Tuesday, 21 Jul, 2026

పీచు చాలా ముఖ్యం

మన పేగుల్లో ఎన్నో జాతుల సూక్ష్మజీవులుంటాయి. మనిషి కడుపులో రెండు కిలోల బరువు తూగే సూక్ష్మజీవులు ఉంటాయి. మనం తీసుకొనే ఆహారంపైన ఈ సూక్ష్మజీవుల ప్రభావం చూపిస్తాయి. పీచు పదార్ధాలను పేగు గోడలు పీల్చుకోగలిన స్థాయికి తీసుకువస్తాయి భిన్న సూక్ష్మజీవుల జాతులు సరైన సంఖ్యలో పేగుల్లో వుంటే పేగు గోడలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి ఆరోగ్యం ఇచ్చే బాక్టీరియా పేగుల్లో ఉండే పీచు కాళ్ళు ఎముకలకు బలన్ని ఇస్తుంది.

ఎండల్లో హాయ్ హాయ్

వేసవి రాగానే సాధారణంగా కాటన్స్ వైపు తిరిగిపోతారు. అలాగే యాక్ససరీలు కూడా వేసవి ఫ్యాషన్ కు సరిపోయేవి మార్కెట్ లో కొస్తాయి. వెదురు, నారా, కలంకారి జీన్స్ తో చేసిన చెప్పులు వేసవికి నప్పుతాయి. జ్యూట్ ,కలంకారీ జీన్స్ హ్యాడ్ బ్యాగ్ లు , ఇతర వస్త్రాలతో చేసిన హ్యాండ్ బ్యాగ్ లు వేసవిలో కట్టుకొనే ,నూలు ,రేయాన్, పోచంపల్లి ఇతర మంగళగిరి కాటన్స్ కు సరిగ్గా సూటవుతాయి. ఈ కాలంలో నగలు కూడా టెర్రకాటన్, డై […]

అనర్ధాలే ఎక్కువ

ఒక్కసారి ఫ్యాషన్ లు కూడా ప్రాణం మీదికి తెచ్చిపెడతాయి చూసుకొండి అంటున్నారు డాక్టర్లు. శరీరాకృతి చక్కగా కనిపించేందుకు బిగుతుగా అతుక్కునేలా ఉండే డ్రెస్ వేసుకోటం వల్ల చర్మం రాపిడికి గురై ఎలర్జీలు వస్తాయి. బిగువైనా ఫ్యాంట్లు స్కర్ట్ లు ,లెగ్గింగ్స్ వంటివి క్లోజ్ ఫిట్టింగ్ స్కర్ట్ లు వేసుకోవడం వల్ల కండరాలు నొప్పులు ,డిస్క్ సమస్యలు రావచ్చు . అలాగే ఎత్తు చెప్పులు కూడా ఎక్కువసేపు మడమలపైన, వేళ్ల పైన భారం పడితే రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు […]

తల్లికి ముప్పే

ఆడవాళ్ళకి పిల్లలకీ ఏదో విడదీయరాని సంబంధం ఉన్నట్లే ఉంది. ఇప్పుడో కొత్త రిపోర్ట్ పిల్లలని కనకపోతేనే బావుండు అనిపిస్తుంది. పిల్లలున్న తల్లి ఆయుష్షు పిల్లలు లేని వాళ్ళతో పోలిస్తే 11 సంవత్సరాలు తక్కువగా ఉంటుందట. ఒక అధ్యాయనంలో మానవ క్రోమోజోమ్స్ లో ఉండే టెలో మర్స్ పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉన్నాయి. టెలోమర్స్ జనన కాలన్ని పెంచుతాయని ఇవి తక్కువగా ఉంటే జననకాలం తక్కువని అధ్యాయనం చెపుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత స్ట్రీలలో టెలోమర్స్ పోడవు తగ్గినట్లు వీరు […]

ఎన్నయినా తినవచ్చు

లోటస్ సీడ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఔషధగుణాలు ఎక్కువే. వీటితో చేసే పాప్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు ,కొవ్వు,సొడియం తక్కువ కనుక భోజనానికి మద్య తినవచ్చు. చక్కెర చాలా తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు తప్పని సరిగా తినగలిగే స్నాక్. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. చిన్నప్పటి నుంచి చిరుతిండి అలవాటైన వాళ్ళు ఒక పట్టానా ఏవీ తినకుండా నోరు కట్టేసుకోలేరు. లోటస్ సీడ్స్ లో […]

