనసుకు విశ్రాంతినీ, నిద్రనూ ఇస్తుంది. పడుకునే ముందుగా దిండు పై చిలకరిస్తే చాలు డిఫ్యూజర్ క్యాండిల్, ఎండిన పూల రూపాల్లో దొరికే లవెండర్ ను, బెడ్రూంలో ఉంచుకుంటే మనసు తేలిక పడుతుంది. కొన్ని చుక్కల ఆరెంజ్ ఆయిల్ ను డిఫ్యూజర్ లో వేసి ఇంట్లో ఉంచితే చాలు. ప్రపంచవ్యాప్తంగా […]

చర్మ సంరక్షణ అవసరం

గర్భం ధరించినప్పుడు హార్మోన్లలో వచ్చే వ్యత్యాసంతో మెడ నల్లబడటం, చర్మం సాగిపోవడం వంటివి జరుగుతాయి ప్రతిరోజు మాయిశ్చరైజ్ చేసుకోవటం తప్పనిసరి మెడ పొత్తికడుపు తొడలపై స్ట్రెచ్ మార్క్, మొహంపై పిగ్మెంటేషన్ వంటి నాలుగవ నెల నుంచి కనిపిస్తాయి. దీనికి మృదువుగా ఏదైనా తేలికైన నూనెతో మసాజ్ చేసుకోవాలి. కెమికల్స్ లేని ఉత్పత్తుల్ని ఉపయోగించాలి. కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిది. హార్మోన్లు ఆ సమతుల్యాన్ని తగ్గించుకునేందుకు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే కూరలు బ్రకోలి.సిట్రిస్ వంటి […]

అంతరిక్ష యానం

ఈ సంవత్సరం తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామిగా  నిలిచింది బండ్ల శిరీష. ఇండియన్ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజనీర్ వర్జిన్ గెలాక్టిక్ అధినేత తో కలిసి అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి తెలుగు అమ్మాయి. గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష తల్లిదండ్రులతో అమెరికాలోని  హ్యూస్టన్ వెళ్లి అక్కడే చదువు పూర్తి చేసింది. 2015 లో వర్జిన్ గెలాక్టిక్ లో చేరి అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శిరీష […]

సంకల్ప బలం

గడచిన సంవత్సరం లో తన సేవలతో ప్రజలను ప్రభావితులను చేసినందుకు గాను భారత్ లోని అత్యంత శక్తివంతమైన ప్రభావ పూర్వకమైన 21 మంది లో ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ 2021లో పేరుతెచ్చుకుంది మెటిల్డా కుల్లు ఒడిస్సా సుందర్‌ఘర్ జిల్లాలోని గార్దభహల్‌ గ్రామానికి చెందిన ఆశ వర్కర్ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి తో ప్రపంచం గడగడలాడుతున్న సమయంలో కోవిడ్ కిట్లు ఇతర సామాగ్రి తో కొండ కోనల్లో లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్ పై […]

మోడలింగ్ నా ఫ్యూచర్

మిస్ యూనివర్స్ గా ఎంపికైన హర్నాజ్ సంధూ నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరివీ భారతీయ మూలాలే గత 35 ఏళ్లలో సింగపూర్ కు చెందిన ఏ అమ్మాయి మిస్ యూనివర్స్ సెమీఫైనల్స్ వరకు వెళ్లలేదు. జడ్జి అడిగిన ఎన్నో ప్రశ్నలకు నేను నిజాయితీగా సమాధానాలు చెప్పాను ఆ నిజాయితీ నన్ను సెమీ ఫైనల్స్ కు తీసుకు వెళ్ళింది అంటుంది నందితా బన్నీ. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే నందిత నేను పుట్టి పెరిగింది సింగపూర్ లో, ఆ దేశపు […]

లింగ వివక్షకు చెక్

కేరళ లోని బాలు శర్రీ (Balu serry ) ప్రభుత్వ పాఠశాలలో తాజాగా విద్యార్థులందరికీ ఒకేలాంటి యూనిఫామ్ కేటాయించి లింగ వివక్షకు వ్యతిరేకంగా నిలబడ్డారు. 200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో అందరూ ప్యాంట్ షర్ట్ ధరించాలనే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టారు. గతంలో విద్యార్థినీలు చుడిదార్ లేదా స్కర్ట్ ధరించే వాళ్ళు ఇటువంటి గొప్ప నిర్ణయానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక కేరళలో మిగతా పాఠశాలలూ ఈ ఫాంట్ షర్ట్ విధానాన్ని […]

