పండగ స్పెషల్స్
పండగ రోజుల్లో ముదురు రంగు దుస్తులు వేసుకుంటే ఆ వాతావరణానికి మరింత శోభ వస్తుంది అంటారు స్టైలిస్ట్ లు సంక్రాంతి వంటి పండుగలకు చేనేత వస్త్రాలు బాగుంటాయి.పండగ స్పెషల్స్ గొబ్బెమ్మలు రంగురంగుల రంగవల్లుల మధ్య చేనేత వస్త్రాలు హుందాగా కనిపించడమే కాక వ్యక్తుల హుందాతనం కూడా చూపిస్తాయి జతగా పెద్దపెద్ద బుట్టలు, చాంద్ బాలీలు పెట్టుకోవాలి లెహంగాలు కుర్తీలకు తోడు స్కార్ఫ్ లు వాడటం తాజా ఫ్యాషన్. అయితే ముఖ్యంగా అందంగా కనిపించడం ఎలా ఉన్నా ఏ […]
మరో కొత్త అడుగు
సి ఆర్ పి ఎఫ్ జడ్ ప్లస్ కేటగిరీ కోసం విధులు నిర్వహించేందుకు ఎంపికైన 32 మంది వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదలైన వారికి రక్షణగా నిలువనున్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విఐపి రాజకీయ నాయకుల రక్షణ బాధ్యతలు తీసుకున్నారు గతంలో జడ్ ప్లస్ కమాండో విభాగాల్లో పురుషులే ఉండేవారు ఇప్పుడు స్త్రీల […]
ఇమ్యూనిటీ పెంపు
వాము ఎంతో మేలు చేస్తుంది అంటారు ఆయుర్వేద నిపుణులు జీర్ణశక్తిని పెంచుతుందని, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఇమ్యూనిటీ పెంచుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో వాము తీసుకోవటం చాలా ప్రయోజనకరం వాము, అల్లం, మిరియాలు, నల్ల జీలకర్ర, మెంతుల తో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వామును నీళ్లలో వేసి మరిగించి వడకట్టి తాగినా నేరుగా ఓ స్పూన్ నోట్లో వేసుకొని నెమ్మదిగా నములుతూ రసం మింగుతున్న మంచి ఫలితం ఉంటుంది. […]
వ్యాయామాలతో చెక్
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే వారిలో యాంగ్జయిటీ రిస్క్ దాదాపు 60 శాతం తగ్గిపోతుందని ఇటీవల అధ్యయనాలు చెబుతున్నాయి. జీవన గతిలో తర్వత గతిన యాంగ్జయిటీ లోపాలు ప్రపంచవ్యాప్తంగా పది శాతం మందిలో ఏర్పడుతున్నాయని మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో రెండింతలు ఎక్కువ అయ్యాయని అధ్యయనకారులు పేర్కొన్నారు. అయితే చురుకైన జీవనశైలి గల వారిలో యాంగ్జయిటీ సంబంధిత సమస్యలు అరవై శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనకారులు చెబుతున్నారు.
అంబై కు సముచిత గౌరవం
స్పారో వ్యవస్థాపకురాలు, ప్రముఖ తమిళ రచయిత్రి కథా సంకలనం శిరప్పు కళ త్తుడవ్ బారు పచ్చాయ్ (ఎర్రని మెడ ఉన్న పచ్చని పక్షి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అయింది 19 సంవత్సరాల వయసులో కథలు వ్రాయటం మొదలు పెట్టిన అంబై మహిళలు ఎదుర్కొంటున్న పరోక్ష ప్రత్యక్ష సమస్యల పై ఎన్నో గొప్ప కథలు రాశారు. సమాజం లోనే అపసవ్య ధోరణులను ప్రశ్నించే ఆమె కథలు సాంప్రదాయ పాఠక వర్గాలకు ఆశ్చర్యం కలిగించాయి. మనం ఇలా […]
ఫిన్ లాండ్ చాలా గ్రేట్
భూటాన్ ఆసియా దేశాల అన్నింటికంటే సంతోషంగా ఉండే దేశమని ప్రపంచ దేశాలలో ఎనిమిదవ స్థానంలో ఉందని బిజినెస్ వీక్ రాసింది. కానీ ప్రపంచ సంతోష నివేదిక 156 దేశాలలో భూటాన్ కు 95 వ స్థానం ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక, ప్రపంచ దేశాల సర్వే ఆయా దేశ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు భావిస్తున్నారో తెలియజేస్తుంది. 2021 నివేదికలో 149 దేశాల్లో సర్వే లో భారతదేశం 139 వ స్థానంలో ఉంది. ప్రపంచంలో […]
యూట్యూబ్ రూపకర్త
ఈ రోజుల్లో అందరి జీవితాల్లో యూట్యూబ్ ఒక ముఖ్యమైన అవసరం. యూట్యూబ్ వాడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. దీన్ని డిజైన్ చేసింది డెవలప్ చేసింది బంగ్లాదేశ్ కు చెందిన జావేద్ కరీమ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తన ఇద్దరు కొలీగ్స్ స్టీవెన్ బెన్, చాడ్ హర్లీ లతో కలిసి యూట్యూబ్ రూపొందించారు.2005 ఏప్రిల్ 235 మొదటి వీడియో ‘మీ ఎట్ జూ’ అన్న వీడియో కూడా అప్లోడ్ చేశాడు. దాన్ని గూగుల్ 2006 అక్టోబర్ […]
