Chinna Maata
ఒక ప్లాన్ ముఖ్యం
ఎంతో హడావుడి పెట్టే వంటగది పనుల్లో ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. దాన్ని గుర్తిస్తే చాలు ప్రతి పని హైరానా లేకుండా పూర్తివుతుంది. ముందుగా వంట ఇంట్లో వంట కు అవసరమైన వస్తువులు అన్నీ అందుబాటులో ఉండాలి ఉదాహరణకు సమయానికి పెరుగు తోడు కోకపోతే కంగారు పడద్దు. ఒక కప్పు పాలలో ఒక స్పూన్ వెనిగర్ కలిపితే క్షణాల్లో మజ్జిగ గా రెడీ అవుతుంది. ప్రతిసారి మనం ఏం వంట చేయబోతున్నాము ముందు రోజే దానికి కావలసినవి […]
ఇదంతా సహజం
మహిళలు అందరూ ఒక వయస్సు దాటాక మెనోపాజ్ దశకు చేరుకుంటారు. ఇది అనారోగ్యం కాదు చిట్టచివరి రుతుస్రావం తర్వాత ఓ సంవత్సరానికి ఎదురయ్యే ఒక దశ ఈ దశలో నెలసరి లో మార్పులు వస్తాయి. దీన్ని పెరి మెనోపాజ్ అంటారు. ఈ దశలో శరీరంలో వేడి ఆవిర్లు మూడ్స్ లో మార్పులు చిరాకు డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉంటాయి. ఈస్ట్రోజన్ తగ్గి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య వంతమైన డైట్, వ్యాయామాలు చక్కని ప్రశాంతమైన జీవనశైలిలో కుటుంబ […]
ఉదయపు ఆహారం
కొన్ని ఆరోగ్యాన్నిచ్చే స్మూతీలు అల్పాహారంలో భాగంగా చేస్తే రోగనిరోధకత తో పాటు కావలసిన పోషకాలు అందుతాయి. అరకప్పు ఫ్యాటీ లేని పెరుగు ఒక నారింజ.,. కాస్త పసుపు కలిపి ఇవ్వవచ్చు పాలకూర, పుదీనా తో పోషకాలు తో కూడిన స్మూతీ తయారు చేయచ్చు. కివి, నారింజ, స్ట్రాబెర్రీలు, పెరుగు విటమిన్లతో కూడిన మంచి రసం తయారు చేయచ్చు. అవకాడో, లైమ్ జ్యూస్, స్ట్రాబెర్రీ, ఆపిల్, నిమ్మరసం జ్యూస్ కూడా శరీరానికి ఎంతో ఉపయోగం.
స్కిన్ ఫాస్టింగ్
స్కిన్ కేర్ కోసం ఎన్నో ఉత్పత్తులు వాడుతున్నా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకే స్కిన్ ఫాస్టింగ్ చేయండి, దీనితో చర్మం డిటాక్సింగ్ అవుతుంది అంటున్నారు నిపుణులు. బాగా ముఖం కడిగాక కొద్ది గంటలపాటు ఉత్పత్తి రాయకుండా అలా వదిలేయాలి. దీనితో స్కిన్ తనను తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. ఈ విధానంలో చర్మం ఊపిరి పీల్చుకున్నట్లే కాక సహజ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. మనం వాడే ఉత్పత్తులు మంచివి కావో తెలుస్తుంది. స్కిన్ ఫాస్టింగ్ తర్వాత చర్మం […]
అత్యంత సాహసికురాలు
శాన్ ఫ్రాన్సిస్కో లోని ఏవియేషన్ మ్యూజియం లో మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటు దొరికింది. కోవిడ్ కోరలు సాచిన సమయంలో వందే భారత్ మిషన్ లో భాగంగా విమానంలో విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చింది జోయా. నలుగురు మహిళా పైలట్ లతో ఉత్తర ధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జోయా ను ఐక్యరాజ్యసమితి […]
ఆరోగ్యం అందం ఇచ్చే గింజలు
హార్మోన్ లలో అసమతుల్యతకు పొద్దుతిరుగుడు విత్తనాలు మంచివి అంటున్నారు ఎక్సపర్ట్స్. వీటిలో విటమిన్ ఈ సెలీనియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి చర్మ కణాలు రిపేర్ చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడే వృద్ధాప్య ఛాయలను దగ్గరకు రానివ్వవు. చర్మానికి పోషణ అందించి మెరిసేలా చేస్తాయి. ఈ విత్తనాల్లో ని వంద రకాల ఎంజైమ్ లు హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్ధీకరణ చేస్తాయి.
