Monday, 27 Jul, 2026

ఈవిల్ ఐ ఇవాల్టి ఫ్యాషన్

బ్లాక్ థ్రెడ్ యాంక్లెట్ దాన్నే ఈవిల్ ఐ యాంక్లెట్ అని పిలిచే నల్లతాడు ఇవ్వాళ యూత్ ఫ్యాషన్. అమ్మాయిలు ఒక్క కాలుకు లేదా రెండు కాళ్ళకి ఈ నల్ల తాడు కట్టేస్తున్నారు. పూర్వకాలంలో పిల్లలకు దిష్టి తగలకుండా మెడలోను చేతికో ఒక నల్ల తాడు కట్టే ఆచారం ఉండేది. ఆ నల్ల తాడుకు నల్లపూసలు బంగారు గుండు గుచ్చేవాళ్ళు ఈ దిష్టి తాళ్లనే ఇప్పుడు రకరకాల డిజైన్లతో అమ్మాయిలు వాడుతున్నారు. బ్రాస్ లెట్ మాదిరిగా కూడా పెట్టుకుంటున్నారు […]

క్రాప్ టాప్ ఫరెవర్

కార్పొరేట్ లుక్ రావాలంటే క్రాప్ టాప్ ప్యాంటు వేసుకోవాలి అంటారు డిజైనర్లు.ఇవాల్టి రోజుల్లో చీరలు స్కర్ట్ ల పైన కూడా క్రాప్ టాప్ లాంగ్ కోట్ వేసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇవి ఇంతగా నచ్చుతున్నాయి కనుకనే ఈ రెండిటిని కలిపేసి కొత్త ఫ్యాషన్ సృష్టించారు ఆధునిక డిజైనర్లు. క్రాప్ టాప్ ప్యాంట్ విత్ కోట్ ఈ డ్రెస్ సంప్రదాయ వేడుకల్లో వేసుకున్న లేదా సాయంకాలపు పార్టీల్లో వేసుకున్న ఆడంబరంగా అందంగా ఉంటుంది. వెడల్పాటి స్కర్ట్ తో కలిపి వేసుకున్న […]

వేరే నగలెందుకు?

అందమైన డ్రెస్సులతోపాటు వాటికి తగ్గ నగలు వెతుక్కోవటం కూడా శ్రమే. అందుకే కుర్తీల పై అందమైన నగల డిజైన్లు చేర్చారు డిజైనర్లు. సాధారణంగా కుర్తీలు, లెనిన్,కాటన్, క్రేప్ వంటి వస్త్రాలతో తయారు చేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల కోసం సిల్క్ పట్టు వస్త్రాల కూడా వాడతారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ కుర్తీల పైన హారాలు డిజైన్ చేశారు. పొడగాటి గొలుసులు నెక్లెస్ లు లాగా దూరంగా చూస్తే అచ్చం నగల్లాగా ఉండే ఈ కుర్తీల డిజైన్లు చూస్తే […]

ఎంతో స్పెషల్ ప్లీటెడ్

ఎప్పుడు ఒకే రకం చీరలేనా ? కాస్త వెరైటీ ఉండదా? పట్టు,కాటన్,జార్జెట్,కోట ఎన్నిసార్లు కట్టుకోలేదు. ఇప్పుడే ఏదైనా కొత్త వెరైటీ కావాలా అనుకుంటే అమ్మాయిల కోసం వచ్చాయి ప్లీటెడ్ క్రష్డ్ చీరలు ఎలాంటి డిజైన్ లేని సాదా చీరలకు చిన్న మడతలు పెట్టినట్లు కనిపించే ఈ చీరలు ఇవ్వాల్టి ఫ్యాషన్. జార్జెట్,సిల్క్ లతో ఈ ప్లేటెడ్ క్రష్డ్ సారీస్ చక్కని డిజైనర్ బ్లౌజ్ తో కలిసి కొత్త అందాన్ని ఇస్తున్నాయి. అందమైన నలుపు, ఎరుపు వంటి ముదురు […]