ధ్యానంతో ఆరోగ్యం
మన దేశ ట్రిపుల్ ఐటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ప్రతి రోజూ అరగంట సేపు ధ్యానంలో గడిపే వారిలో మెదడు చాలా ఆరోగ్యంగా చురుకుగా పని చేస్తోందని చెబుతున్నారు. ఈ రోజుల్లో నాడీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ఆల్జీమర్స్ చాలామందిలో కనిపిస్తోంది. డెమన్షియా, జ్ఞాపకశక్తి, మందగింపు కూడా ఎక్కువవుతోంది. ఇటువంటి సమస్యకు వయసులో చేసే ధ్యానమే విరుగుడు అంటున్నారు. జ్ఞాపక శక్తికి సంబంధించిన మెదడు భాగాలు ధ్యానం చేసే సమయంలో చూపించే స్పందనలు, ఆ తర్వాత కాలంలో […]
శక్తిమంతమైన మహిళ
భారత దేశపు తొలి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ఫోర్బ్స్ పత్రిక వారి శక్తిమంతమైన మహిళల జాబితాలో వరుసగా మూడో సంవత్సరం స్థానం సంపాదించింది. 2020 లో 41వ స్థానంలో ఉన్న నిర్మల 2021 నాటికి 37 వ స్థానం లోకి ఎదిగింది. అమెరికా ఆర్థిక మంత్రి కంటే అది మెరుగైన స్థానం.
ఇది సీజనల్ నొప్పి
శీతాకాలంలో చాలా మందికి తలనొప్పి సమస్య వస్తుంది. ఈ సీజన్ లో ఎక్కువసేపు తలుపులు వేసుకొని పడుకోవడం వల్ల గదుల్లో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువవుతోంది. అదీ కాకుండా పగటి వేళలు తక్కువ కావటం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. గది తలుపులు వీలైనంత తెరిచి ఉంచాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు ఉపయోగించాలి. సమయానికి భోజనం చేయటం, నిద్రపోవటం, నీళ్లు త్రాగటం, డి-విటమిన్ ఎక్కువగా లభించే గుడ్లు, చేపలు తినడం మంచిది. తప్పకుండా ఓ అరగంట వ్యాయామం కూడా […]
అమిత బలశాలి
పంజాబ్ కు చెందిన ఆశా రాణి తన రెండు జడలతో 12,216 కిలోల బరువున్న డబల్ డెక్కర్ బస్ ను లాగి గిన్నిస్ రికార్డ్స్ లో పేరు సొంతం చేసుకుంది. గతంలో కనురెప్పల తో 15.15 కిలోలు ఎత్తిన రికార్డ్. చెవులతో 1700 కిలోల వ్యాన్ ను లాగిన రికార్డ్ ఏళ్ల తో 22-16 సెకన్లలో 25 మీటర్లు లాగినా రికార్డ్ వంటివి ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇటలీ లోని మిలాన్ లో జరిగిన ఈ ఈవెంట్ […]
కథలతో ప్రయోగాలు
వయాకామ్ 18 సి ఈ ఓ గా పనిచేస్తుంది జ్యోతి దేశ్ పాండే చిన్నప్పుడు నిమోనియా పోలియో బారిన పడినా ఆత్మవిశ్వాసంతో చక్కగా చదువుకొని ఎం.బి ఎస్ పూర్తి చేశారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో స్టూడియో, జియో సావన్, రిలయన్స్ మూవీస్ బాధ్యతలను చేపట్టారు. తర్వాత ఈరోస్ సంస్థకు అంతర్జాతీయ అధిపతిగా ఉన్నారు. ఈరోస్ తర్వాత రిలయన్స్ లోకి వచ్చారు. ఎన్నో మంచి కథల తో గొప్ప ప్రయోగాలు చేసిన ఆమె ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో […]
టోమేటో లేపనం బెస్ట్
చర్మం తీరు ఏమైనా టోమాటో లేపనాలు వృద్యాప లక్షణాలను మాయం చేస్తాయని చర్మాన్ని మృదువుగా మార్చేయగలవని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. అరటి పండు సగం ముక్క కు అర చెంచా ఆలివ్ నూనె చెంచా టమాటో రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి శుభ్రం చేస్తే చాలు పొడి చర్మం మృదువుగా మారి పోతుంది అంటున్నారు. అరకప్పు ఓట్ మీల్ కు పావు కప్పు కీరా ముక్కలు తగినంత టమాటో రసం కలిపి […]
కొత్తదనం ఇష్టం
డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ గా ఉన్నారు మేఘా టాటా బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోడీ ఉత్తరాఘండ్ అడవుల్లో పర్యటించిన డాక్యుమెంటరీ ఆలోచన ఆమెదే స్టార్ హెచ్.బి.ఓ ల్లో పనిచేశారు మా నాన్న సైనిక అధికారి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ప్రాంతాలు చూశాను ప్రతి చోట ఒక కొత్త స్కూలు కొత్త సంస్కృతి నన్ను కొత్తగా ఆలోచించేలా చేశాయి. డిస్కవరీ ఛానల్ లో కొత్త ప్రయోగాలు చేసేందుకు కావలసిన ఆత్మవిశ్వాసం కలిగింది […]
