Thursday, 30 Jul, 2026

ఇంకా ఎక్కువ శ్రమ అవసరం

టెక్నాలజీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మిట్ గుర్తిస్తోంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో మహిళలు తమను తాము నిరూపించుకొనేందుకు నాయకత్వం స్థాయికి చేరుకునేందుకు పురుషులు కన్నా ఎక్కువ శ్రమించాలి అంటుంది సుచరిత మన్యాల తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్ లో సీట్ సంపాదించింది. అందులో సిస్టం డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ ను ఇటీవలే పూర్తి చేసింది సిస్టం డిజైన్ అండ్ […]

అలాటి ట్యాగ్స్ వద్దు

నన్ను లేడి పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయటం నాకు అసలు నచ్చలేదు పేరుకు ముందు ఇలాంటి ట్యాగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఇటువంటి వాటికి నేను కనెక్ట్ కాను. ఈ ట్యాగ్స్ వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను అంటుంది సాయి పల్లవి. ఇప్పటివరకు నేను పోషించిన పాత్రల వల్లే ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు. వారి ప్రేమను దృష్టిలో ఉంచుకొని మంచి పాత్రలలో నటిస్తా  చాలా సాధారణంగా ఉండేందుకే ఇష్టపడతాను. అంటోంది సాయి పల్లవి.

కూరకు మరింత రుచి

ఒక్కసారి కూర లో నీళ్ళు ఎక్కువై కూర రుచి తగ్గిపోతుంది. అలాటప్పుడు చిక్కని గ్రేవీ దానికి జతచేయాలి. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ చక్కగా కలిపి కూరలో వేసి కలిపితే దానికి కాస్త మసాలా కారం వేస్తే గ్రేవీ చిక్కగా రుచిగా వస్తుంది. అలాగే జీడిపప్పు నేతిలో వేయించి పాలలో కలిపి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ను కూడా వేసి పది నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ చిక్కగా అవుతుంది.కార్న్ ఫ్లోర్ ను నీళ్లలో కలిపి కూర లో […]

పోర్గై వర్క్ ఇప్పుడు ఫ్యాషన్

తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో పోర్గై కళ ఎంతగానో ఆకట్టుకుంది తమిళ నాడు లోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీ లోని గిరిజనలు సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ఎంతో వినూత్నమైంది 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కి వచ్చిన డాక్టర్ లలిత రేగి దంపతులు ఈ కళను బతికించేందుకు పోర్గై అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

జ్ఞాపకాన్ని భద్రంగా

మనకు ఎంతో ఇష్టమైన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం వారు వాడిన వస్తువులు దుస్తులు జాగ్రత్తగా భద్ర పరచుకుంటూ ఉంటారు. దీన్ని ద్రుష్టి లో పెట్టుకొని డెహ్రాడూన్‌ లో పుర్కాల్‌ స్త్రీ శక్తి అనే సమితిని ఏర్పాటు చేసింది నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఈ సంస్థలు. గత పదిహేను సంవత్సరాలుగా డెహ్రాడూన్ లోని నలభై గ్రామాల్లోని దాదాపు 200 మంది మహిళల మహిళలు ఈ సంస్థలో బొంతలు కుడతారు. ఈ మధ్యకాలంలో ముంబైకి చెందిన […]

వత్తిడికి ఇదే వైద్యం

కిమ్స్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ గా పని చేస్తాను. చిన్నతనం నుంచే సాంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకొన్న. డాక్టర్ ఉమా రామారావు మా గురువుగారు. కూచిపూడిలో డిప్లమా చేసి వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. దేశ విదేశాల్లో మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చా. వైద్య వృత్తిలో ఉండే వత్తిడికి నా నృత్యం ద్వారా నేను అధిగమిస్తాను అంటారు డాక్టర్ జ్వాలా శ్రీకళ. వత్తిడి తో కూడిన వృత్తి నిపుణులు,డాన్స్ సంగీతం,పెయింటింగ్,ఫొటోగ్రఫీ ఇలా ఇలా ఏదో […]