మహిళల ఓట్లే కీలకం

2029 నుంచి భారతదేశంలో మహిళా ఓటర్ల సంఖ్య అధికం అవనున్నదని ఎస్.బి.ఐ నివేదిక చెబుతోంది. 2024 లో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో నివేదిక మొత్తం 68 కోట్ల మంది ఓటర్లను అంచనా వేసింది. అందులో మహిళా ఓటర్లు 49 శాతంగా అంటే 33 కోట్ల మంది ఉన్నారని నివేదిక పేర్కొన్నది గత దశాబ్ద కాలంలో భారతదేశ రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళల ఓటింగ్ శాతం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. […]

ఏనుగుల రాణి

భారత దేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బహుకరించి గౌరవించింది. మన దేశం లోనే కాదు ఆసియాలోని ప్రమాద స్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణ కోసం వాటిని ఎలా కనిపెట్టుకొని ఉండాలో తెలుసుకొని ఇన్నాళ్లుగా వాటిని సంరక్షిస్తున్న పర్బతి అస్సాం అటవీశాఖ లో చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ గా పనిచేసింది. మావటి పని డ్రైవర్ ఉద్యోగం చేసినట్లు పనిగంటలతో ఉండదు ఏనుగు కు మావటి అనుక్షణం తోడు ఉండాలి అంటుంది పర్బతి. […]

చామీ ముర్ము కు పద్మశ్రీ

ఝార్ఖండ్ కు చెందిన చార్మి ముర్మా 36 సంవత్సరాలుగా తన రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. కూలి పనులు చేసుకుంటూ పర్యావరణ హితం కోసం మొక్కలు నాటిన ముర్ము కు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేశారు. ఈ మొక్కలు నాటే పని పెట్టుకున్నందుకు ఇంట్లో వాళ్లతో కూడా గొడవలు వచ్చాయి. చామీ ముర్ము ఇంటి నుంచి బయటికి వచ్చి ఎంతో ధైర్యంతో  సమాజ హితం కోరింది. తాను నివసించే భుర్సా గ్రామం బంజరు […]

రోజుల కొద్దీ పాట

పాట వింటూ గంటలు గడిపేయచ్చు కానీ రోజుల కొద్దీ అవిశ్రాంతిగా పాడటం గురించి విన్నారా ? ఘానా కు చెందిన 33 ఏళ్ల అసాంతేవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.ఆఫ్రికాలోని కొట్టుకు కొటోకా విమానాశ్రయం వేదికగా ఆమె తన గాన మారథాన్ ప్రారంభించి సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు పాడింది. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రయాణికులు సహా వేలాది మంది ఆమెను ప్రశంసించారు […]

పెదవులు పగుళ్ళా ?

వాతావరణం అతి చల్లగా ఉన్న వేడిగా ఉన్న పెదాలు పొడిబారి పోతాయి. అలర్జీలు, థైరాయిడ్, ఐరన్, బి-విటమిన్ లోపం తగినన్ని నీళ్లు తాగకపోవడం మాటిమాటికి పెదాలు నాలుకతో తడపడం కూడా పెదవుల పగుళ్లకు కారణం కావచ్చు. పెదవులపై చర్మం చాలా పలుచగా ఉంటుంది. పెదవిపై నూనె గ్రంధులు ఉండవు అందుకే ఎప్పటికప్పుడు పెదవులకు పోషణ అందించడం కోసం రోజుకు మూడు లీటర్ల నీరు తాగాలి.కానీ కొన్ని రకాల టూత్ పేస్ట్ లు కూడా పడవు అదేమైనా కారణమేమో […]