ఈ మార్పు మంచిదే

2021 సంవత్సరం మహిళలకు బ్రహ్మాండమైన స్ఫూర్తిని శక్తి నిరూపించుకునే అవకాశాలు ఎన్నో ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వధువు వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా ఒక మంచి మార్పు ఇచ్చే ఉద్దేశ్యం ఉంది. చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లు అమ్మాయి మానసిక శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని దీనివల్ల  ప్రసవానంతర మరణాలు నవజాత శిశు మరణాలు పెరుగుతున్నాయని సర్వేలు చెప్పటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 21 ఏళ్ల […]

గ్రామాల అభివృద్ధి లక్ష్యం

భూపాల్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల జాగ్రతి అవస్థి యు పి ఎస్ సీ పరీక్షల్లో దేశంలోనే రెండవ ర్యాంకర్ గా నిలిచింది మహిళల్లో ఆమెదే ఫస్ట్ ర్యాంక్ మౌలనా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017 లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.  ప్రతిష్టాకరమైన గేట్ పరీక్ష లోను మంచి ర్యాంకు సాధించింది. ముందుగా బి హెచ్ ఈ ఎల్ లో ఇంజనీర్ గా పనిచేసిన అవస్థి ఇంటి దగ్గర శ్రద్ధగా చదివి పరీక్షలు […]

అత్యున్నత పురస్కారం

ఈ సంవత్సరం దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు వనదేవత తులసి గౌడ్. ఔషధ మొక్కల భిన్నమైన ఎన్నో జాతి మొక్కల పట్ల పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉన్న 72 సంవత్సరాల తులసి గౌడ్. తన ఉద్యోగ కాలంలో 40 వేల వృక్షాలను పెంచి వన సామ్రాజ్యాన్నే నెలకొల్పారు గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన సేవలు వల్లనే ఆమెకి అత్యున్నత గౌరవం దక్కింది ఈ వయసులోనూ తులసి అలసట లేకుండా మొక్కలు నాటుతారు తనకు […]

మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డ్

ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగుల మైలురాయిని దాటి తన ఘనత చాటింది మిథాలీ రాజ్. దేశంలో మహిళల క్రికెట్ కు అంతగా గుర్తింపు లేని రోజుల్లో క్రికెట్ స్టేడియం లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్ రెండు దశాబ్దాలకు పైన పోటీల్లో కొనసాగుతూ దానికి ఆదరణ పెంచటంలో తన వంతు పాత్ర పోషించింది. తాజాగా అన్ని ఫార్మల్ లతో కలిపి పది వేల అడుగులు పూర్తి చేసిన ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా […]

పొడిగా ఉంటేనే ఆరోగ్యం

వంటిల్లు చెమ్మగా ఉంటే క్రిమికీటకాలు చేరతాయి. తడితో దుర్వాసన వస్తుంది. వంట ఇంటి తలుపులు కిటికీలు వీలైనంత ఎక్కువ సేపు తెరిచి, గాలి, వెలుతురు లోపలికి వచ్చేలా చూడండి. చెద పురుగులు, బొద్దింకలు చేరకుండా ఉంటాయి. వంట చేసే గట్టు పైన జిడ్డు మురికి ఎప్పటికప్పుడు వదిలించాలి. సింక్ మూలల్లో తడిలేకుండా పేరుకోకుండా చూడాలి. వంటగది అరల్లో నిలకా జెల్ ప్యాకెట్లు కానీ, బొగ్గు ముక్కలను చిన్న మూటలా కట్టి ఉంచితే ఫ్రెష్ గా ఉంటుంది. సింక్ […]

జుట్టు ఊడుతోందా ?

చర్మం పొడిబారకుండా ఉండేందుకు వాడే మాయిశ్చరైజర్ల కంటే ప్రకృతి సహజంగా దొరికేవి వాడితేనే ఆకర్షణీయంగా ఉంటాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారానికి ఒకరోజు అలోవేరా గుజ్జులో తేనె కలిపి రాస్తే చర్మ సౌందర్యం మాత్రమే కాదు దురద, మంట వంటి సమస్యలు కూడా రావు. వేపాకు నూరి తలకు పట్టిస్తే పేలు, చుండ్రు వంటి సమస్యలు పోతాయి. అలాగే జుట్టు ఊడిపోతుంటే  వారానికి ఒకసారి కొబ్బరిపాలు అప్పటికప్పుడు తీసినవి తలకు పట్టించి ఓ గంట ఆగాక తలస్నానం చేస్తే […]

