Gagana
రోహిణీ గాడ్బోలే
న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ పార్టికల్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు రోహిణీ గాడ్బోలే. అంతకంటే ముందు 1982లో ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 1995 లో బెంగళూరులోని ఐ.ఐ.ఎస్సీ.లో అసోసియేట్ గా చేరారు. ఇప్పుడు అక్కడే ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు వందకు పైగా అధ్యయన పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో గౌరవించింది.
కేరళ తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్
కేరళ లో తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ డాక్టర్ ప్రియా. ఆమె పుట్టినప్పటి పేరు జిను శశిధరన్. కేరళలోని త్రిసూర్ ఆమెది. 2013లో బెచిలర్ ఆఫ్ ఆయుర్వేద చేశారు. 2018 లో ఆయుర్వేదంలో ఎండీ పూర్తిచేసి త్రిసూర్ లో హాస్పిటల్లో పని చేయటం మొదలు పెట్టారు. అవసరమైన ఆరు సర్జరీల తర్వాత డాక్టర్ ప్రియా గా వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు.
ప్రధమ మహిళ బృందంలో గారిమ
అమెరికా నూతన అధ్యక్షుడు జొ బైడెన్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తుంది గారిమ వర్మ. ఆమె తల్లిదండ్రులు భారతీయలు. ఉపాధి కోసం అమెరికా వలస వెళ్లారు. గారిమ కెరీర్ గా డిజిటల్ మార్కెటింగ్ స్టాటజీలను ఎంచుకొన్నారు. అంతకు ముందు వాల్ డిస్నికి చెందిన ఎబిసి నెట్ వర్క్ లో హోస్ట్ గా పనిచేశారు. పారామెంట్ పిక్చర్స్ లో గ్రాఫిక్ డిజైన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు. బైడెన్, కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో డిజిటల్ మరియా వ్యూహ […]
కాక్ టైల్ స్పెషలిస్ట్ మీనాక్షి సింగ్
వైవిధ్యమైన కాక్ టైల్ రుచులూ మెరుగైన ఆతిథ్యం తో మీనాక్షి సింగ్ ప్రారంభించిన బార్ ప్రపంచంలోనే అత్యున్నతమైన 100 బార్ లో ఒకటిగా నిలిచింది. ఈమె నడిపే సైడ్ కార్ బార్ పాత గ్రంథాలయం లాగా బిలియర్డ్స్ రూమ్ లాగా ఉంటుంది.మీనాక్షి టీమ్ ప్రత్యేకమైన రుచులతో డ్రింక్స్ తయారు చేస్తారు. ఈ డ్రింక్ కి అవసరమైన దినుసులు బార్ వెనుక ఉన్న గార్డెన్ లో పండిస్తారు హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేస్తున్న మీనాక్షి సింగ్ […]
ఆడవాళ్లే డ్రైవర్స్
మహిళ డ్రైవర్లు నడిపే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది రేవతి రాయ్ .ఆమె స్థాపించిన హే దీదీ కంపెనీలో ఇప్పుడు తొమ్మిది వందల మంది మహిళ డ్రైవర్లు పనిచేస్తున్నారు.రేవతి ప్రధాన కార్యాలయం ముంబాయి స్వయంగా రేవతి టాక్సీ డ్రైవర్ గా ఎయిర్ పోర్ట్ లో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక టాక్సీ మొదలు పెట్టింది తరువాత తన వంటి మహిళా డ్రైవర్లను తయారు చేసేందుకు పూనుకొంది ఆమె శిక్షణ ఇచ్చిన మహిళలు టాక్సీలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ, అమెజాన్ […]
ప్లానెట్ ఏ బుల్ట్
ప్లానెట్ ఏ బుల్ట్ అనే పేరుతో దివ్యాంగుల కోసం టూరిజం సౌకర్యం ఏర్పాటు చేసింది నేహా arora. నేహా తండ్రి అంధుడు తల్లి చక్రాల కుర్చీకి పరిమితం అయిన దివ్యాంగురాలు. నేహా బాగా చదువుకొని ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించింది తన సంపాదన తో తల్లిదండ్రులను టూరింగ్ కు తీసుకు వెళ్ళినప్పుడు దివ్యాంగులకు ఎలాంటి సౌకర్యాలు లేవని అర్థం అయ్యింది. ఆ సమయంలో ఆమె ఈ సంస్థ గురించి ఆలోచన వచ్చింది. 2016 లో ప్రారంభమైన […]
లైన్ ఉమెన్ గా తొలి మహిళ శిరీష
లైన్ మేన్ ఉద్యోగానికి తెలంగాణ నుంచి తొలిసారిగా ఎంపికయింది బబ్బురి శిరీష ఆమెకి తెలంగాణ జిల్లా సిద్దిపేట జిల్లా గణేష్ పల్లి ఐ.టి.ఐ కోర్స్ చేసింది లైన్ మేన్ ఉద్యోగం కోసం TSSPDCL సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తే మహిళలకు అవకాశం లేదన్నారు. అప్పుడు కోర్టుకు వెళ్లింది శిరీష హైకోర్టు ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరించారు. మహిళా అభ్యర్థులకు పోల్ టెస్ట్ చేసి ఉద్యోగం ఇవ్వాలనే హైకోర్టు ఆదేశంతో ఒకటిన్నర నిమిషం లో విద్యుత్ స్తంభం […]