స్ఫూర్తిదాయక ప్రయాణం

తమిళనాడు కు చెందిన ప్రీతి శ్రీనివాసన్  క్రికెటర్ అమెరికాలో చదువుకున్న టాప్ స్టూడెంట్ 18 ఏళ్ల వయసులో వెన్నెముక పక్షవాతం రావడం తో వీల్ చైర్ కే పరిమితం అయింది. సొంత అనుభవాలతో ఈ దేశంలో దివ్యాంగుల గౌరవంగా జీవించగలిగిన స్థలం లేదని అర్థం అయ్యాక సోల్ ఫ్రీ పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. ఇక్కడ వెన్నుపాము సమస్యలున్న వారికి పూర్తి చికిత్స, పునర్వాసం, వైద్య సంరక్షణ విద్య కౌన్సిలింగ్ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ సంస్థ […]

నోక్టర్న్స్ కు అవార్డ్  

హిమాలయ ప్రాంతాలకు చెందిన మాత్ అంటే రెక్కల పురుగుల పై తీసిన డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన నోక్టర్న్స్ డాక్యుమెంటరీ,అమెరికాలో జరిగిన సన్‌డాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి ఈ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ ఆమె భర్త  అనిర్బన్ దత్తా తో కలిసి ఢిల్లీలో ఉంటారు. హిమాలయాల్లో ఉండే అందమైన రెక్కల పురుగులు పర్యావరణ మార్పులతో నశించిపోతున్నాయని తెలుసుకొని వాటి జీవన విధానాన్ని డాక్యుమెంటరీ గా తీశారు.డాక్యుమెంటరీ లో రెండే […]

చర్మానికి పోషకాలు అవసరం

చుట్టూ వాతావరణంలోని దుమ్ము ధూళి తో పెరుగుతున్న ఎండ వేడితో చర్మం నిర్జీవంగా మారుతుంది. చర్మానికి కూడా పోషకాలు అవసరం ఎలాంటి రసాయనాలు లేని కొన్ని మాస్క్ లు చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కమల పండు తొక్కలను ఓ గిన్నెలో వేసి ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మూడు ఇ విటమిన్ క్యాప్సూల్స్ కలపాలి వీటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి ఆ రసాన్ని వడగట్టి దానికి అలోవెరా గుజ్జు కలిపి గాజు సీసాలో ఫ్రిజ్ లో […]

నెల తగిలితే ఆరోగ్యం

సాధారణంగా వాకింగ్ కోసం రన్నింగ్ కోసం మంచి షూస్ వేసుకొంటారు. కానీ ఇవేవీ లేకుండా వట్టి పాదాలతో నడవడం,పరుగెత్తడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. నేలపైన వట్టి పాదాలతో నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది.  రిఫ్రెష్ అయిన భావన కలుగుతుంది.పాదాల అన్ని నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఎముకలు లంగ్స్ పాదాల తోనే ముడిపడి ఉంటాయి. కనుక వట్టి పాదాలతో నేలపైన లేదా పచ్చని పచ్చిక పైన నడిస్తే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇది […]

140 భాషల్లో పాటలు    

కేరళ కు చెందిన 18 ఏళ్ల సుచేతా సతీష్ తన గాన మాధుర్యంతో రెండుసార్లు గిన్నిస్ సాధించింది భాషలతో పాటు ఫ్రెంచ్ హంగేరియన్ జర్మనీ వంటి విదేశీ భాషల్లోనూ పాడగలరు. 85 భాషల్లో పాట పాడింది సుచేతా. 2021 లో ఏడు గంటల్లో 120 భాషల్లో గాత్రాన్ని వినిపించి రికార్డు సృష్టించింది సుచేతా 140 భాషల్లో పాడి రెండోసారి గిన్నిస్ లో తన పేరు నమోదు చేసుకుంది. మ్యూజిక్ బియాండ్ బ్యాండ్ రాప్ పేరుతో ఆమె పాటలు […]