వీటితో కాస్త జాగ్రత్త

వర్షాలు కదా మేకప్ చెదర కూడదని వాటర్ ప్రూఫ్,మస్కారా వేసుకొంటున్నారా ? వాటిలో ఉండే కెమికల్స్ గురించి చూసి వాడుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మస్కారాలు లిప్ స్టిక్ ఫౌండేషన్ షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొనేముందర టేబుల్ పైన ఫ్లురో అన్న రసాయనం ఉందా అన్నది తప్పకుండా చూడాలి ఉంటే మాత్రం వాటిని ఎంత మాత్రం కొనద్దు అంటున్నారు ఈ రసాయనాలు ఎప్పటికీ భూమిలో కలవవు అందుకే వీటిని ఫరెవర్ కెమికల్స్ అంటారు హార్మోన్ల పైన […]

తక్కువ బడ్జెట్ తో అలంకరణ

అతి తక్కువ బడ్జెట్ తో మోడ్రన్ లుక్ వచ్చేలా ఇల్లు ఆఫీసు ఎలా అలంకరించుకోవాలో చక్కని సలహాలు ఇస్తుంది నిహేరా సోనావన్ వృత్తి రీత్యా ఆమె ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ లో జాగ్రత్తలు ఎలాంటి మెటీరియల్ ఎంచుకోవాలి ఏ రంగులు ఎలాటి వాటికి బావుంటాయి. ఎక్కువ కాలం మన్నిక గా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వంటి ప్రతి చిన్న అంశాన్ని వివరించే లా ఉంటాయి. నిహేరా సోనావన్ వీడియోలు నాలుగు లక్షల మందికి పైగా అనుసరించే […]

పూల దుప్పటి

గులాబి వంటి పువ్వులతో ఈ కాలువ మొత్తం పూల దుప్పటి కప్పుకొని ఉన్నట్లు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. కోజికోడ్ జిల్లాలోని ఓ కాలువలో ఫాన్ వర్ట్ పువ్వులు వికసిస్తాయి. సౌత్ ఆఫ్రికా కు చెందిన ఈ నీటి జాతి మొక్క కోజికోడ్ నది మీద తీగలాగా అల్లుకుంటూ మొత్తం కాలువనే పువ్వులతో కప్పేసింది. ఎన్నో గ్రామాలను చుడుతూ వెళ్లే ఈ కాలువ చూసేందుకు సందర్శకులు ఫోటో షూట్ కోసం కొత్త జంటలు బారులు తీరుతున్నారు

పాత చీరెలకు గొప్ప డిమాండ్

ఖరీదైన చీరెలు కట్టాలనుకున్న వారి కళను నిజం చేశాం. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల వారికి చీరెలు సరఫరా చేశాం అంటున్నారు ‘ఎం ఓ ఎస్ ప్రీ లవ్డ్’ వ్యవస్థాపకులు సుస్మితా మిశ్ర ఆమె చెల్లెలు సునీత. 11 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ ఆన్ లైన్ వేదిక పైన ఎవరైనా ఒకసారి ఉపయోగించిన చీరలను అమ్మవచ్చు కొనుక్కోవచ్చు. అంటే వేడుకల కోసం కొనుక్కొని తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించలేని సరికొత్త పాత చీరెల ఆన్ లైన్ […]

ఫ్యాషన్ స్లీవ్స్

వెండి తెర తారల నుంచి ఫ్యాషన్ ప్రియుల ద్వారా అందరూ ఫాలో అవుతోంది స్లీవ్స్ డిజైన్స్. ఇప్పుడు బిషప్ సీవ్స్ లేటెస్ట్ రీ-ఎంట్రీ ఇచ్చాయి. పొడవాటి రెక్కల్లా గా చేతులంత పొడవు, పై నుంచి కింది వరకు లూజ్ గా మణికట్టు దగ్గర ఎలాస్టిక్ తో బంధించినట్టు ఉంటాయి. బిషప్ స్లీవ్స్ అన్నింటిలోనూ ఎలాస్టిక్  కాకుండా కొన్నింట్లో బటన్ ఓపెనింగ్ ఉంటుంది. ఏ తరహా ప్యాంటు వేసుకున్న బిషప్ స్లీవ్స్ ఉన్న షర్టు అందం రెట్టింపు చేస్తాయి. […]