మహిళా వేదిక హీరోస్
హీరోస్ అన్న మహిళా వేదికను ౨౦౧౪లో ప్రారంభించారు. ఈ ఇంటర్నెట్ వేదిక పైన ఐదు లక్షల మంది కలుస్తున్నారు. సమస్యలకు సలహాలు నైపుణ్యాలు పొందటం, కొత్త అవకాశాలు వెతకటం అవసరమైన రుణాలను పొందటం మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు ప్రదర్శించి అమ్మకాలు చేసుకోవటం కోసం ఈ వేదిక ఉపయోగపడుతోంది.ఉద్యోగాలు చేసే చోట ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లైంగిక వేధింపుల నుంచి బయటపడే మార్గాల సూచన వంటివి కూడా ఇక్కడ పొందగలరు. ఫిర్యాదు చేసే మార్గాలు న్యాయ సలహాలు […]
సహస యాత్ర
ఉత్తర ధృవం మీదుగా బోయింగ్ విమానాన్ని నడిపి 16 వేల కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసిన పైలెట్ తన్మయి పాపగారి. ఉత్తర ధృవం మీదుగా బోయింగ్ విమానాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళురుకు కెప్టెన్ జోయసింగ్ తో పాటు మరో ఇద్దరు మహిళా పైలెట్ లతో విజయవంతంగా పూర్తిచేసింది తన్మయి. మాతో పాటు ప్రయాణం చేస్తున్న 235 మంది ప్రయాణికులు 12 మంది క్యాబిన్ క్రో బాధ్యత మాదే కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ధైర్యంతో ముందడుగు […]
శభాష్ పరుల్
చీరకట్టుతో ఫ్రంట్ బ్యాక్ ఫ్లిప్స్ చేసిన వీడియో తో పరుల్ అరోరా ఇంటర్నెట్ సంచలనం అయ్యారు అరోరా గత 15 ఏళ్లుగా 35 జాతీయ పోటీల్లో పాల్గొన్నారు ఒకప్పుడు జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందిన అరోరా ప్రస్తుతం ఫిట్ నెస్ జిమ్నాస్టిక్స్ శిక్షకురాలు గా ఉన్నారు. సాధారణంగా ఫ్లిప్స్ ను డ్రెస్ లతోనే చేసేందుకు వీలుగా ఉంటుంది కానీ పరుల్ చీరకట్టుతో గాల్లో వెనక్కు ముందుకు దూకుతూ చేసినా విన్యాసం నెటిజన్ల మన్ననలు పొందింది. విద్యాబాలన్ […]
మసాలాలే కెరీర్
5 లక్షల పెట్టుబడితో డెక్కన్ డైరీస్ స్థాపించింది పూజిత. నగరవాసులు మరిచిపోతున్న ప్రాచీన కాలపు రుచులను పరిచయం చేయాలనుకుంది పూజిత స్టార్టప్ పెట్టాలనుకున్న తరవాత పూజిత వుయాంగ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన ప్రదేశాలు అన్ని దర్శించింది ప్రతి పదార్థం లోనూ వాడే పొడులను డైరీ రాసుకుంది.అలా రాసుకున్న డైరీ తోనే డైరీస్ పేరుతో స్టార్టప్ మొదలుపెట్టింది మసాలాలు పొడులకు నలభై వేల కోట్ల మార్కెట్ ఉంది. ఇంతవరకు మసాలా రంగంలో మగవాళ్లే ఉన్నారు.ఇప్పుడు మా యూనిట్ లో […]
ట్రంప్ ట్విట్టర్ కు తాళం
డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ శాశ్వతంగా మూసే స్తున్నాం లేకపోతే ట్విట్టర్ ల ద్వారా ఆయన మరింత హింసకు పాల్పడేలా వున్నారు అంటూ జనవరి 8 2021న డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా నిషేధిస్తూ చర్య తీసుకున్నారు విజయ్ గద్దె.ట్విట్టర్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న విజయ భారతీయురాలు కుటుంబం హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్ళి పోవటంతో టెక్సాస్ లోనే పెరిగారు ప్రపంచంలో అత్యంత శక్తి మంతురాలు గా ఇన్ స్టైల్ మ్యాగజైన్ విజయా ను ఎంపిక […]
కరోనా కట్టడికి గుర్తింపు
కేరళ ఆరోగ్య మంత్రి కె.కె శైలజ టాప్ థింకర్ 2020 గా ఎంపికయ్యారు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యుకె లోనే ప్రతిష్ఠాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఆమెను ఈ టైటిల్ లో గౌరవించింది. సకాలంలో చర్యలు తీసుకుని తన రాష్ట్రంలో కరుణ విస్తృతిని కట్టడి చేసిన కారణంగా శైలజ కు గుర్తింపు లభించింది. కేరళలో కరోనా కేసులు బయటపడగానే ఆమె ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టెస్టింగ్ కాంట్రాక్ట్ టెస్టింగ్ క్వారంటైన్ […]
అత్యంత సాహసి
ముంబైలో నావికాదళ స్కూల్ విద్యార్థిని 12 సంవత్సరాల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాం కాగ్వా (6962 మీ) విజయవంతంగా అధిరోహించింది అకాం కాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.