పండ్లలో బెస్ట్

ఆరు కమలా పండ్లలో ఎంత ‘సి’ విటమిన్ ఉంటుందో భాగా పండిన ఒక్క జామ కాయలో అంత ‘సి’ విటమిన్ ఉంటుంది. అంతే కాదు కాల్షియం , ఫాస్పరస్, కెరోటిన్, పోటాషియం , పీచు, కాల్షియం, ఐరన్ తో పాటు దాదాపు అన్నీ విటమిన్లు,లవణాలు సమృద్ధిగా ఉండే అద్భుతమైన పండు జామ. ఇందులో కొలెస్ట్రాల్ ,సోడియం అస్సలు ఉండవు. మిగతా అన్నీ పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ జామాలో ఎక్కువగా ఉంటాయి. పచ్చి కూరలు,జామతో కలిపి తిన్న […]

శిశువుకు సమస్య

అతిగా మాంసం తినవద్దు , గర్భస్థ శిశువుకు చాలా నష్టం అంటున్నాయి పరిశోధనలు. గొర్రె మాంసం ,చికెన్ , చీజ్ నట్స్ పాలధార ఉత్పత్తులు . బీన్స్ లో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భవతిగా ఉన్న వాళ్ళు మాంసం అధికంగా తింటే శిశువు కు స్కిజోఫ్రినియా అంటే దీర్ఘకాలికమైన వైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. అంచేత గర్భవతిగా ఉంటే అధికంగా మాంసం తినవద్దని హెచ్చరిస్తున్నారు.

అందరూ సరేనంటేనే

యాభై దాటినా వయసులో ఉన్నప్పటి ఉత్సహం కావాలంటే బేసిక్ ఎరోబిక్ వ్యాయామాలు ఎంచుకోవాలి. వేగం తగ్గించి ఎక్కువ సేపు చేసే వ్యయామాలు ,చేతులు ,కాళ్ళు కదిలేలా ఉంటాయి. అయితే ముందుగా ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడి శరీరం బరువు , ఆరోగ్య సమస్యల వివరాలు అన్నీ డాక్టర్ దగ్గర సూచనలు తీసుకొని వారు ఇరువురూ కలిసి నిర్ణయించిన తేలికపాటి వ్యయామాలు చేయాలి. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకొని ఎముకల్లో కాల్షియం సాంద్రత గురించి తెలుసుకొని మరీ వ్యయామం […]

కండరాల నొప్పా

నిద్రలో ఒక్కసారి కాలి వేళ్ళు తిమ్మిర్లు ,కాలి కండరాలు పట్టేసి నొప్పి పెడతాయి. ఇందుకు కారణం పొటాషియం లోపం కావచ్చు . కండరాలను అలసట చెందనివ్వకూడదు. కాళ్ళ పాదాలు పడుకొనే ముందర మసాజ్ చేసుకోవాలి. పట్టేసిన కండరాలపైన వేడి నీళ్ళతో కాపడం పెట్టాలి. ముఖ్యంగా ఆహారంలో అరటి పండు, బంగాళాదుంపలు ,సిట్రస్ పండ్లు ,పాలకూర ,బీన్స్ సమృద్ధిగా తినాలి. వీటిలో పొటాషియం ఉంటుంది. ఆహారం ద్వారా పోషకాలు అందితేనే ఆరోగ్యం.

ముళ్ళున్నా మంచిదే

ముళ్లు మొక్కలా కాస్త అనిపిస్తుంది. కానీ అనాస కాస్త శ్రద్ధగా ముక్కలు చేస్తే మాత్రం అద్భుతమే. అలాగే తినేయవచ్చు ,జ్యూస్ చేసుకొని తాగవచ్చు. ఇందులోని పిండి పదార్థాలు చక్కెరలు శక్తి నిస్తాయి.పుష్కలంగా పీచు ,జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని విటమిన్ సి, శరీరం ఇనుముని పీల్చుకొనేందుకు సహకరిస్తుంది. కొల్లాజిన్ తో కలిపి చర్మాన్నీ ముడతలు పడకుండా మాంగనీస్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అనాసతో ఎన్నో రకాల వంటలు చేసుకొవచ్చు.