గోళ్ళు అందంగా

నిరంతరం నీళ్ళతోనే పనిచేయటం తో గోళ్ళు బలహీనపడతాయి. అలాగే శానిటైజర్స్ ఉపయోగిస్తే కూడా వీటిలోని ఆల్కహాల్ గోళ్లను బలహీనపరుస్తుంది. గోళ్ళను ప్రతిరోజు కొబ్బరినూనెతో మృదువుగా మర్దన చేయాలి రెండు రోజులకొకసారి నిమ్మచెక్కతో గోళ్లు చుట్టూ మర్దనా చేస్తే ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. అలాగే గోళ్ళకు క్యూటీ కాల్ ఆయిల్ రాస్తే వాటి చుట్టూ ఉండే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గోళ్ళ చుట్టూ కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మంచి నెయిల్ […]

వినూత్నంగా లట్ కాన్

ఉలెన్ కుచ్చులు బీడ్స్ మెరిసే రాళ్ళు ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల స్టైల్స్ తో లట్ కాన్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటితో బ్లౌజులు, లెహంగా లకు కొత్త అందం యాడ్ అవుతుంది. బ్లౌజ్ వెనక మెడ దగ్గర రోప్స్ కట్టి లట్ కాన్ లను వేలాడదీయవచ్చు. లేదా బ్లౌజ్ అడుగుల రెండు అంచులు కలుపుతూ డోరి కట్టుకోవచ్చు డోరి రంగులు బ్లౌజ్ తో మ్యాచ్ అయ్యేలా ఉండాలి. చిలుకలు, ఏనుగులు వంటి పులి బొమ్మలు కూడా […]

ఇలా చేస్తే చాలు

ఎన్ని పర్ఫ్యూమ్స్ వాడిన చెమట వాసన వదలకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో లావెండర్ రోజ్ మేరీ టీట్రీ ఆయిల్ ఇలా నచ్చిన సువాసన ఎంచుకొని కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. చర్మంపై సూక్ష్మక్రిములు పెరగటమే వాసనకు కారణం. వేపాకులు లేదా టమాటో రసం ఎక్కువగా చెమట పోసే చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేయండి. అలోవెరా లో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి ఎక్కువ. అలోవెరా జెల్ లో ముంచిన కాటన్ తో బాహు మూలలను శుభ్రం […]

ఇదే అసలైన చదువు

ఏ దారి లేదు అనుకున్నప్పుడు ఈ మిల్లు దారి చూపింది. మా చదువు కొనసాగేందుకు సాయం చేసింది మా అక్క చెల్లెళ్ళం చదువుకున్నాం అంటుంది నివేదా.ఎం. తమిళనాడులోని కోయంబత్తూరు లో కే పి ఆర్ మిల్స్ లో పనిచేస్తున్నారు అక్క చెల్లెలు ముగ్గురు. యాజమాన్యానికి విద్యాసంస్థలు ఉన్నాయి తన సంస్థలో పనిచేసే యువతులకు కళాశాలలో చదువుకునే అవకాశం కల్పించారు. ఆ వస్త్రాల మిల్లు లో ఆపరేటర్ గా పని చేస్తూ రాత్రివేళ చదువుకున్నారు. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ […]

తక్షణ శక్తి కి ద్రాక్ష

సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే కాసిన్ని ఎండు ద్రాక్ష పండ్లు ప్రయత్నం చేయచ్చు. ఇది తక్షణ శక్తిని ఇవ్వటమే కాకుండా చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో పీచు, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.ద్రాక్షలోని పొటాషియం, మెగ్నీషియం శరీరంలో ఆమ్ల తత్వం పెరగకుండా చేస్తాయి.  బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉండటం తో రక్తహీనత రాదు. చర్మం పొడిబారి పోకుండా ఉంటుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్-సి సెలీనియం లు చర్మానికి మేలు చేస్తాయి.