ప్రతిభకు గుర్తింపు
అమెరికా కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి కెరీర్ ఆరంభం నుంచి సామాన్యత హక్కుల కోసం పోరాడే నా బిల్లి జీన్ కింగ్ (76) ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ITAF) అరుదైన రీతిలో గౌరవించింది ప్రతిష్ఠాత్మక iTF టీమే ఈవెంట్ కాప్ పేరు మార్చేసింది ఇక నుంచి దీన్ని బిల్లీ జీన్ వ్యవహరిస్తామని ప్రకటించింది ఒక టీమ్ ఈవెంట్ టోర్నీ ని మహిళ పేరుతో వ్యవహరించటం ఇదే మొదటిసారి.
మరణానికైనా సిద్దమే
Zhang Zhan చైనాకు చెందిన పౌర పాత్రికేయురాలు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది చైనా ప్రభుత్వం ఆమె చేసిన నేరం కరోనా పై వార్తలు రాయటమే తమ రిపోర్టింగ్ లతో ప్రభుత్వానికి అంతర్జాతీయంగా అప్రతిష్ట తెచ్చి పెట్టారన్న నేరారోపణలపై చైనా జైళ్లలో మగ్గిపోతున్న జర్నలిస్ట్ లో ఈమె కూడా ఒకరు. షాంఘై జిల్లా ఉడొంగ్ పట్టణంలోని జైల్లో ఉంది Zhang నాకు మరణశిక్ష విధించిన సరే నేను నా మాట పైనే ఉంటాను వాస్తవాలను భూస్థాపితం […]
అలైస్ వాల్టన్
ప్రపంచంలో కెల్లా సంపన్నమైన మహిళల్లో ఒకరు అలైస్ వాల్టన్. అతిపెద్ద రీటైల్ సంస్థ ‘వాల్‌మార్ట్’ అధిపతుల్లో ఒకరు అలైస్ వాల్టన్ కుమార్తె. 1971 ‘ట్రినిటి విశ్వవిద్యాలయం’ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన అలైస్ ముందుగా మాతృ సంస్థ ‘వాల్‌మార్ట్’లో పిల్లల దుస్తుల బయ్యర్‌గా పనిచేశారు.ఆర్వెస్ట్ బ్యాంక్ స్థాపించారు. అతి పెద్ద కంపెనీ అధిపతిగానే కాక,మానవత్వం ఉన్న మహిళగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. ఫోర్బ్స్ పత్రిక 2020 జాబితాలో 70.4 బిలియన్ డాలర్ల సంపదతో […]
ఏడాది సంపాదన 284 కోట్లు
ఒక సంవత్సర కాలంలో అత్యధికంగా అర్జించిన క్రీడాకారిణి జపాన్ టెన్నిస్ ప్లేయర్ ప్రపంచ మాజీ నెంబర్ వన్ నయోమి ఒకాసా గుర్తింపు పొందింది ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 సంవత్సరాలు ఒకాసా ప్రైజ్ మనీ ఎండార్స్ మెంట్ల ద్వారా మొత్తం 3 కోట్ల 74 లక్షల డాలర్లు అంటే 284 కోట్లు సంపాదించి రికార్డ్ బ్రేక్ చేసింది.
శకుంతలాదేవికి గిన్నీస్
భారత గణిత మేధావి శకుంతలా దేవికి నాలుగు దశాబ్దాల అనంతరం గిన్నిస్ సంస్థ సర్టిఫికేట్ అందజేసింది.అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్ గా ఖ్యాతి గణించిన శకుంతలాదేవి 1980లో లండన్లోని ఇంపీరియర్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంత వేగంగా కేవలం 28 సెకన్లలోనే గణించిన ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.కాకపోతే అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు ఆ సంస్థ దృవీకరణ పత్రం అందలేదు.
అత్యంత సంపన్నురాలు
రెండేళ్లుగా రోషిని నాడార్ మల్హోత్ర ఫోర్బ్స్ జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఏకైక సంతానం రోహిణ. దేశం నుంచి సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేసే సంస్థల్లో అతిపెద్దదైన ఈ సంస్థ చైర్ పర్సన్ గా 2020 జూన్ బాధ్యతలు తీసుకున్నారు రోహిణి వన్యప్రాణుల సంరక్షణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేశారు శాస్త్రీయ సంగీతం లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. భారతదేశపు అత్యంత సంపన్నురాలైన మహిళల్లో రోషిని నాడర్ ఒకరు.