డిప్రెషన్ దూరం
డిప్రెషన్ తో బాధపడేవారు ప్రోబయోటిక్స్ ఎంతో ఉపశమనం పొందవచ్చు అంటున్నారు వైద్యులు ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే పెరుగు మజ్జిగ కొద్దిగా పులిసిన పిండితో చేసిన ఇడ్లీ దోస వంటి పదార్థాలు తీసుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఈ ప్రో బ్యాక్టీరియా డిప్రెషన్ను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు స్విట్జర్లాండ్ పరిశోధకులు. అయితే ఇదే చికిత్స కాదని యాంటీ డిప్రెసెంట్లో వాడే వారికి వీటి వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
ఇక్కడి ప్రేక్షకులే ప్రత్యేకం
మలయాళ ప్రేక్షకులు జీవితంలో వాస్తవికతను ఇష్టపడతారు. తెలుగు ప్రేక్షకులు యధార్థను ఇష్టపడుతూనే అద్భుత కల్పన కోరుకుంటారు ఈ రెండింటి కలయికే తెలుగు పరిశ్రమ అందుకే కేరాఫ్ కంచర్ల పాలెం ఆర్ ఆర్ ఆర్ వంటి విభిన్నమైన చిత్రాలు ఇక్కడ నుంచే వచ్చాయి సక్సెస్ అయ్యాయి. ఇక్కడ వైవిధ్యం ఎక్కువ అంటోంది అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ-2 సక్సెస్ ఎంత గానో సంతోష పెట్టింది కెరీర్ ఆరంభం లోనే నన్ను తెలుగు ప్రేక్షకులు గుర్తించి ప్రోత్సహించారు. నేను చాలా అదృష్టవంతురాలిని […]
ఏరోబిక్స్ తో మతిమరుపు మాయం
ఏరోబిక్స్ వ్యాయామం చేస్తే జ్ఞాపక శక్తికి సంబంధించిన మెదడులోని కొన్ని ప్రదేశాలకు రక్తప్రసారం పెరిగి తద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అల్జీమర్స్ డిసీజ్ జర్నల్ ప్రచురితమైన ఈ అధ్యయనం లో ఏరోబిక్స్ లో పెరిగే రక్తప్రసారం వల్ల వయసు మీరిన వాళ్లలో మతిమరుపు సమస్యలు తగ్గుతాయి అంటున్నారు. 60 ఏళ్ల పైబడిన వారి పై చేసిన ఈ ప్రయోగాలు ఈ అంశాన్ని రుజువు చేశాయి.
ఉన్నవ్ లక్ష్మీబాయ్ 1882 -1952
ఉన్నవ లక్ష్మీనారాయణ గారి భార్య లక్ష్మీ బాయి 1992లో ఆ దంపతులు గుంటూరు లో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. జాతీయోద్యమంలో గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకలాపాలలో దంపతులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. గుంటూరులో దేశ భక్తి కొండా వెంకటయ్య ఇంట్లో ఉన్నావ లక్ష్మీబాయి శారదా నికేతన్ అనే చిన్న పాఠశాల స్థాపించారు. ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది కాంగ్రెస్ తరఫున పురపాలక సంఘం సభ్యురాలిగా ఆమె సేవలు అందించారు. మరణించేవరకు మహిళల అభ్యున్నతే ధ్యేయంగా జీవించారు.
వయసుతో పని ఏముంది ?