మెరిపించే మేకప్

ఇంట్లోంచే మేకప్ వేసుకోవాలి అనుకుంటే చక్కని చిట్కాలు చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం రంగుకు సరిపోను గ్లాసీ ఫౌండేషన్ ఎంచుకోవాలి. ఇది చర్మానికి అంటిపెట్టుకొని ముఖం నున్నగా కనిపించేలా చేస్తుంది. లేకపోతే మ్యాలే ఫౌండేషన్ కు రెండు చుక్కల హై లైటర్ లో కలిపిన సరిపోతుంది. తర్వాత కన్సీలర్ రాసి ఆపై ప్రెస్ డే పౌడర్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాస్క్ వాడటం తప్పనిసరి కనుక కళ్ళ మీదకే పోతుంది. కనుబొమ్మలు హైలైట్ చేయాలి కనురెప్పలకు వాటర్ […]

ఇంటి భోజనం బెస్ట్

ప్రతిరోజు రెస్టారెంట్ లో భోజనం చేసే వారి కంటే ఇంటి భోజనం చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి అధ్యయనాలు. హోటల్ ఆహారంలో సమతుల్యత ఉండదని రుచికోసం కలిపే కొన్ని రకాల పదార్థాలు జీర్ణ క్రియలకు ఇబ్బంది కలిగిస్తాయని చెబుతున్నారు. సోడియం కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు శాచ్యురేటెడ్ ఫ్యాట్  పెంచే వాటిని రెస్టారెంట్స్ లో వాడతారు అదే ఇంటి భోజనంలో ప్రతిదీ ఆచితూచి వాడతారు కనుక ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇమ్మని చెబుతున్నారు.

స్ఫూర్తి ప్రదాత

తొలి అన్న పదం ఎప్పుడూ ప్రత్యేకం. అది ఎంతోమందికి మార్గదర్శకత్వం, మార్గనిర్దేశం కూడా దేశం లో పైలట్ గా రాణిస్తున్న అమ్మాయిలు ఎందరో కానీ రక్షణ రంగం లో అమ్మాయిల ఉనికి తక్కువే ఈ లోటు పూర్తి చేసింది. భారత వైమానిక దళం లో విమానం ద్వారా యుద్ధంలో పాల్గొనే అర్హత సాధించింది. గణతంత్ర వేడుకల్లో ఎం ఐజీ- 21 బైసన్ ఫైటర్ విమానాన్ని నడిపి యుద్ధం లో పాల్గొనే అర్హత సాధించింది. మొదటి మహిళా ఫైటర్ […]

పెరిగిన మహిళా సంఖ్య

దేశ చరిత్రలో మొదటిసారిగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే చెబుతోంది. ఈ నవంబర్ లో నిర్వహించిన సర్వే లో మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2019-2021 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని సర్వే చెబుతోంది. లింగ నిర్ధారణ పరీక్షల తర్వాత జరిగే బ్రూణ హత్య కారణంగా ఆడ పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజా నివేదిక ఈ […]

వ్యాపార విజయం

సౌందర్య ఉత్పత్తుల ఈ కామర్స్ సంస్థ నైక్ తాజాగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది మొదటి రోజే లక్ష కోట్ల మైలురాయినీ దాటింది. యూనీ కార్నర్ హోదా పొందింది. దీనితో ఫల్గుణి నాయక్ దేశం లోని అత్యంత సంపన్న సెల్ఫ్ మేడ్ మహిళ బిల్లి నియర్ గా ఎదిగారు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు నాయర్ ఆస్తుల విలువ 48 వేల కోట్ల 48 వేల కోట్లు దాటిపోయింది రెండు ప్రమోటర్ల ట్రస్ట్ లు, […]

బియ్యం గింజలు వెండివే

వెండి పూజా వస్తువులకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. ఇవి వాడుకునేందుకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు కూడా చక్కగా ఉన్నాయి. అందం గట్టిదనం తేలికగా వివిధ ఆకృతుల్లో కి ఒదిగి పోయే గుణం వెండి కి మాత్రమే ప్రత్యేకం. లైట్ వెయిట్ తో చాలా ఆడంబరంగా అందంగా ఉన్నాయి దీపాలు, ప్లేట్లు, పూలసజ్జ లతోపాటు పూజకు వాడే పూలు అగ్గి పెట్టి బియ్యం గింజల వరకూ వెండివే. శుభసూచకంగా నిల నిలబెట్టే అరటి మొక్కలు, కొబ్బరికాయలు, చెరుకు […]