ఇదీ మోనోపాజ్ సమస్యే
స్త్రీ లలో మోనోపాజ్ సమయంలో ఎక్కువ ఎదురయ్యే సమస్య బ్రెయిన్ ఫాగ్, ఈ సమస్య వారికి కెరీర్ కే సవాల్ గా మారుతుంది అంటున్నారు. మెల్ బోర్న్ లోని మోనాష్ విశ్వవిద్యాలయాల అధ్యయనకారులు, ప్రతిదీ మరచిపోవటం అయోమయం దేనిపైనా దృష్టి పెట్టలేక పోవడం దిగులు పడటం, ఈ పరిస్థితినే బ్రెయిన్ ఫాగ్ అంటున్నారు. నెలసరులు పూర్తిగా ఆగిపోయిన దశలో దాదాపు సగం మంది జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు చాలామందికి ఎదుటి వ్యక్తి పేరు కూడా చెప్పినా స్పురణకు […]
ఇల్లు విశాలంగా
కొత్త ఇల్లు కొనుక్కుంటే కొత్త వస్తువులను ఎంపిక చేసుకోండి కొత్త ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్ లో కాస్త శ్రద్ధ చూపిస్తే అప్పుడే ఇంటి అందం తెలుస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదాహరణకు బెడ్ రూమ్ తీసుకుంటే బెడ్ తో పాటు ఇంట్లో ఉండే క్లోసెట్స్ ను రెడీమేడ్ గా కొనుక్కోవాలి. మార్కెట్ లోకి వచ్చే అధునాతన టెక్నాలజీ కొత్త వస్తువులకు అప్డేట్ కావాలి. హాల్ రంగులను బట్టి కూల్ గా అందంగా కనిపించే సోఫా సెట్ ఎంపిక చేసుకోవాలి. […]
నిండుగా పోషకాలు
ఈ రోజుల్లోనే ఎక్కువ గా పచ్చిబఠాని దొరుకుతుంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే కూరగాయల్లో బఠాని ఒకటి ఒక అర కప్పు పచ్చి బఠాని నుంచి నాలుగు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కేలరీలు తక్కువ ఉన్నప్పటికీ పీచు అధికంగా ఉండటం వల్ల ఆకలి నియంత్రించేందుకు పచ్చిబఠాణి ఉపయోగపడుతుంది. వీటిలో విటమిన్-ఎ,థయామిన్,ఫోలేట్,విటమిన్ కె కూడా ఉంటాయి. మధుమేహం గుండె జబ్బులు క్యాన్సర్ మొదలైన జీవనశైలి వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది పచ్చిబఠాని.
ఎందరికో స్ఫూర్తి
మోనికా షెర్గిల్ నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషన్ ఒరిజినల్స్ హెడ్ కూడా. మేరట్ లో పుట్టి పెరిగినా మోనికా ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశారు పర్యావరణ పాత్రికేయురాలు గా జీవితం మొదలు పెట్టింది. బీహార్ లోని ధన్ బాద్ లో అక్రమ గనుల తవ్వకాలు, మధ్యప్రదేశ్ గుజరాత్ లోని పరిశ్రమల కాలుష్యం పై కథనాలు చిత్రీకరించారు గ్రీన్ ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘లివింగ్ ఆన్ ది ఎడ్జ్’ ఆమె తీశారు నెట్ […]
డాక్టర్ అల్కా మిట్టల్
ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) సీఎండీగా నియమితులయ్యారు డాక్టర్ అల్కా మిట్టల్.ONGC చరిత్రలో ఒక మహిళ సీఎండీగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 2018 నుంచి ఆమె ఆ సంస్థ లో హెచ్ ఆర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ లో పూర్తిస్థాయి డైరెక్టర్ గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలి తరం మహిళ గా ఆమెను చెప్పుకోవచ్చు.
ప్రీత్ చాందీ
40 రోజుల్లో 700 మైళ్ళ ప్రయాణించి ఒంటరిగా దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కింది 32 ఏళ్ల ప్రీత్ చాందీ. 2007 లో బ్రిటీష్ సైన్యంలో ప్రీత్ క్లినికల్ ట్రైనింగ్ అధికారిగా చేరింది. సాహసాలను ఇష్టపడే ప్రీత్ నవంబర్ 24న దక్షిణ ధృవ యాత్రకు బయలుదేరి 90 కేజీల బరువున్న సంచులను మోస్తూ మైనస్ 50 డిగ్రీల వాతావరణం లో అతి చల్లని ఈదురుగాలుల మధ్య ప్రయాణం కొనసాగించింది. సైనికుల ధృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్ […]