ముందే హెచ్చరించండి

ఆటల్లో పడి పోవటం ,పిల్లలు కొట్టుకోవటం సహజం, కానీ ఆ చిన్న తననా తగిలే దెబ్బలు వారిపై దీర్ఘకాల ప్రభావం చూపెడతాయి అంటున్నారు వైద్యులు. ఆటల్లో తలకు గాయాలు తగులుతాయి . పొట్టలో పిడిగుద్దులు గుద్దుకొంటే అక్కడ దెబ్బలు తగులుతాయి. కర్రలు ,రాళ్ళతో కాళ్ళకు గాయాలు అవుతాయి. పిల్లలకు తప్పనిసరిగా ఈ అంగాల విషయం స్పష్టంగా అర్ధం అయ్యేలా చెప్పాలి. కీలక అంగాలకు గాయం తగలకుండా చూసుకోమ్మని ముందే హెచ్చరించాలి. వాళ్ళంతట వాళ్ళను కపాడుకొనే వయసు వచ్చే […]

ఎంత మంచిదో

అచ్చం పాలకూరలో వుండే పోషకాలతో చేసిన టాబ్లెట్స్ గర్భవతులకు ఇస్తారు. పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ శక్తి పాలకూరలో ఉందన్నమాట. ఇందులోని పోషకాలు అందరికీ ఆరోగ్యాన్నీ ఇస్తాయి. విటమిన్ ‘ఎ’ పాళ్ళు ఎక్కువ కనుక కాళ్ళకు మేలు చేస్తుంది. విటమిన్ ‘సి’ ఉంది కనుక వ్యాధి నిరోధక శక్తి సమకూరుతోంది. అనీమియా రాదు . పాలకూరలో ఉండే ల్యూటెన్ ,జయగ్భాంధన్ వంటి యాంటీ ఆక్సీ డెంట్స్ వల్ల ఎన్నో పోషకాలు అందటమే కాక ఎన్నో […]

బుల్లి కప్పు చాలు

మనసుంటే మార్గం ఉంటుంది. ఇంట్లో అలంకరణగా పూల మొక్కలు ఉండాలి అనుకొంటే మీని యేచర్ గార్డెన్స్ వైపు చూడవచ్చు ఒక టీ కప్పు లో మొక్కలు పెంచవచ్చు . కొత్తమీరా ,పూదీనా ,మెంతికూరలతో పాటు బొప్పాయి, గడ్డిజాతి నాచు మొక్కలు హాయిగా కప్పుల్లో పెరుగుతాయి. సేంద్రీయ ఎరువులు కలిపిన గట్టి చిన్నచిన్న గులకరాళ్ళు కొన్నీ అలంకారాలు చేస్తే ఈ బుల్లి కప్పులతో మొక్కలు ఎంతో ఆనందపెట్టిస్తాయి. ఇంటిని ఉద్యానవనం చేస్తాయి.

ఎండల్లో జాగ్రత్త

జుట్టు ధృఢంగా ,బావుండలంటే మాడు శుభ్రంగా పొడిగా ఉంచుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తలకు పెట్టుకోనే డై ,హెన్నా,ఆయిల్స్ అన్నీ బాగా పోయేలా శుభ్రం చేయాలి. మాడు ఆరోగ్యంతో దురదలు రాకుండా ఉంటాయి. సహజమైన నూనెతో మసాజ్ చేసి తల స్నానం చేయాలి. గోరు వెచ్చని నీళ్ళతోనే తలస్నానం చేయాలి. వేసవిలో మాడుకు చల్లదనం ఇచ్చే గోరింటాకు పూత వేసుకోవాలి . ఎండ పడకుండ స్కార్ఫ్ ధరించాలి. గొడుగు వెంట తీసుకుపోవాలి హెయిర్ స్ప్రే లు, జెల్స్ […]

అందం ఆరోగ్య రహస్యం ఇదే

వాకింగ్, యోగా ఏదైనా ఏ వ్యయామం అయినా సరే శృంగార జీవితానికి సాటిరాదు అంటుంది ఒక రిపోర్ట్. సుఖంగా అన్యోన్యంగా జీవించే దంపతులు ఆరోగ్యంగా జీవించవచ్చు. శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు విడుదలై పని ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. భార్య,భర్తల శృంగార జీవితం వాళ్ళ శరీరాలను పటిష్టంగా , ఆరోగ్యంగా ఉంచి వాళ్ళకి ఆరోగ్యం, అందం ప్రసాదిస్తుందని రిపోర్టు చెపుతుంది.