పలు దేశాల సమస్యలూ, కష్టాల్లో ఉన్న వ్యక్తుల కథనాలతో ‘ప్రాజెక్ట్ ఇన్వాల్వ్’ తీసుకువచ్చింది అమెరికాలోని న్యూజెర్సీలో హైస్కూల్ విద్యార్థి టీనేజర్ ఆషి చందన ఎవరైనా సహాయం చేయాలంటే అందులో ‘హెల్ప్ నౌ’ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే అందుకు సంబంధించిన ఎన్జీవో సమాచారం వస్తుంది. ఇండియా, కెనడా, జర్మనీ ఇలా 60 దేశాలకు చెందిన ఎన్జీవోలు ఇప్పుడు ఆషి చందన తో కలిసి పని చేస్తున్నారు. ఈ యాప్ కి వేల మంది భాగస్వాములు ఉన్నారు. సమాజంలో […]
అస్సలు వాడద్దు
చర్మ సంరక్షణ లో ఫేస్ ఆయిల్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ కొన్ని సమస్యలు ఉంటే మాత్రం నూనెలకు దూరంగా ఉండాలి. యాక్నే ని ఉంటే అధిక చుండ్రు లక్షణాలున్న, దుమ్ము లు రసాయనాలతో ఎలర్జీ వచ్చే వాళ్ళు మొటిమలు ఎక్కువ ఉన్న నూనెలు వాడకూడదు పై సమస్యలకు దాదాపు జిడ్డు చర్మమే కారణం అందుకే ఫేస్ ఆయిల్స్ కు దూరంగా ఉండాలి.
ఇండియా అంటే ఇదే
తొలిసారిగా భారతీయ సినిమాలో డబల్ జండర్ రోల్ (హీరోయిన్ హీరో గా) పోషించిన అన్నా హరి సలుంని చూడాలి అనుకుంటే ఐ.ఎం.పి అనే టైం మెషిన్ లోకి వెళ్ళాలి. ముంబాయి కి చెందిన అనూష యాదవ్ మొదలుపెట్టిన ఇండియన్ మెమొరీ ప్రాజెక్ట్ (ఐ.ఎం.పి). కి ఆన్ లైన్ లో విపరీతమైన ఆదరణ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ అయిన అనూష యాదవ్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫర్ బ్రాండ్ కల్చర్ డిజైనింగ్ కన్సల్టెంట్ ఐ.ఎం.పి ఆన్ లైన్ […]
బ్లౌజ్ కు అందం
ఎన్నో అందమైన దృశ్యాలు పెయింటింగ్స్ రూపంలో చూస్తూ ఉంటాం చివరకు క్యాలెండర్ లో కుట్టు మిషన్ లు, రేడియోలు ఇతర ఎన్నో పెయింటింగ్స్ ఇప్పుడు బ్లౌజ్ ల పైన బ్యాక్ స్పేస్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ కి వేదిక అయ్యాయి బ్లౌజ్ లు. హై నెక్ బ్లౌజ్ లు ఇష్టమైతే ఇలా ప్రత్యేకమైన డిజైన్ల ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. రొటీన్ ఆకులు, పువ్వులు కాకుండా మోడరన్ ఆర్ట్ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ లు గా మారిపోయాయి. ఎంబ్రాయిడరీ […]
మాస్క్ ఉంటేనేం
కొన్ని వృత్తుల్లో ఇప్పటికీ మొహానికి మాస్ ధరించే ఆఫీసుకు వెళ్లాలి. కాస్తయినా మేకప్ లేకపోతే బాగోలేదు అనుకునేవాళ్లు మేకప్ తో మాస్క్ ను మ్యాచ్ చేసే చిట్కాలు తెలుసుకోవాలి. చర్మానికి అప్లయ్ చేసే లేయర్స్ తగ్గించాలి. స్పాట్ ఆన్ సీలింగ్ పద్ధతి పాటించాలి. పౌండేషన్ వేయాలంటే పలచని లేయర్ పూసుకుని స్పాంజ్ తో చర్మం లో కలిసేలా పరచుకోవాలి. మేకప్ చెదిరిపోకుండా బ్యూటీ స్పాంజ్ తో చర్మానికి దగ్గర గా అద్దుకోవాలి. కళ్ళ పైనే అందరి దృష్టి […]
జంతు ప్రేమతో ఆరోగ్యం
గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు,కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకొంటున్నవాళ్ళు,ఆందోళన,ఆదుర్దాతో సతమతం అయ్యేవాళ్ళు యానిమల్ థెరపీ తో కోలుకొంటారు అంటున్నారు అధ్యయనకారులు దీన్నే పెటో థెరపీ అంటున్నారు. కుక్కలు, గుర్రాలు,కుందేళ్ళు,పక్షులు,డాల్ఫిన్ లు, చేపల్ని కూడా ఈ థెరపీ కోసం ఉపయోగిస్తారు. అన్నింటిలో బర్డ్ థెరపీ అత్యంత శక్తివంతమైంది అంటున్నారు. రోగి మానసిక శారీరక స్వాంతన కు కుందేళ్లు సాయపడతాయి. భావోద్వేగాల నియంత్రణలో హార్స్ థెరపీ కి మించినది ఇంకొకటి లేదు. శునకాలతో సొంత పిల్లల తో ఉన్న ఫీలింగ్ […]
మహిళల హక్కులు చెప్పే పింక్ లీగల్
లైంగిక వేధింపులు, గృహహింస, వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు, బాలల హక్కులు, సైబర్ బెదిరింపులు వంటి వాటిపై అవగాహన కలిగించేలా ఒక వెబ్ సైట్ రూపొందించారు హైదరాబాద్ కు చెందిన మానసి చౌదరి. పింక్ లీగల్ పేరుతో ఈ వెబ్ సైట్ మహిళలకు న్యాయ సలహా ఇస్తోంది దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న 30 మంది స్వచ్ఛందంగా ఇందులో పనిచేస్తున్నారు మహిళల చట్టాలు హక్కులపై పింక్ లీగల్ ఒక ఎన్ సైక్లోపీడియా వంటిది.
నేవి లో మహిళలు
భువనేశ్వర్ సమీపంలోని ఐ.ఎన్.ఎస్ బాలిక శిక్షణ కేంద్రం లోకి నేవి ఫస్ట్ ఉమెన్ బ్యాచ్ కు చెందిన ఆరు వందల మంది మహిళలు అడుగు పెట్టబోతున్నారు. పర్సనల్ బి లో ఆఫీసర్ ర్యాంక్ క్యాడర్ లో మహిళలను రిక్రూట్ చేసి తొలి విభాగం నేవి సెయిలర్స్ గా మహిళలకు తోలి అవకాశం దొరికింది గతంలో నేవి కి చెందిన ఉమెన్ టీమ్ నావిక సాగర్ పరిశ్రమ పేరుతో ప్రపంచ నౌక యాత్ర చేసి చరిత్ర సృష్టించింది. అలాగే […]
నాచు గులాబీలు
సెక్యులరెంట్ జాతులకు చెందిన లేవనో క్లాక్, మెక్సికన్ రోజ్, సన్ రోజ్, రాక్ రోజ్ మొదలైనవి నాచు మొక్కలకు చక్కని రంగురంగుల చిట్టి గులాబీ పూలు పూస్తాయి. ఒకే కుండీలో రెండు మూడు రకాలు సన్నని ఆకులు గల ఈ మొక్కలను పెంచితే రంగురంగుల పూలు పూస్తాయి కొందరు బోన్సాయ్ గా పెంచి భిన్నమైన ఆకారాల్లో కి మలుస్తారు వీటిని నాస్ట్రిర్జియం జినియా ముక్కలతో కలిపి పెంచుతారు ఎక్కువగా నీళ్లు కూడా అవసరం లేదు ఎంత బాగా […]
కొండంత గణపతి
గుళ్లో భగవంతుడి విగ్రహం కనిపిస్తుంది కానీ ఒక కొండ భగవంతుడి ప్రతిమ లాగా ఉంటే 71 అడుగుల ఎత్తులో మూడు అంతస్తుల్లో పీఠం వేసుకుని ఆశీర్వదిస్తూ ఉన్న సిద్ధి వినాయక ఆలయం గుజరాత్ లోని మహేమదావద్ పట్టణంలో ఉంది. లోపల మూల విరాట్ తో పాటు చైనా, ఇండోనేషియా, థాయిలాండ్, కాంబోడియా ఇలా తొమ్మిది దేశాలకు చెందిన వేరు వేరు గణేశుడి ప్రతిమలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఎన్నో గణపతి శిల్పాలు మూషికాలు ఉంటాయి. ఈ ఏకదంతుడి […]