తోలి హెలికాప్టర్‌ పైలట్‌

అమ్మాయిలకు అదంతా సులువుకాదు అని కొట్టిపడేస్తారు కానీ హెలికాప్టర్‌ పైలట్‌ అవ్వటం నా జీవిత కాంక్ష. నా పట్టుదల చూసి అమ్మ నాన్న వప్పుకొన్నారు. 2016 లో అమెరికా లోని హవాయిలోని మానలోవా హెలికాప్టర్‌ అకాడమీలోచేరాను. నేను చేరిన సంస్థనే నాకు ఉద్యోగం ఇచ్చింది అంటోంది వైజాగ్ అమ్మాయి క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్‌ హెలికాప్టర్‌ పైలట్‌. విమానాల్లో లాగా దీనిలో ఆటో పైలట్ అవకాశం ఉండదు. ప్రతి సెకను దీక్ష తో […]

సంతోషాన్నిచ్చే వర్ణాలు

రంగు లను చూసినప్పుడు తెలియకుండానే ఆనందం కలుగుతుంది అంటున్నారు థెరపిస్ట్ లు వాతావరణంలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతాయి అంటున్నారు. ఒత్తిడితో సతమతమయ్యే వారి లో కూడా ఈ రంగులు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని కలిగిస్తాయి వర్షాకాలంలో కాస్త మబ్బు ముసిరి ఇల్లు చీకటి గా అనిపిస్తే ఇంటిని వర్ణమయం చేసుకోమంటున్నారు. ప్రకాశవంతమైన ఎరుపు, నారింజ, పసుపు ప్రశాంతతకు సంకేతమైన ఆకుపచ్చ, నీలం ఆనందం కలిగించే లేలేత నీలం గులాబీ ఉదా పీచ్ కలర్ తో ఇంటికి […]

హెల్దీ లంచ్ బాక్స్

స్కూళ్లు మొదలయ్యాయి పిల్లల లంచ్ బాక్స్ ఏమేం ఉంటే వారికి ఆరోగ్యం అన్న ప్రశ్న ప్రతి తల్లి ముందు నిలబెడుతుంది. పిల్లల ఆహారాన్ని బట్టర్ ఫాయిల్ లో చూటేసి పెడితే పదార్థాలు చెక్కు చెదరవు. పాలు, పెరుగు తో చేసినవి బాక్స్ లో పెట్టక పోవటం మంచిది. ఒక్కసారి అవి పాడైపోతాయి. పళ్ళ ముక్కలు ఉదయాన్నే కట్ చేసి ఎయిర్ టైట్ డబ్బాలో ఫ్రిజ్ లో పెట్టాలి. స్కూల్ కు వెళ్లే ముందు ఈ బాక్స్ బ్యాగ్ […]

పర్ ఫెక్ట్ మ్యాచ్

సరిగ్గా డ్రెస్ కలర్ లో ఉండే ఫ్యాబ్రిక్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. డ్రెస్ పోలికలో ఉండే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ఎంచుకోవటం తెలిసిందే కానీ డ్రెస్ లోని మెటీరియల్ తోనే ఆభరణాలు తయారు చేస్తున్నారు. కొన్ని చీరల తో వాటికి సరిపోను ధరించే ఆభరణాలు ఇస్తున్నారు చీరె డిజైన్ ను పోలి చిన్న చిన్న మార్పులతో ఉండే ఆభరణాలు క్యాజువల్ గా ఫ్యాషన్ వేర్ గాను అందుబాటులో ఉంది. ఈ ఫ్యాబ్రిక్ ఆభరణాలు చాలా […]