హ్యాపీగా ఉంటారు

కొన్ని వేల మంది పై దీర్ఘకాలం అధ్యాయనం చేసి గర్భిణులు వ్యాయామం చేయటం వలన ప్రసవంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. నొప్పులు ఎక్కువ భాదించవు శరీరాకృతి పాడవ్వదు. శరీరం తేలికగా ఉంటుంది, వ్యయామం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి అధ్యయనాలు.

ఎండకాలపు కానుక

ఎండల్లో తాటి ముంజలు వస్తాయి, మండే ఎండకు ఇవి దాహ శాంతిని ఇస్తాయి. ఈ ముంజల్లో పోషక విలువలు చాలా ఎక్కువ, 100 గ్రాముల ముంజల్లో 43 కెలరీల శక్తి ఉంటుంది. ఏ,బీ,సీ విటమిన్లు ఉంటాయి. పొటాషీయం చాలా ఎక్కువ, ఇంకా ఐరన్ , జింక్ ఫాస్పరస్ , కాల్షీయం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి తింటే డీ హైడ్రేషన్ రాదు, ఎలాంటి అనారోగ్యాలు రావు. పెద్దలు,పిల్లలు అందరు తినోచ్చు.

పచ్చివే మంచివి

రా ఫుడ్ ఆరోగ్యమేనా అని చాలా మందికి డౌట్, శరీరం పచ్చి కూరగాయలు, జ్యూస్ లు తీసుకుని ఆరోగ్యంగా ఉంచగలరా అని సందేహం. కాని శరీరంలోని జీవక్రియ సంభందిత కార్యకలాపాల్లో రా ఫుడ్స్ చురుకైన పాత్ర పోషిస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఎంజైమ్స్ లేకుండా శరీరం ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బో హైడ్రెడ్స్ , విటమిన్లను ఎముకలు, శిరోజాలు, చర్మ కండరాలు హార్మోన్లను ఉపయోగించుకోలేవు. పైగా రిఫైండ్ పదార్ధాల్లోని సింథటిక్ విటమిన్ల కంటే తాజా పచ్చి పదార్ధాల్లో లభించే విటమిన్లు,ఖనిజాలను శరీరం […]

ఎక్కువ అరలుండాలి

ఉద్యోగానికి వీకెండ్ ప్రయాణాలకు యుటిలిటి బ్యాగ్ ప్రాక్టికల్ గా ఆర్గానైజ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఖరీదైన బ్యాగ్ అయినంత మాత్రానా ప్రతి బ్యాగ్ యూజ్ ఫుల్ గా ఉంటుంది అనుకునే వీలులేదు. వీకెండ్ కోసం బ్యాగ్ బరువు తక్కువగా,తేలికగా ,ఎక్కువ అరలతో , కంపార్ట్ మెంట్స్ తో ఉండాలి. డీప్ బ్రౌన్, బ్లాక్ , గ్రే వంటి క్లాసిక్ కలర్స్ చాలా బావుంటాయి. ఉద్యోగం కోసం బయటటికి వెళ్ళేందుకు అన్నీ విధాలా వాడుకునేందుకు చక్కని నాణ్యమైన బ్రాండ్ […]

చెకింగ్ మంచిదే

ప్రతి రోజు బరువు తూచే యంత్రంపై నిలబడి బరువు చెక్ చేసుకొంటూ నోట్ చేసుకొంటూ వుంటే ఆ ఫలితాలు చెప్పలేని ఆనందం ఇచ్చి, ఎంత కష్టమైనా ఎంత నోరు కట్టేసుకుని అయినా బరువు తగ్గిపోదాం అనిపిస్తుంది అంటుంది ఒక సరికొత్త అధ్యయనం. ప్రతి రోజు బరువు చూసుకొంటు వర్కవుట్స్ చేసేందుకు తగిన ఉత్సహం వస్తుంది. బరువు తగ్గే లక్ష్యం దిశగా శ్రమ చేసేందుకు తగిన ప్రోత్సహం దోరుకుతుంది. ఎప్పుడో ఒక సారి చూసుకొంటే వచ్చే రిజల్ట్ కంటే […]