విశిష్ఠ గౌరవం

భారతదేశ ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం పరిశోధకురాలు, సంగీత దర్శకురాలు ఉపాధ్యాయుల, రచయిత కూడా పద్మ సుబ్రహ్మణ్యం ప్రముఖ చలనచిత్ర దర్శకులు కె. సుబ్రహ్మణ్యం మీనాక్షి సుబ్రహ్మణ్యం లకు 1943 లో జన్మించారు. సంగీతం లో మాస్టర్స్ చేశారు. నృత్యం లో పి.హెచ్.డి తీసుకున్నారు. 1981 లో పద్మశ్రీ, 2003 పద్మభూషణ్ అవార్డు లు పొందారు. 1983 లో సంగీత నాటక కమిటీ అవార్డు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు ఇచ్చి గౌరవించారు.తాజాగా  పద్మ […]

హరికథకు గౌరవం

ప్రముఖ హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణాజిల్లా హుబిలి పట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి తెలంగాణ లోని వేములవాడ లో పెరిగారు. 14 ఏళ్ల వయసు లో హరికథ నేర్చుకున్నారు. ఇప్పటివరకు కొన్ని వేల హరికథ ప్రదర్శనలు ఇచ్చారు. దేశం లోని విశ్వవిద్యాలయలు అన్ని ఆమె ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు తో పాటు ఆమె సంస్కృతంలోనూ హరికథ చెబుతారు. 2018 లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. జాతీయస్థాయి కళాకారిణిగా  హరికథ […]

క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్

శక్తివంతమైన హస్కీ గళంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన  నేపథ్య గాయని ఉషా ఉతుప్ ఆమెను క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ గా పిలుస్తారు. హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం తో సహా పలు భారతీయ భాషలలో 1500 పాటలు పాడారు ఉషా. 2011 లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం అందించింది. సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను అనేక అవార్డులు ప్రశంసలు పొందారు. తాజాగా ఆమెను పద్మభూషణ్ వరించింది.

వైజయంతిమాల కు పద్మ విభూషణ్

భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా కీర్తి గణించిన వైజయంతిమాల బాల నృత్య సంగీత కళల్లో ప్రవీణురాలు తమిళ చిత్రం వాఙ్కై తో సినిమా రంగంలో ప్రవేశించారు. నృత్య ప్రధానమైన చిత్రాలలో ఆమెకి ఆమే సాటి. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో పాటు తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాలు అందుకున్నారు. సినీ సంగీత రంగాలకు ఆమె చేసిన సేవలకు గాను ఈ ఏడాది పద్మ విభూషణ్ అందుకున్నారు.

వ్యాపారవేత్త

జ్యోతి లాబరేటరీస్ అధినేత్రి ఎం.ఆర్ జ్యోతి ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీ మీద కెక్కిన జ్యోతి స్ఫూర్తిదాయక కథనం ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శం.ఉజాలా నీటి మందు ప్రిల్ లిక్విడ్ డిష్ వాషర్, మార్గో సోప్, హెన్కో, మిస్టర్ వైట్ డిటర్జెంట్ మొదలైనవన్నీ జ్యోతి లాబరేటరీ ప్రతిభకు నిదర్శనమే. ఎన్నో బహుళజాతి సంస్థల ప్రొడక్ట్స్ తో పోటీపడి జ్యోతి ల్యాబ్స్ నిలదొక్కుకుంది అంటే కేవలం ఆమె వ్యవహార రక్షణ గానే చెప్పవచ్చు సింగిల్ ప్రోడక్ట్ ఉజాల తో మొదలైన […]

నిద్రలేమి తో సమస్య

రోజు మొత్తంలో ఆరు గంటల నిద్ర తప్పనిసరి అంటున్నాయి అధ్యాయనాలు. నిద్రలేమి ఒత్తిడిని పెంచడమే కాకుండా రక్త ప్రసరణ పై ప్రభావం చూపెడుతుందని ఒక అధ్యయనం చెబుతోంది.రాత్రి వేళల్లో ఆరు గంటల కంటే నిద్ర సమయం తక్కువగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు తప్పనిసరిగా నిద్ర వేల లు నిద్ర వేళలు పాటించమని అధ్యయనకారులు సలహా ఇస్తున్నారు.